(అధికారిగా తీసుకోతగిన శిష్యుని గ్రహించి, తీసుకొని, ధర్మమును ఉపదేశించువాడు గురుడు)
అంధకార నిరోధకారనిరోధిత్వాత్ గురురిత్యాభి ధీయతే ||“. (అద్వయతారకోపనిషత్)
(‘గురు’ అను మాటలోని ‘గు’ అను అక్షరము అజ్ఞానమును అంధకారమును చెప్పును, ‘రు’ అను అక్షరము అంధకారమును - అజ్ఞానమును - నివారించును -కావున బ్రహ్మజ్ఞానము లేకపోవుట అను అంధకారమును జ్ఞానముకలిగించుటచే నిరోధించువాడుకనుక గురువు).
చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురువేనమః ||“.
(బ్రహ్మజ్ఞానము లేకపోవుట అజ్ఞానము - అజ్ఞామను గుడ్డితనమును బ్రహ్మజ్ఞానమను అంజనమే - కాటుకతో జ్ఞానచక్షువు కల్పించినవాడు గురుడు . అట్టి గురువునకు నమస్కారము).
గుణాతీతమ రూపంచ యస్తత్త్వం సగురుస్మృతః ||“.
(గురుడు అను మాటలోని ‘గు’ అను అక్షరమునకు గుణాతీతుదనియు, ‘రు’ అను అక్షరమునకు రూపములేనివాడు అనియు అర్థము. అందుచేత త్రిగునములకు మించిన వాడనియు రూపములేనివాడనియు - నిరాకారుడనియు - (నిర్గుణుడు, నిరాకారుడు) చెప్పబడిన పరబ్రహ్మ గురువు - లోక గురువు).
(గిరయతి = శబ్దార్థ జ్ఞానము తెలిసినవాడు, తెలియచేయువాడు గురుడు).
(దేవతులు, గంధర్వులు మొదలగువారిచే స్తోత్రము చేయబడువాడు గురువు).
(గురువు అను మాటకు గోష్పతి, శ్రేష్టుడు, దేవగురువైన బృహస్పతి, తండ్రియని అర్థము).
(గురుడనగా సాక్షాత్తు ఆదినారాయణుడగు పురుషుడు).
ఉభయోరంతరం కించిత్ న ద్రష్టవ్యం ముముక్షుభిః ||“.
(సర్వ వేదాంత సిద్ధాంతసార సంగ్రహము).
(ఈశ్వరుడే గురువు, గురువే ఈశ్వరుడు. మోక్షమును కోరువారు ఈశ్వరునకును గురునకును ఏ విధమైన వ్యత్యాసమును చూడ కూడదు).
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః ||“.
(గురువైనవాడు బ్రహ్మ అని, విష్ణువని, శివుడని సాక్షాత్ పరబ్రహ్మకనుక అతనియందు శ్రద్ధా భక్తులు కలిగియుండవలెను, అందుచేత అతనికి నమస్కరించుచున్నాను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరరూపములలో శ్రీపరబ్రహ్మయే లోకమునకు గురువు).
నై సకల కులాశ్రమంబులందును నెపుడున్
ధీసుజ్ఞాన ప్రదుడన
దేశికుడన నొప్పుచుందు ధృతినెల్లెడలన్ ||“,”వందే గుణాం గురుం” (శ్రీరామకర్ణామృతం - 2 - 65)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 996)
(గురువులు ముగ్గురు - ఈ సంసారములో ఎక్కడ పుట్టెదమో ఆ జన్మమాత్రముచేత తండ్రి అయినవాడు మొదటిగురువు. సత్కర్మలుచేయు ద్విజాతులందు ఉపనయనమువేళ గాయత్రీ మంత్రమునుపదేశించువాడు రెండవ గురువు. ఈశ్వరుడనగుటచేత నేను (పరబ్రహ్మ) మొదటి గురువుకన్నను శ్రేష్టుడను. బ్రహ్మ విద్యను ఉపదేశించువాడు మూడవ గురువు).
(ఆచార్యుడు -; ఉపదేశించువాడు శాస్త్రమునుపదేశించువాడు; చదువు చెప్పువాడు; పూజ్యుడు)
“వేదాదే రధ్యాపకః”(వేదము మొదలగువాటిని చెప్పువాడు, బోధించువాడు).
“సగురుః క్రియాః కృత్వా వేదమస్మై ప్రయచ్ఛతి”.
(తాను విహితకర్మ చేయుచు, వేదమును మాకు బోధించు వాడు, మాకు బ్రహ్మజ్ఞానమును కలుగచేయువాడు).
(దేనివలన ఎవడు ముక్తిని పొందునో దానిని తనకిచ్చువాడు. బ్రహ్మజ్ఞానమువలన మోక్షము కలుగును కనుక దానిని తనకి కలుగచేయువాడు - గురుడు).
(సమస్తవిద్యలను ఉపదేశించువాడగుటవలన,లేక అందఱికితండ్రి (అందఱినీ పుట్టించువాడు) అగుటచేతగురువు).
(సమస్త జీవులకు హితమునుపదేశించువాడు - అజ్ఞానమును అంధకారమును పోగొట్టువాడు).
సాంప్రదాయ ప్రవర్తకః - (సాంప్రదాయమును తన బోధనచే ప్రవర్తింపచేయువాడు).
నిషే కాదీని కర్మాణి యః కరోతి యథా విధి| సంభావ యతి చాన్యేన సవిప్రో గురు రుచ్యతే ||“.
(నిషేకము మొదలగు కర్మలను యథావిధిగా తాను చేయుచు ఇతరులచేత చేయించు విప్రుడు గురువు).
యోగజ్ఞో యోగనిష్టశ్చ సదా యోగాత్మకో శుచిః |
గురు భక్తి సమా యుక్తః పురుషజ్ఞో విశేషతః |
ఏవం లక్షణ సంపన్నో గురు రిత్యభిధీయతే ||“. (అద్వయతారకోపనిషత్).
(తాను సత్ప్రవర్తన కలిగియుండి దానిని ఇతరులకు బోధించువాడు, వేదములను చదివియుండుటవలన కలుగు బ్రహ్మజ్ఞానము కలవాడు, విష్ణువే దైవమని అతనియందు భక్తిగలవాడు, మాత్సర్యము లేనివాడు, యోగమును తెలిసినవాడు, గురువునందు భక్తి శ్రద్ధలు గలవాడు, పరమ పురుషుడైన పరమాత్మని తెలుసుకొనినవాడు, ఈ లక్షణములు గలవాడు గురువని చెప్పబడుచున్నవాడు).
(ఎవడు వేదములను, వేదాంగములను అధ్యయనము చేసెనో, వాటి అర్థమును తెలుసుకొనునో, జీవుడు, బ్రహ్మ ఒకడే అని నిశ్చయముగా తెలుసుకొని ఆత్మసాక్షాత్కారము పొందుటయందు నిష్టలోనున్న వాడే గురుడు. వేదాధ్యయనము చేసినంతమాత్రమున ఆత్మజ్ఞానములేనివాడు గురువు కానేరడు. ఆత్మజ్ఞానము గలవాడైనను వేదాధ్యయనము చేయనివాడు తానుస్వయముగా ముక్తుడైనను ఈతరులకు ఉపదేశించుటకు యోగ్యుడైన గురువు కానేరడు). అందుచేత వేదాధ్యయనము చేసి ఆత్మజ్ఞానముగలవాడే గురువని చెప్పబడును. సంసారమను పెద్ద మొసలి నోటిలో పడిన శిష్యునికి జీవ బ్రహ్మైక్యము తాను బోధపఱచి వానిని, శ్రీమహావిష్ణువు మొసలినోటినుండి గజేంద్రుని రక్షించి మోక్షమిచ్చినట్లు , సంసారమునుండి మోక్షమిచ్చునో యతనే గురువు).
(సద్గురుడైనవాడు శిష్యునియందు ఎప్పుడు ప్రసన్నుడగునో అప్పుడు అతను విష్ణురూపుడుగ ప్రవర్తించును; ఎప్పుడు శిష్యునియందు కోపించునో అప్పుడు శివరూపుడగును; రాజసవ్యాపారముకలిగియున్నపుడు బ్రహ్మరూపు, డగును; ప్రశాంతుడగునపుడు గంగారూపుడగును; వేదాంతవాక్యములను కిరణములచేత శిష్యునియొక్క భ్రమ, సంశయము మొగలగునవిగల అజ్ఞానమను అంధకారమును శేషము లేకుండునట్లు ఎప్పుడు నివర్తింపచేయునో అప్పుడు సూర్యునివలె రూపించును. ఈ విధముగా బ్రహ్మ నిష్టగల సద్గురునియందు శిష్యునకు గురువు సాక్షాత్తు ఈశ్వరుడేయను బుద్ధి కలుగవలెను - అప్పుడే గురువు బోధించినదాని సారస్యము తెలియనగును).
గురువున్ నరుడనుచు దలచి కుంఠితభక్తిం
దిరుగు పురుషు శ్రమమెల్లను
కరిశౌచము క్రియ నిరర్థకంబగు నధిపా” (శ్రీమదాంధ్రమహాభాగవతము- 7 - 15 - 453)
జడుడు నైనట్టి యా జంతువునందును దయగల్గి మిక్కిలి ధర్మబుద్ధి
గన్నులున్నవాడు గాననివానికి దెరువుజూపినట్లు దెలియబలికి
యతులమగుచు దివ్యమైన యా మోక్షమార్గంబు జూపవలయు రమణతోడ”. (శ్రీమదాంధ్రమహాభాగవతము- 5 - 1 -)
పితా (తండ్రి) - “తండ్రి, హరిచేరుమనియెడి తండ్రి తండ్రి”
“త్రీన్ గురూన్ ఆహ - ఇహ సంసారే యత్రసంభవః జన్మమాత్రం సపితా తావత్ ఆద్యః ప్రధమః గురుః పూజ్యః. ద్విజాతే స్సతః పుం సః సత్కర్మణాం యత్ర సంభవః ఉపనీయే వేదాధ్యాపకః ఇత్యర్థః సద్వితీయో గురుః యథా అహం ఈశ్వరః ప్రథమాదపి పూజ్యః ఇత్యర్థః బ్రహ్మవిద్యా ప్రదః గురు ః తృతీయః -”
(గురువులు ముగ్గురు అని చెప్పబడుచున్నారు : - ఈ సంసారములో ఎక్కడ పుట్టెదమో ఆ జన్మమాత్రమునతండ్రి అయినవాడు మొదటి గురువు. సత్కర్మలు చేయు ద్విజాతులయందు ఉపనయనమువేళ గాయత్రీమంత్రమునుపదేశించువాడు రెండవ గురువు. ఈశ్వరుడనగు నేను మొదటి గురువుకన్నను పూజ్యుడను. అట్టి నా గుఱించి అయిన బ్రహ్మవిద్యను ఉపదేశించువాడు మూడవ గురువు). (చూడుము 12).
(చోదకుడు, బోధకుడు, మోక్షమునిచ్చువాడు అని గురువులు మూడు విధములు - సామాన్యజనులతో కలిసి మెలిసి తిరుగువాడు చోదకుడు. జీవన్ముక్తులను బోధించువాడు బోధకుడు. సంసారమునుండి తరింపచేసి, తిరిగి జన్మలేకుండ చేయువాడు మోక్షకుడు - ంఒక్షము కలుగచేయువాడు).
(సూత సంహిత).
(క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు బ్రాహ్మణుడు గురువు, వైశ్యులకు శూద్రులకు క్షత్రియుడు గురువు. వైశ్యుడు శూద్రులకు గురువు).
“అధీహి భగవన్ !, బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్భిస్సేవ్యమానాం, నిగూఢాం, య యా చిదాత్ సర్వం పాపం వ్యపోహ్య పరాత్పరం పురుషముపైతి విద్వాన్” (కైవల్యోపనిషత్)
(శ్రేష్టమైనటువంటిదిన్నీ, సత్పురుషులచేత సేవింపబడునది, అతిరహస్యమైనదిన్నీ, సమస్త పాపములను పోగొట్టి శీఘ్రముగా పరాత్పరుడైన పరమపురుషుని పొందింప చేయునట్టి బ్రహ్మ విద్యను (బ్రహ్మజ్ఞానమును) , ఓ గురు మహాశయా ! నాకు బోధింపుము). ఇట్లు తనను చేరిన శిష్యునికి బ్రహ్మవిద్య యను బ్రహ్మజ్ఞానమును బోధించినవాడు గురువు –
“తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞాని నస్తత్వ దర్శినః ||“. (శ్రీమద్భగవద్గీత - 4 - 34)
(గురువు నాశ్రయించి, సేవచేసి, ప్రశ్నలువేసి సంశయములు తీర్చుకొనిన ఆ గురువు - బ్రహ్మజ్ఞానముగలవాడుతనకు కలిగిన బ్రహ్మజ్ఞానమును ఉపదేశించును).
“శాస్త్రజ్ఞోపి స్వతంత్రేణ బ్రహ్మ జ్ఞానాన్వేషణం న కుర్యాత్”.
(శాస్త్రము ఎంత తెలిసినవాడైనను గురువు నాశ్రయించి - అతని ఉపదేశములేనిదీ స్వతంత్రించి బ్రహ్మజ్ఞానమును పొందుటకు ప్రయత్నము చేయరాదు).
(దీనుడైనను, భాగ్యహీనుడైనను నా భర్తయే నాకు గురువు - గౌరవనీయుడు - పూజ్యుడు).
సృష్టిలో కొన్ని కొన్ని జీవులు ప్రవర్తించు విధముచూచి వాటివలన ప్రజలు గుణపాఠము నేర్చుకొనుచుందురు - అటువంటి జీవులు గురువులుగా గ్రహింపబడుచున్నారు -
భరతుల్ గూర్చిన విత్తముల్పరులకున్ బ్రాప్తించు; బ్రాప్తాశియై
తిరుగంబోని మహోరగంబు బ్రదుకున్ దీర్ఘాంగమై యుండియున్;
జిరకాలంబగు వాని వర్తనము నే జింతించి యేకాంతినై“.
“క. అజగరమును జుంటీగయు
నిజగురువులుగా దలంచి నిశ్చింతుడనై
నిజనస్థలి గర్మంబుల
గజబిజిలేకున్నవాడ గౌరవ వృత్తిన్ (శ్రీమదాంధ్రమహాభాగవతము- 7 - 13, - 436, 437)
(శ్రీమద్భాగవతం- 7 - 35)
(పై విషయము శ్రీమదాంధ్రమహాభాగవతములో ఈ క్రింద విధముగా చెప్పబడినది : - “భూ గగనానిల జల కృపీట భవ సోమ సూర్యకపోత తిలిప్స శలభ మధుమక్షికా జగరద్విరేఫ హరిణ పాఠీన పింగళా కురర పించక కుమారికా శరకౄత్సర్స లూతాసపేశ కృత్సముదయంబులు మొదలుగా గలవాని గుణంబు లెఱింగికొని యోగీంద్రులు మెలగుచుందురు”.
(పైన చెప్పిబడినవాటి గుణంబులేవియో, అవి యెట్లు ప్రవర్తించుచున్నవో, వాటి ప్రవర్తన యెట్లు గుణపాఠమగుచున్నదో అను విషయము సర్వము - “ఇవ్విధంబున భూమివలన సైరణయు, గంధవహునివలన బంధురంబగు పరోపకారంబును - - -” అని మొదలుకొని - చెప్పబడినది - చూడుము - 11 - 97, 99).
త్పూర్వారంభము సేయబోలదనుచున్ బోధించు చందంబునన్ |
సర్వత్వముతో జగద్గురువులై సంపూర్ణు లై యుండియుం |
గుర్వంగీకరణంబు సేయజనిరా గోవిందుడున్ రాముడున్ ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - 1411)
(adhikārigā tīsukōtagina śiṣyuni grahiṃci, tīsukoni, dharmamunu upadēśiṃcuvāḍu guruḍu)
aṃdhakāra nirōdhakāranirōdhitvāt gururityābhi dhīyatē ||“. (advayatārakōpaniṣat)
(‘guru’ anu māṭalōni ‘gu’ anu akṣaramu ajñānamunu aṃdhakāramunu ceppunu, ‘ru’ anu akṣaramu aṃdhakāramunu - ajñānamunu - nivāriṃcunu -kāvuna brahmajñānamu lēkapōvuṭa anu aṃdhakāramunu jñānamukaligiṃcuṭacē nirōdhiṃcuvāḍukanuka guruvu).
cakṣurunmilitaṃ yēna tasmai śrīguruvēnamaḥ ||“.
(brahmajñānamu lēkapōvuṭa ajñānamu - ajñāmanu guḍḍitanamunu brahmajñānamanu aṃjanamē - kāṭukatō jñānacakṣuvu kalpiṃcinavāḍu guruḍu . aṭṭi guruvunaku namaskāramu).
guṇātītama rūpaṃca yastattvaṃ sagurusmṛtaḥ ||“.
(guruḍu anu māṭalōni ‘gu’ anu akṣaramunaku guṇātītudaniyu, ‘ru’ anu akṣaramunaku rūpamulēnivāḍu aniyu arthamu. aṃducēta trigunamulaku miṃcina vāḍaniyu rūpamulēnivāḍaniyu - nirākāruḍaniyu - (nirguṇuḍu, nirākāruḍu) ceppabaḍina parabrahma guruvu - lōka guruvu).
(girayati = śabdārtha jñānamu telisinavāḍu, teliyacēyuvāḍu guruḍu).
(dēvatulu, gaṃdharvulu modalaguvāricē stōtramu cēyabaḍuvāḍu guruvu).
(guruvu anu māṭaku gōṣpati, śrēṣṭuḍu, dēvaguruvaina bṛhaspati, taṃḍriyani arthamu).
(guruḍanagā sākṣāttu ādinārāyaṇuḍagu puruṣuḍu).
ubhayōraṃtaraṃ kiṃcit na draṣṭavyaṃ mumukṣubhiḥ ||“.
(sarva vēdāṃta siddhāṃtasāra saṃgrahamu).
(īśvaruḍē guruvu, guruvē īśvaruḍu. mōkṣamunu kōruvāru īśvarunakunu gurunakunu ē vidhamaina vyatyāsamunu cūḍa kūḍadu).
gurussākṣāt parabrahma tasmai śrī guravēnamaḥ ||“.
(guruvainavāḍu brahma ani, viṣṇuvani, śivuḍani sākṣāt parabrahmakanuka ataniyaṃdu śraddhā bhaktulu kaligiyuṃḍavalenu, aṃducēta ataniki namaskariṃcucunnānu. brahma, viṣṇu, mahēśvararūpamulalō śrīparabrahmayē lōkamunaku guruvu).
nai sakala kulāśramaṃbulaṃdunu nepuḍun
dhīsujñāna praduḍana
dēśikuḍana noppucuṃdu dhṛtinelleḍalan ||“,”vaṃdē guṇāṃ guruṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 65)
(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 996)
(guruvulu mugguru - ī saṃsāramulō ekkaḍa puṭṭedamō ā janmamātramucēta taṃḍri ayinavāḍu modaṭiguruvu. satkarmalucēyu dvijātulaṃdu upanayanamuvēḷa gāyatrī maṃtramunupadēśiṃcuvāḍu reṃḍava guruvu. īśvaruḍanaguṭacēta nēnu (parabrahma) modaṭi guruvukannanu śrēṣṭuḍanu. brahma vidyanu upadēśiṃcuvāḍu mūḍava guruvu).
(ācāryuḍu -; upadēśiṃcuvāḍu śāstramunupadēśiṃcuvāḍu; caduvu ceppuvāḍu; pūjyuḍu)
“vēdādē radhyāpakaḥ”(vēdamu modalaguvāṭini ceppuvāḍu, bōdhiṃcuvāḍu).
“saguruḥ kriyāḥ kṛtvā vēdamasmai prayacchati”.
(tānu vihitakarma cēyucu, vēdamunu māku bōdhiṃcu vāḍu, māku brahmajñānamunu kalugacēyuvāḍu).
(dēnivalana evaḍu muktini poṃdunō dānini tanakiccuvāḍu. brahmajñānamuvalana mōkṣamu kalugunu kanuka dānini tanaki kalugacēyuvāḍu - guruḍu).
(samastavidyalanu upadēśiṃcuvāḍaguṭavalana,lēka aṃdaṟikitaṃḍri (aṃdaṟinī puṭṭiṃcuvāḍu) aguṭacētaguruvu).
(samasta jīvulaku hitamunupadēśiṃcuvāḍu - ajñānamunu aṃdhakāramunu pōgoṭṭuvāḍu).
sāṃpradāya pravartakaḥ - (sāṃpradāyamunu tana bōdhanacē pravartiṃpacēyuvāḍu).
niṣē kādīni karmāṇi yaḥ karōti yathā vidhi| saṃbhāva yati cānyēna saviprō guru rucyatē ||“.
(niṣēkamu modalagu karmalanu yathāvidhigā tānu cēyucu itarulacēta cēyiṃcu vipruḍu guruvu).
yōgajñō yōganiṣṭaśca sadā yōgātmakō śuciḥ |
guru bhakti samā yuktaḥ puruṣajñō viśēṣataḥ |
ēvaṃ lakṣaṇa saṃpannō guru rityabhidhīyatē ||“. (advayatārakōpaniṣat).
(tānu satpravartana kaligiyuṃḍi dānini itarulaku bōdhiṃcuvāḍu, vēdamulanu cadiviyuṃḍuṭavalana kalugu brahmajñānamu kalavāḍu, viṣṇuvē daivamani ataniyaṃdu bhaktigalavāḍu, mātsaryamu lēnivāḍu, yōgamunu telisinavāḍu, guruvunaṃdu bhakti śraddhalu galavāḍu, parama puruṣuḍaina paramātmani telusukoninavāḍu, ī lakṣaṇamulu galavāḍu guruvani ceppabaḍucunnavāḍu).
(evaḍu vēdamulanu, vēdāṃgamulanu adhyayanamu cēsenō, vāṭi arthamunu telusukonunō, jīvuḍu, brahma okaḍē ani niścayamugā telusukoni ātmasākṣātkāramu poṃduṭayaṃdu niṣṭalōnunna vāḍē guruḍu. vēdādhyayanamu cēsinaṃtamātramuna ātmajñānamulēnivāḍu guruvu kānēraḍu. ātmajñānamu galavāḍainanu vēdādhyayanamu cēyanivāḍu tānusvayamugā muktuḍainanu ītarulaku upadēśiṃcuṭaku yōgyuḍaina guruvu kānēraḍu). aṃducēta vēdādhyayanamu cēsi ātmajñānamugalavāḍē guruvani ceppabaḍunu. saṃsāramanu pedda mosali nōṭilō paḍina śiṣyuniki jīva brahmaikyamu tānu bōdhapaṟaci vānini, śrīmahāviṣṇuvu mosalinōṭinuṃḍi gajēṃdruni rakṣiṃci mōkṣamiccinaṭlu , saṃsāramunuṃḍi mōkṣamiccunō yatanē guruvu).
(sadguruḍainavāḍu śiṣyuniyaṃdu eppuḍu prasannuḍagunō appuḍu atanu viṣṇurūpuḍuga pravartiṃcunu; eppuḍu śiṣyuniyaṃdu kōpiṃcunō appuḍu śivarūpuḍagunu; rājasavyāpāramukaligiyunnapuḍu brahmarūpu, ḍagunu; praśāṃtuḍagunapuḍu gaṃgārūpuḍagunu; vēdāṃtavākyamulanu kiraṇamulacēta śiṣyuniyokka bhrama, saṃśayamu mogalagunavigala ajñānamanu aṃdhakāramunu śēṣamu lēkuṃḍunaṭlu eppuḍu nivartiṃpacēyunō appuḍu sūryunivale rūpiṃcunu. ī vidhamugā brahma niṣṭagala sadguruniyaṃdu śiṣyunaku guruvu sākṣāttu īśvaruḍēyanu buddhi kalugavalenu - appuḍē guruvu bōdhiṃcinadāni sārasyamu teliyanagunu).
guruvun naruḍanucu dalaci kuṃṭhitabhaktiṃ
dirugu puruṣu śramamellanu
kariśaucamu kriya nirarthakaṃbagu nadhipā” (śrīmadāṃdhramahābhāgavatamu- 7 - 15 - 453)
jaḍuḍu nainaṭṭi yā jaṃtuvunaṃdunu dayagalgi mikkili dharmabuddhi
gannulunnavāḍu gānanivāniki deruvujūpinaṭlu deliyabaliki
yatulamagucu divyamaina yā mōkṣamārgaṃbu jūpavalayu ramaṇatōḍa”. (śrīmadāṃdhramahābhāgavatamu- 5 - 1 -)
pitā (taṃḍri) - “taṃḍri, haricērumaniyeḍi taṃḍri taṃḍri”
“trīn gurūn āha - iha saṃsārē yatrasaṃbhavaḥ janmamātraṃ sapitā tāvat ādyaḥ pradhamaḥ guruḥ pūjyaḥ. dvijātē ssataḥ puṃ saḥ satkarmaṇāṃ yatra saṃbhavaḥ upanīyē vēdādhyāpakaḥ ityarthaḥ sadvitīyō guruḥ yathā ahaṃ īśvaraḥ prathamādapi pūjyaḥ ityarthaḥ brahmavidyā pradaḥ guru ḥ tṛtīyaḥ -”
(guruvulu mugguru ani ceppabaḍucunnāru : - ī saṃsāramulō ekkaḍa puṭṭedamō ā janmamātramunataṃḍri ayinavāḍu modaṭi guruvu. satkarmalu cēyu dvijātulayaṃdu upanayanamuvēḷa gāyatrīmaṃtramunupadēśiṃcuvāḍu reṃḍava guruvu. īśvaruḍanagu nēnu modaṭi guruvukannanu pūjyuḍanu. aṭṭi nā guṟiṃci ayina brahmavidyanu upadēśiṃcuvāḍu mūḍava guruvu). (cūḍumu 12).
(cōdakuḍu, bōdhakuḍu, mōkṣamuniccuvāḍu ani guruvulu mūḍu vidhamulu - sāmānyajanulatō kalisi melisi tiruguvāḍu cōdakuḍu. jīvanmuktulanu bōdhiṃcuvāḍu bōdhakuḍu. saṃsāramunuṃḍi tariṃpacēsi, tirigi janmalēkuṃḍa cēyuvāḍu mōkṣakuḍu - ṃokṣamu kalugacēyuvāḍu).
(sūta saṃhita).
(kṣatriyulaku, vaiśyulaku, śūdrulaku brāhmaṇuḍu guruvu, vaiśyulaku śūdrulaku kṣatriyuḍu guruvu. vaiśyuḍu śūdrulaku guruvu).
“adhīhi bhagavan !, brahma vidyāṃ variṣṭāṃ sadā sadbhissēvyamānāṃ, nigūḍhāṃ, ya yā cidāt sarvaṃ pāpaṃ vyapōhya parātparaṃ puruṣamupaiti vidvān” (kaivalyōpaniṣat)
(śrēṣṭamainaṭuvaṃṭidinnī, satpuruṣulacēta sēviṃpabaḍunadi, atirahasyamainadinnī, samasta pāpamulanu pōgoṭṭi śīghramugā parātparuḍaina paramapuruṣuni poṃdiṃpa cēyunaṭṭi brahma vidyanu (brahmajñānamunu) , ō guru mahāśayā ! nāku bōdhiṃpumu). iṭlu tananu cērina śiṣyuniki brahmavidya yanu brahmajñānamunu bōdhiṃcinavāḍu guruvu –
“tadviddhi praṇipātēna paripraśnēna sēvayā |
upadēkṣyaṃti tē jñānaṃ jñāni nastatva darśinaḥ ||“. (śrīmadbhagavadgīta - 4 - 34)
(guruvu nāśrayiṃci, sēvacēsi, praśnaluvēsi saṃśayamulu tīrcukonina ā guruvu - brahmajñānamugalavāḍutanaku kaligina brahmajñānamunu upadēśiṃcunu).
“śāstrajñōpi svataṃtrēṇa brahma jñānānvēṣaṇaṃ na kuryāt”.
(śāstramu eṃta telisinavāḍainanu guruvu nāśrayiṃci - atani upadēśamulēnidī svataṃtriṃci brahmajñānamunu poṃduṭaku prayatnamu cēyarādu).
(dīnuḍainanu, bhāgyahīnuḍainanu nā bhartayē nāku guruvu - gauravanīyuḍu - pūjyuḍu).
sṛṣṭilō konni konni jīvulu pravartiṃcu vidhamucūci vāṭivalana prajalu guṇapāṭhamu nērcukonucuṃduru - aṭuvaṃṭi jīvulu guruvulugā grahiṃpabaḍucunnāru -
bharatul gūrcina vittamulparulakun brāptiṃcu; brāptāśiyai
tirugaṃbōni mahōragaṃbu bradukun dīrghāṃgamai yuṃḍiyun;
jirakālaṃbagu vāni vartanamu nē jiṃtiṃci yēkāṃtinai”.
“ka. ajagaramunu juṃṭīgayu
nijaguruvulugā dalaṃci niściṃtuḍanai
nijanasthali garmaṃbula
gajabijilēkunnavāḍa gaurava vṛttin (śrīmadāṃdhramahābhāgavatamu- 7 - 13, - 436, 437)
(śrīmadbhāgavataṃ- 7 - 35)
(pai viṣayamu śrīmadāṃdhramahābhāgavatamulō ī kriṃda vidhamugā ceppabaḍinadi : - “bhū gaganānila jala kṛpīṭa bhava sōma sūryakapōta tilipsa śalabha madhumakṣikā jagaradvirēpha hariṇa pāṭhīna piṃgaḷā kurara piṃcaka kumārikā śarakṝtsarsa lūtāsapēśa kṛtsamudayaṃbulu modalugā galavāni guṇaṃbu leṟiṃgikoni yōgīṃdrulu melagucuṃduru”.
(paina ceppibaḍinavāṭi guṇaṃbulēviyō, avi yeṭlu pravartiṃcucunnavō, vāṭi pravartana yeṭlu guṇapāṭhamagucunnadō anu viṣayamu sarvamu - “ivvidhaṃbuna bhūmivalana sairaṇayu, gaṃdhavahunivalana baṃdhuraṃbagu parōpakāraṃbunu - - -” ani modalukoni - ceppabaḍinadi - cūḍumu - 11 - 97, 99).
tpūrvāraṃbhamu sēyabōladanucun bōdhiṃcu caṃdaṃbunan |
sarvatvamutō jagadguruvulai saṃpūrṇu lai yuṃḍiyuṃ |
gurvaṃgīkaraṇaṃbu sēyajanirā gōviṃduḍun rāmuḍun ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - 1411)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.