← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చిదచిదాకారము cidacidākāramu

Original — తెలుగు

చేతనా చేతనరూపము - చేతనవస్తువులుగాను అచేతనవస్తువులుగాను తానే అయినవాడు - భగవంతుడు. “తత్సృష్టా తదేవాను ప్రావిశత్, తదను ప్రవిశ్య సచ్చ., త్యచ్చ అభవత్”.(భగవంతుడు లోకములను సృష్టించి వాటిలోనే ప్రవేశించెను - లోకములలోనున్న అన్నివస్తువులలోను ప్రవేశించెను - అట్లు ప్రవేశించి - సత్ - సత్పదార్థము - త్యత్ (అసత్పదార్థము) తానే ఆయెను. సత్యం = సత్ + త్యత్ (సత్తు, అసత్).

“అలఘ ననంతు చిద చిదాత్మకునాద్యున నీశు నీశ్వరున్” (శ్రీమదాంధ్రమహాభాగవతము- 2 - 6 - 109)

భగవంతునికి రెండు శక్తులు గలవు - అపరాశక్తి, పరాశక్తి - అపరాశక్తి యనగా జడమైన ప్రకృతి. పరాశక్తి అనగా తనయొక్క చిచ్ఛక్తి - లేక చైతన్యశక్తి - ప్రకృతిగాను, దాని పరిణామములుగాను, వాటిలో ఉన్న చిచ్ఛక్తి లేక జీవరూపముగాను ఉండి, వాటికి చైతన్యశక్తి భగవంతుడు ఇచ్చుచున్నాడు. అందుచేత సృష్టిలోనున్న వస్తువులన్నియు భగవంతుని రూపములే - అందుచేత ఉన్నదంతా ఒక్క భగవంతుడే. రెండవ వస్తువు లేదు - అందుచేత భగవంతుడు అద్వయుడు).

Transliteration

cētanā cētanarūpamu - cētanavastuvulugānu acētanavastuvulugānu tānē ayinavāḍu - bhagavaṃtuḍu. “tatsṛṣṭā tadēvānu prāviśat, tadanu praviśya sacca., tyacca abhavat”.(bhagavaṃtuḍu lōkamulanu sṛṣṭiṃci vāṭilōnē pravēśiṃcenu - lōkamulalōnunna annivastuvulalōnu pravēśiṃcenu - aṭlu pravēśiṃci - sat - satpadārthamu - tyat (asatpadārthamu) tānē āyenu. satyaṃ = sat + tyat (sattu, asat).

“alagha nanaṃtu cida cidātmakunādyuna nīśu nīśvarun” (śrīmadāṃdhramahābhāgavatamu- 2 - 6 - 109)

bhagavaṃtuniki reṃḍu śaktulu galavu - aparāśakti, parāśakti - aparāśakti yanagā jaḍamaina prakṛti. parāśakti anagā tanayokka cicchakti - lēka caitanyaśakti - prakṛtigānu, dāni pariṇāmamulugānu, vāṭilō unna cicchakti lēka jīvarūpamugānu uṃḍi, vāṭiki caitanyaśakti bhagavaṃtuḍu iccucunnāḍu. aṃducēta sṛṣṭilōnunna vastuvulanniyu bhagavaṃtuni rūpamulē - aṃducēta unnadaṃtā okka bhagavaṃtuḍē. reṃḍava vastuvu lēdu - aṃducēta bhagavaṃtuḍu advayuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.