← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గతి gati

Original — తెలుగు
  1. గమ్యం (పొంద తగినది - పోవు స్థానము), గమ్యతే ఇతి గతిః - స్వర్గాది ఫలం.

(పొందబడుస్థానము - స్వర్గము మొదలగు ఫలము).

“గమ్యతే ముముక్షుభిః ఇతిగతిః” (శ్రీ ఆనందతీర్థః)

మోక్షము కోరువారిచే పొందబడునది.

  1. గచ్చతి అనేన ఇతి గతిః. (దీనిద్వారా వెళ్ళుచున్నారు - మార్గము).

  2. పరమపురుషార్థ సిద్ధిః - (చతుర్విధ పురుషార్థములలో ఒకటి అయిన మోక్షము).

  3. ప్రాప్యస్థానము; పరమలక్ష్యము; సంచారము; ఉపాయము, మార్గము.

  4. “వాసుదేవ పరా గతిః” (వాసుదేవుడే పరమ ప్రాప్యస్థానము - మోక్షము - వాసుదేవుడే మోక్షము ;

మోక్షమే వాసుదేవుడు - “స్వతః పురుషార్థభూతం ఆశ్రయః” (భగవంతుడే పురుషార్థము).

“గతిర్భర్తా ప్రభుః సాక్షీ” ( శ్రీమద్భాగవతం - 9 - 18)

  1. సర్వాపత్సు రక్షకః. (అన్నివ్ధములైన ఆపదలనుండి రక్షించువాడు - రక్షకుడు, శరణము).

  2. “హరేర్నామైవ నామైవ నామైవ మ య జీవనం |

కలౌనాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథా ||“.

“రామ ఏవ గతిర్మమ”

(హరినామమే నాకు ముమ్మాటికి జీవనము - ఈ కలికాలములో తరించుటకుగుగాని, శరణు పొందు టకుగాని ఇంకొక గతిలేదు).

  1. కర్మఫలము - అవస్థ - (“గహనా కర్మణో గతిః”) (శ్రీమద్భగవద్గీత - 4 -17)

చేసినకర్మ ఏ విధ మైనఫలముననుభవింపచేయునో - ఎక్కడ, ఏ విధముగా ఫలమునిచ్చునో - ఆగతి - అతిగూఢము. ఇది అతి సూక్ష్మము అయిన ప్రకృతి ప్రవర్తకము - పద్ధతి - (natural law). స్థూలేంద్రియములచేగాని, మనసుచేగాని ఊహింప శక్యముగానిది. అందుచేత ఆ కర్మ ఫలముయొక్క గతి ఊహకు అందనిది - ఇది అపూర్వము -

  1. “అపుత్రస్య గతిర్నాస్తి”

(పుత్రుడు లేనివానికి గతిలేదు, గమ్యస్థానమైన మోక్షము లేదు - ఎందుచేతననగా - “పున్నామనరకాత్ త్రాయతే ఇతి పుత్రః”. పున్నామ నరకమునుండి రక్షించువాడు పుత్రుడు. అట్టి పుత్రుడు లేనపుడు నరకమే ప్రాప్తి - మోక్షము కాదు).

  1. “స ఏతాన్ బ్రహ్మ గమయతి” ఇత్యత్రవిచి కిత్స్యుతే - కిం కార్యమపరం బ్రహ్మ గమయతి, ఆహాస్విత్ పరమేదాదికృతం ముఖ్యం బ్రహ్మేతి - కుతః సంశయః ? - బ్రహ్మశబ్ద ప్రయోగాత్ గతి శ్రుతేశ్చ తత్రకార్యమేవ సగుణమపరం బ్రహ్మ గమయత్యేనా నమానవః పురుషః ఇతి బాదరిరాచార్యో మన్యతే కుతః ? గత్యుప పత్తేః. అస్యహి కార్య బ్రహ్మణః గం తవ్యత్వముపపద్యతే ప్రదేశవత్వాత్, నతు పరస్మన్ బ్రహ్మణిగంతౄ త్వం, గం తవ్యత్వముప పద్యతే, ప్రదేశవత్వాత్; నతు పరస్మన్ బ్రహ్మణి గంతృత్వం, గంతవ్యత్వం గతిర్వా అవకల్పతే, సర్వగతత్వాత్, ప్రత్యగాత్మత్వాచ్చగం త్రూణాం” (శ్రీ శంకరః - బ్రహ్మసూత్రభాష్యే)

(అతను - ఆ దివ్యపురుషుడు - ఆతివాహకుడు - (celestial guide) - వారిని - అర్చిరాదిమార్గము ద్వారా వెళ్ళినవారిని బ్రహ్మను పొందించును. “అని శ్రుతి చెప్పిచున్నది.ఇక్కడ బ్రహ్మ నగా కార్యబ్రహ్మ - అపరబ్రహ్మ, సగుణబ్రహ్మ అని అర్థమా, లేక నిర్గుణ నిరాకార, నిర్విషయ పరబ్రహ్మ అని అర్థమా - దేనిని పొందించును అని సంశయము - అనగా, గమ్యస్థానము (మోక్షస్థానము) ఈ రెండింటిలో ఏది ? అని సంశయము. ఎందుచేతననగా ఈ వాక్యములో బ్రహ్మ అను పదము వాడుక చేయబడినది, సగుణబ్రహ్మ అనిగాని నిర్గుణబ్రహ్మ అనిగాని, చెప్పబడియుండలేదు. ఆ ఆతివాహకుడు వీరిని, కార్యబ్రహ్మనే, సగుణ బ్రహ్మనే పొందించును అని బాదరాయణుని అభిప్రాయము - ఇందుకు కారణమేమనగా నిరాకార నిర్గుణ పరబ్రహ్మ ముముక్షువులందరిలోను సర్వాంతర్యామి (అందఱిలోను అంతర్యామి) గా నుండుటవలన ప్రత్యేకముగా అతనిని వీరు పొందవలసినదిలేదు - గమ్యస్థానమునకు వెళ్ళుట యనునది కార్యబ్రహ్మను పొందుటే యని చెప్పబడినది, అతనే గంతవ్యస్థానమని చెప్పబడినది”.

“పరబ్రహ్మ సర్వగతుడు కనుక అతనిని పొందుట ఉపపన్నముకాదు - కార్యబ్రహ్మమే, చతుర్ముఖ బ్రహ్మమే - గతి, పొందతగినవాడు అని వ్యాసుల వారి అభిప్రాయము”- ” కార్యం బాదరిరస్య గత్యుపపత్తేః” (బ్రహ్మసూత్రములు - 4 - 3 - 7)

(కార్యబ్రహ్మమే గతి, పొందతగినది, గతి అని వ్యాసులవారి అభిప్రాయము - కార్యబ్రహ్మకే ‘గతి’ అను పదము (కూట) ఉపపన్నమగును“).

“కార్య బ్రహ్మతో బ్రహ్మలోకమునుండి కారణబ్రహ్మలో లయమగునపుడు కార్యబ్రహ్మతోపాటు ఈ ముముక్షువు కూడ అతనితోపాటు ఆ లోకములోనుండువారును పరబ్రహ్మలో - నిరాకార పరబ్రహ్మలో లీనమగుదురు.

“పరాంతమందు వారందఱు బ్రహ్మతోకూడా - సాకారబ్రహ్మతోకూడా - కృతాత్ములయి పరమపదమును ప్రవేశించుచున్నారు - పొందుచున్నారు”). అమృతత్వమనునది పరబ్రహ్మమందే కలదు, నశించునట్టి కార్యమందు - కార్యబ్రహ్మమందుకాదు)..

  1. “పరంబ్రహ్మ గం తవ్యం ఇతి పూర్వపక్షే మార్గస్య ముఖ్యార్థతా, కార్యం బ్రహ్మేతి సిద్ధాంతే బోధా ర్థతా”. సర్వగతస్యాపి ప్రదేశాంతర విశిష్టత్వేన ఆకాశస్య గంతవ్యత్వం దృష్టం, బ్రహ్మణస్తు ప్రత్యక్త్వాత్ న కథమపి గంతవ్యతా ఇత్యర్థః.

“పరమేవహి బ్రహ్మ సత్యకామత్వాది గుణయుక్తం కార్య బ్రహ్మేతి కథ్యతే. తథాచ కార్య బ్రహ్మణః కారణ బ్రహ్మ సామీప్యాత్ కారణే ముఖ్యస్య బ్రహ్మణ శబ్దస్య కార్యే వ్యపదేశః లక్షణయా ప్రయోగః ఇత్యర్థః - ముఖ్యభావాదితి భావః -

“కార్యబ్రహ్మణస్యాత్యయే నాశేసతి తదద్యక్షేణ తల్లోకస్వామినా కారణ్య గర్భేణ సహ అతః కార్యాద్బ్రహ్మణః పరం బ్రహ్మ ప్రాప్నువంతి. ఉత్పన్నాత్మ సాక్షాత్కారాః విద్వాంసః ఇత్య నావృత్తి శ్రుత్యభిధానాత్ అవగంత మిత్యర్థః -”బ్రహ్మణా సహ తే సర్వేసంప్రాప్తా ప్రతిసంచిరే. పరిస్యాంతే కృతాత్మానః ప్రవిశంతి పరం పదం “ఇతి స్మృతే రపి బ్రహ్మలోకం ప్రాప్తాః క్రమేణ ముక్తిం ప్రాప్నువంతీత్యవగంతవ్య మిత్యర్థః -” యత్సర్వగతం సర్వాంతరం, సర్వాత్మకం చ పరం బ్రహ్మ ఆకాశవత్సర్వ గతశ్చ నిత్యః. యస్సాక్షా దపరోక్షా దపరోక్షాద్బ్రహ్మయ ఆత్మా సర్వాంతరః, ఆత్మైవేదం సర్వం, బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం”

ఇత్యాది శ్రుతిభిః నిర్థారిత విశేషం తస్య గంతవ్యతా న కదా చిదమ్యపపద్యతే, నహిగతమేవ గమ్యతే. అన్యోహ్యన్యద్గచ్ఛతీతి ప్రసిద్ధం లోకే --- బ్రహ్మణోపి సర్వ శక్త్యు సేతత్వాత్ కథం చిద్గంతవ్యతాస్యాత్ ఇతిన, ప్రతిషిద్ధ సర్వ విశేషత్వాత్ బ్రహ్మణః - “నిష్కలం నిష్క్రియం, శాంతం, నిరవద్యం, నిరంజనం | అస్థూలమనణ్యు హ్రస్వ దీర్ఘం స బాహ్యంతరో హ్యజః | సహ ఏష మహానజః ఆత్మా అజరో అసురో అమృతో అభయో బ్రహ్మ న ఏష నేతినేత్యాత్మా”ఇత్యాది శ్రుతి స్మృతి న్యాయేభ్యో న దేశకాలాది విశేష యోగః పర మాత్మనః కల్పయితుం శక్యతే యేన భూప్రదేశ వయో అవస్థాన్యాయేన అస్య గంతవ్యతా స్యాత్“.

(ముముక్షువులు పొందవలసినది పరబ్రహ్మయని పూర్వపక్ష వాదము - అట్లుకాదు, కార్యబ్రహ్మయే అని సిద్ధాంతము చేయబడినది. ఆకాశము సర్వగతమైనప్పటికీ వేరే ఒక ప్రత్యేకమైన చోట మహాకాశములో కలిసిపోవును. బ్రహ్మ ప్రత్యగాత్మ యనుటవలన వేరే ప్రత్యేకముగా ఒక విశేషమైన చోటనుండుదానినే పొందవలెను. అదియే గమ్యస్థానమని చెప్పుట సమంజసము కాదు. పరబ్రహ్మయే సత్యకాముడు, సత్య సంకల్పుడు అను గుణములు కలిగియుండు కార్యబ్రహ్మ యని చెప్పబడుచున్నాడు. అయినప్పటికీ కార్య బ్రహ్మ కారణబ్రహ్మ సమీపమందుండుటచేత కార్యబ్రహ్మయే కారణబ్రహ్మ అని లక్షణమువలన వ్యపదేశము - కార్యబ్రహ్మ లోకము ప్రళయకాలమందు నశించి ఆ లోకాధిపతియైన కార్యబ్రహ్మయగు హిరణ్యగర్భునితో సహ ఈ ముముక్షువులు బ్రహ్మసాక్షాత్కారము పొందినవారై కారణబ్రహ్మను పొందుదురు. ప్రళయకాల మందు కార్యబ్రహ్మతో సహ వీరు కృతాత్ములై పరమపదమును పొందుదురు అని స్మృతిలో కూడ చెప్పబడినది. అందుచేత ఆ ప్రకారముగా క్రమ ముక్తిని పొందుదురు).

(పరబ్రహ్మ సర్వగతమని, సర్వాంతరమని (అన్నింటిలోపలనున్నవాడని), సర్వాత్మకమని (అన్నింటికి ఆత్మ యినవాడని), పరబ్రహ్మ శాశ్వతుడు, అపరోక్షుడు (దగ్గరగా, తన లోపల ప్రత్యక్షముగా) ఉన్నవాడు. ఈ ఆత్మయే సర్వము, ఈ బ్రహ్మయే విశ్వము - (ప్రపంచమంతయు) అనియు పరబ్రహ్మ గుఱించి శ్రుతులు చెప్పుటచేత కార్యబ్రహ్మ గంతవ్యము - ముముక్షువులు పొందవలసిన స్థానము - అని చెప్పుటకు లేదు - పరబ్రహ్మ సమస్త శక్తులు గలవాడగుటచేత అతనే గమ్యస్థానము అని చెప్పుటకు వలను పడదు - ఎందుచేతననగా - పరబ్రహ్మ నిష్కలమని, నిష్క్రియమని, శాంతమని, నిరువద్యమని. నిరంజనమని, అస్థూలమని, అనణువని, అహ్రస్వమని, అదీర్ఘమని, అన్నింటికీ లోపల పైన నుండువాడని, అజుడని, అజరుడని, అమరుడని, అమృతుడని, అభయుడని చెప్పబడుచున్నాడు - సృష్టిలోని ప్రతివస్తువు బ్రహ్మ కాదని విడిచిపెట్టగా మిగిలిన ఆత్మయే పరబ్రహ్మ అని శ్రుతి స్మృతులు చెప్పుటచేత పరబ్రహ్మ ఒకచోటనే ఉన్నాడు అనికాని, ఒకకాలమందున్నాడనికాని చెప్పుటకు వీలుకానివాడు. ఆ ప్రకారముగా దేశకాల విశేషములందుండువాడు కాడుకనుక పరబ్రహ్మ గమ్యస్థానము కాదు కార్యబ్రహ్మయే గమ్యస్థానము).

Transliteration
  1. gamyaṃ (poṃda taginadi - pōvu sthānamu), gamyatē iti gatiḥ - svargādi phalaṃ.

(poṃdabaḍusthānamu - svargamu modalagu phalamu).

“gamyatē mumukṣubhiḥ itigatiḥ” (śrī ānaṃdatīrthaḥ)

mōkṣamu kōruvāricē poṃdabaḍunadi.

  1. gaccati anēna iti gatiḥ. (dīnidvārā veḷḷucunnāru - mārgamu).

  2. paramapuruṣārtha siddhiḥ - (caturvidha puruṣārthamulalō okaṭi ayina mōkṣamu).

  3. prāpyasthānamu; paramalakṣyamu; saṃcāramu; upāyamu, mārgamu.

  4. “vāsudēva parā gatiḥ” (vāsudēvuḍē parama prāpyasthānamu - mōkṣamu - vāsudēvuḍē mōkṣamu ;

mōkṣamē vāsudēvuḍu - “svataḥ puruṣārthabhūtaṃ āśrayaḥ” (bhagavaṃtuḍē puruṣārthamu).

“gatirbhartā prabhuḥ sākṣī” ( śrīmadbhāgavataṃ - 9 - 18)

  1. sarvāpatsu rakṣakaḥ. (annivdhamulaina āpadalanuṃḍi rakṣiṃcuvāḍu - rakṣakuḍu, śaraṇamu).

  2. “harērnāmaiva nāmaiva nāmaiva ma ya jīvanaṃ |

kalaunāstyēva nāstyēva nāstyēva gatiranyathā ||“.

“rāma ēva gatirmama”

(harināmamē nāku mummāṭiki jīvanamu - ī kalikālamulō tariṃcuṭakugugāni, śaraṇu poṃdu ṭakugāni iṃkoka gatilēdu).

  1. karmaphalamu - avastha - (“gahanā karmaṇō gatiḥ”) (śrīmadbhagavadgīta - 4 -17)

cēsinakarma ē vidha mainaphalamunanubhaviṃpacēyunō - ekkaḍa, ē vidhamugā phalamuniccunō - āgati - atigūḍhamu. idi ati sūkṣmamu ayina prakṛti pravartakamu - paddhati - (natural law). sthūlēṃdriyamulacēgāni, manasucēgāni ūhiṃpa śakyamugānidi. aṃducēta ā karma phalamuyokka gati ūhaku aṃdanidi - idi apūrvamu -

  1. “aputrasya gatirnāsti”

(putruḍu lēnivāniki gatilēdu, gamyasthānamaina mōkṣamu lēdu - eṃducētananagā - “punnāmanarakāt trāyatē iti putraḥ”. punnāma narakamunuṃḍi rakṣiṃcuvāḍu putruḍu. aṭṭi putruḍu lēnapuḍu narakamē prāpti - mōkṣamu kādu).

  1. “sa ētān brahma gamayati” ityatravici kitsyutē - kiṃ kāryamaparaṃ brahma gamayati, āhāsvit paramēdādikṛtaṃ mukhyaṃ brahmēti - kutaḥ saṃśayaḥ ? - brahmaśabda prayōgāt gati śrutēśca tatrakāryamēva saguṇamaparaṃ brahma gamayatyēnā namānavaḥ puruṣaḥ iti bādarirācāryō manyatē kutaḥ ? gatyupa pattēḥ. asyahi kārya brahmaṇaḥ gaṃ tavyatvamupapadyatē pradēśavatvāt, natu parasman brahmaṇigaṃtṝ tvaṃ, gaṃ tavyatvamupa padyatē, pradēśavatvāt; natu parasman brahmaṇi gaṃtṛtvaṃ, gaṃtavyatvaṃ gatirvā avakalpatē, sarvagatatvāt, pratyagātmatvāccagaṃ trūṇāṃ” (śrī śaṃkaraḥ - brahmasūtrabhāṣyē)

(atanu - ā divyapuruṣuḍu - ātivāhakuḍu - (celestial guide) - vārini - arcirādimārgamu dvārā veḷḷinavārini brahmanu poṃdiṃcunu. “ani śruti ceppicunnadi.ikkaḍa brahma nagā kāryabrahma - aparabrahma, saguṇabrahma ani arthamā, lēka nirguṇa nirākāra, nirviṣaya parabrahma ani arthamā - dēnini poṃdiṃcunu ani saṃśayamu - anagā, gamyasthānamu (mōkṣasthānamu) ī reṃḍiṃṭilō ēdi ? ani saṃśayamu. eṃducētananagā ī vākyamulō brahma anu padamu vāḍuka cēyabaḍinadi, saguṇabrahma anigāni nirguṇabrahma anigāni, ceppabaḍiyuṃḍalēdu. ā ātivāhakuḍu vīrini, kāryabrahmanē, saguṇa brahmanē poṃdiṃcunu ani bādarāyaṇuni abhiprāyamu - iṃduku kāraṇamēmanagā nirākāra nirguṇa parabrahma mumukṣuvulaṃdarilōnu sarvāṃtaryāmi (aṃdaṟilōnu aṃtaryāmi) gā nuṃḍuṭavalana pratyēkamugā atanini vīru poṃdavalasinadilēdu - gamyasthānamunaku veḷḷuṭa yanunadi kāryabrahmanu poṃduṭē yani ceppabaḍinadi, atanē gaṃtavyasthānamani ceppabaḍinadi”.

“parabrahma sarvagatuḍu kanuka atanini poṃduṭa upapannamukādu - kāryabrahmamē, caturmukha brahmamē - gati, poṃdataginavāḍu ani vyāsula vāri abhiprāyamu”- ” kāryaṃ bādarirasya gatyupapattēḥ” (brahmasūtramulu - 4 - 3 - 7)

(kāryabrahmamē gati, poṃdataginadi, gati ani vyāsulavāri abhiprāyamu - kāryabrahmakē ‘gati’ anu padamu (kūṭa) upapannamagunu”).

“kārya brahmatō brahmalōkamunuṃḍi kāraṇabrahmalō layamagunapuḍu kāryabrahmatōpāṭu ī mumukṣuvu kūḍa atanitōpāṭu ā lōkamulōnuṃḍuvārunu parabrahmalō - nirākāra parabrahmalō līnamaguduru.

“parāṃtamaṃdu vāraṃdaṟu brahmatōkūḍā - sākārabrahmatōkūḍā - kṛtātmulayi paramapadamunu pravēśiṃcucunnāru - poṃducunnāru”). amṛtatvamanunadi parabrahmamaṃdē kaladu, naśiṃcunaṭṭi kāryamaṃdu - kāryabrahmamaṃdukādu)..

  1. “paraṃbrahma gaṃ tavyaṃ iti pūrvapakṣē mārgasya mukhyārthatā, kāryaṃ brahmēti siddhāṃtē bōdhā rthatā”. sarvagatasyāpi pradēśāṃtara viśiṣṭatvēna ākāśasya gaṃtavyatvaṃ dṛṣṭaṃ, brahmaṇastu pratyaktvāt na kathamapi gaṃtavyatā ityarthaḥ.

“paramēvahi brahma satyakāmatvādi guṇayuktaṃ kārya brahmēti kathyatē. tathāca kārya brahmaṇaḥ kāraṇa brahma sāmīpyāt kāraṇē mukhyasya brahmaṇa śabdasya kāryē vyapadēśaḥ lakṣaṇayā prayōgaḥ ityarthaḥ - mukhyabhāvāditi bhāvaḥ -

“kāryabrahmaṇasyātyayē nāśēsati tadadyakṣēṇa tallōkasvāminā kāraṇya garbhēṇa saha ataḥ kāryādbrahmaṇaḥ paraṃ brahma prāpnuvaṃti. utpannātma sākṣātkārāḥ vidvāṃsaḥ itya nāvṛtti śrutyabhidhānāt avagaṃta mityarthaḥ -”brahmaṇā saha tē sarvēsaṃprāptā pratisaṃcirē. parisyāṃtē kṛtātmānaḥ praviśaṃti paraṃ padaṃ “iti smṛtē rapi brahmalōkaṃ prāptāḥ kramēṇa muktiṃ prāpnuvaṃtītyavagaṃtavya mityarthaḥ -” yatsarvagataṃ sarvāṃtaraṃ, sarvātmakaṃ ca paraṃ brahma ākāśavatsarva gataśca nityaḥ. yassākṣā daparōkṣā daparōkṣādbrahmaya ātmā sarvāṃtaraḥ, ātmaivēdaṃ sarvaṃ, brahmaivēdaṃ viśvamidaṃ variṣṭaṃ”

ityādi śrutibhiḥ nirthārita viśēṣaṃ tasya gaṃtavyatā na kadā cidamyapapadyatē, nahigatamēva gamyatē. anyōhyanyadgacchatīti prasiddhaṃ lōkē --- brahmaṇōpi sarva śaktyu sētatvāt kathaṃ cidgaṃtavyatāsyāt itina, pratiṣiddha sarva viśēṣatvāt brahmaṇaḥ - “niṣkalaṃ niṣkriyaṃ, śāṃtaṃ, niravadyaṃ, niraṃjanaṃ | asthūlamanaṇyu hrasva dīrghaṃ sa bāhyaṃtarō hyajaḥ | saha ēṣa mahānajaḥ ātmā ajarō asurō amṛtō abhayō brahma na ēṣa nētinētyātmā”ityādi śruti smṛti nyāyēbhyō na dēśakālādi viśēṣa yōgaḥ para mātmanaḥ kalpayituṃ śakyatē yēna bhūpradēśa vayō avasthānyāyēna asya gaṃtavyatā syāt”.

(mumukṣuvulu poṃdavalasinadi parabrahmayani pūrvapakṣa vādamu - aṭlukādu, kāryabrahmayē ani siddhāṃtamu cēyabaḍinadi. ākāśamu sarvagatamainappaṭikī vērē oka pratyēkamaina cōṭa mahākāśamulō kalisipōvunu. brahma pratyagātma yanuṭavalana vērē pratyēkamugā oka viśēṣamaina cōṭanuṃḍudāninē poṃdavalenu. adiyē gamyasthānamani ceppuṭa samaṃjasamu kādu. parabrahmayē satyakāmuḍu, satya saṃkalpuḍu anu guṇamulu kaligiyuṃḍu kāryabrahma yani ceppabaḍucunnāḍu. ayinappaṭikī kārya brahma kāraṇabrahma samīpamaṃduṃḍuṭacēta kāryabrahmayē kāraṇabrahma ani lakṣaṇamuvalana vyapadēśamu - kāryabrahma lōkamu praḷayakālamaṃdu naśiṃci ā lōkādhipatiyaina kāryabrahmayagu hiraṇyagarbhunitō saha ī mumukṣuvulu brahmasākṣātkāramu poṃdinavārai kāraṇabrahmanu poṃduduru. praḷayakāla maṃdu kāryabrahmatō saha vīru kṛtātmulai paramapadamunu poṃduduru ani smṛtilō kūḍa ceppabaḍinadi. aṃducēta ā prakāramugā krama muktini poṃduduru).

(parabrahma sarvagatamani, sarvāṃtaramani (anniṃṭilōpalanunnavāḍani), sarvātmakamani (anniṃṭiki ātma yinavāḍani), parabrahma śāśvatuḍu, aparōkṣuḍu (daggaragā, tana lōpala pratyakṣamugā) unnavāḍu. ī ātmayē sarvamu, ī brahmayē viśvamu - (prapaṃcamaṃtayu) aniyu parabrahma guṟiṃci śrutulu ceppuṭacēta kāryabrahma gaṃtavyamu - mumukṣuvulu poṃdavalasina sthānamu - ani ceppuṭaku lēdu - parabrahma samasta śaktulu galavāḍaguṭacēta atanē gamyasthānamu ani ceppuṭaku valanu paḍadu - eṃducētananagā - parabrahma niṣkalamani, niṣkriyamani, śāṃtamani, niruvadyamani. niraṃjanamani, asthūlamani, anaṇuvani, ahrasvamani, adīrghamani, anniṃṭikī lōpala paina nuṃḍuvāḍani, ajuḍani, ajaruḍani, amaruḍani, amṛtuḍani, abhayuḍani ceppabaḍucunnāḍu - sṛṣṭilōni prativastuvu brahma kādani viḍicipeṭṭagā migilina ātmayē parabrahma ani śruti smṛtulu ceppuṭacēta parabrahma okacōṭanē unnāḍu anikāni, okakālamaṃdunnāḍanikāni ceppuṭaku vīlukānivāḍu. ā prakāramugā dēśakāla viśēṣamulaṃduṃḍuvāḍu kāḍukanuka parabrahma gamyasthānamu kādu kāryabrahmayē gamyasthānamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.