← Back to ఎ · Booklets 11–20 (digitized file 2)

ఎండమావులు eṃḍamāvulu

Original — తెలుగు
  1. మృగతృష్ట - ఎండలో గుఱ్ఱమువలె కదలుచుండునట్లు కనబడు చాయలు. మిట్టమధ్యాహ్నమున బయళ్ళలో నీటివలె తోచు సూర్య కిరణములు. సూర్యకిరణములు ఒక్కొక్కచోట పడి మెరయుటచే దూరమునుండి అవి కదలుచున్న నీళ్ళవలె కనబడును అట్లు కనబడుటయేకాని అవి నిజముగ నీళ్ళుకావు. అడవులలో లేళ్ళు దాహముతో నీరు కనబడుచోటికి పరుగెత్తుచుండును. ఈ ఎండమావులను చూచి అవి నీళ్ళు అనుకొని వాటికి పరుగెత్తుచూ వెళ్ళిన, అవి ఇంకా దూరముగా నీళ్ళవలె కనపడును. ఇట్లు భ్రాంతిచే తోచు వస్తువులు ఎండమావులతో పోల్చబడుచున్నవి. ఇవి లేని వస్తువులు ఉన్నట్లు తోచునవి. ఇటువంటివే కుందేటి కొమ్ము, ఆకాశపద్మము, వంధ్యా పుత్రుడు.

  2. “క. మతిదలపగ సంసారం

బతి చంచల మెండమావులటుల సంస

త్ప్రతతుల తిక్షణికంబులు;

గతకాలము మేలు వచ్చుకాలముకంటెన్“. (భారతము).

  1. “మ. కలలం బోలెడి పుత్ర మిత్ర వనితాగారాది సం యోగముల్

జలవాభారతి నెండమావులకు నాసల్సేయు చందంబునం

దలతున్ సత్యములంచు - - - ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - 1238)

Transliteration
  1. mṛgatṛṣṭa - eṃḍalō guṟṟamuvale kadalucuṃḍunaṭlu kanabaḍu cāyalu. miṭṭamadhyāhnamuna bayaḷḷalō nīṭivale tōcu sūrya kiraṇamulu. sūryakiraṇamulu okkokkacōṭa paḍi merayuṭacē dūramunuṃḍi avi kadalucunna nīḷḷavale kanabaḍunu aṭlu kanabaḍuṭayēkāni avi nijamuga nīḷḷukāvu. aḍavulalō lēḷḷu dāhamutō nīru kanabaḍucōṭiki parugettucuṃḍunu. ī eṃḍamāvulanu cūci avi nīḷḷu anukoni vāṭiki parugettucū veḷḷina, avi iṃkā dūramugā nīḷḷavale kanapaḍunu. iṭlu bhrāṃticē tōcu vastuvulu eṃḍamāvulatō pōlcabaḍucunnavi. ivi lēni vastuvulu unnaṭlu tōcunavi. iṭuvaṃṭivē kuṃdēṭi kommu, ākāśapadmamu, vaṃdhyā putruḍu.

  2. “ka. matidalapaga saṃsāraṃ

bati caṃcala meṃḍamāvulaṭula saṃsa

tpratatula tikṣaṇikaṃbulu;

gatakālamu mēlu vaccukālamukaṃṭen”. (bhāratamu).

  1. “ma. kalalaṃ bōleḍi putra mitra vanitāgārādi saṃ yōgamul

jalavābhārati neṃḍamāvulaku nāsalsēyu caṃdaṃbunaṃ

dalatun satyamulaṃcu - - - ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - 1238)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.