← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గోలాంగూలన్యాయము gōlāṃgūlanyāyamu

Original — తెలుగు

ఒక అంధుడు తనగ్రామమునుండి ఇంకొకగ్రామము వెళ్ళదలచి దారిలోనివారిని మార్గము అడుగుచూ పోవుచుండగా ఒక దుర్మార్గుడు ఒక పెంకి ఆబోతును దగ్గఱకు తీసుకొనివెళ్ళి దానితోక ఆ అంధుడికి అందిచ్చి యిది వెళ్ళినమార్గమున వెళ్ళుము అని చెప్పి పోయె. ఆ ఆబోతు తోక తొక్కిన పామువలె ఇష్టమువచ్చినట్లు పరుగెడుచు, గెంతుచు ఆ అంధుని ముప్ప తిప్పలు పెట్టెను. అంధుడు గమ్యస్థానమును చేరకపోవుటయే కాక, చాలాబాధలు పడవలసి వచ్చెను. ఈ ప్రకారముగానే బ్రహ్మజ్ఞానము లేనివాడు సద్గురువు నాశ్రయించక, ఉపనిషత్తులలోని భగవత్తత్త్వము తెలుసుకొనలేక, పాషండులు మొదలగువారి ఉపదేశమువిని, గమ్యస్థానమైన పరమ పదమును పొందలేకపోవుటయేకాక, ఆత్మానాత్మ విచక్షణలేకపోవుటచేత అనర్థము పాలగును అని చెప్పుటయే ఈ న్యాయమున కర్థము.

Transliteration

oka aṃdhuḍu tanagrāmamunuṃḍi iṃkokagrāmamu veḷḷadalaci dārilōnivārini mārgamu aḍugucū pōvucuṃḍagā oka durmārguḍu oka peṃki ābōtunu daggaṟaku tīsukoniveḷḷi dānitōka ā aṃdhuḍiki aṃdicci yidi veḷḷinamārgamuna veḷḷumu ani ceppi pōye. ā ābōtu tōka tokkina pāmuvale iṣṭamuvaccinaṭlu parugeḍucu, geṃtucu ā aṃdhuni muppa tippalu peṭṭenu. aṃdhuḍu gamyasthānamunu cērakapōvuṭayē kāka, cālābādhalu paḍavalasi vaccenu. ī prakāramugānē brahmajñānamu lēnivāḍu sadguruvu nāśrayiṃcaka, upaniṣattulalōni bhagavattattvamu telusukonalēka, pāṣaṃḍulu modalaguvāri upadēśamuvini, gamyasthānamaina parama padamunu poṃdalēkapōvuṭayēkāka, ātmānātma vicakṣaṇalēkapōvuṭacēta anarthamu pālagunu ani ceppuṭayē ī nyāyamuna karthamu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.