← Back to ఏ · Booklets 11–20 (digitized file 2)

ఏకాంశ ēkāṃśa

Original — తెలుగు
  1. “ఏకావయదేవ, ఏకపాదేన, సర్వభూతస్వరూపేణ ఇత్యేతత్” (శ్రీ శంకరః)

(భగవంతునియొక్క ఒకే ఒక్క అవయవము - లేక పాదము - సమస్త భూతముల స్వరూపమైనది ఒకటే).

  1. భగవంతుని యొక్క ఒకే ఒక అంశచేత - పాదముచేత ఈ ప్రపంచమంతా నిండియున్నది - ప్రపంచములోని సమస్త భూతములు భగవంతుని యొక్క ఒకే రూపము - సర్వ భూతములు ఒకడే అయిన భగవంతుని రూపము - సృష్టి ప్రారంభమున భగవతుడొకడే యుండెను - ఆ ఒక్క అంశయే ప్రపంచముగా మారెను - ఈ ప్రపంచములోని వస్తువులన్నియు ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టినను, వాటి అన్నింటికి మూలకారణమైన భగవంతుని అంశయే సృష్టిలోనున్న సర్వ వస్తువులలోను వ్యాపించియున్నది ఆ ఒక్క అంశయే. ఎన్ని వస్తువులుగా మారినను వాటి అన్నింటిలోను ఉన్నది ఆ ఒక్క అంశయే - “భగవంతుని విభూతలని చెప్పబడినవి నేనే, అవన్నీ నేనొక్కడినే” అని వాటిని వేరు వేరుగా చెప్పి, అన్ని వస్తువులు కలిసి కూడినది అయిన ప్రపంచము అను ఒకే వస్తువుకూడ నేనే అని శ్రీ మద్భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు చెప్పును -

“విషభ్యాహమిదం కృత్స్న మేకాంశేన స్థితో జగత్” - (శ్రీమద్భగవద్గీత - 10 - 42)

ఎన్నింటిలోనున్నను, ఎటువంటివస్తువులోనున్నను, నేనుండు ఉపాధి యేది యైనను నా తొలి స్వ స్వరూపములోనే ఉందును. ఉపాధి భేదమువలన వృత్తిబేధము కలిగినను ఆ ఉపాధిలోనున్న స్వ స్వరూపములో మార్పు లేదు.

Transliteration
  1. “ēkāvayadēva, ēkapādēna, sarvabhūtasvarūpēṇa ityētat” (śrī śaṃkaraḥ)

(bhagavaṃtuniyokka okē okka avayavamu - lēka pādamu - samasta bhūtamula svarūpamainadi okaṭē).

  1. bhagavaṃtuni yokka okē oka aṃśacēta - pādamucēta ī prapaṃcamaṃtā niṃḍiyunnadi - prapaṃcamulōni samasta bhūtamulu bhagavaṃtuni yokka okē rūpamu - sarva bhūtamulu okaḍē ayina bhagavaṃtuni rūpamu - sṛṣṭi prāraṃbhamuna bhagavatuḍokaḍē yuṃḍenu - ā okka aṃśayē prapaṃcamugā mārenu - ī prapaṃcamulōni vastuvulanniyu okadānilōnuṃḍi okaṭigā puṭṭinanu, vāṭi anniṃṭiki mūlakāraṇamaina bhagavaṃtuni aṃśayē sṛṣṭilōnunna sarva vastuvulalōnu vyāpiṃciyunnadi ā okka aṃśayē. enni vastuvulugā mārinanu vāṭi anniṃṭilōnu unnadi ā okka aṃśayē - “bhagavaṃtuni vibhūtalani ceppabaḍinavi nēnē, avannī nēnokkaḍinē” ani vāṭini vēru vērugā ceppi, anni vastuvulu kalisi kūḍinadi ayina prapaṃcamu anu okē vastuvukūḍa nēnē ani śrī madbhagavadgītalō śrī kṛṣṇa bhagavānuḍu ceppunu -

“viṣabhyāhamidaṃ kṛtsna mēkāṃśēna sthitō jagat” - (śrīmadbhagavadgīta - 10 - 42)

enniṃṭilōnunnanu, eṭuvaṃṭivastuvulōnunnanu, nēnuṃḍu upādhi yēdi yainanu nā toli sva svarūpamulōnē uṃdunu. upādhi bhēdamuvalana vṛttibēdhamu kaliginanu ā upādhilōnunna sva svarūpamulō mārpu lēdu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.