← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చిచ్ఛక్తి cicchakti

Original — తెలుగు
  1. చిచ్ఛక్తి శబ్దేన చైతన్యముచ్యతే (చిత్ + శక్తి) (చైతన్యము) (జ్ఞానశక్తి). (సర్వప్రాణులయందును గల జీవకళయే ప్రకాశరూపమైన చిచ్ఛక్తి;) (“సత్, చిత్, ఆనందం బ్రహ్మ”), అజ్ఞానమును తొలగించు జ్ఞానమే చిచ్ఛక్తి - (“సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ”).

  2. సీయ, స్వయంప్రకాశక వైభవః.

(పరమాత్మను ప్రకాశింపచేయు - పరమాత్మ ఉండి పనిచేయించువలన ఉన్నట్లు తెలియచేయు శక్తి - వైభవము).

  1. “చిచ్ఛక్తిః పరమేశ్వరస్య విమలం చైతన్యమేవోచ్యతే ||

తస్తైవాస్య జడాపరా భగవతశ్శక్తి స్త్వ విద్యాత్మికా |

సంసర్గాచ్చ మిధస్త యోర్భగవతశ్శక్త్యోర్జగ జ్జాయతే ||“. (సంక్షేపశారీరకము)

(భగవంతుని శక్తులు రెండు విధములు - చిచ్ఛక్తి, అవిద్య. చిచ్ఛక్తి (చిత్ + శక్తి) అనగా చైతన్య శక్తి. రెండవది అవిద్య లేక ప్రకృతి - జడము - ఈ రెండు శక్తులు కలియుటవలననే జగత్తు పుట్టుచున్నది - (పురుష ప్రకృతి సం యోగము వలననే సృష్టి జరుగుచున్నది- creation is the result of the combination of matter and Energy - భగవంతుడు తన చైతన్యశక్తితో జడమైన ప్రకృతితో కలియుటచేత ప్రకృతి చైతన్యవంతమై తనలోనుండి యింకొకవస్తువును సృష్టించుచున్నది. ఆధ్యాత్మదృష్టిలో భగవంతునికి, భగవంతునిశక్తికి భేదములేదు - భగవంతుడే భగవంతుని (చైతన్య) శక్తి, చైతన్యశక్తియే భగవంతుడు. భగవంతునినుండి అతని చైతన్య శక్తిని విడదీయలేము - అర్థనారీశ్వరరూపములోని ఈ శ్వరరూపమును, పార్వతి (ప్రకృతి) రూపమును విడదీయలేనట్లు - ఇట్టి పార్వతీ పరమేశ్వరులే - పురుష ప్రకృతిలే ఆది దంపతులని చెప్పబడుచున్నారు. “మిమ్ము పురాణ దంప తుల మేలుభజింతు గదమ్మ” (రుక్మిణీ కళ్యాణము - శ్రీమదాంధ్రమహాభాగవతము). ఈ చిచ్ఛక్తికే ఆధునిక శాస్త్ర జ్ఞులు (Scientists) “ENERGY”(శక్తి) యని పేరు వాడుచున్నారు - ఈ శక్తినే కాళికాశక్తియని, దేవీ అని కొన్నిమతములవారు అభిప్రాయ పడుచుచున్నారు). “నతదస్తి వినాయతస్యన్మయా భూతం చరా చరం” –

(గీత - 10 - 39)

  1. “చిచ్ఛక్తిర్బహ్మణో, రామ,శరీరేష్వభి దృశ్యతే |

స్పంద శక్తిశ్చ వాతేషు జడశక్తిస్త దోపలే |

ద్రవ్య శక్తిస్త ధాం ఛస్సు తేజశ్శక్తిస్త ధానలే |

శూన్యశక్తి స్తథాకాశే భావశక్తిర్భవ స్థితౌ ||” (యోగవాసిష్టము - 100 - 7, 8)

(బ్రహ్మయొక్క చిచ్ఛక్తి - చైతన్య శక్తి - అండజములు మొదలగు నాలుగు విధములగు శరీరములలోను గలదు - మఱియు వాయువునందుగల చలనశక్తి, శిలయందుగల జడత్వము - కాఠిన్యము, అగ్ని యందు గల ప్రకాశశక్తి (వేడిమి, ప్రకాశము). ఆకాశమందుగల శూన్యశక్తి, సంసారమందు ) - (జన్మలో వ్యవహారయోగ్యమగు శక్తియు నదియే).

  1. “నిఖిల శక్తి ధరుండవు, నంతః ప్రవిష్టుండవు నైన నీవు లీనంబులైన మదీయ వాక్యంబులం బ్రాణేంద్రీయంబులం గల చరణ శ్రవణ త్వగాదులను జిచ్ఛక్తిచే గృపం జేసి జీవింపం జేసిన భగవంతుండవును బరమ పుఇరుషుండవును నైన నీకు నమస్కరింతు. నీవొక్కరుండవయ్యు మహదాద్యంబైన యీ యశేష విశ్వంబు మాయాఖ్యంబైన యాత్మీయ శక్తిచేతం గల్పించి యందుం బ్రవేశించి యింద్రియంబులందు వసించుచు తత్తద్దేవతా రూపంబులచేనానా ప్రకారంబులందారువులందున్న వహ్ని చందంబునం బ్రకాశింతువు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము- 4 - 9 - 28)

Transliteration
  1. cicchakti śabdēna caitanyamucyatē (cit + śakti) (caitanyamu) (jñānaśakti). (sarvaprāṇulayaṃdunu gala jīvakaḷayē prakāśarūpamaina cicchakti;) (“sat, cit, ānaṃdaṃ brahma”), ajñānamunu tolagiṃcu jñānamē cicchakti - (“satyaṃ jñānaṃ anaṃtaṃ brahma”).

  2. sīya, svayaṃprakāśaka vaibhavaḥ.

(paramātmanu prakāśiṃpacēyu - paramātma uṃḍi panicēyiṃcuvalana unnaṭlu teliyacēyu śakti - vaibhavamu).

  1. “cicchaktiḥ paramēśvarasya vimalaṃ caitanyamēvōcyatē ||

tastaivāsya jaḍāparā bhagavataśśakti stva vidyātmikā |

saṃsargācca midhasta yōrbhagavataśśaktyōrjaga jjāyatē ||“. (saṃkṣēpaśārīrakamu)

(bhagavaṃtuni śaktulu reṃḍu vidhamulu - cicchakti, avidya. cicchakti (cit + śakti) anagā caitanya śakti. reṃḍavadi avidya lēka prakṛti - jaḍamu - ī reṃḍu śaktulu kaliyuṭavalananē jagattu puṭṭucunnadi - (puruṣa prakṛti saṃ yōgamu valananē sṛṣṭi jarugucunnadi- creation is the result of the combination of matter and Energy - bhagavaṃtuḍu tana caitanyaśaktitō jaḍamaina prakṛtitō kaliyuṭacēta prakṛti caitanyavaṃtamai tanalōnuṃḍi yiṃkokavastuvunu sṛṣṭiṃcucunnadi. ādhyātmadṛṣṭilō bhagavaṃtuniki, bhagavaṃtuniśaktiki bhēdamulēdu - bhagavaṃtuḍē bhagavaṃtuni (caitanya) śakti, caitanyaśaktiyē bhagavaṃtuḍu. bhagavaṃtuninuṃḍi atani caitanya śaktini viḍadīyalēmu - arthanārīśvararūpamulōni ī śvararūpamunu, pārvati (prakṛti) rūpamunu viḍadīyalēnaṭlu - iṭṭi pārvatī paramēśvarulē - puruṣa prakṛtilē ādi daṃpatulani ceppabaḍucunnāru. “mimmu purāṇa daṃpa tula mēlubhajiṃtu gadamma” (rukmiṇī kaḷyāṇamu - śrīmadāṃdhramahābhāgavatamu). ī cicchaktikē ādhunika śāstra jñulu (Scientists) “ENERGY”(śakti) yani pēru vāḍucunnāru - ī śaktinē kāḷikāśaktiyani, dēvī ani konnimatamulavāru abhiprāya paḍucucunnāru). “natadasti vināyatasyanmayā bhūtaṃ carā caraṃ” –

(gīta - 10 - 39)

  1. “cicchaktirbahmaṇō, rāma,śarīrēṣvabhi dṛśyatē |

spaṃda śaktiśca vātēṣu jaḍaśaktista dōpalē |

dravya śaktista dhāṃ chassu tējaśśaktista dhānalē |

śūnyaśakti stathākāśē bhāvaśaktirbhava sthitau ||” (yōgavāsiṣṭamu - 100 - 7, 8)

(brahmayokka cicchakti - caitanya śakti - aṃḍajamulu modalagu nālugu vidhamulagu śarīramulalōnu galadu - maṟiyu vāyuvunaṃdugala calanaśakti, śilayaṃdugala jaḍatvamu - kāṭhinyamu, agni yaṃdu gala prakāśaśakti (vēḍimi, prakāśamu). ākāśamaṃdugala śūnyaśakti, saṃsāramaṃdu ) - (janmalō vyavahārayōgyamagu śaktiyu nadiyē).

  1. “nikhila śakti dharuṃḍavu, naṃtaḥ praviṣṭuṃḍavu naina nīvu līnaṃbulaina madīya vākyaṃbulaṃ brāṇēṃdrīyaṃbulaṃ gala caraṇa śravaṇa tvagādulanu jicchakticē gṛpaṃ jēsi jīviṃpaṃ jēsina bhagavaṃtuṃḍavunu barama puiruṣuṃḍavunu naina nīku namaskariṃtu. nīvokkaruṃḍavayyu mahadādyaṃbaina yī yaśēṣa viśvaṃbu māyākhyaṃbaina yātmīya śakticētaṃ galpiṃci yaṃduṃ bravēśiṃci yiṃdriyaṃbulaṃdu vasiṃcucu tattaddēvatā rūpaṃbulacēnānā prakāraṃbulaṃdāruvulaṃdunna vahni caṃdaṃbunaṃ brakāśiṃtuvu”.

(śrīmadāṃdhramahābhāgavatamu- 4 - 9 - 28)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.