(విచారసాగరము)
(పటము అనగా బట్ట. పటముయొక్క లక్షణములు లేనప్పటికీ పటమువలె - బట్టవలెకనబడుట పటాభాసము - ఆ ప్రకారమే చిత్ కన్న వేరైన లక్షణములుగలదైనను చిత్ వలె ప్రకాశించునది భాసము).
(బాగా ఎర్రగానున్న పూజా పుష్పముల మీదనున్న శుద్ధ స్పటికము - తెల్లని వస్తువు - ఆ ఏర్రపువ్వులరంగు గలదిగా కనబడును. స్ఫటికముమీద కనబడు ఆ ఎర్రరంగు పుష్పముల ప్రతిబింబమే. ఆ ప్రకారము కూటస్థుడు చేత ఆక్రమించబడిన బుద్ధి కూటస్థుని వలెనే ప్రకాశించును - ఆ ప్రకాశమే - చిత్ వలె ప్రకాశించు ఆప్రకాశమే - చిదాభాసుడని చెప్పబడుచున్నది. మిక్కిలి స్వచ్చమైన స్ఫటికము వలెనే బుద్ధికూడ అత్యంతనిర్మ లమైనది - అది సత్వగుణమువలన కలిగినదగుటచేత - అక్కడ ప్రతిబింబుంచిన కూటస్థమే చిదాభాసుడు).
చిత్ (పరబ్రహ్మము) యొక్క లక్షణములు లేకున్నను చిద్రూపముతో తోచువాడు కనుకచిదాభాసుడు.
వ్యష్టి స్థూలరూపమందుండు జీవ చైతన్యము - జీవుడు - విశ్వుడు, వ్యావహారికసత్తా - పరమేశ్వరుని చైతన్యమువలె భాసిల్లువాడు.
(vicārasāgaramu)
(paṭamu anagā baṭṭa. paṭamuyokka lakṣaṇamulu lēnappaṭikī paṭamuvale - baṭṭavalekanabaḍuṭa paṭābhāsamu - ā prakāramē cit kanna vēraina lakṣaṇamulugaladainanu cit vale prakāśiṃcunadi bhāsamu).
(bāgā erragānunna pūjā puṣpamula mīdanunna śuddha spaṭikamu - tellani vastuvu - ā ērrapuvvularaṃgu galadigā kanabaḍunu. sphaṭikamumīda kanabaḍu ā erraraṃgu puṣpamula pratibiṃbamē. ā prakāramu kūṭasthuḍu cēta ākramiṃcabaḍina buddhi kūṭasthuni valenē prakāśiṃcunu - ā prakāśamē - cit vale prakāśiṃcu āprakāśamē - cidābhāsuḍani ceppabaḍucunnadi. mikkili svaccamaina sphaṭikamu valenē buddhikūḍa atyaṃtanirma lamainadi - adi satvaguṇamuvalana kaliginadaguṭacēta - akkaḍa pratibiṃbuṃcina kūṭasthamē cidābhāsuḍu).
cit (parabrahmamu) yokka lakṣaṇamulu lēkunnanu cidrūpamutō tōcuvāḍu kanukacidābhāsuḍu.
vyaṣṭi sthūlarūpamaṃduṃḍu jīva caitanyamu - jīvuḍu - viśvuḍu, vyāvahārikasattā - paramēśvaruni caitanyamuvale bhāsilluvāḍu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.