గాయత్రిశబ్దమునకు అర్థము ఈ క్రిందవిధముగ చెప్పబడినది : -
(ఈ మంత్రమును గానము చేయువానిని - లేక, మనినము చేయువానిని - రక్షించునదికనుక గాయత్రియని చెప్పబడినది - ఒకరు ఇచ్చినదానిని గ్రహించుటవలన కలిగెడు దోషమువలనను పాతకములు ఉపపాత కములు అని చెప్పబడువాటివలనను ఈ మంత్రమును మనినము చేసినవానిని రక్షించునది కనుక గాయత్రియని చెప్పబడినది).
స్వగాయక త్రాణదక్షా గాయత్రీత్యుదా హృతా ||“. (శ్రీ వెంకటేశ్వరమహత్యం - 5 - 8). (అర్థమునకు - చూడుము - 2)
ఉపాసకానాం రక్షత్రీ - (తనను ఉపాసన చేయువారలను రక్షించునది).
గాయత్రీ నామ సవితృ ప్రతీక బ్రహ్మవిద్యా.
(గాయత్రి యనగా సూర్యుడు. ప్రతీకముగా గల పరబ్రహ్మ విద్య పరబ్రహ్మకు బదులుగా ఉపాసన చేయ బడు సూర్యుడు - తేజోరూపముగలిగి ప్రత్యక్షదైవముగా ఉపాసన చేయబడుచున్నాడు - “సూర్య నారాయణమూర్తి” సూర్యభగవానుడు అని చెప్పబడుచున్నాడు“.
“యదాదిత్యగతం తేజః” (సూర్యునిలో నున్న తేజస్సు నాదే). “తత్తేజో విద్ధిమామకం”,
“ధ్యేయస్సదా సవితృమండల మధ్య వర్తీ” - (సూర్యమండలములోనున్న నారాయణుడను పరబ్రహ్మ ఎల్లపుడు ధ్యానించతగినవాడు).
(పంచభూతములు, భూమి, పంచభూతమయమగు శరీరము, హృదయము అను నాలుగు పాదములు కలది గాయత్రి యనుటచేత పరమపురుషుడే పరబ్రహ్మయే గాయత్రియని యుపపాదన చేయబడినది).
(గాయత్రి నాలుగు పాదములు గలది, ఆరువిభాగములు గలది - భూతసమూహము వేదాదిరూపమగు వాక్కు, భూమి, పంచభూతమయమగు శరీరము, హృదయము, ప్రాణము అనునవి ఆరు విభాగములు - ఈ ఆరులోను నాలుగుపాదములు - (చూడుము - ‘గాయత్రి’ - 4).
(గీతాభావప్రకాశము - 10 - 149)
(గాయత్రి పరబ్రహ్మరూపమగుటచేత ఈ ప్రపంచమంతయు గాయత్రియే యని ఛాందోగ్యోపనిషత్తులోను, శతపధ బ్రాహ్మణములోను స్తోత్రము చేయబడినది).
(గీతభావప్రకాశము - 10 - 151)
“గాయత్రీ ఛందసా మహం” (శ్రీమద్భగవద్గీత - 10 - 35)
(ఛందస్సులలో గాయత్రీ ఛందస్సు నేను అని శ్రీకృష్ణపరమాత్మ చెప్పియున్నాడు - అది భగవంతుని విభూతులలో నొకటి. విశిష్టమైన ఛందస్సులలో గాయత్రీ ఛందస్సు నేనే - అన్నింటికీ ఆత్మ యగుట వలన ఆ ఛందస్సు నేనే).
(ఛందస్సులకు గాయత్రి ఛందస్సు తల్లివంటిది. అందుచేత గాయత్రీ చందస్సునకు ఉత్కర్షత). “గాయత్రీ ఛందసాం మాతేదం బ్రహ్మ జుషస్వమే” -
gāyatriśabdamunaku arthamu ī kriṃdavidhamuga ceppabaḍinadi : -
(ī maṃtramunu gānamu cēyuvānini - lēka, maninamu cēyuvānini - rakṣiṃcunadikanuka gāyatriyani ceppabaḍinadi - okaru iccinadānini grahiṃcuṭavalana kaligeḍu dōṣamuvalananu pātakamulu upapāta kamulu ani ceppabaḍuvāṭivalananu ī maṃtramunu maninamu cēsinavānini rakṣiṃcunadi kanuka gāyatriyani ceppabaḍinadi).
svagāyaka trāṇadakṣā gāyatrītyudā hṛtā ||“. (śrī veṃkaṭēśvaramahatyaṃ - 5 - 8). (arthamunaku - cūḍumu - 2)
upāsakānāṃ rakṣatrī - (tananu upāsana cēyuvāralanu rakṣiṃcunadi).
gāyatrī nāma savitṛ pratīka brahmavidyā.
(gāyatri yanagā sūryuḍu. pratīkamugā gala parabrahma vidya parabrahmaku badulugā upāsana cēya baḍu sūryuḍu - tējōrūpamugaligi pratyakṣadaivamugā upāsana cēyabaḍucunnāḍu - “sūrya nārāyaṇamūrti” sūryabhagavānuḍu ani ceppabaḍucunnāḍu”.
“yadādityagataṃ tējaḥ” (sūryunilō nunna tējassu nādē). “tattējō viddhimāmakaṃ”,
“dhyēyassadā savitṛmaṃḍala madhya vartī” - (sūryamaṃḍalamulōnunna nārāyaṇuḍanu parabrahma ellapuḍu dhyāniṃcataginavāḍu).
(paṃcabhūtamulu, bhūmi, paṃcabhūtamayamagu śarīramu, hṛdayamu anu nālugu pādamulu kaladi gāyatri yanuṭacēta paramapuruṣuḍē parabrahmayē gāyatriyani yupapādana cēyabaḍinadi).
(gāyatri nālugu pādamulu galadi, āruvibhāgamulu galadi - bhūtasamūhamu vēdādirūpamagu vākku, bhūmi, paṃcabhūtamayamagu śarīramu, hṛdayamu, prāṇamu anunavi āru vibhāgamulu - ī ārulōnu nālugupādamulu - (cūḍumu - ‘gāyatri’ - 4).
(gītābhāvaprakāśamu - 10 - 149)
(gāyatri parabrahmarūpamaguṭacēta ī prapaṃcamaṃtayu gāyatriyē yani chāṃdōgyōpaniṣattulōnu, śatapadha brāhmaṇamulōnu stōtramu cēyabaḍinadi).
(gītabhāvaprakāśamu - 10 - 151)
“gāyatrī chaṃdasā mahaṃ” (śrīmadbhagavadgīta - 10 - 35)
(chaṃdassulalō gāyatrī chaṃdassu nēnu ani śrīkṛṣṇaparamātma ceppiyunnāḍu - adi bhagavaṃtuni vibhūtulalō nokaṭi. viśiṣṭamaina chaṃdassulalō gāyatrī chaṃdassu nēnē - anniṃṭikī ātma yaguṭa valana ā chaṃdassu nēnē).
(chaṃdassulaku gāyatri chaṃdassu tallivaṃṭidi. aṃducēta gāyatrī caṃdassunaku utkarṣata). “gāyatrī chaṃdasāṃ mātēdaṃ brahma juṣasvamē” -
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.