← Back to ఏ · Booklets 11–20 (digitized file 2)

ఏకాత్మ ēkātma

Original — తెలుగు
  1. ఏకశ్చాసావాత్మా చేతి ఏకాత్మా - “ఆత్మావా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్” ఇతి శ్రుతేః. (శ్రీ శంకరః)

(ఒకే ఆత్మ అయినవాడు - సృష్టికిముందు ఈ ప్రంచమంతయు ఒకే ఆత్మగానుండెను అని శ్రుతి చెప్పుచున్నది. (ఐతరేయోపనిషత్)

  1. అద్వితీయః (ఆత్మవంటిది సృష్టికి ముందుగాని దాని, తర్వాత గాని, ఇతర వస్తువు ఇంకొకటిగాని లేదు - ఉన్నదంతయు ఒకే ఆత్మ).

  2. ఆత్మ నునది ఒకటే - అదే సృష్టి అంతటిలోను - సృష్టి అంటతిలోనున్న వస్తువులన్నింటిలోను పూర్తిగా నిండియున్నది - “ఏకః ప్రధానః ఆత్మా, పూర్ణః”.

  3. జాగ్రదాదిస్థానేషు ఏకో అయమాత్మా ఇత్య వ్యభిచారిణీ.

(జాగ్రదాది అవస్థలయందుండునది ఒకే ఆత్మ - వ్యభిచరించనిది - వేరు వేరుగా ఉండనిది).

  1. “జగదుత్పత్తి స్థితిలయ కృద సంసారీ సర్వజ్ఞః, సర్వ శక్తిః, సర్వ విత సర్వమిదం జగత్ స్వతో అన్యద్వస్త్వంతరమనుపాదా యైవాకాశాది క్రమేణ సృష్ట్వా స్వాత్మ ప్రబోధనార్థం సర్వాణిచ ప్రాణాది మచ్ఛరీరాణిస్వయం ప్రవివేశ, ప్రవశ్యచ స్వమాత్మానం యథా భూతమిదం బ్రహ్మ స్మీతి సాక్షాత్ ప్రత్య బుద్ధ్యత; తస్మాచ్ఛ స ఏవ సర్వ శరీరేషు ఏక ఏవాత్మా, నాన్య ఇతి” (శ్రీశంకరః)

(జగత్తునకు సృష్టిస్థితిలయములు చేయువాడున్నూ, సంసారముతో సంబంధములేనివాడున్నూ, సర్వమును తెలిసినవాడున్నూ, అన్ని విధములైన శక్తులు గలవాడున్నూ అయిన పరమాత్మ ఈ జగత్తునంతటినీ, ఇంకొక ఉపాదానకారణములేకనే, తానే, ఆకాశము మొదలగువాటిని సృష్టించి ప్రాణము కలవియగు వస్తువులను సృష్టించి, ప్రానముగలవి యగు సమస్త శరీరములందు తానే ప్రవేశించి తన స్వస్వరూపము “బ్రహ్మాస్మి” అను జ్ఞానమును కలుగచేయుచు నుండువాడు ఒకడే అయిన ఆత్మ. అందుచేత అన్ని శరీరములందుండు ఆత్మ ఒకటే, ఇంకొక ఆత్మకాని, ఇంకొక ఇతర వస్తువుకాని లేదు - అందుచేత ఆత్మ ఒక్కటియే).

  1. ఒకే విధమైన మనస్సు గలవాడు.
Transliteration
  1. ēkaścāsāvātmā cēti ēkātmā - “ātmāvā idamēka ēva agra āsīt” iti śrutēḥ. (śrī śaṃkaraḥ)

(okē ātma ayinavāḍu - sṛṣṭikimuṃdu ī praṃcamaṃtayu okē ātmagānuṃḍenu ani śruti ceppucunnadi. (aitarēyōpaniṣat)

  1. advitīyaḥ (ātmavaṃṭidi sṛṣṭiki muṃdugāni dāni, tarvāta gāni, itara vastuvu iṃkokaṭigāni lēdu - unnadaṃtayu okē ātma).

  2. ātma nunadi okaṭē - adē sṛṣṭi aṃtaṭilōnu - sṛṣṭi aṃṭatilōnunna vastuvulanniṃṭilōnu pūrtigā niṃḍiyunnadi - “ēkaḥ pradhānaḥ ātmā, pūrṇaḥ”.

  3. jāgradādisthānēṣu ēkō ayamātmā itya vyabhicāriṇī.

(jāgradādi avasthalayaṃduṃḍunadi okē ātma - vyabhicariṃcanidi - vēru vērugā uṃḍanidi).

  1. “jagadutpatti sthitilaya kṛda saṃsārī sarvajñaḥ, sarva śaktiḥ, sarva vita sarvamidaṃ jagat svatō anyadvastvaṃtaramanupādā yaivākāśādi kramēṇa sṛṣṭvā svātma prabōdhanārthaṃ sarvāṇica prāṇādi maccharīrāṇisvayaṃ pravivēśa, pravaśyaca svamātmānaṃ yathā bhūtamidaṃ brahma smīti sākṣāt pratya buddhyata; tasmāccha sa ēva sarva śarīrēṣu ēka ēvātmā, nānya iti” (śrīśaṃkaraḥ)

(jagattunaku sṛṣṭisthitilayamulu cēyuvāḍunnū, saṃsāramutō saṃbaṃdhamulēnivāḍunnū, sarvamunu telisinavāḍunnū, anni vidhamulaina śaktulu galavāḍunnū ayina paramātma ī jagattunaṃtaṭinī, iṃkoka upādānakāraṇamulēkanē, tānē, ākāśamu modalaguvāṭini sṛṣṭiṃci prāṇamu kalaviyagu vastuvulanu sṛṣṭiṃci, prānamugalavi yagu samasta śarīramulaṃdu tānē pravēśiṃci tana svasvarūpamu “brahmāsmi” anu jñānamunu kalugacēyucu nuṃḍuvāḍu okaḍē ayina ātma. aṃducēta anni śarīramulaṃduṃḍu ātma okaṭē, iṃkoka ātmakāni, iṃkoka itara vastuvukāni lēdu - aṃducēta ātma okkaṭiyē).

  1. okē vidhamaina manassu galavāḍu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.