చైతన్యము; చేతనత్వము -
కార్యకారణ సంఘాతే అభివ్యక్తా బుద్ధేః వృత్తిః చేతనా.
(కార్యవస్తువులందు, కారణవస్తువులందు తోచుబుద్ధి యొక్క వృత్తి).
(దేహము, ఇంద్రియములయొక్క సంఘాతమందు - అనగా శరీరమందు, క్షేత్రమందు - కనబడు, తోచు - అంతఃకరణవృత్తి - బాగా కాల్చిన ఇనుపకడ్డీ అగ్నివలె స్ఫురించునది).
చేతనత్వం నామ చైతన్య గుణయోగః . (చేతనత్వమనగా చైతన్య గుణము కలిగియుండుట).
“వృత్తిః సమస్త భూతానాం చేతనా నామహం హరిః”- (గీతాభావప్రకాశము- 10 - 109)
(చేతనములైన - చైతన్యముగల - భూతములన్నింటిలోను ఉన్న చైతన్యశక్తి, చైతన్యవృత్తి నేనే - భగవంతుడే).
(భూతములలోని చైతన్యసక్తి భగవంతుడనైన నేనే).
చేతనైన తనము -
పరమేశ్వరునిశక్తియే చేతనారూపముగా ప్రవర్తించుచున్నది. అదియే చైతన్యము - పరమేశ్వరుడు ప్రతివస్తువునందు ఉండి తనశక్తిచేత దానిని చేతనవంతముగా చేయును. తానున్న ఉపాధివిశేషమును బట్టి దానికి తగిన విధముగా చైతన్యము కలుగచేసి దానిచేత పనిని (వృత్తిని) నిర్వర్తింపచేయును.
caitanyamu; cētanatvamu -
kāryakāraṇa saṃghātē abhivyaktā buddhēḥ vṛttiḥ cētanā.
(kāryavastuvulaṃdu, kāraṇavastuvulaṃdu tōcubuddhi yokka vṛtti).
(dēhamu, iṃdriyamulayokka saṃghātamaṃdu - anagā śarīramaṃdu, kṣētramaṃdu - kanabaḍu, tōcu - aṃtaḥkaraṇavṛtti - bāgā kālcina inupakaḍḍī agnivale sphuriṃcunadi).
cētanatvaṃ nāma caitanya guṇayōgaḥ . (cētanatvamanagā caitanya guṇamu kaligiyuṃḍuṭa).
“vṛttiḥ samasta bhūtānāṃ cētanā nāmahaṃ hariḥ”- (gītābhāvaprakāśamu- 10 - 109)
(cētanamulaina - caitanyamugala - bhūtamulanniṃṭilōnu unna caitanyaśakti, caitanyavṛtti nēnē - bhagavaṃtuḍē).
(bhūtamulalōni caitanyasakti bhagavaṃtuḍanaina nēnē).
cētanaina tanamu -
paramēśvaruniśaktiyē cētanārūpamugā pravartiṃcucunnadi. adiyē caitanyamu - paramēśvaruḍu prativastuvunaṃdu uṃḍi tanaśakticēta dānini cētanavaṃtamugā cēyunu. tānunna upādhiviśēṣamunu baṭṭi dāniki tagina vidhamugā caitanyamu kalugacēsi dānicēta panini (vṛttini) nirvartiṃpacēyunu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.