← Back to చ · Booklets 11–20 (digitized file 2)

చిత్తశాంతి cittaśāṃti

Original — తెలుగు
  1. “యోగినశ్చిత్త శాంత్యర్థం కుర్వంతి ప్రాణ రోధనం |

ప్రాణాయామై స్తధా ధ్యానైః ప్రయోగైర్యుక్తి కల్పితైః |

చిత్తోపశాంతి ఫలదం పరమమ విద్ధి కారణం ||“. (అన్నపూర్ణోపనిషత్)

(చిత్తశాంతికొఱకు యోగులు ప్రాణాయామము చేయుదురు. ప్రాణాయామముచేత, యుక్తితో కూడిన ప్రయోగములు చేతను చిత్త శాంతి కలుగును).

  1. “యానద్విలీనం నమనో నతావద్వాసనా క్షయః |

న క్షీణ వాసనాయావత్తా వచ్చిత్తం న శామ్యతి |

యావన్న తత్వ విజ్ఞానం తానచ్చిత్త శమః కుతః |

యావన్న చిత్తో వశమో నతావత్తత్వ వేదనం ||“.

(మనసు ఎంతకాలము లీనమైపోవకయుండునో అంతకాలము వాసనలు క్షీణించవు. వాసనలు క్షీణించనంతకాలము చిత్తము శాంతిని పొందదు. తత్వజ్ఞానమపుడు చిత్తమునకు శాంతియెట్లు కలుగును ?).

  1. “యథా నిరింధనో వహ్ని స్వయోనా వుపశామ్యతి |

తథా వృత్తి క్షయాచ్చిత్తం స్వయోనా వుప శామ్యతి ||“.

(కట్టెలు వేయని అగ్ని ఎట్లు తానే శాంతిని పొందునో, అట్లే చిత్తము దానివృత్తులు నిరోధింపబడగానే శాంతిని పొందును).

  1. “కుటుంబ సంగంబున చిత్త విక్షేపంబగు, చిత్త విజయ ప్రయత్నంబున సన్యసించి, సంగంబు వర్జించి, మితంబయిన భిక్షాన్నంబు భక్షించుచు, శుద్ధ వివిక్త సమప్రవేశంబున నొక్కరుండు నాసీనుండై సుస్థిరత్వంబున బ్రణవోచ్చారణంబు సేయుచు, రేచక, పూరక, కుంభకంబుల ప్రాణాపానంబుల నిరోధించి, కామ హతంబయిన చిత్తంబున బరిభ్రమణంబు మాని, కామ విసర్జనంబు సేసి మరలునంతవరకు నిజ నాసాగ్ర నిరీక్షణంబు సేయుచు, నివ్విధంబున యోగాభ్యాసంబు చేయువాని చిత్తంబు కాష్టరహితంబైన వహ్ని తెఱంగున శాంతిం జెందు. కామాదులచేత వేధింపబడక ప్రశాంత సమస్త వృత్తంబయిన చిత్తంబు బ్రహ్మసుఖ సమ్మర్శనంబున లీనంబై మఱియు నెగయనేరదు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము- 7 - 15 - 460)

Transliteration
  1. “yōginaścitta śāṃtyarthaṃ kurvaṃti prāṇa rōdhanaṃ |

prāṇāyāmai stadhā dhyānaiḥ prayōgairyukti kalpitaiḥ |

cittōpaśāṃti phaladaṃ paramama viddhi kāraṇaṃ ||“. (annapūrṇōpaniṣat)

(cittaśāṃtikoṟaku yōgulu prāṇāyāmamu cēyuduru. prāṇāyāmamucēta, yuktitō kūḍina prayōgamulu cētanu citta śāṃti kalugunu).

  1. “yānadvilīnaṃ namanō natāvadvāsanā kṣayaḥ |

na kṣīṇa vāsanāyāvattā vaccittaṃ na śāmyati |

yāvanna tatva vijñānaṃ tānaccitta śamaḥ kutaḥ |

yāvanna cittō vaśamō natāvattatva vēdanaṃ ||“.

(manasu eṃtakālamu līnamaipōvakayuṃḍunō aṃtakālamu vāsanalu kṣīṇiṃcavu. vāsanalu kṣīṇiṃcanaṃtakālamu cittamu śāṃtini poṃdadu. tatvajñānamapuḍu cittamunaku śāṃtiyeṭlu kalugunu ?).

  1. “yathā niriṃdhanō vahni svayōnā vupaśāmyati |

tathā vṛtti kṣayāccittaṃ svayōnā vupa śāmyati ||“.

(kaṭṭelu vēyani agni eṭlu tānē śāṃtini poṃdunō, aṭlē cittamu dānivṛttulu nirōdhiṃpabaḍagānē śāṃtini poṃdunu).

  1. “kuṭuṃba saṃgaṃbuna citta vikṣēpaṃbagu, citta vijaya prayatnaṃbuna sanyasiṃci, saṃgaṃbu varjiṃci, mitaṃbayina bhikṣānnaṃbu bhakṣiṃcucu, śuddha vivikta samapravēśaṃbuna nokkaruṃḍu nāsīnuṃḍai susthiratvaṃbuna braṇavōccāraṇaṃbu sēyucu, rēcaka, pūraka, kuṃbhakaṃbula prāṇāpānaṃbula nirōdhiṃci, kāma hataṃbayina cittaṃbuna baribhramaṇaṃbu māni, kāma visarjanaṃbu sēsi maralunaṃtavaraku nija nāsāgra nirīkṣaṇaṃbu sēyucu, nivvidhaṃbuna yōgābhyāsaṃbu cēyuvāni cittaṃbu kāṣṭarahitaṃbaina vahni teṟaṃguna śāṃtiṃ jeṃdu. kāmādulacēta vēdhiṃpabaḍaka praśāṃta samasta vṛttaṃbayina cittaṃbu brahmasukha sammarśanaṃbuna līnaṃbai maṟiyu negayanēradu”.

(śrīmadāṃdhramahābhāgavatamu- 7 - 15 - 460)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.