← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గోలోకము gōlōkamu

Original — తెలుగు
  1. “పాతాళాత్ బ్రహ్మలోకాంతం బ్రహ్మండం పరికీర్తితం |

అతః ఊర్థ్వంచ వైకుంఠో బ్రహ్మాండాద్భహిరేవచ |

తతః ఊర్థ్వంచ గోలోకః పంచా శత్కోటి యోజనః ||. (దేవీభగవతము)

(పాతాళలోకము మొదలు సత్యలోకమువరకు - బ్రహ్మలోకమువరకు ఉన్నది బ్రహ్మాండమని చెప్పబడుచున్నది. ఈ బ్రహ్మాండమునకు పైన ఉన్నది, బ్రహ్మాండముకంటె వేరుగానున్నది, వైకుంఠము. దానికి పైన ఉన్నది గోలోకము. ఇది పంచాశత్కోటి యోజనములు విస్తీర్ణముకలది)

  1. “వి రజాయాః పరే పారే వైకుంఠం యత్పరం పదం |

తస్మాదుపరి గోలోకః సచ్చిదింద్రియగోచరః |

సర్వేభ్యశ్చా పిలోకేభ్యశ్చో ప్రకృతి మండలాత్ |

తన్మధ్యై రామ థామాస్తి సాకేతం యత్పరాత్పరం||“. (వేదసారోపనిషత్)

(విరజానదియొక్క ఉత్కృష్టమైన ఒడ్డున వైకుంఠమనెడి పరపదమున్నది. దానికి ఇంకా మీదను సచ్చిదింద్రియములకు గోచరమైన - బ్రహ్మజ్ఞానమనే ఇంద్రియములకు కనబడు - గోలోకమున్నది. అన్నిలోకములకు పైన, ప్రకృతి కార్యములైన లోకములన్నింటికీ పైన, బ్రహ్మాండమునకుపైన ఆ గోలోకమున్నది. దాని మధ్యను పరాత్పరమైన సాకేతమను పేరుగల స్థానము - శ్రీరాముని నివాసస్థానము ఉన్నది).

  1. “గోలోకాఖ్యేత్వ యోధ్యాయాం మూల సౌధే పరాత్పరం |

సరూప సగుణోపేతః శ్రీరామ ఇతి వి శ్రుతః ||“.

(గోలోకమను పేరుగల అయోధ్యయొక్క మూలసౌధమందు పరాత్పరుడు అయిన నిరాకార నిర్గుణ పరబ్రహ్మ, ఆకారముగలవాడై, సత్వరజస్తమోగుణములతో కలిసియుండుటవలన రూపము పొందినవాడై శ్రీరాముడు అనుపేరుతోనున్నాడు).

Transliteration
  1. “pātāḷāt brahmalōkāṃtaṃ brahmaṃḍaṃ parikīrtitaṃ |

ataḥ ūrthvaṃca vaikuṃṭhō brahmāṃḍādbhahirēvaca |

tataḥ ūrthvaṃca gōlōkaḥ paṃcā śatkōṭi yōjanaḥ ||. (dēvībhagavatamu)

(pātāḷalōkamu modalu satyalōkamuvaraku - brahmalōkamuvaraku unnadi brahmāṃḍamani ceppabaḍucunnadi. ī brahmāṃḍamunaku paina unnadi, brahmāṃḍamukaṃṭe vērugānunnadi, vaikuṃṭhamu. dāniki paina unnadi gōlōkamu. idi paṃcāśatkōṭi yōjanamulu vistīrṇamukaladi)

  1. “vi rajāyāḥ parē pārē vaikuṃṭhaṃ yatparaṃ padaṃ |

tasmādupari gōlōkaḥ saccidiṃdriyagōcaraḥ |

sarvēbhyaścā pilōkēbhyaścō prakṛti maṃḍalāt |

tanmadhyai rāma thāmāsti sākētaṃ yatparātparaṃ||“. (vēdasārōpaniṣat)

(virajānadiyokka utkṛṣṭamaina oḍḍuna vaikuṃṭhamaneḍi parapadamunnadi. dāniki iṃkā mīdanu saccidiṃdriyamulaku gōcaramaina - brahmajñānamanē iṃdriyamulaku kanabaḍu - gōlōkamunnadi. annilōkamulaku paina, prakṛti kāryamulaina lōkamulanniṃṭikī paina, brahmāṃḍamunakupaina ā gōlōkamunnadi. dāni madhyanu parātparamaina sākētamanu pērugala sthānamu - śrīrāmuni nivāsasthānamu unnadi).

  1. “gōlōkākhyētva yōdhyāyāṃ mūla saudhē parātparaṃ |

sarūpa saguṇōpētaḥ śrīrāma iti vi śrutaḥ ||“.

(gōlōkamanu pērugala ayōdhyayokka mūlasaudhamaṃdu parātparuḍu ayina nirākāra nirguṇa parabrahma, ākāramugalavāḍai, satvarajastamōguṇamulatō kalisiyuṃḍuṭavalana rūpamu poṃdinavāḍai śrīrāmuḍu anupērutōnunnāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.