(చింతించుటకు తగినది, ధ్యానించుటకు తగినది - భగవంతుడు ఆనందస్వరూపుడు - “సచ్చిదానందం బ్రహ్మ” ఆనందమే బ్రహ్మ - బ్రహ్మానందం - మోక్షరూపుడైనవాడుకనుక. ” ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ నారాయణః –”
(సూర్య మండలమధ్యమందు - సూర్యమండలములోపల పూర్తిగా వ్యాపించియున్న నారాయణుడు ధ్యానించతగినవాడు - సృష్టి స్థితిలయములు చేయువాడుకనుక) - చూడుము - ‘నారాయణుడు’ –
“ఆలోఢ్య సర్వ శాస్త్రాణి విచార్య చ పునః పునః |
ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణస్సదా ||“.
(సమస్త శాస్త్రములను - ఉపనిషత్తులను, పురాణములను, ఇతిహాసములను, శోధించి, గాలించి, మరల మరల తర్కించగా తేలిన సారాంశమిదియే - ఎల్ల వేళలందు నారాయణుడే ధ్యానించతగినవాడు).
అచింతనీయం బహు చింతయే (అ)హం తమేవ రామం భువనాభిరామం” (శ్రీరామకర్ణామృతం- 3 - 95)
(చిత్తమునందు - మనసులో - ఉన్నటువంటున్నీ, భక్తూలచేత చింతింపతగినవాడున్నూ, చింతలను - విచారములను, దుఃఖములను - హరించువాడున్నూ, తనను గుఱించి చింతించువారికి - ధ్యానించువారికి - పారిజాత వృక్షమువలె కోరికలనిచ్చువాడును, మూడు లోకములలోను మనోహరుడైనవాడు అయిన శ్రీరాముని గుఱించి నేను చింతించెదను, ధ్యానించెదను).
(ciṃtiṃcuṭaku taginadi, dhyāniṃcuṭaku taginadi - bhagavaṃtuḍu ānaṃdasvarūpuḍu - “saccidānaṃdaṃ brahma” ānaṃdamē brahma - brahmānaṃdaṃ - mōkṣarūpuḍainavāḍukanuka. ” dhyēyassadā savitṛmaṃḍala madhyavartī nārāyaṇaḥ –”
(sūrya maṃḍalamadhyamaṃdu - sūryamaṃḍalamulōpala pūrtigā vyāpiṃciyunna nārāyaṇuḍu dhyāniṃcataginavāḍu - sṛṣṭi sthitilayamulu cēyuvāḍukanuka) - cūḍumu - ‘nārāyaṇuḍu’ –
“ālōḍhya sarva śāstrāṇi vicārya ca punaḥ punaḥ |
idamēkaṃ suniṣpannaṃ dhyēyō nārāyaṇassadā ||“.
(samasta śāstramulanu - upaniṣattulanu, purāṇamulanu, itihāsamulanu, śōdhiṃci, gāliṃci, marala marala tarkiṃcagā tēlina sārāṃśamidiyē - ella vēḷalaṃdu nārāyaṇuḍē dhyāniṃcataginavāḍu).
aciṃtanīyaṃ bahu ciṃtayē (a)haṃ tamēva rāmaṃ bhuvanābhirāmaṃ” (śrīrāmakarṇāmṛtaṃ- 3 - 95)
(cittamunaṃdu - manasulō - unnaṭuvaṃṭunnī, bhaktūlacēta ciṃtiṃpataginavāḍunnū, ciṃtalanu - vicāramulanu, duḥkhamulanu - hariṃcuvāḍunnū, tananu guṟiṃci ciṃtiṃcuvāriki - dhyāniṃcuvāriki - pārijāta vṛkṣamuvale kōrikalaniccuvāḍunu, mūḍu lōkamulalōnu manōharuḍainavāḍu ayina śrīrāmuni guṟiṃci nēnu ciṃtiṃcedanu, dhyāniṃcedanu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.