← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గతానుగతికాః gatānugatikāḥ

Original — తెలుగు

“గతానుగతికో లోకో”

“శేష్టో జనో యథ్య ద్వైదికం, లౌకికం చవా |

- ప్రమాణత్వేన లోకేస్మిన్ |

మన్యతే (అ)న్యే జనోపి చ |

తదేవ కురుతే మానం స్వాతంత్ర్యేణ కించిన ||” (గీతాభావప్రకాశము - 3 - 149 - 150)

(లోకములో శ్రేష్టులైనవారు ఏది చేసినను అది యే ప్రమాణమని నమ్మి చేయుదురో ఇతరులు కూడ అదే ప్రమాణమని ఆ ప్రకారముగనే చేయవలెనని నమ్మి చేయుదురు. అందుచేతనే భగవంతునికి స్వతహాగా చేయవలసిన పని - కర్తవ్య కర్మ - లేకపోయినను లోకములో మానవుడుగా అవతరించిన ప్రమాణమ పూర్వకమైన కర్మలు చేయును - అతనిని చూచి ప్రజలు అదియే ప్రమాణమని ఆ ప్రకారముగానే - ధర్మ పద్ధతినే - చేయుదురు. అట్లు భగవంతుడు కర్మ చేయనిపక్షమున అతనిని చూచి ప్రజలుకూడ కర్మ చేయరు - చిత్తశుద్ధికొఱకు కర్మ చేయవలయును - కార్యం కర్మ చేయవలసినదే).

“మ. జననం బెందును లేక ఈశ్వరుడు దా జన్మించుటెల్లన్ నిరో

ధి నిరాసార్థము; వేతకర్ముడగు నద్దేవుండు కర్మ ప్రవ

ర్తనుడౌటెల్ల జరాచర ప్రకటభూతశ్రేణులం గర్మవ

ర్తనులం జేయదలంచి కాక కలవే దాత్యారికిం గర్మముల్ (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 1 - 72)

Transliteration

“gatānugatikō lōkō”

“śēṣṭō janō yathya dvaidikaṃ, laukikaṃ cavā |

- pramāṇatvēna lōkēsmin |

manyatē (a)nyē janōpi ca |

tadēva kurutē mānaṃ svātaṃtryēṇa kiṃcina ||” (gītābhāvaprakāśamu - 3 - 149 - 150)

(lōkamulō śrēṣṭulainavāru ēdi cēsinanu adi yē pramāṇamani nammi cēyudurō itarulu kūḍa adē pramāṇamani ā prakāramuganē cēyavalenani nammi cēyuduru. aṃducētanē bhagavaṃtuniki svatahāgā cēyavalasina pani - kartavya karma - lēkapōyinanu lōkamulō mānavuḍugā avatariṃcina pramāṇama pūrvakamaina karmalu cēyunu - atanini cūci prajalu adiyē pramāṇamani ā prakāramugānē - dharma paddhatinē - cēyuduru. aṭlu bhagavaṃtuḍu karma cēyanipakṣamuna atanini cūci prajalukūḍa karma cēyaru - cittaśuddhikoṟaku karma cēyavalayunu - kāryaṃ karma cēyavalasinadē).

“ma. jananaṃ beṃdunu lēka īśvaruḍu dā janmiṃcuṭellan nirō

dhi nirāsārthamu; vētakarmuḍagu naddēvuṃḍu karma prava

rtanuḍauṭella jarācara prakaṭabhūtaśrēṇulaṃ garmava

rtanulaṃ jēyadalaṃci kāka kalavē dātyārikiṃ garmamul (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 1 - 72)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.