(కర్మలు చేయుటవలన చిత్త శుద్ది కలుగును). (విహితకర్మలు, నిత్యకర్మలు, వేదాధ్యయనము, యజ్ఞము, దానము, వ్రతములు, తపస్సు, నియమములు ఆచరించినయడల చిత్తశుద్ధి కలుగును).
(శుద్ధమైన ఆహారము తినుటవలన చిత్తశుద్ధి దానంతట అదే కలుగును) -“ఆహార శుద్ధౌ నృపతే చిత్తశుద్ధిస్తు జాయతే”. (దేవీభాగవతము).
(సత్పురుషుల సంగమమువలన, వేదాంత శ్రవణమువలన చిత్తము వాసనా రహితమైన యడల అదియే చిత్తాశుద్ధి అని చెప్పబడినది).
(ద్రవ్య శుద్ధి, క్రియాశుద్ధిని కలిగియుండి, పుణ్య క్షేత్రములందు నివసించుచు, జ్ఞాననిష్టచేతను, సత్పురుషుల సంగముచేతను, శాస్త్రములను వినుటచేతను, వైరాగ్యము చేతను చిత్తశుద్ధి సంపాదించవలెను).
యది స్యాత్ దైవ యోగేన క్షాలయంత్యాంతరం మలం |
విశేషణతు సత్సంగో జ్ఞాన నిష్టస్య భూపతే |
నవేదా, నచ శాస్త్రాణి, న వ్రతాని, తపాంసిన |
న మఖా న చ దానాని చిత్త శుద్ధేస్తు కారణం ||“. (దేవీభాగవతం ---)
“తీర్థాని దేహమల మేవ క్షాలయంతి, నతుమానసం మలం. యది దైవ యోగేన జ్ఞాన నిష్టస్య సత్సంగో విశేషేణ నిరంతరం స్యాత్, తదా స ఏవ సత్సంగః అతరం మలం మానసం మలం క్షాలయతి, నాన్యః ఇత్యర్థః -(తీర్థములు - తీర్థములలో స్నానము చేయుటవలన - దేహము పైనున్న మలమునే - బాహ్య మలమునే పోగొట్టును. దైవయోగముచేత - అదృష్తవశాత్తు - జ్ఞాననిష్టునికి సత్పురుషుల సంగము ఎల్లపుడు దొరికినయడల ఆ సత్సంగమే లోపలనున్నమలమును, మానసికమలమును పోగొట్టును - చిత్తమునకు సంబంధించిన ఈ మలము
ఇంకొకరీతిగా పోవనేరదు).
కర్మ యోగోస్త్వనుష్టేయో న సన్యాసః కథంచన |
వైరాగ్య తీవ్రతా యాం న స్వయమేవ భవిష్యతి |
ధీ శోధకమృతే కర్మ సన్యాసో యోహఠాత్కృతః |
సదుఃఖ మామ్త మేవాస్తి బుద్ధి శుద్ధేర భావతః |
జ్ఞానస్యా సంభవాత్ కర్మ త్యాగాద్బ్రష్టో అభితో భవేత్ |
కర్మానుష్టాన యుక్తస్తు శుద్ధ బుద్ధితయా మునిః |
సత్యం జ్ఞానమనంతాఖ్య మాత్మానం బ్రహ్మ హృద్గతం |
ఘ్రమ ప్రతిబంధేన సమ్యక్ సాక్షాత్కారో త్య సౌ ||“. (గీతాభావప్రకాశము - 5 - 59 to 63)
(అజ్ఞాని అయిన జిజ్ఞాసువు మొదట చిత్తశుద్ధి కొఱకు కర్మ యోగము చేయవలెను - అంతేగాని మొదటిలో కర్మసన్యాసము చేయకూడదు. వైరాగ్యము తీవ్ర దశ పొందినపుడు కర్మసన్యాసము దానంతట అదే వచ్చును. చిత్త శుద్ధి లేనిదే హఠాత్తుగా ముందే కర్మసన్యాసము చేసినవాడు చిత్తశుద్ధి లేనందువలన దుఃఖమునే పొందును. కర్మ చేయకపోవుటవలన జ్ఞానము కలుగక పోవుటవలన భ్రష్టుడగును. కర్మయోగము ముందుగా చేసినవాడు దానివలన చిత్తశుద్ధికలుగుటవలన తన హృదయములోనే ఉన్న “సత్యం జ్ఞానమనంతం” అని చెప్పబడు బ్రహ్మ శీఘ్రముగా, ఏ అడ్డు లేక సాక్షాత్కరించును).
“చిత్తశుద్ధి లేని శివపూజనములేల (వేమన).
“చిత్త శుద్ధి కల్గిచేసిన పుణ్యంబు
కొంచెమైననదియు కొదువకాదు” (వేమన)
(karmalu cēyuṭavalana citta śuddi kalugunu). (vihitakarmalu, nityakarmalu, vēdādhyayanamu, yajñamu, dānamu, vratamulu, tapassu, niyamamulu ācariṃcinayaḍala cittaśuddhi kalugunu).
(śuddhamaina āhāramu tinuṭavalana cittaśuddhi dānaṃtaṭa adē kalugunu) -“āhāra śuddhau nṛpatē cittaśuddhistu jāyatē”. (dēvībhāgavatamu).
(satpuruṣula saṃgamamuvalana, vēdāṃta śravaṇamuvalana cittamu vāsanā rahitamaina yaḍala adiyē cittāśuddhi ani ceppabaḍinadi).
(dravya śuddhi, kriyāśuddhini kaligiyuṃḍi, puṇya kṣētramulaṃdu nivasiṃcucu, jñānaniṣṭacētanu, satpuruṣula saṃgamucētanu, śāstramulanu vinuṭacētanu, vairāgyamu cētanu cittaśuddhi saṃpādiṃcavalenu).
yadi syāt daiva yōgēna kṣālayaṃtyāṃtaraṃ malaṃ |
viśēṣaṇatu satsaṃgō jñāna niṣṭasya bhūpatē |
navēdā, naca śāstrāṇi, na vratāni, tapāṃsina |
na makhā na ca dānāni citta śuddhēstu kāraṇaṃ ||“. (dēvībhāgavataṃ ---)
“tīrthāni dēhamala mēva kṣālayaṃti, natumānasaṃ malaṃ. yadi daiva yōgēna jñāna niṣṭasya satsaṃgō viśēṣēṇa niraṃtaraṃ syāt, tadā sa ēva satsaṃgaḥ ataraṃ malaṃ mānasaṃ malaṃ kṣālayati, nānyaḥ ityarthaḥ -(tīrthamulu - tīrthamulalō snānamu cēyuṭavalana - dēhamu painunna malamunē - bāhya malamunē pōgoṭṭunu. daivayōgamucēta - adṛṣtavaśāttu - jñānaniṣṭuniki satpuruṣula saṃgamu ellapuḍu dorikinayaḍala ā satsaṃgamē lōpalanunnamalamunu, mānasikamalamunu pōgoṭṭunu - cittamunaku saṃbaṃdhiṃcina ī malamu
iṃkokarītigā pōvanēradu).
karma yōgōstvanuṣṭēyō na sanyāsaḥ kathaṃcana |
vairāgya tīvratā yāṃ na svayamēva bhaviṣyati |
dhī śōdhakamṛtē karma sanyāsō yōhaṭhātkṛtaḥ |
saduḥkha māmta mēvāsti buddhi śuddhēra bhāvataḥ |
jñānasyā saṃbhavāt karma tyāgādbraṣṭō abhitō bhavēt |
karmānuṣṭāna yuktastu śuddha buddhitayā muniḥ |
satyaṃ jñānamanaṃtākhya mātmānaṃ brahma hṛdgataṃ |
ghrama pratibaṃdhēna samyak sākṣātkārō tya sau ||“. (gītābhāvaprakāśamu - 5 - 59 to 63)
(ajñāni ayina jijñāsuvu modaṭa cittaśuddhi koṟaku karma yōgamu cēyavalenu - aṃtēgāni modaṭilō karmasanyāsamu cēyakūḍadu. vairāgyamu tīvra daśa poṃdinapuḍu karmasanyāsamu dānaṃtaṭa adē vaccunu. citta śuddhi lēnidē haṭhāttugā muṃdē karmasanyāsamu cēsinavāḍu cittaśuddhi lēnaṃduvalana duḥkhamunē poṃdunu. karma cēyakapōvuṭavalana jñānamu kalugaka pōvuṭavalana bhraṣṭuḍagunu. karmayōgamu muṃdugā cēsinavāḍu dānivalana cittaśuddhikaluguṭavalana tana hṛdayamulōnē unna “satyaṃ jñānamanaṃtaṃ” ani ceppabaḍu brahma śīghramugā, ē aḍḍu lēka sākṣātkariṃcunu).
“cittaśuddhi lēni śivapūjanamulēla (vēmana).
“citta śuddhi kalgicēsina puṇyaṃbu
koṃcemainanadiyu koduvakādu” (vēmana)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.