← Back to ఏ · Booklets 11–20 (digitized file 2)

ఏకత్వం ēkatvaṃ

Original — తెలుగు
  1. “సర్వత్ర స్థితో నారాయణః ఏక ఏవ ఇతి ఏకత్వం”. (జయ తీర్థముని)

  2. “సర్వత్ర ఏక ఏవ నారాయణః స్థితః, పృథక్త్వేన సర్వతో వైలక్షణ్యేన బహుధాహి తస్య రూపం ఆభాతి”. (శ్రీ అనందతీర్థః)

(అంతట, అన్నింటిలోను నారాయణుడొక్కడే యున్నాడు. అంతటా, అన్నింటిలోను అతని రూపము వేరు వేరుగా ఉన్నట్లు కనబడుచున్నది).

  1. “భగవాన్ వాసుదేవః ఏవ నామరూప విభాగా నర్హతి, సూక్ష్మ చిదచిద్వస్తు శరీరస్సన్ సత్యసంకల్పో వివిధ విభక్త నామరూప స్థూల చిద చిద్వస్తు శరీరస్యాం ఇతి సంకల్ప్య స్ద ఏకః ఏవ దేవ తిర్య ఙ్మనుష్య స్థావర విచిత్ర జగచ్ఛరీరో అవ తిష్టతే.”. (శ్రీ రామానుజః)

(నామరూపములుగల స్థూల వస్తు రూపముగా కాక సూక్ష్మరూపములుగా ఉన్న స్థితిలో భగవంతుని సూక్ష్మరూపములో, అతని ఒక్కడిలోనే ఉండెను. ఆ స్థితిలో ఉన్నపుడు భగవంతుడు సౄష్టిచేయునుద్దేశముతో తానే దేవతులు, జంతువులు, మనుష్యులు, స్థావరములు మొదలగు స్థూలరూపములన్నియు తానే ఆయెను - అట్లు అన్ని రూపములుగా అయిన భగవంతుడొక్కడే. ఆ సూక్ష్మస్థూలరూపములు రెండున్నూ తానొక్కడే కనుక ఏకత్వము).

  1. “యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మై నా భూత్ విజానతః |

తత్రకో మోహః కశ్శోకః ఏకత్వమను పశ్యతః ||“. (ఈశావాస్యోపనిషత్)

(ఏ స్థితిలో సమస్త భూతములు ఆత్మగానే కనబడునో ఆ స్థితియందు అట్లు ఏకత్వమును చూచు జ్ఞానికి - అంతా ఆత్మ ఒకటే యున్నది అని తెలుసుకొనుజ్ఞాని దేనిని చూచి మోహించును, దేనిని చూచి శోకించును - అప్పటి ఆ స్థితిలో ఆత్మ ఒకటే కనబడును కనుక తను చూచి మోహించవలసిన వస్తువు ఉండదు, శోకించవలసిన వస్తువు ఉండదు).

  1. “యత్రత్వస్య సర్వమాత్మైవాభూత్ తత్ కేనకం పశ్యేత్” ఇతి శ్రుతిః.

(ఎప్పుడు ఎవనికి ఇదంతయు ఆత్మగానే కనబడునో, అప్పుడు ఎవడు ఎవనిని చూచును? ప్రపంచమనునదే, దానిలోని వస్తువులన్నింటితోసహా లేకనే పోవును).

  1. ఆకృతి వ్యక్త్యోరివ, గుణ గుణినోరివ చ అత్యంత భిన్న యోరివ జగద్బ్రహ్మణోః ఏకత్వం, విభాగావర్ణ సంబంధ విశేషః.

(వ్యక్తి, అతని ఆకారములకు, గుణుడు అతని గుణములు ఈ రెండింటికి భేదములేనట్లు జగత్తునకు, పరబ్రహ్మకు ఏకత్వమున్నది. ఈ రెండింటిలో ఒకదానినుండి ఒకదానిని వేరు చేయుటకు అవకాశము లేనట్లు పరబ్రహ్మను, అతని రూపమైన ప్రపంచమును - ఒకదానినుండి ఒకదానిని వేరు చేయుటకు వీలుకాదు - భగవంతుడే ప్రపంచము - విశ్వుడు -, ప్రపంచమే భగవంతుడు అగుటవలన - ఒకని శక్తి అతని నుండి వేరు చేయ లేనట్లు, పరమేశ్వరుని అతని శక్తి అయిన పార్వతిని ఒకరినుండి ఒకరిని విడదీయ లేనట్లు - లక్ష్మీనారాయణులు, సీతారాములు, ప్రకృతి పురుషులు, వలనే -) (eg. Matter and Energy). సర్వత్ర - అంతటా ఒకే పరమాత్మ యున్నాడు, ఉన్నదంతా ఒక్క పరమాత్మయే, పరమాత్మకు ప్రపంచమునకు భేదములేదు - అను భావము -

Transliteration
  1. “sarvatra sthitō nārāyaṇaḥ ēka ēva iti ēkatvaṃ”. (jaya tīrthamuni)

  2. “sarvatra ēka ēva nārāyaṇaḥ sthitaḥ, pṛthaktvēna sarvatō vailakṣaṇyēna bahudhāhi tasya rūpaṃ ābhāti”. (śrī anaṃdatīrthaḥ)

(aṃtaṭa, anniṃṭilōnu nārāyaṇuḍokkaḍē yunnāḍu. aṃtaṭā, anniṃṭilōnu atani rūpamu vēru vērugā unnaṭlu kanabaḍucunnadi).

  1. “bhagavān vāsudēvaḥ ēva nāmarūpa vibhāgā narhati, sūkṣma cidacidvastu śarīrassan satyasaṃkalpō vividha vibhakta nāmarūpa sthūla cida cidvastu śarīrasyāṃ iti saṃkalpya sda ēkaḥ ēva dēva tirya ṅmanuṣya sthāvara vicitra jagaccharīrō ava tiṣṭatē.”. (śrī rāmānujaḥ)

(nāmarūpamulugala sthūla vastu rūpamugā kāka sūkṣmarūpamulugā unna sthitilō bhagavaṃtuni sūkṣmarūpamulō, atani okkaḍilōnē uṃḍenu. ā sthitilō unnapuḍu bhagavaṃtuḍu sṝṣṭicēyunuddēśamutō tānē dēvatulu, jaṃtuvulu, manuṣyulu, sthāvaramulu modalagu sthūlarūpamulanniyu tānē āyenu - aṭlu anni rūpamulugā ayina bhagavaṃtuḍokkaḍē. ā sūkṣmasthūlarūpamulu reṃḍunnū tānokkaḍē kanuka ēkatvamu).

  1. “yasmin sarvāṇi bhūtāni ātmai nā bhūt vijānataḥ |

tatrakō mōhaḥ kaśśōkaḥ ēkatvamanu paśyataḥ ||“. (īśāvāsyōpaniṣat)

(ē sthitilō samasta bhūtamulu ātmagānē kanabaḍunō ā sthitiyaṃdu aṭlu ēkatvamunu cūcu jñāniki - aṃtā ātma okaṭē yunnadi ani telusukonujñāni dēnini cūci mōhiṃcunu, dēnini cūci śōkiṃcunu - appaṭi ā sthitilō ātma okaṭē kanabaḍunu kanuka tanu cūci mōhiṃcavalasina vastuvu uṃḍadu, śōkiṃcavalasina vastuvu uṃḍadu).

  1. “yatratvasya sarvamātmaivābhūt tat kēnakaṃ paśyēt” iti śrutiḥ.

(eppuḍu evaniki idaṃtayu ātmagānē kanabaḍunō, appuḍu evaḍu evanini cūcunu? prapaṃcamanunadē, dānilōni vastuvulanniṃṭitōsahā lēkanē pōvunu).

  1. ākṛti vyaktyōriva, guṇa guṇinōriva ca atyaṃta bhinna yōriva jagadbrahmaṇōḥ ēkatvaṃ, vibhāgāvarṇa saṃbaṃdha viśēṣaḥ.

(vyakti, atani ākāramulaku, guṇuḍu atani guṇamulu ī reṃḍiṃṭiki bhēdamulēnaṭlu jagattunaku, parabrahmaku ēkatvamunnadi. ī reṃḍiṃṭilō okadāninuṃḍi okadānini vēru cēyuṭaku avakāśamu lēnaṭlu parabrahmanu, atani rūpamaina prapaṃcamunu - okadāninuṃḍi okadānini vēru cēyuṭaku vīlukādu - bhagavaṃtuḍē prapaṃcamu - viśvuḍu -, prapaṃcamē bhagavaṃtuḍu aguṭavalana - okani śakti atani nuṃḍi vēru cēya lēnaṭlu, paramēśvaruni atani śakti ayina pārvatini okarinuṃḍi okarini viḍadīya lēnaṭlu - lakṣmīnārāyaṇulu, sītārāmulu, prakṛti puruṣulu, valanē -) (eg. Matter and Energy). sarvatra - aṃtaṭā okē paramātma yunnāḍu, unnadaṃtā okka paramātmayē, paramātmaku prapaṃcamunaku bhēdamulēdu - anu bhāvamu -

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.