← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గుహా guhā

Original — తెలుగు
  1. నాభి; ఆకాశము, హృదయము;

నభోరూపోవా, బుద్ధి రూపోవా. (ఆకాశమువలె నుండునది; బుద్ధిరూపము).

  1. విదుషాం బుద్ధిః. (పండితులైనవారి బుద్ధి; బ్రహ్మజ్ఞానులైనవారి బుద్ధి; రహస్యమైన బ్రహ్మజ్ఞానముకలవారి బుద్ధి -).

  2. గుహా శబ్దేన హృదయ పుండరీక మధ్యవర్తిని బుద్ధిః ఉచ్యతే “గుహా సంవరణం” ఇత్యస్మాద్దాతోరుత్పన్నో గుహా శబ్దః. బుద్ధిశ్చ హృదయ పుండరీకేణ సం వృతా. తన్మధ్యవర్తిత్వాత్ తస్యాం బుద్ధౌ అస్య పరమాత్మ నః నిహితత్వం నామ విద్యయోపలభ్యమానత్వం, నతు బుద్ధౌ ఆదేయత్వం. సర్వజగదా ధారస్య తద సంభవాత్;

తం తథావస్థితం ఈశం శమాది గుణయుక్తో అధికారీ పురుషః పశ్యతి, సాక్షాత్కరోతి.

(‘గుహ’ అనగా హృదయ పుండరీకమధ్యమందు - పద్మమువలెనుండు హృదయమధ్యమున - ఉండు బుద్ధి. గుహ యనుమాట ‘గుహ’ అను ధాతువునుండి పుట్టినది. దానికి సంవరణ అని అర్థము. బుద్ధి యనునది హృదయమను పుండరీకముచే ఆవరించబడియున్నది. ఈ హృదయపుండరీకము మధ్యను బుద్ధిలో భగవంతుడున్నాడు అని చెప్పుటచేత బ్రహ్మవిద్య చేత - బ్రహ్మజ్ఞానముచే పొందతగినవాడు అని చెప్పుటయేకాని బుద్ధినే ఆధారముగా చేసుకొనియున్నాడని భావము కాదు. ఎంతచేతననగా సమస్త జగత్తునకు అతనే ఆధారమగుటచేత. అట్లు హృదయమధ్యమను గుహయందున్న భగవంతుని శమము, దమము మొదలగు గుణములు గల అధికారి అయిన పురుషుడు చూడగలడు, సాక్షాత్కారము చేసుకోగలడు).

  1. గూహతేః సంవరణార్థస్య నిగూఢాః అస్యాం జ్ఞాన జ్ఞేయ జ్ఞాతృపదార్థాః ఇతి గుహా బుద్ధిః; గూఢా వస్యాం భోగాపవర్గౌ పురుషార్థౌ ఇతివా.

(జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాతా అనుమూడును దీనియందు నిగూఢముగా - రహస్యముగా - ఉన్నవి కనుక ఇది గుహయని చెప్పబడినది. అదియే బుద్ధి. భోగములు, మోక్షము అను పురుషార్థములు దీనియందు గూఢముగా - ఉన్నట్లు పైకితెలియబడకుండగ - ఉన్నవి కనుక ఇది - బుద్ది - గుహయని చెప్పబడుచున్నది).

  1. “గుహతేః సంవరణార్థత్వేన స్వాతిం కా, విద్యా పదతత్కార్య జాత గుహనాత్ గుహా బుద్ధిః”

(అవిద్య దానికార్యములు - వీటిచేత ఆవరణమువలె కప్పబడి గూఢముగానుండుటచేత బుద్ధి గుహయని చెప్పబడినది).

  1. జనిమజ్జుతోః స్థూల శరీరస్య హృదయ విచ్ఛిన్న బుద్ధిః గుహనాత్ గుహే త్యుచ్యతే.

(జన్మము కలిగిన జీవులు స్థూలశరీరములోని హృదయమందున్న బుద్ధి. గుహనము అనగా దాచుట. హృదయమందు దాచబడినట్లు గూఢముగానున్నది కనుక బుద్ధి గుహయని చెప్పబడుచున్నది)

  1. “అన్యాకృతాకాశమేవ గుహా, తత్రాపి నిగూఢాః సర్వే పదార్థాః త్రిషు కాలేషు కారణత్వాత్ సూక్ష్మతరత్వాచ్చ తస్మిన్ అంతర్నిహితం బ్రహ్మ, హార్దస్య వ్యోమ్నః పరమత్వం తస్మిన్ హర్దే వ్యోమ్నియా బుద్ధిః గుహా, తస్యాం నిహితం బ్రహ్మ”.

(అవ్యాకృతమైన ఆకాసమే గుహ. అవ్యాకృతమనగా సూక్ష్మరూపములోనుండి, దానిలోనుండియే వస్తువులు పుట్టకయుండు స్థితి. అట్టి ఆకాశమందు సమస్తపదార్థములు మూడుకాలములందు సూక్ష్మరూపములో నుండును. వాటికి అది కారణము - ఉత్పత్తి స్థానమగుటచేత. దీనిలోపల పరబ్రహ్మ ఉండును. హృదయాకాశములోనుండు బుద్ధియే గుహ).

  1. “అణోర్ఫణీయాన్మహతో మహీయానాత్మా (అ)స్య జంతోర్నిహి తో గుహాయాం”. (కఠోపనిషత్)

(అణువుకంటె చిన్నది - చిన్నదానికన్న చిన్నది, మహత్తత్వము కంటె పెద్దది - పెద్దదానికంటె పెద్దది - అయిన ఆత్మ గుహవలె జీవుని హృదయమందున్నది).

  1. “అంతశ్చరతి భూతేషు గుహా యాం విశ్వమూర్తిషు” (మంత్ర పుష్పము).

(ప్రపంచములో అనేక రూపములతో ఉన్న భూతములందు - గుహలో ఉన్న దానివలె - రహస్యముగానుండి సంచరించు చున్నది).

Transliteration
  1. nābhi; ākāśamu, hṛdayamu;

nabhōrūpōvā, buddhi rūpōvā. (ākāśamuvale nuṃḍunadi; buddhirūpamu).

  1. viduṣāṃ buddhiḥ. (paṃḍitulainavāri buddhi; brahmajñānulainavāri buddhi; rahasyamaina brahmajñānamukalavāri buddhi -).

  2. guhā śabdēna hṛdaya puṃḍarīka madhyavartini buddhiḥ ucyatē “guhā saṃvaraṇaṃ” ityasmāddātōrutpannō guhā śabdaḥ. buddhiśca hṛdaya puṃḍarīkēṇa saṃ vṛtā. tanmadhyavartitvāt tasyāṃ buddhau asya paramātma naḥ nihitatvaṃ nāma vidyayōpalabhyamānatvaṃ, natu buddhau ādēyatvaṃ. sarvajagadā dhārasya tada saṃbhavāt;

taṃ tathāvasthitaṃ īśaṃ śamādi guṇayuktō adhikārī puruṣaḥ paśyati, sākṣātkarōti.

(‘guha’ anagā hṛdaya puṃḍarīkamadhyamaṃdu - padmamuvalenuṃḍu hṛdayamadhyamuna - uṃḍu buddhi. guha yanumāṭa ‘guha’ anu dhātuvunuṃḍi puṭṭinadi. dāniki saṃvaraṇa ani arthamu. buddhi yanunadi hṛdayamanu puṃḍarīkamucē āvariṃcabaḍiyunnadi. ī hṛdayapuṃḍarīkamu madhyanu buddhilō bhagavaṃtuḍunnāḍu ani ceppuṭacēta brahmavidya cēta - brahmajñānamucē poṃdataginavāḍu ani ceppuṭayēkāni buddhinē ādhāramugā cēsukoniyunnāḍani bhāvamu kādu. eṃtacētananagā samasta jagattunaku atanē ādhāramaguṭacēta. aṭlu hṛdayamadhyamanu guhayaṃdunna bhagavaṃtuni śamamu, damamu modalagu guṇamulu gala adhikāri ayina puruṣuḍu cūḍagalaḍu, sākṣātkāramu cēsukōgalaḍu).

  1. gūhatēḥ saṃvaraṇārthasya nigūḍhāḥ asyāṃ jñāna jñēya jñātṛpadārthāḥ iti guhā buddhiḥ; gūḍhā vasyāṃ bhōgāpavargau puruṣārthau itivā.

(jñānamu, jñēyamu, jñātā anumūḍunu dīniyaṃdu nigūḍhamugā - rahasyamugā - unnavi kanuka idi guhayani ceppabaḍinadi. adiyē buddhi. bhōgamulu, mōkṣamu anu puruṣārthamulu dīniyaṃdu gūḍhamugā - unnaṭlu paikiteliyabaḍakuṃḍaga - unnavi kanuka idi - buddi - guhayani ceppabaḍucunnadi).

  1. “guhatēḥ saṃvaraṇārthatvēna svātiṃ kā, vidyā padatatkārya jāta guhanāt guhā buddhiḥ”

(avidya dānikāryamulu - vīṭicēta āvaraṇamuvale kappabaḍi gūḍhamugānuṃḍuṭacēta buddhi guhayani ceppabaḍinadi).

  1. janimajjutōḥ sthūla śarīrasya hṛdaya vicchinna buddhiḥ guhanāt guhē tyucyatē.

(janmamu kaligina jīvulu sthūlaśarīramulōni hṛdayamaṃdunna buddhi. guhanamu anagā dācuṭa. hṛdayamaṃdu dācabaḍinaṭlu gūḍhamugānunnadi kanuka buddhi guhayani ceppabaḍucunnadi)

  1. “anyākṛtākāśamēva guhā, tatrāpi nigūḍhāḥ sarvē padārthāḥ triṣu kālēṣu kāraṇatvāt sūkṣmataratvācca tasmin aṃtarnihitaṃ brahma, hārdasya vyōmnaḥ paramatvaṃ tasmin hardē vyōmniyā buddhiḥ guhā, tasyāṃ nihitaṃ brahma”.

(avyākṛtamaina ākāsamē guha. avyākṛtamanagā sūkṣmarūpamulōnuṃḍi, dānilōnuṃḍiyē vastuvulu puṭṭakayuṃḍu sthiti. aṭṭi ākāśamaṃdu samastapadārthamulu mūḍukālamulaṃdu sūkṣmarūpamulō nuṃḍunu. vāṭiki adi kāraṇamu - utpatti sthānamaguṭacēta. dīnilōpala parabrahma uṃḍunu. hṛdayākāśamulōnuṃḍu buddhiyē guha).

  1. “aṇōrphaṇīyānmahatō mahīyānātmā (a)sya jaṃtōrnihi tō guhāyāṃ”. (kaṭhōpaniṣat)

(aṇuvukaṃṭe cinnadi - cinnadānikanna cinnadi, mahattatvamu kaṃṭe peddadi - peddadānikaṃṭe peddadi - ayina ātma guhavale jīvuni hṛdayamaṃdunnadi).

  1. “aṃtaścarati bhūtēṣu guhā yāṃ viśvamūrtiṣu” (maṃtra puṣpamu).

(prapaṃcamulō anēka rūpamulatō unna bhūtamulaṃdu - guhalō unna dānivale - rahasyamugānuṃḍi saṃcariṃcu cunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.