చైతన్యము; ప్రకాశ స్వరూపము; జ్ఞానస్వరూపము; పరబ్రహ్మస్వరూపము.
స్వయంప్రకాశమాన సర్వ చేతనరూపా.
(స్వయముగా ప్రకాశించునది, అన్నింటిని చైతన్యవంతముగా చేయునది - “స్వయంప్రకాశమాన సర్వచేతనరూపాస్వాధ్యస్తే సర్వస్మిన్ దృశ్యేప్యనుస్యూతత్వాత్ -”చిద్ధీదం సర్వం కాశతే, కాశతేచ” (తాపనీయోపనిషత్)
(తనంతట తానే ప్రకాశించునదిన్నీ, సమస్తమును చైతన్యవంతముగా చేయునదిన్నీ, తనచేత అధిష్టించిబడియున్న సర్వప్రపంచమును ఓతప్రోతమువలె వ్యాపించియుండుటవలన అన్నింటినీ ప్రకాశింపచేయునది ‘చిత్’).
(కలంకములేనిదిన్నీ, పరతత్వమునకు పర్యాయ భూతమైనదిన్నీ మహాసత్తా కలిగినదిన్నీ, చిత్ అని చెప్పబడుచున్నదే బ్రహ్మ, పరమాత్మా అను పేర్లతో చెప్పబడుచున్నది).
“సర్వావస్థలయందును విషయంబులనెడ విడువక నిల్చియెఱుంగునదియే చిద్రూపము” (వివేకచింతామణి - పరమానందతీర్థ)
“ప్రాణులందు జీవుడుగాను, సాక్షిగాను, సచ్చిదానందమందు జ్ఞానస్వరూపముగాను, సూర్యుడు, చంద్రుడు, అగ్నివంటి తేజస్వరూపములందుగల ప్రకాశస్వరూపముగాను ఉన్నది చిత్ అని చెప్పబడుచునది”.
“యదాదిత్యగతం తేజో జగద్భాసయతే (అ)ఖిలం |
యచ్చంద్రమసి యచ్చాగ్నే తత్తేజో విద్ధి మామకం ||” (శ్రీమద్భగవద్గీత - 15 - 12)
(సమస్తమైన జగత్తును ప్రకాశింపచేయు సూర్యునిలోను, చంద్రునిలోను, అగ్నిలోను ఉన్న తేజస్సు నాదే).
చిత్ త్వం, చిదహమేతే చ లోకాస్చిదితి సంగ్రహః ||“. (వాసిష్టే)
(ఇక్కడ చిత్ ఉన్నది, చిన్మాత్రము - చైతన్యమే - ఉన్నది; ఈ ప్రపంచమంతయు చిన్మయము - చైతన్యముతో నిండియున్నది. నీవు చిత్ - (చైతన్యమే నీవు), నేను చిత్ (చైతన్యమే) - ఈ లోకములన్నియు చిత్ పదార్థమే - చైతన్యమే - సృష్టి అంతయు చైతన్యముతో నిండియున్నది -“హరిమయముగాని ద్రవ్యము, పరమాణువు లేదు, వంశపావన వింటే”.
“చిదేక రసః”. (చైతన్యమొక్కటే తన తత్వముగా గలవాడు - భగవంతుడు).
చిత్తము - మనస్సు.
“శ్లో ||. ఆత్మత్వా దీక్షితత్వా దఖిలవశతయా శాస్త్ర యోనిత్వవాదా |
త్కామాభిధ్యోప దేశాచ్ఛ తపన ముఖధ్యోతిభరూప తోక్తేః |
సాక్షా దేవాపరోక్షాద సుకృత సుకృధ్యక్ష్య సాకిత్వవాదా |
త్సర్వ జ్ఞాజ్ఞాదిశబ్దాత్ స్ఫుటవచనశతైశ్చాపి సచ్చిత్స్వభావం ||“. (సారాజ్య సిద్ధి - అపవాద ప్రకరణము)
(బ్రహ్మ ఆత్మ అగుటవలనను, ఈ క్షణమాత్రమున సృష్టిచేయుటవలనను, సర్వమును అతని వశములోనుంచుకొనుటచేతను, వేదములను రచించిన వాడగుటచేతను, ప్రపంచమును సృష్టిచేయుకోరిక కలవాడగుటచేతను, సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలగువాటికి కాంతిని ఇచ్చువాడగుటచేతను, ఇతరాపేక్షలేక ప్రత్యక్షమగువాడు అగుటచేతను, పుణ్యపాపములకు సాక్షియగుటవలనను, బ్రహ్మ సర్వజ్ఞుడు. అందుచేత సద్రూపుడగు బ్రహ్మ చిత్ - జ్ఞానముగలవాడు).
“సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ” (తైత్తిరీయోపనిషత్ - 2 - 1 - 1),
“అయమాత్మా సర్వను భూః” (బృహదారణ్యకోపనిషత్ - 2 - 5 - 16)
ఇత్యాది శ్రుత్యా స్వయంప్రకాశత్వేన స్వయంప్రకాశ జ్ఞానాత్మత్వేన చ ప్రతిపాదనాత్ చిదాత్మకమిత్యర్థః. నను విజ్ఞానస్యకథం స్వప్రకాశ తేతిచేన్న. విషయాత్మ విజ్ఞానానాంత్రయాణామపి జడత్వే జగదాద్య ప్రసంగాత్ విజ్ఞానస్య విజ్ఞానాంతర సాపేక్షత్వే తస్యాపి జడత్వేన (అ)నవస్థా పాతాచ్చ ఆత్మనః విజ్ఞానాత్మత్వే స్వయంప్రయోగః, విజ్ఞాతా న స్వాతి రిక్తవిజ్ఞానాధీన ప్రకాశః విజ్ఞాన కర్మతామంతరేణ అపరోక్షత్వాత్ సంవేదనవత్“. (వేదాంత పరిభాషా)
(‘ఈ పురుషుడు - బ్రహ్మ - స్వయముగా ప్రకాశించువాడు’అని బృహదారణ్యకోపనిషత్తులోను,’ బ్రహ్మ, సత్యము, జ్ఞానము అనంతము’ అని తైతైరీయోపనిషత్తులోను చెప్పబడియుండుటచేత పరబ్రహ్మ స్వయముగా ప్రకాశించు వాడు - ఇతరుల ఆపేక్షలేకయే ప్రకాశించువాడు అగుటచేత ‘చిత్’ అని (చైతన్యమే, జ్ఞానమే రూపముగా గలవాడు అని) తెలియవచ్చుచున్నది. (‘స్వయం జ్యోతిః’ అనిన్నీ,‘జ్ఞానం అనంతం’ అనిన్నీ చెప్పుటచేత) ‘చిత్’ అనగా చైతన్యము - ప్రకాశము, జ్ఞానము అనికూడ అర్ధమగుచున్నది, జ్ఞానమున్నదానికి ప్రకాశమెట్లుండును అనిన - ’విషయాత్మ విజ్ఞానములు మూడున్నూ జడములే అయిన యడల సృష్టికి కారణమగుటయను ప్రసంగమే ఉండదు. విజ్ఞానమునకు ఇంకొక విజ్ఞానము యొక్క అపేక్ష కలిగినచే అదికూడ జడమే. ఇట్లు ఒకదానికి ఇంకొకదాని అపేక్ష ఉన్నయడల దానికి అంతము ఉండదు - అనవస్థా దోషము పట్టును - ఆత్మ స్వయముగా ప్రకాశముకలది - అది ప్రకాశించుటకు ఇంకొక ప్రకాశవంతమైనదాని అపేక్ష లేదు - ఇట్లు ఇతర ప్రకాశవంతమైనదాని అపేక్ష లేకుండుటచేత స్వయముగానే జ్ఞానముకలవాడు - “యః సర్వజ్ఞ స్సర్వవిత్” -).
caitanyamu; prakāśa svarūpamu; jñānasvarūpamu; parabrahmasvarūpamu.
svayaṃprakāśamāna sarva cētanarūpā.
(svayamugā prakāśiṃcunadi, anniṃṭini caitanyavaṃtamugā cēyunadi - “svayaṃprakāśamāna sarvacētanarūpāsvādhyastē sarvasmin dṛśyēpyanusyūtatvāt -”ciddhīdaṃ sarvaṃ kāśatē, kāśatēca” (tāpanīyōpaniṣat)
(tanaṃtaṭa tānē prakāśiṃcunadinnī, samastamunu caitanyavaṃtamugā cēyunadinnī, tanacēta adhiṣṭiṃcibaḍiyunna sarvaprapaṃcamunu ōtaprōtamuvale vyāpiṃciyuṃḍuṭavalana anniṃṭinī prakāśiṃpacēyunadi ‘cit’).
(kalaṃkamulēnidinnī, paratatvamunaku paryāya bhūtamainadinnī mahāsattā kaliginadinnī, cit ani ceppabaḍucunnadē brahma, paramātmā anu pērlatō ceppabaḍucunnadi).
“sarvāvasthalayaṃdunu viṣayaṃbulaneḍa viḍuvaka nilciyeṟuṃgunadiyē cidrūpamu” (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)
“prāṇulaṃdu jīvuḍugānu, sākṣigānu, saccidānaṃdamaṃdu jñānasvarūpamugānu, sūryuḍu, caṃdruḍu, agnivaṃṭi tējasvarūpamulaṃdugala prakāśasvarūpamugānu unnadi cit ani ceppabaḍucunadi”.
“yadādityagataṃ tējō jagadbhāsayatē (a)khilaṃ |
yaccaṃdramasi yaccāgnē tattējō viddhi māmakaṃ ||” (śrīmadbhagavadgīta - 15 - 12)
(samastamaina jagattunu prakāśiṃpacēyu sūryunilōnu, caṃdrunilōnu, agnilōnu unna tējassu nādē).
cit tvaṃ, cidahamētē ca lōkāsciditi saṃgrahaḥ ||“. (vāsiṣṭē)
(ikkaḍa cit unnadi, cinmātramu - caitanyamē - unnadi; ī prapaṃcamaṃtayu cinmayamu - caitanyamutō niṃḍiyunnadi. nīvu cit - (caitanyamē nīvu), nēnu cit (caitanyamē) - ī lōkamulanniyu cit padārthamē - caitanyamē - sṛṣṭi aṃtayu caitanyamutō niṃḍiyunnadi -“harimayamugāni dravyamu, paramāṇuvu lēdu, vaṃśapāvana viṃṭē”.
“cidēka rasaḥ”. (caitanyamokkaṭē tana tatvamugā galavāḍu - bhagavaṃtuḍu).
cittamu - manassu.
“ślō ||. ātmatvā dīkṣitatvā dakhilavaśatayā śāstra yōnitvavādā |
tkāmābhidhyōpa dēśāccha tapana mukhadhyōtibharūpa tōktēḥ |
sākṣā dēvāparōkṣāda sukṛta sukṛdhyakṣya sākitvavādā |
tsarva jñājñādiśabdāt sphuṭavacanaśataiścāpi saccitsvabhāvaṃ ||“. (sārājya siddhi - apavāda prakaraṇamu)
(brahma ātma aguṭavalananu, ī kṣaṇamātramuna sṛṣṭicēyuṭavalananu, sarvamunu atani vaśamulōnuṃcukonuṭacētanu, vēdamulanu raciṃcina vāḍaguṭacētanu, prapaṃcamunu sṛṣṭicēyukōrika kalavāḍaguṭacētanu, sūryuḍu, caṃdruḍu, agni modalaguvāṭiki kāṃtini iccuvāḍaguṭacētanu, itarāpēkṣalēka pratyakṣamaguvāḍu aguṭacētanu, puṇyapāpamulaku sākṣiyaguṭavalananu, brahma sarvajñuḍu. aṃducēta sadrūpuḍagu brahma cit - jñānamugalavāḍu).
“satyaṃ jñānamanaṃtaṃ brahma” (taittirīyōpaniṣat - 2 - 1 - 1),
“ayamātmā sarvanu bhūḥ” (bṛhadāraṇyakōpaniṣat - 2 - 5 - 16)
ityādi śrutyā svayaṃprakāśatvēna svayaṃprakāśa jñānātmatvēna ca pratipādanāt cidātmakamityarthaḥ. nanu vijñānasyakathaṃ svaprakāśa tēticēnna. viṣayātma vijñānānāṃtrayāṇāmapi jaḍatvē jagadādya prasaṃgāt vijñānasya vijñānāṃtara sāpēkṣatvē tasyāpi jaḍatvēna (a)navasthā pātācca ātmanaḥ vijñānātmatvē svayaṃprayōgaḥ, vijñātā na svāti riktavijñānādhīna prakāśaḥ vijñāna karmatāmaṃtarēṇa aparōkṣatvāt saṃvēdanavat”. (vēdāṃta paribhāṣā)
(‘ī puruṣuḍu - brahma - svayamugā prakāśiṃcuvāḍu’ani bṛhadāraṇyakōpaniṣattulōnu,’ brahma, satyamu, jñānamu anaṃtamu’ ani taitairīyōpaniṣattulōnu ceppabaḍiyuṃḍuṭacēta parabrahma svayamugā prakāśiṃcu vāḍu - itarula āpēkṣalēkayē prakāśiṃcuvāḍu aguṭacēta ‘cit’ ani (caitanyamē, jñānamē rūpamugā galavāḍu ani) teliyavaccucunnadi. (‘svayaṃ jyōtiḥ’ aninnī,‘jñānaṃ anaṃtaṃ’ aninnī ceppuṭacēta) ‘cit’ anagā caitanyamu - prakāśamu, jñānamu anikūḍa ardhamagucunnadi, jñānamunnadāniki prakāśameṭluṃḍunu anina - ’viṣayātma vijñānamulu mūḍunnū jaḍamulē ayina yaḍala sṛṣṭiki kāraṇamaguṭayanu prasaṃgamē uṃḍadu. vijñānamunaku iṃkoka vijñānamu yokka apēkṣa kaliginacē adikūḍa jaḍamē. iṭlu okadāniki iṃkokadāni apēkṣa unnayaḍala dāniki aṃtamu uṃḍadu - anavasthā dōṣamu paṭṭunu - ātma svayamugā prakāśamukaladi - adi prakāśiṃcuṭaku iṃkoka prakāśavaṃtamainadāni apēkṣa lēdu - iṭlu itara prakāśavaṃtamainadāni apēkṣa lēkuṃḍuṭacēta svayamugānē jñānamukalavāḍu - “yaḥ sarvajña ssarvavit” -).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.