“ఆకాశమే అప్పు సం యోగాన చిత్తమాయెను” (బ్రహ్మవిద్యా సుధార్ణవము)
అంతఃకరణం (అంతఃకరణము - లోపలి యింద్రియములు).
మనస్సు; కోరిక.
అను సంధానాత్మకాంతః కరణ వృత్తిః చిత్తం.
(పూర్వవిషయమును స్మరణకు తెచ్చునట్టి అనుసంధానరూపమైన అంతఃకరణవృత్తి).
విచారం సం పరిత్యజ్య తదాసా చిత్తముచ్యతే ||“. (యోగవాసిష్టము - 80 - 3)
(విచారించక ఒక విషయమును విడిచి ఇంకొకవిషయమును తలచునది చిత్తము).
(సత్త్వము నిర్మలమైనదగుటవల్ల ప్రకాశించునది, అనామయమున్నూ అని చెప్పబడియుండుటవలన సత్త్వము ప్రకాశించునదగుటచేత, ఆ గుణముగల చిత్తము భగవంతుడుండు స్థానము).
(భగవంతుని స్థానము, సత్వము - అధిభూతరూపములో ఆదియే మహత్తత్త్వము, అధ్యాత్మరూపములో చిత్తము అనియు చెప్పబడుచున్నది. ఉపాసన చేయునప్పుడు భగవంతుడగు వాసుదేవుడని చెప్పబడుచున్నది. దీనికి అధిష్టాత క్షేత్రజ్ఞుడు).
(చిత్తం = చిత్ + త; చిత్తము అను పదములోని తకారము విషయాధ్యానము - అది తెసివేసిన ‘చిత్’ మిగులును - అందుచేత చిత్తమనగా ‘చిత్’ - జ్ఞేయవస్తువు - తెలిసినవస్తువు - ను - తీసివేయగా జ్ఞానమే మిగులును).
(చిత్ + త = చిత్త ; చిత్త - త = చిత్).
యచ్చిత్తస్తన్మయో భవతి గుహ్యమేతత్ సనాతనం ||“.
చిత్తస్యహి ప్రసాదేన హంతి కర్మ శుభా శుభం |
ప్రసన్నాత్మా (ఆ)త్మని స్థిత్వా సుఖమక్షయ మశ్నుతే |
సమాసక్తం యథా చిత్తం, జంతోర్విషయ గోచరే |
యద్వేవం బ్రహ్మణిస్యాత్ తత్ కోన ముచ్యేత బంధనాత్ |
మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చా శుద్ధమేవచ |
అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం |
లయ విక్షేప రహితం మనః కృత్వా సునిశ్చలం |
యథా యాత్యమనీభావం తథా తత్ పరమం పదం |
తావన్మనో నిరోద్ధవ్యం హృదియావత్ క్షయం గతం |
ఏతత్ జ్ఞానం చ మోక్షశ్చ శేషాస్తు గ్రంధవిస్తరాః |
సమాధి విర్థూతమలస్య చేతసో నివేశితస్యాత్మని యత్సుఖం భవేత్ |
నశక్యతే వర్ణయితుం గిరా తథా స్వయం తదంతః కరణేన గృహ్యతే ||“. (మైత్రాయణ్యుపనిషత్)
“రాగద్వేషాది దోషకలుషితం చిత్తమేవ సంసారః, సంసారహేతుర్యతః తత్. తస్మాత్ ప్రయత్నేన శోధయేత్|
జ్ఞానాభ్యాస వైరాగ్యాదిభిః రాగాది దోషనివృత్తిం సంపాదయేత్. యచ్చిత్తస్తన్మయో భవతి, యస్మిన్ వస్తుని చిత్తం యస్య స యచ్చిత్తః తథా చ బ్రహ్మణి చేచ్చిత్తం యస్య స తన్మయో భవతి - బ్రహ్మైవభవతీత్యర్థః. తథాచ శ్రుతిః - “బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి” ఇతి. గుహ్యం రహస్యం ఏతత్ ఉపదేశనం సనాతనం చిరంతనం గురుశిష్య పరంపరయా ప్రవృత్తం. సర్వాత్మ జ్ఞానే జాతే (అ)పికథం సంసారనివృత్తిః ? అనాది భవ పరంపరోపార్జిత కర్మణాం బహూనాం సంభవాత్ ఇత్యతః ఆహ - ’చిత్తస్య ప్రసాదానేతి అంతఃకరణ ప్రసాదపూర్వకాత్మ సాక్షాత్కారేణ ప్రసాదో నామ రాగ ద్వేషనివృత్తి పూర్వకమేకాగ్రతా శుభాశుభ పుణ్య పాపాత్మకం ప్రారబ్ద వ్యతిరిక్తం కర్మ హంతి నాశయతి ప్రసన్నః ఆత్మా అంతఃకరణం యస్య సః ప్రసన్నాత్మా. ఆత్మని పరిపూర్ణే అభేదేన స్థిత్వా సచ్చిదానందం బ్రహ్మ హమే వేతి సుఖమక్షయం నిత్యం అశ్నుతే, ప్రాప్నోతి. లయ విస్ఖేపరహితం - లయః సుషుప్తిః - నిక్షేపో జాగ్రత్స్వప్నౌ - అధవా లయః అజ్ఞానం, విక్షేపః భ్రాంతి జ్ఞానం, తాభ్యాం రహితం మనః కృత్వా, అత ఏవ సునిశ్చలం, తస్యైవ వ్యాఖ్యానం అవనీభావమితి. యదా అవనీభావం యాతి సాధకః తదా తత్పరమం పదం సాక్షాత్కృతో భవతి. ఏత దేవ జ్ఞానం. జ్ఞానసాధనం మోక్ష సాధనం చ”.
(రాగము, ద్వేషము, మొదలగు వాటిచేత కలుషితమగుటవలన చిత్తమే సంసారమునకు - జననమరణాది పరంపరకు - కారణమగుటచేత అదియే సంసారము - అందుచేత దానిని - చిత్తమును - ప్రయత్నించి శోధించవలెను. ప్రయత్నమనగా జ్ఞానము, అభ్యాసము, వైరాగ్యము మొదలగువాటిచేత రాగము మొదలగు వాటి నివృత్తి సంపాదింపవలెను - ఏ వస్తువునందు చిత్తము లగ్నమై యుండునో ఆ విషయమునందే అట్టిచిత్తము గలవాడు మునిగియుండును. ఆ ప్రకారముగానే ఎవని చిత్తము బ్రహమ్మందు లగ్నమైయుండునో వాడు బ్రహ్మమందే, బ్రహ్మ ధ్యానమందే మునిగియుండును - అనగా అట్టివాడు బ్రహ్మమే యగును - “బ్రహ్మను తెలుసుకొనినవాడు బ్రహ్మయే యగును -” అని శ్రుతి చెప్పుచున్నది. చిత్తమును గుఱించి యీ యుపదేశము రహస్యమైనదిన్నీ, చిరకాలమునుండి వచ్చుచున్నదిన్నీ, గురువునుండి శిష్యునకు పరంపరగావచ్చినదిన్నీ. అనాదికాలమునుండి కలుగుచున్న, అనేక జన్మలలో ఆర్జించిన కర్మ ఫలము బ్రహ్మజ్ఞానము కలుగగానే ఎట్లు నివృత్తియగుననగా - చిత్తప్రసాదముచేత - అంతఃకరణము శుద్ధియగుటచేత కలుగు ఆత్మసాక్షాత్కారముచేత - చిత్త ప్రసాదమనగా రాగద్వేషముములు మొదలగునవిలేకుండ చేసుకొనిన పిమ్మట ఏకాగ్రతపొందుట. ప్రారబ్దకర్మకాక మిగిలిన పుణ్యపాపకర్మలను నాశముచేయును. ప్రసన్నమైన అంతఃకరణము గలవాడు పరిపూర్ణుడైన - అన్నింటిలోను, అంతటా, పూర్తిగా నిండియున్నవాడు అయిన - ఆత్మయందు, ఆత్మకి తనకి భేదములేదను బుద్ధితో మునిగియుండి “సచ్చిదానందమైన బ్రహ్మము నేనే” అని తలుచుకొనుచు అత్యంతసుఖమైన మోక్షమును పొందును - అమనీభావమనగా రాగ విక్షేపరహితమైన మనస్సు కలిగియుండుట. లయమనగా సుషుప్తి. విక్షేపమనగా జాగ్రత్స్వప్నములు; లేక, లయమనగా అజ్ఞానము, విక్షేపమనగా భ్రాంతిజ్ఞానము. ఈ రెండును లేకయుండునట్లు మనస్సును చేసి, నిశ్చలమైన మనస్సు గలిగియుండుట. సాధకుడు ఇట్టి అమనీభావమును ఎప్పుడు పొందునో అప్పుడు ఆపరమపదమును సాక్షాత్కరించుకొనును - ఇదియే జ్ఞానము, జ్ఞానసాధనము, మోక్షసాధనమున్నూ).
తస్మాత్ చిత్తం స్థిరీ కుర్యాత్ ప్రజ్ఞయా పరయా విధే || - - -
మనసా మన ఆలోచక్య వృత్తి శూన్యం యదా భవేత్ |
తతః పరం బ్రహ్మ దృశ్యతే చ సు దుర్లభం ||’ (యోగశిఖోపనిషత్)
(చిత్తము చంచలముగానున్నచో - చిత్తము తనస్వాధీనములో లేనిచో - అది సంసారమునకు కారణము అగును - అది ఎట్లనగా చిత్తము తన స్వాధీనములో లేకపోయిన యడల కామములు కలుగును - వాటి కొఱకు కర్మలు చేయవలసియుండును, ఆ కర్మలవలన మరల మరల జన్మలు కలుగుచుండును - మరల మరల జన్మలు కలుగుటయే సంసారము - చిత్తమును భగవంతునియందే నిశ్చముగా నుంచగలిగిన చో అదియే మోక్షము. అందుచేత ఎంత ప్రయత్నము చేసి అయినను చిత్తమును స్థిరముగా నుంచవలెను. మనస్సు దాని వృత్తులను అది చేయకుండునట్లు చేసిన దుర్లభమైన పరబ్రహ్మ దర్శనము కలుగును).
(చిత్తము ఏ ప్రకారముగనుండునో ఆ ప్రకారముగానే జీవుడు ప్రవర్తించును).” విషయాన్ ధ్యాయ తశ్చిత్తం విషయేషు విసజ్జతే| మామనుస్మరతశ్చిత్తం మయ్యేవ ప్రవిలీయతే ||’ (శ్రీమద్భాగవతం- 11 -)
(విషయములగుఱించి ధ్యానము చేయువాడు విషయములందే మునిగియుండును - నన్ను - భగవంతుని నిరతము ధ్యానించువాడు భగవంతునియందే లీనమగును).
- - -
తే. వైరులెవ్వరు చిత్తంబు వైరిగాక
చిత్తమును నీకు వశముగా జేయవయ్య ---” (శ్రీమదాంధ్రమహాభాగవతము- 7 - 8 - 266, 267)
“ākāśamē appu saṃ yōgāna cittamāyenu” (brahmavidyā sudhārṇavamu)
aṃtaḥkaraṇaṃ (aṃtaḥkaraṇamu - lōpali yiṃdriyamulu).
manassu; kōrika.
anu saṃdhānātmakāṃtaḥ karaṇa vṛttiḥ cittaṃ.
(pūrvaviṣayamunu smaraṇaku teccunaṭṭi anusaṃdhānarūpamaina aṃtaḥkaraṇavṛtti).
vicāraṃ saṃ parityajya tadāsā cittamucyatē ||“. (yōgavāsiṣṭamu - 80 - 3)
(vicāriṃcaka oka viṣayamunu viḍici iṃkokaviṣayamunu talacunadi cittamu).
(sattvamu nirmalamainadaguṭavalla prakāśiṃcunadi, anāmayamunnū ani ceppabaḍiyuṃḍuṭavalana sattvamu prakāśiṃcunadaguṭacēta, ā guṇamugala cittamu bhagavaṃtuḍuṃḍu sthānamu).
(bhagavaṃtuni sthānamu, satvamu - adhibhūtarūpamulō ādiyē mahattattvamu, adhyātmarūpamulō cittamu aniyu ceppabaḍucunnadi. upāsana cēyunappuḍu bhagavaṃtuḍagu vāsudēvuḍani ceppabaḍucunnadi. dīniki adhiṣṭāta kṣētrajñuḍu).
(cittaṃ = cit + ta; cittamu anu padamulōni takāramu viṣayādhyānamu - adi tesivēsina ‘cit’ migulunu - aṃducēta cittamanagā ‘cit’ - jñēyavastuvu - telisinavastuvu - nu - tīsivēyagā jñānamē migulunu).
(cit + ta = citta ; citta - ta = cit).
yaccittastanmayō bhavati guhyamētat sanātanaṃ ||“.
cittasyahi prasādēna haṃti karma śubhā śubhaṃ |
prasannātmā (ā)tmani sthitvā sukhamakṣaya maśnutē |
samāsaktaṃ yathā cittaṃ, jaṃtōrviṣaya gōcarē |
yadvēvaṃ brahmaṇisyāt tat kōna mucyēta baṃdhanāt |
manōhi dvividhaṃ prōktaṃ śuddhaṃ cā śuddhamēvaca |
aśuddhaṃ kāma saṃkalpaṃ śuddhaṃ kāma vivarjitaṃ |
laya vikṣēpa rahitaṃ manaḥ kṛtvā suniścalaṃ |
yathā yātyamanībhāvaṃ tathā tat paramaṃ padaṃ |
tāvanmanō nirōddhavyaṃ hṛdiyāvat kṣayaṃ gataṃ |
ētat jñānaṃ ca mōkṣaśca śēṣāstu graṃdhavistarāḥ |
samādhi virthūtamalasya cētasō nivēśitasyātmani yatsukhaṃ bhavēt |
naśakyatē varṇayituṃ girā tathā svayaṃ tadaṃtaḥ karaṇēna gṛhyatē ||“. (maitrāyaṇyupaniṣat)
“rāgadvēṣādi dōṣakaluṣitaṃ cittamēva saṃsāraḥ, saṃsārahēturyataḥ tat. tasmāt prayatnēna śōdhayēt|
jñānābhyāsa vairāgyādibhiḥ rāgādi dōṣanivṛttiṃ saṃpādayēt. yaccittastanmayō bhavati, yasmin vastuni cittaṃ yasya sa yaccittaḥ tathā ca brahmaṇi cēccittaṃ yasya sa tanmayō bhavati - brahmaivabhavatītyarthaḥ. tathāca śrutiḥ - “brahmavēda brahmaiva bhavati” iti. guhyaṃ rahasyaṃ ētat upadēśanaṃ sanātanaṃ ciraṃtanaṃ guruśiṣya paraṃparayā pravṛttaṃ. sarvātma jñānē jātē (a)pikathaṃ saṃsāranivṛttiḥ ? anādi bhava paraṃparōpārjita karmaṇāṃ bahūnāṃ saṃbhavāt ityataḥ āha - ’cittasya prasādānēti aṃtaḥkaraṇa prasādapūrvakātma sākṣātkārēṇa prasādō nāma rāga dvēṣanivṛtti pūrvakamēkāgratā śubhāśubha puṇya pāpātmakaṃ prārabda vyatiriktaṃ karma haṃti nāśayati prasannaḥ ātmā aṃtaḥkaraṇaṃ yasya saḥ prasannātmā. ātmani paripūrṇē abhēdēna sthitvā saccidānaṃdaṃ brahma hamē vēti sukhamakṣayaṃ nityaṃ aśnutē, prāpnōti. laya viskhēparahitaṃ - layaḥ suṣuptiḥ - nikṣēpō jāgratsvapnau - adhavā layaḥ ajñānaṃ, vikṣēpaḥ bhrāṃti jñānaṃ, tābhyāṃ rahitaṃ manaḥ kṛtvā, ata ēva suniścalaṃ, tasyaiva vyākhyānaṃ avanībhāvamiti. yadā avanībhāvaṃ yāti sādhakaḥ tadā tatparamaṃ padaṃ sākṣātkṛtō bhavati. ēta dēva jñānaṃ. jñānasādhanaṃ mōkṣa sādhanaṃ ca”.
(rāgamu, dvēṣamu, modalagu vāṭicēta kaluṣitamaguṭavalana cittamē saṃsāramunaku - jananamaraṇādi paraṃparaku - kāraṇamaguṭacēta adiyē saṃsāramu - aṃducēta dānini - cittamunu - prayatniṃci śōdhiṃcavalenu. prayatnamanagā jñānamu, abhyāsamu, vairāgyamu modalaguvāṭicēta rāgamu modalagu vāṭi nivṛtti saṃpādiṃpavalenu - ē vastuvunaṃdu cittamu lagnamai yuṃḍunō ā viṣayamunaṃdē aṭṭicittamu galavāḍu munigiyuṃḍunu. ā prakāramugānē evani cittamu brahammaṃdu lagnamaiyuṃḍunō vāḍu brahmamaṃdē, brahma dhyānamaṃdē munigiyuṃḍunu - anagā aṭṭivāḍu brahmamē yagunu - “brahmanu telusukoninavāḍu brahmayē yagunu -” ani śruti ceppucunnadi. cittamunu guṟiṃci yī yupadēśamu rahasyamainadinnī, cirakālamunuṃḍi vaccucunnadinnī, guruvunuṃḍi śiṣyunaku paraṃparagāvaccinadinnī. anādikālamunuṃḍi kalugucunna, anēka janmalalō ārjiṃcina karma phalamu brahmajñānamu kalugagānē eṭlu nivṛttiyagunanagā - cittaprasādamucēta - aṃtaḥkaraṇamu śuddhiyaguṭacēta kalugu ātmasākṣātkāramucēta - citta prasādamanagā rāgadvēṣamumulu modalagunavilēkuṃḍa cēsukonina pimmaṭa ēkāgratapoṃduṭa. prārabdakarmakāka migilina puṇyapāpakarmalanu nāśamucēyunu. prasannamaina aṃtaḥkaraṇamu galavāḍu paripūrṇuḍaina - anniṃṭilōnu, aṃtaṭā, pūrtigā niṃḍiyunnavāḍu ayina - ātmayaṃdu, ātmaki tanaki bhēdamulēdanu buddhitō munigiyuṃḍi “saccidānaṃdamaina brahmamu nēnē” ani talucukonucu atyaṃtasukhamaina mōkṣamunu poṃdunu - amanībhāvamanagā rāga vikṣēparahitamaina manassu kaligiyuṃḍuṭa. layamanagā suṣupti. vikṣēpamanagā jāgratsvapnamulu; lēka, layamanagā ajñānamu, vikṣēpamanagā bhrāṃtijñānamu. ī reṃḍunu lēkayuṃḍunaṭlu manassunu cēsi, niścalamaina manassu galigiyuṃḍuṭa. sādhakuḍu iṭṭi amanībhāvamunu eppuḍu poṃdunō appuḍu āparamapadamunu sākṣātkariṃcukonunu - idiyē jñānamu, jñānasādhanamu, mōkṣasādhanamunnū).
tasmāt cittaṃ sthirī kuryāt prajñayā parayā vidhē || - - -
manasā mana ālōcakya vṛtti śūnyaṃ yadā bhavēt |
tataḥ paraṃ brahma dṛśyatē ca su durlabhaṃ ||’ (yōgaśikhōpaniṣat)
(cittamu caṃcalamugānunnacō - cittamu tanasvādhīnamulō lēnicō - adi saṃsāramunaku kāraṇamu agunu - adi eṭlanagā cittamu tana svādhīnamulō lēkapōyina yaḍala kāmamulu kalugunu - vāṭi koṟaku karmalu cēyavalasiyuṃḍunu, ā karmalavalana marala marala janmalu kalugucuṃḍunu - marala marala janmalu kaluguṭayē saṃsāramu - cittamunu bhagavaṃtuniyaṃdē niścamugā nuṃcagaligina cō adiyē mōkṣamu. aṃducēta eṃta prayatnamu cēsi ayinanu cittamunu sthiramugā nuṃcavalenu. manassu dāni vṛttulanu adi cēyakuṃḍunaṭlu cēsina durlabhamaina parabrahma darśanamu kalugunu).
(cittamu ē prakāramuganuṃḍunō ā prakāramugānē jīvuḍu pravartiṃcunu).” viṣayān dhyāya taścittaṃ viṣayēṣu visajjatē| māmanusmarataścittaṃ mayyēva pravilīyatē ||’ (śrīmadbhāgavataṃ- 11 -)
(viṣayamulaguṟiṃci dhyānamu cēyuvāḍu viṣayamulaṃdē munigiyuṃḍunu - nannu - bhagavaṃtuni niratamu dhyāniṃcuvāḍu bhagavaṃtuniyaṃdē līnamagunu).
- - -
tē. vairulevvaru cittaṃbu vairigāka
cittamunu nīku vaśamugā jēyavayya ---” (śrīmadāṃdhramahābhāgavatamu- 7 - 8 - 266, 267)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.