← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చేతనానాం చేతనః cētanānāṃ cētanaḥ

Original — తెలుగు
  1. “చేత యిత్రూణాం బ్రహ్మాదీనాం ప్రాణినాం అగ్ని నిమిత్తమివదాహకత్వ ముదకాదీనాం ఆత్మ చైతన్యనిమిత్తమేవ చేత యితృత్వం అతః చేతనానాం చేతనః పరమాత్మేత్యర్థః”.

(వేడి నీరులోని ఉష్ణత్వమునకు అగ్ని కారణమైనట్లు చైతన్యముగల చతుర్ముఖబ్రహ్మ మొదలగు ప్రాణులకు కలిగిన చేతనత్వము, ఇతరవస్తువులను చేతనవంతముగా చేయు చైతన్యశక్తికి కారణమైనది ఆత్మచైతన్యమే - ఆత్మయొక్క చైతన్యశక్తియే - చైతన్యరూపములోనున్న ఆత్మయే - ఆత్మ శక్తియే).

  1. “పృథివ్యాదీనాం తథా చేత యిత్రూణాం బ్రహ్మాది స్తంబాంత ప్రాణి నామపి చేతనః;యథా అనగ్నీ నామ యసాం దాహకత్వం అగ్నినిమిత్తం, తథా బ్రహ్మాది స్తంబాంతగత చేతయితృత్వం శుద్ధ చైతన్య నిమిత్తం” .

(భూమి మొదలగువాటికి - అట్లే బ్రహ్మమొదలు స్తంబమువరకుగల ప్రాణులకు చైతన్యమును - చేతనత్వమును - ఇచ్చునది - చేతనత్వమునిచ్చునది. అగ్నికానటువంటి ఇనుమునకు దహించుశక్తి అగ్నివలన కలిగినట్లు, చతుర్ముఖబ్రహ్మ మొదలు స్తంబమువఱకుగల వస్తువులందలి చేతనత్వమునకు కారణము శుద్ధచైతన్యమైన పరమాత్మయే.

Transliteration
  1. “cēta yitrūṇāṃ brahmādīnāṃ prāṇināṃ agni nimittamivadāhakatva mudakādīnāṃ ātma caitanyanimittamēva cēta yitṛtvaṃ ataḥ cētanānāṃ cētanaḥ paramātmētyarthaḥ”.

(vēḍi nīrulōni uṣṇatvamunaku agni kāraṇamainaṭlu caitanyamugala caturmukhabrahma modalagu prāṇulaku kaligina cētanatvamu, itaravastuvulanu cētanavaṃtamugā cēyu caitanyaśaktiki kāraṇamainadi ātmacaitanyamē - ātmayokka caitanyaśaktiyē - caitanyarūpamulōnunna ātmayē - ātma śaktiyē).

  1. “pṛthivyādīnāṃ tathā cēta yitrūṇāṃ brahmādi staṃbāṃta prāṇi nāmapi cētanaḥ;yathā anagnī nāma yasāṃ dāhakatvaṃ agninimittaṃ, tathā brahmādi staṃbāṃtagata cētayitṛtvaṃ śuddha caitanya nimittaṃ” .

(bhūmi modalaguvāṭiki - aṭlē brahmamodalu staṃbamuvarakugala prāṇulaku caitanyamunu - cētanatvamunu - iccunadi - cētanatvamuniccunadi. agnikānaṭuvaṃṭi inumunaku dahiṃcuśakti agnivalana kaliginaṭlu, caturmukhabrahma modalu staṃbamuvaṟakugala vastuvulaṃdali cētanatvamunaku kāraṇamu śuddhacaitanyamaina paramātmayē.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.