← Back to ఏ · Booklets 11–20 (digitized file 2)

ఏకః ēkaḥ

Original — తెలుగు
  1. అద్వితీయం; అనుపమం; అజండః; సజాతీయ విజాతీయ రహితం; స్వసమాన రహితః; సమాభ్యధిక రహితః; అసహాయః.

(తనకంటె రెండవపదార్థము లేనిది - తనతో పోల్చతగినది లేనిది; ప్రపంచమంతట, లోన. బైట పూర్తిగా నిండియున్నవాడు; (తను లేనిచోటు లేనివాడు); తనవలె పరమాత్మ పరబ్రహ్మ అయిన ఇతరుడు లేనివాడు, ఇతర వస్తువేదియు లేనివాడు; తనతో సమానమైనవాడుగాని, తనకంటె అధికుడైనవాడుగాని లేనివాడు, సృష్టి చేయుటలో తనకు ఇంకొకరి సహాయము లేనివాడు). (గీత - 11 - 43)

  1. ఏకం సర్వ భూతేషు - (సమస్త భూతములందు తానొక్కడే ఉండువాడు)

(సమస్త వస్తువులలోను అంతరాత్మగా తనే ఉండువాడు).

  1. అన్య, ద్రష్టృ దృశ్యాత్మకం నకించిత్ ఆసీత్ ఇతి.

(తనకంటె ఇతరమైన ద్రష్టగాని, దృశ్యవస్తువుగాని లేనివాడు - సమస్త వస్తువులు తానే అయినవాడు. ప్రపంచము అంతా, ప్రపంచములోని వస్తువులన్నీ తానే యగుటవలన తనను చూచువాడుకాని, తాను చూచు ఇతరవస్తువుకాని లేనివాడు).

  1. సృష్టేః ప్రాక్ ఏక ఏవ నామరూపవిభాగానర్హ సూక్ష్మచిదచిత్కాల శరీరకస్సన్ ఉపాదానత్వేనవిద్యమానః

(సృష్టికి పూర్వము నామరూపములు కలిగియుండుటకు అర్హముకాని స్థితిలోనున్న సూక్ష్మ చిదచిత్కాలము రూపముతో ఉపాదానకారణమై ఒక్కడే అయినవాడు).

  1. ఏక ఏవ ఉపాదానకారణాంతర శూన్యః - ఏకత్వం చ సృట్యనంతర భావినామ రూపవిభాగ నిబంధన బహుత్వ ప్రతిబంధినామరూప విభాగా భావాదీనా మేవ వక్షితం. నతు ప్రకృతి పురుషాది రాహిత్యం ఏకః ఇతి.

(ఇతర ఉపాదానకారణములేక తాను ఒకడే ఉపాదానకారణమైనవాడు. సృష్టి తర్వాత కలుగు నామరూపములుగల వస్తువులన్నింటికి ఉపాదానకారణమైనవాడు - ప్రకృతి పురుషులు కలసి ఉన్న స్థితిలో ఉన్నవాడు).

  1. కనబడనివాడు - కేవలుడు - అనగా తనవలన పుట్టిన మహత్తత్త్వము మొదలగువాటితో కలిసియుండక సృష్టికి పూర్వము తానొక్కడే యుండువాడు. ఏ కార్యవస్తువుతోనుకలిసియుండనివాడు - కనబడనివాడు).

“పరోక్షస్సన్, ఏకాకీసన్ రహసి కేవలః, విష్ణుః -”.

  1. అసహాయః; (ప్రపంచసృష్టిలో ఇతర సహాయము లేనివాడు - ఇతర సహాయము లేకనే సృష్టి, స్థితి లయములు చేయువాడు).

  2. ఏకః త్వమేవ కారయితా, న అన్యో అస్తి, యధాపి. (నీవొక్కడివే సృష్టి కర్తవు - ఎన్ని విధములుగా చూచినను ఇతరులు ఎవరూ లేరు - అందుచేత ఏకః).

  3. సుహృదాది సంగరహితః, అస్య ప్రియః, అప్రియః నాస్తి.

(సుహృదులుగాని, ప్రియులుగాని, అప్రియులుగాని లేనివాడు).

  1. అపరః -

(ఇంకొకడు లేనివాడు - సృష్టిలో ఉన్నదంతయు తానే అయినవాడు - తనకంటె ఉత్కృష్టుడైనవాడు లేనివాడు).

  1. భేదరహితః (భేదము లేనివాడు - ఎల్లపుడు ఒక్కరీతిగనే ఉండువాడు).

  2. ఏకరూపః (ఒకే ఆకారముతో, ఒకే స్థితిలోనుండువాడు).

  3. సృష్టేః ప్రాక్ కేవలః -

(సృష్టికిముందు తాను ఒక్కడే ఉన్నవాడు - “ఆత్మై వేదం ఏక ఏవాగ్ర ఆసీత్” - ఇతి శ్రుతిః -

ఈ కనబడు ప్రపంచమంతయు సృష్టికి పూర్వము ఒక్క ఆత్మగానే ఉండెను. అప్పుడు మరేదియును లేదు).

  1. “పరమార్థ తః స్వజాతీయ విజాతీయ స్వగత భేద వినుర్ముక్తత్వాత్ ఏకః” (శ్రీ శంకరః)

(పరమార్థ దృష్టిలో స్వజాతీయ, విజాతీయ, స్వగత భేదములేనివాడు కనుక ఏకః).

  1. స్వతః ఏకః మా య యాతు అనేకః.

(తాను ఒక్కడే - సృష్టి చేయకముందు ఒక్కడే - సృష్టి చేయుటకు మాయతో కలిసియుండుటవలన - ప్రకృతి, దాని వికారములైన సమస్త వస్తువులలో ప్రవేశించి యుండుటవలన అనేకముగా అయినవాడు).

  1. అద్వితీయ తత్వ రూపః -

(ఆత్మ తత్వము ఒకటే, సృష్టికి ముందు ఒకటిగా ఉన్నపుడు, స్థితికాలములో అనేక వస్తువులలో ప్రవేశించి యుండునపుడు. ఉన్న ఆత్మ ఒకటే - అన్నింటిలోను ఉన్నది ఒకే తత్వము - ‘తత్వము’ అనగా అదే - ఆ పరమాత్మయే నీవు ఇట్లున్న తత్వము ఒకటే - అదే పరమాత్మ - అటువంటి తత్వము మరొకటి లేనివాడు).

  1. దేశకాల వస్తువుల పరిచ్ఛేదరహితః –

(దేశముచేతగాని, కాలముచేతగాని, వస్తువుచేతగాని పరిమితి లేనివాడు – ఇటువంటివాడు మరొకడు లేడు కనుక ‘ఏకః’.)

  1. “యః పరమేశ్వరః స్వ విలల్పిత సర్వాన్ లోకాన్ అహమే వేదం సర్వం” ఇతి స్వా విశేషతయా ఉద్గృష్ణాతి, ఉపసమ్హరతి, అజస్రం సృజతి సూక్ష్మ రూపేణ, పునః స్థూల రూపేణ విశ్రుజతి. ఏవమ పంచీకృతభూత సృష్టిం కృత్వా స్వస్మి నాధారభూతే అజస్రం వాసయతి, స్థితిం కరోతి, స ఏకః“.

(తనచేత కల్పించబడిన సమస్త లోకములు తానే అని అన్నియు అని సూక్ష్మరూపముతో వాటిని సృజించి, వాటిని స్థూలరూపముగా చేసి, ఆ సృజించిన వాటికి కొంతకాలము స్థితి కల్పించి వాటిని ఉపసమ్హరించుచుండు పరమేశ్వరుడు ఒక్కడే. అందుచేత అతను ‘ఏకః’).

  1. “నిత్యః అర్వాత్మకోహ్యాత్మా కూటస్థో దోష వర్జితః |

ఏకస్స భిద్యతే శక్త్యా మాయ యా సర్వభావతః ||“. (ఈశ్వరగీత)

(నిత్యుడు - మూడు కాలములందు ఉండువాడు -, అన్నింటికి తానే ఆత్మ అయినవాడున్నూ, కూటస్థుడున్నూ, ఏ విధమైన దోషములు లేనివాడున్నూ అయిన పరమాత్మ ఒకడే అయినను తన మాయా శక్తిచేత అన్ని భావములుగాను - అన్ని రూపములుగాను తానే విభజింపబడుచున్నాడు).

  1. “సర్వ భూతస్థితం యో మాం భజత్యేకత్వమా స్థితం -” (శ్రీమద్భగవద్గీత - 6 - 31)

“- - - అఖండార్థోని రూప్యతే|

బ్రహ్మాది స్థావరాం తేషు భూతేషూచ్ఛా వచేషు యః |

నిర్విశేషం, చిదానందం మామ ద్వైతం నిరంజనం |

గుణరూపక్రియావస్తు విక్రియాద్యేక హేతుకం |

భేదంత్యక్త్వా - - - శుద్ధం సచ్ఛిన్మాత్ర తయాస్థితం |

ఇహైకత్వం శృతౌ సిద్ధమత్యంతా భేదమాస్థితః”

అహం బ్రహ్మేతి వేదాంత వాక్య జ జ్ఞాన చక్షుషా |

అపరోక్ష కరోత్యానుత్యక్త్వా విద్యాంచ తత్కృతాం |

కృత కృత్యతయా సోయం జీవన్ముక్త ఉదారధీః - - - ||“. (గీతాభావప్రకాశము - 6 - 151 to 155)

(తత్వపదార్థమును చెప్పి శ్రీకృష్ణ భగవానుడు అఖండార్థమును చెప్పుచున్నాడు - భగవంతుడు వేరు వేరు వస్తువులుగా కాక ఒక్కడే అనుట అఖండార్థము - చతుర్ముఖ బ్రహ్మ మొదలు స్థావరములువరకుగల భూతములందు - ఇవి శ్రేష్టమైనవి, ఇవి నీచమైనవి అని విచక్షణలేక - భేదము భావము విడిచి, అన్నింటిలోను సన్మాత్రుడుగాను, చిన్మాత్రుడుగాను ఉన్న భగవంతుడు ఒకడే అని తెలుసుకొనినవాడు జీవన్ముక్తుడగును).

  1. “జగదుత్పత్తికి నాదియందు నేనొక్కండన తేజరిల్లుచుంటి, బహిరంతరంబుల వేరొక్కటిలేక సుషుప్త్యవస్థయందు సర్వంబు లీనంబుగటం జేసి, సంజ్ఞామాత్రుండును, అవ్యక్తుండుగానుండు జీవుని భంగి నేనొక్కండనే యుండుదు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 4 - 25)
Transliteration
  1. advitīyaṃ; anupamaṃ; ajaṃḍaḥ; sajātīya vijātīya rahitaṃ; svasamāna rahitaḥ; samābhyadhika rahitaḥ; asahāyaḥ.

(tanakaṃṭe reṃḍavapadārthamu lēnidi - tanatō pōlcataginadi lēnidi; prapaṃcamaṃtaṭa, lōna. baiṭa pūrtigā niṃḍiyunnavāḍu; (tanu lēnicōṭu lēnivāḍu); tanavale paramātma parabrahma ayina itaruḍu lēnivāḍu, itara vastuvēdiyu lēnivāḍu; tanatō samānamainavāḍugāni, tanakaṃṭe adhikuḍainavāḍugāni lēnivāḍu, sṛṣṭi cēyuṭalō tanaku iṃkokari sahāyamu lēnivāḍu). (gīta - 11 - 43)

  1. ēkaṃ sarva bhūtēṣu - (samasta bhūtamulaṃdu tānokkaḍē uṃḍuvāḍu)

(samasta vastuvulalōnu aṃtarātmagā tanē uṃḍuvāḍu).

  1. anya, draṣṭṛ dṛśyātmakaṃ nakiṃcit āsīt iti.

(tanakaṃṭe itaramaina draṣṭagāni, dṛśyavastuvugāni lēnivāḍu - samasta vastuvulu tānē ayinavāḍu. prapaṃcamu aṃtā, prapaṃcamulōni vastuvulannī tānē yaguṭavalana tananu cūcuvāḍukāni, tānu cūcu itaravastuvukāni lēnivāḍu).

  1. sṛṣṭēḥ prāk ēka ēva nāmarūpavibhāgānarha sūkṣmacidacitkāla śarīrakassan upādānatvēnavidyamānaḥ

(sṛṣṭiki pūrvamu nāmarūpamulu kaligiyuṃḍuṭaku arhamukāni sthitilōnunna sūkṣma cidacitkālamu rūpamutō upādānakāraṇamai okkaḍē ayinavāḍu).

  1. ēka ēva upādānakāraṇāṃtara śūnyaḥ - ēkatvaṃ ca sṛṭyanaṃtara bhāvināma rūpavibhāga nibaṃdhana bahutva pratibaṃdhināmarūpa vibhāgā bhāvādīnā mēva vakṣitaṃ. natu prakṛti puruṣādi rāhityaṃ ēkaḥ iti.

(itara upādānakāraṇamulēka tānu okaḍē upādānakāraṇamainavāḍu. sṛṣṭi tarvāta kalugu nāmarūpamulugala vastuvulanniṃṭiki upādānakāraṇamainavāḍu - prakṛti puruṣulu kalasi unna sthitilō unnavāḍu).

  1. kanabaḍanivāḍu - kēvaluḍu - anagā tanavalana puṭṭina mahattattvamu modalaguvāṭitō kalisiyuṃḍaka sṛṣṭiki pūrvamu tānokkaḍē yuṃḍuvāḍu. ē kāryavastuvutōnukalisiyuṃḍanivāḍu - kanabaḍanivāḍu).

“parōkṣassan, ēkākīsan rahasi kēvalaḥ, viṣṇuḥ -”.

  1. asahāyaḥ; (prapaṃcasṛṣṭilō itara sahāyamu lēnivāḍu - itara sahāyamu lēkanē sṛṣṭi, sthiti layamulu cēyuvāḍu).

  2. ēkaḥ tvamēva kārayitā, na anyō asti, yadhāpi. (nīvokkaḍivē sṛṣṭi kartavu - enni vidhamulugā cūcinanu itarulu evarū lēru - aṃducēta ēkaḥ).

  3. suhṛdādi saṃgarahitaḥ, asya priyaḥ, apriyaḥ nāsti.

(suhṛdulugāni, priyulugāni, apriyulugāni lēnivāḍu).

  1. aparaḥ -

(iṃkokaḍu lēnivāḍu - sṛṣṭilō unnadaṃtayu tānē ayinavāḍu - tanakaṃṭe utkṛṣṭuḍainavāḍu lēnivāḍu).

  1. bhēdarahitaḥ (bhēdamu lēnivāḍu - ellapuḍu okkarītiganē uṃḍuvāḍu).

  2. ēkarūpaḥ (okē ākāramutō, okē sthitilōnuṃḍuvāḍu).

  3. sṛṣṭēḥ prāk kēvalaḥ -

(sṛṣṭikimuṃdu tānu okkaḍē unnavāḍu - “ātmai vēdaṃ ēka ēvāgra āsīt” - iti śrutiḥ -

ī kanabaḍu prapaṃcamaṃtayu sṛṣṭiki pūrvamu okka ātmagānē uṃḍenu. appuḍu marēdiyunu lēdu).

  1. “paramārtha taḥ svajātīya vijātīya svagata bhēda vinurmuktatvāt ēkaḥ” (śrī śaṃkaraḥ)

(paramārtha dṛṣṭilō svajātīya, vijātīya, svagata bhēdamulēnivāḍu kanuka ēkaḥ).

  1. svataḥ ēkaḥ mā ya yātu anēkaḥ.

(tānu okkaḍē - sṛṣṭi cēyakamuṃdu okkaḍē - sṛṣṭi cēyuṭaku māyatō kalisiyuṃḍuṭavalana - prakṛti, dāni vikāramulaina samasta vastuvulalō pravēśiṃci yuṃḍuṭavalana anēkamugā ayinavāḍu).

  1. advitīya tatva rūpaḥ -

(ātma tatvamu okaṭē, sṛṣṭiki muṃdu okaṭigā unnapuḍu, sthitikālamulō anēka vastuvulalō pravēśiṃci yuṃḍunapuḍu. unna ātma okaṭē - anniṃṭilōnu unnadi okē tatvamu - ‘tatvamu’ anagā adē - ā paramātmayē nīvu iṭlunna tatvamu okaṭē - adē paramātma - aṭuvaṃṭi tatvamu marokaṭi lēnivāḍu).

  1. dēśakāla vastuvula paricchēdarahitaḥ –

(dēśamucētagāni, kālamucētagāni, vastuvucētagāni parimiti lēnivāḍu – iṭuvaṃṭivāḍu marokaḍu lēḍu kanuka ‘ēkaḥ’.)

  1. “yaḥ paramēśvaraḥ sva vilalpita sarvān lōkān ahamē vēdaṃ sarvaṃ” iti svā viśēṣatayā udgṛṣṇāti, upasamharati, ajasraṃ sṛjati sūkṣma rūpēṇa, punaḥ sthūla rūpēṇa viśrujati. ēvama paṃcīkṛtabhūta sṛṣṭiṃ kṛtvā svasmi nādhārabhūtē ajasraṃ vāsayati, sthitiṃ karōti, sa ēkaḥ”.

(tanacēta kalpiṃcabaḍina samasta lōkamulu tānē ani anniyu ani sūkṣmarūpamutō vāṭini sṛjiṃci, vāṭini sthūlarūpamugā cēsi, ā sṛjiṃcina vāṭiki koṃtakālamu sthiti kalpiṃci vāṭini upasamhariṃcucuṃḍu paramēśvaruḍu okkaḍē. aṃducēta atanu ‘ēkaḥ’).

  1. “nityaḥ arvātmakōhyātmā kūṭasthō dōṣa varjitaḥ |

ēkassa bhidyatē śaktyā māya yā sarvabhāvataḥ ||“. (īśvaragīta)

(nityuḍu - mūḍu kālamulaṃdu uṃḍuvāḍu -, anniṃṭiki tānē ātma ayinavāḍunnū, kūṭasthuḍunnū, ē vidhamaina dōṣamulu lēnivāḍunnū ayina paramātma okaḍē ayinanu tana māyā śakticēta anni bhāvamulugānu - anni rūpamulugānu tānē vibhajiṃpabaḍucunnāḍu).

  1. “sarva bhūtasthitaṃ yō māṃ bhajatyēkatvamā sthitaṃ -” (śrīmadbhagavadgīta - 6 - 31)

“- - - akhaṃḍārthōni rūpyatē|

brahmādi sthāvarāṃ tēṣu bhūtēṣūcchā vacēṣu yaḥ |

nirviśēṣaṃ, cidānaṃdaṃ māma dvaitaṃ niraṃjanaṃ |

guṇarūpakriyāvastu vikriyādyēka hētukaṃ |

bhēdaṃtyaktvā - - - śuddhaṃ sacchinmātra tayāsthitaṃ |

ihaikatvaṃ śṛtau siddhamatyaṃtā bhēdamāsthitaḥ”

ahaṃ brahmēti vēdāṃta vākya ja jñāna cakṣuṣā |

aparōkṣa karōtyānutyaktvā vidyāṃca tatkṛtāṃ |

kṛta kṛtyatayā sōyaṃ jīvanmukta udāradhīḥ - - - ||“. (gītābhāvaprakāśamu - 6 - 151 to 155)

(tatvapadārthamunu ceppi śrīkṛṣṇa bhagavānuḍu akhaṃḍārthamunu ceppucunnāḍu - bhagavaṃtuḍu vēru vēru vastuvulugā kāka okkaḍē anuṭa akhaṃḍārthamu - caturmukha brahma modalu sthāvaramuluvarakugala bhūtamulaṃdu - ivi śrēṣṭamainavi, ivi nīcamainavi ani vicakṣaṇalēka - bhēdamu bhāvamu viḍici, anniṃṭilōnu sanmātruḍugānu, cinmātruḍugānu unna bhagavaṃtuḍu okaḍē ani telusukoninavāḍu jīvanmuktuḍagunu).

  1. “jagadutpattiki nādiyaṃdu nēnokkaṃḍana tējarillucuṃṭi, bahiraṃtaraṃbula vērokkaṭilēka suṣuptyavasthayaṃdu sarvaṃbu līnaṃbugaṭaṃ jēsi, saṃjñāmātruṃḍunu, avyaktuṃḍugānuṃḍu jīvuni bhaṃgi nēnokkaṃḍanē yuṃḍudu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 4 - 25)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.