← Back to ఇ · Booklets 11–20 (digitized file 2)

ఇదం idaṃ

Original — తెలుగు
  1. ప్రత్యక్షం - (కంటికి కనబడు ఇదంతా).

  2. వ్యక్తం విశ్వం (స్థూలరూపములో కంటికి కనబడుచున్న ఈ ప్రపంచము).

  3. సర్వం జగత్ - (ఈ జగత్తు అంతా - జగత్తులోనున్నవన్నీ)

  4. వర్తమానం జగత్. - (ఇప్పుడు జరుగుచున్న ఈ ప్రపంచము).

  5. కార్యాస్పదం దృశ్యం, విశ్వం. (భగవంతునియొక్క కార్యమై కనబడుచున్న ఈ విశ్వము - ప్రపంచము).

  6. ఇదం పదేన భోగ్య సంఘాతః ఉచ్యతే. (ఇది, అనగా, భోగ్య వస్తువులు అన్నీ కలిసినది).

  7. భోక్తృ భోగ్యాత్మకం విశ్వం. (భోక్త అయిన జీవుడు, అతనికి భోగ్యమగు వస్తువులతోనిండియున్న ప్రపంచము).

  8. నామరూపకర్మభేద భిన్నం, జగత్- (నామరూపములచేత, కర్మలచేత వేరువేరుగా కనబడు జగత్తు).

  9. చిదచిదాత్మకం జగత్.

(చిత్, అచిత్ - ఆత్మ, అనాత్మ - ఈ రెండింటియొక్క మేళన వలన కలిగి - ఈ రెండూ అయిన జగత్తు).

  1. చిద చిద్వస్తు జాతం, కార్యావస్థం, కారణావస్థం చ మచ్ఛరీర భూతం.

(చిద్వస్తువు, అచిద్వస్తువు - ఈ రెండింటితోను కూడియున్నదిన్నీ, కార్యరూపముగాను, కారణరూపముగాను ఉన్నదిన్నీ కలిసి భగవంతుని శరీరమే అయిన జగత్తు).

  1. తత్తత్ప్రమాణ సిద్ధం, ఈశ్వర వ్యతిరిక్తం, చిద చిదాత్మకం.

(ఆయా ప్రమాణములచేత తెలియబడునది; ఈశ్వరునికంటె వేరైనది; చిత్, అచిత్ అను రెండు కలసి అయినది).

  1. నామరూప విశేషవత్ వ్యాకృతం జగత్.

(అనేకమైన రూపములతో, అనేకమైన పేర్లతో, అనేకవిశేషములతో వ్యాపించియున్నజగత్తు).

  1. స్థూల చేతన శరీరకం బ్రహ్మానభివ్యక్తనామరూపం.

(నామరూపములు వ్యక్తముకాని పరబ్రహ్మయొక్క స్థూల చేతన శరీరము).

  1. ఇదం పరిదృశ్య మాన నానా నామరూప జుష్ట పశు పక్షి పన్నగాది విచిత్ర కలనా శోభితం, కర్తృ భోక్తృత్వాది విభ్రమారూఢాధిష్టితం అనంతకోటి బ్రహ్మాండాత్మకం సర్వం ఆవిద్యకం యత్ జగద్దృశ్యతే.

(ఈ కనబడుచున్నటువంటిదిన్నీ, అనేకమైన నామరూపములు కలిగియున్న పశువులు పక్షులు, పాములు మొదలగు చిత్ర విచిత్రమైన వస్తువులుగా కనబడుచున్నటువంటిదిన్నీ, నేనే కర్తను, నేనే భోక్తను అను భ్రమతో నిండియున్న, అంతములేనన్ని - లెక్కపెట్టలేనన్ని కోట్లు సంఖ్యగల బ్రహ్మాండములు కలిగినటువంటిన్నీ, అవిద్యవలన కలిగినటువంటిన్నీ, కనబడుచున్న ఈ జగత్తు అంతా).

  1. “భూద్వీప వర్ష సందద్రి మణస్సముద్ర పాతాళది ఙ్నరక తారాగణ లోక సంస్థితంబయి, సకలజీవ నికాయ్యంబై యద్భుతంబైన శ్రీహరి స్థూల శరీరంబు వినిపించితిని” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 2 - 162)

  2. “అవిద్యా పద తత్కార్య జాతం”

(అవిద్య యను పేరుగల మాయయొక్క కార్య వస్తువు, మాయచే సృష్టించ బడినదంతయు).

  1. వివిధ విచిత్ర రచనయా బ్రహ్మాదిస్తంబ పర్యాంత క్షేత్రజ్ఞ మిశ్రతయా చ ప్రత్యక్ష ప్రమాన సిద్ధమిత్యర్థః

(చిత్ర విచిత్రముగా చేయబడిన బ్రహ్మ మొదలు స్తంబము వఱకుగల వస్తువులన్నియు క్షేత్రజ్ఞుడైన పరమాత్మతో కలసియుండి ప్రత్యక్ష ప్రమాణముగా నున్నది).

  1. ప్రాణ కర్మాది నిమిత్తాను రూపం ఇదం జగత్, దేశతః, కాలతః, నామ్నా, రూపేణచ యథానుభవం సర్వప్రాణిభిః సర్వా వస్థైః అనుభూయమానం.

(ప్రాణులయొక్క కర్మ మొదలగునవి కారణముగా కలిగిన ఈ జగత్తు. దేశభేదముచేతను, కాలభేదము చేతను, నామము, రూపము కలిగి సమస్త ప్రాణులచేత అన్ని అవస్థలయందు అనుభవమగుచున్న ఈ జగత్తు).

  1. “అనిత్యం సర్వమే వేదం తాపత్రయ దూషితం |

అసారం నిందితం హేయమితి నిశ్చిత్య శామ్యతి ||“. (అష్టావక్రగీత - 9 - 3)

(ప్రపంచము నిత్యమైనదికాదు, ఎల్లకాలమందుండునదికాదు, తాపత్రయమను దోషముకలిగియున్నది, సారములేనిది, నీచమైనది యని నిందింపబడినది అని నిశ్చయించుకొని శమము నవలంభింపవలెను).

  1. “ఇదం జగత్ విభ్రమం” - అత్ర హేతువః - మనో విజృంభితత్వాత్, దృష్టత్వాత్, వినాశిత్వాచ్చ, స్వప్నవత్ అతి చంచలత్వాత్ చ అలాత చక్రవత్ ”

(ఈ జగత్తు ఒకభ్రమ - ఎందుచేతననగా, మనస్సునుబట్టి ఉన్నట్లు కనబడుటవలనను, కంటికి కనబడుటవలనను, నశించవలసినదేకనుక. చక్రమువలె జరిగినదే మరల మరల జరుగుచుండునది గనుకను).

  1. “విస్తారస్సర్వభూతస్య విష్ణోః సర్వ మిదం జగత్ |

ద్రష్టవ్యమాత్మవత్తస్మాత్ అభేదేన విచక్షణైః ||“. (విష్ణుపురాణము)

(ఈ జగత్తు అంతయు సర్వస్వరూపుడైన విష్ణువుయొక్క విస్తారమే, విష్ణువే, ఒక్కడే ఈ జగత్తు అంతటిలాగ, జగత్తులోని అన్నివస్తువులుగాను వ్యాపించియున్నాడు. అందుచేత పండితులగువారు - బ్రహ్మజ్ఞానులైనవారు - పరమాత్మకి జగత్తుకు (జగత్తులోని అన్ని వస్తువులకు) భేదములేదని, పరమాత్మ జగత్తు ఒకటేయని, దృష్టికలిగియుండవలెను - ఈ సృష్టి అంతా, అందులోని వస్తువులన్నీ భగవంతుడే అని దీని అర్థము).

  1. విశ్వం ఇదానీం అజ్ఞానదృష్ట్యా ప్రదృశ్యతే, తత్సర్వం వస్తు తత్త్వదృష్ట్యా పురుషః ఏవ, పరమాత్మ ఏవ.

(ఈ కనబడు ప్రపంచమంతా అజ్ఞానదృష్టిలో భగవంతునికంటె వేరుగా అయినట్లు కనబడుచున్నది - కాని తత్వదృష్టిలో ఇదంతా పురుషుడే - పరమపురుషుడే - పరమాత్మయే).

“విశ్వం నారయణం దేవం” -

    1. “పురుష ఏ వేదం విశ్వం” (ముండకోపనిషత్)

    2. “సర్వం ఖిల్విదం బ్రహ్మ, స్వాతిరిక్త సర్వా భావాత్” (ఛాందోగ్యోపనిషత్)

(బ్రహ్మ కానిది ఏదియు లేదుకనుక ఇదంతయు బ్రహ్మమే). (చూడుము – 23.6.).

  1. “ఆత్మై వేదం సర్వం” (ఛాందోగ్యోపనిషత్)

(ఈ కనబడునదంతయు ఆత్మయే, బ్రహ్మమే).

“ఆత్మమాత్రం మిదం సర్వం, ఆత్మనో(అ)న్యన్న కించిన” ఇతి శ్రుతిః.

  1. “సత్తామాత్ర మిదం సర్వం”

(ఇది అంతయు సత్తామాత్రమే, సన్మాత్రుడు, సద్రూపుడు అయిన భగవంతుడే - ఇదంతయు భగవంతుని యొక్క సద్రూపమే, చైతన్యమే).

  1. “సచ్చిదానంద రూపమిదం సర్వం” ఇతి శ్రుతేః -

(ఇదంతయు సత్, చిత్, ఆనందము అను మూడుకలిసిన పరబ్రహ్మయొక్క రూపమే)

  1. “సర్వం ఖిల్విదం బ్రహ్మ, తజ్జలానితి శాంత ఉపాసీత” (ఛాందోగ్యోపనిషత్)

“యస్మాత్ సర్వమిదం వికారజాతం బ్రహ్మ, తజ్జత్వాత్, తల్లయత్వాత్ తదనత్వాచ్చ. నచ సర్వస్యైకాత్మత్వే రాగాదయః సంభవంతి, తస్మాత్ శాంత ఉపాసీత ఇతిశ్రుతేః.

(నామరూపములగల ఈ వికారజాతమంతయు - ప్రకృతియే ఈ నామరూపములుగల సమస్త వస్తువులుగా వికారమును, మార్పును - పొందినది. పరబ్రహ్మ తన చైతన్యశక్తితో - సత్తస్ఫూర్తితో - ప్రకృతిలో ప్రవేశించుటవలన - ప్రకృతి పురుష సంయోగమువలన - ప్రకృతి మార్పులు చెందినది - వికారము చెందినది. ఇట్లు వికారములుగానున్నవి ఈ ప్రపంచములోని వస్తువులన్నియు. అందుచేత అవన్నియు భగనంతునినుండి పుట్టినవే ఇవన్నియు పరబ్రహ్మమే. అవన్నియు తిరిగి అతనిలోనే లయ,మగుచున్నవి. అంతవరకు, స్థితికాలములో అతనిలోనే ఉండునవి - అందుచేత అవన్నియు ఒకే అత్మగలవి, ఒకటే కనుక, రాగముమొదలగు దోషములు కలుగవు. అందుచేత శాంతుడై ఇది అంతా పరబ్రహ్మమే అని తెలిసి ఉపాసించవలెను. - తత్ = ఆ బ్రహ్మనుండి, జ = పుట్టినది, ల = ఆ బ్రహ్మయందు లయమగుచున్నది. అన్ ఇతి = ఆ బ్రహ్మయందు చలించుచున్నవి).

  1. “కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి”. –

“ఆత్మని ఖల్వరే దృష్టే, శ్రుతే, మతే, విజ్ఞాతే, ఇదం సర్వం విజ్ఞాతం”.

“ఆత్మని విజ్ఞాతే సర్వమిదం విజ్జాతం భవతి. ఇదం సర్వం యదయమాత్మా బ్రహ్మా” (బృహదారణ్యకోపనిషత్)

(దేనిని తెలుసుకొనిన యీ సర్వమును - ఈదంతా - తెలుసుకొనబడినదగును? అను ప్రశ్నకు ఉత్తరముగా - ఆత్మనుచూచిన, వినిన, తెలుసుకొనిన ఈ సర్వప్రపంచము తెలియబడినదగును - అనగా - ఈ సర్వప్రపంచము ఆత్మయేకనుక ఆ ఆత్మతత్వము తెలుసుకొనిన ఈ ప్రపంచమంతయు అదేతత్వము కలదికనుక తెలిసినదగును).

  1. “యథా సోమ్య! ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యా ద్వాచారంభణం వికారో నామధేయం, మృత్తికేత్యేవ సత్యం”.

(చాందోగ్యోపనిషత్ - 6 - 1 - 4)

(మట్టిముద్ద - ఉండ - ఏమిటో తెలుసుకొనినచో ఆ మట్టితో చేయబడిన వస్తువులన్నియు తెలియనగును. ఆ మట్టియొక్క వికారమే - మార్పే - కుండ మొదలగునవి - మట్టితో చేయబడిన వస్తువులు - కుండ, మూకుడు, కూజా అను పేరుమాత్రమే వేరు. అవికూడా మట్టియే అనుటయే సత్యము.మట్టి ఎన్ని మార్పులు కలిగి, ఎన్ని వస్తువులుగా మారినా మట్టియే. ఉపాదానమును తెలుసుకొనిన ఉపాదేయమును తెలుసుకొనవచ్చును - బ్రహ్మలోనుండి ఇది అంతా పుట్టినదికనుక బ్రహ్మను తెలుసుకొనిన ‘ఇదంతా’ తెలుసుకొనబడును - అంతా బ్రహ్మమే).

  1. “ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ నాన్యత్ కించనముషత్” (ఐతరేయోపనిషత్)

“సదేవ సోమ్య! ఇదమగ్ర ఆసీత్ - ఏకమేవా ద్వితీయం”.

(ఇప్పుడు అనేకమైన నామరూపములతో కనబడు ఇదంతయు - ఈ ప్రపంచమంతయు - సృష్టికిముందు - ఇవి యేవియు పుట్టకముందు - ఒక్క ఆత్మగానే, సత్పదార్థముగానే ఉండెను - ఆత్మకాక ఇంకేదియు అప్పుడులేదు. అందుచేత ఇదంతా, ఈ కనబడు ప్రపంచములోని నామరూపములతో ఉన్నవస్తువులన్నియు, వేరు వేరుగా పుట్టకముందు ఆత్మగానే ఉండెను. అందుచేత అవి పుట్టి ప్రపంచముగామారినా అవి ఆత్మరూపములే - ఆత్మయే ఆత్మకాక ఇంకొకటి సృష్టిలో ఏదియులేదు. “హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 1 - 17)

  1. “మ యి సర్వమిదం ప్రోతం సూత్రేమణిగణా ఇవ” (శ్రీమద్భగవద్గీత - 7 - 7)

(దారములో గుచ్చబడిన మణులవలె ఈ జగత్తు అంతా - ఇదంతా - కూర్చబడినది).

  1. “మయా తతమిదం సర్వం జగదీవ్యక్త మూర్తినా” (శ్రీమద్భగవద్గీత - 9 - 4)

(కంటికి కనబడని రూపముతో నేను దీనినంతటిలోను - ఈ ప్రపంచకము అంతటిలోను లోపల పైన పూర్తిగావ్యాపించి యున్నాను).

Transliteration
  1. pratyakṣaṃ - (kaṃṭiki kanabaḍu idaṃtā).

  2. vyaktaṃ viśvaṃ (sthūlarūpamulō kaṃṭiki kanabaḍucunna ī prapaṃcamu).

  3. sarvaṃ jagat - (ī jagattu aṃtā - jagattulōnunnavannī)

  4. vartamānaṃ jagat. - (ippuḍu jarugucunna ī prapaṃcamu).

  5. kāryāspadaṃ dṛśyaṃ, viśvaṃ. (bhagavaṃtuniyokka kāryamai kanabaḍucunna ī viśvamu - prapaṃcamu).

  6. idaṃ padēna bhōgya saṃghātaḥ ucyatē. (idi, anagā, bhōgya vastuvulu annī kalisinadi).

  7. bhōktṛ bhōgyātmakaṃ viśvaṃ. (bhōkta ayina jīvuḍu, ataniki bhōgyamagu vastuvulatōniṃḍiyunna prapaṃcamu).

  8. nāmarūpakarmabhēda bhinnaṃ, jagat- (nāmarūpamulacēta, karmalacēta vēruvērugā kanabaḍu jagattu).

  9. cidacidātmakaṃ jagat.

(cit, acit - ātma, anātma - ī reṃḍiṃṭiyokka mēḷana valana kaligi - ī reṃḍū ayina jagattu).

  1. cida cidvastu jātaṃ, kāryāvasthaṃ, kāraṇāvasthaṃ ca maccharīra bhūtaṃ.

(cidvastuvu, acidvastuvu - ī reṃḍiṃṭitōnu kūḍiyunnadinnī, kāryarūpamugānu, kāraṇarūpamugānu unnadinnī kalisi bhagavaṃtuni śarīramē ayina jagattu).

  1. tattatpramāṇa siddhaṃ, īśvara vyatiriktaṃ, cida cidātmakaṃ.

(āyā pramāṇamulacēta teliyabaḍunadi; īśvarunikaṃṭe vērainadi; cit, acit anu reṃḍu kalasi ayinadi).

  1. nāmarūpa viśēṣavat vyākṛtaṃ jagat.

(anēkamaina rūpamulatō, anēkamaina pērlatō, anēkaviśēṣamulatō vyāpiṃciyunnajagattu).

  1. sthūla cētana śarīrakaṃ brahmānabhivyaktanāmarūpaṃ.

(nāmarūpamulu vyaktamukāni parabrahmayokka sthūla cētana śarīramu).

  1. idaṃ paridṛśya māna nānā nāmarūpa juṣṭa paśu pakṣi pannagādi vicitra kalanā śōbhitaṃ, kartṛ bhōktṛtvādi vibhramārūḍhādhiṣṭitaṃ anaṃtakōṭi brahmāṃḍātmakaṃ sarvaṃ āvidyakaṃ yat jagaddṛśyatē.

(ī kanabaḍucunnaṭuvaṃṭidinnī, anēkamaina nāmarūpamulu kaligiyunna paśuvulu pakṣulu, pāmulu modalagu citra vicitramaina vastuvulugā kanabaḍucunnaṭuvaṃṭidinnī, nēnē kartanu, nēnē bhōktanu anu bhramatō niṃḍiyunna, aṃtamulēnanni - lekkapeṭṭalēnanni kōṭlu saṃkhyagala brahmāṃḍamulu kaliginaṭuvaṃṭinnī, avidyavalana kaliginaṭuvaṃṭinnī, kanabaḍucunna ī jagattu aṃtā).

  1. “bhūdvīpa varṣa saṃdadri maṇassamudra pātāḷadi ṅnaraka tārāgaṇa lōka saṃsthitaṃbayi, sakalajīva nikāyyaṃbai yadbhutaṃbaina śrīhari sthūla śarīraṃbu vinipiṃcitini” (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 2 - 162)

  2. “avidyā pada tatkārya jātaṃ”

(avidya yanu pērugala māyayokka kārya vastuvu, māyacē sṛṣṭiṃca baḍinadaṃtayu).

  1. vividha vicitra racanayā brahmādistaṃba paryāṃta kṣētrajña miśratayā ca pratyakṣa pramāna siddhamityarthaḥ

(citra vicitramugā cēyabaḍina brahma modalu staṃbamu vaṟakugala vastuvulanniyu kṣētrajñuḍaina paramātmatō kalasiyuṃḍi pratyakṣa pramāṇamugā nunnadi).

  1. prāṇa karmādi nimittānu rūpaṃ idaṃ jagat, dēśataḥ, kālataḥ, nāmnā, rūpēṇaca yathānubhavaṃ sarvaprāṇibhiḥ sarvā vasthaiḥ anubhūyamānaṃ.

(prāṇulayokka karma modalagunavi kāraṇamugā kaligina ī jagattu. dēśabhēdamucētanu, kālabhēdamu cētanu, nāmamu, rūpamu kaligi samasta prāṇulacēta anni avasthalayaṃdu anubhavamagucunna ī jagattu).

  1. “anityaṃ sarvamē vēdaṃ tāpatraya dūṣitaṃ |

asāraṃ niṃditaṃ hēyamiti niścitya śāmyati ||“. (aṣṭāvakragīta - 9 - 3)

(prapaṃcamu nityamainadikādu, ellakālamaṃduṃḍunadikādu, tāpatrayamanu dōṣamukaligiyunnadi, sāramulēnidi, nīcamainadi yani niṃdiṃpabaḍinadi ani niścayiṃcukoni śamamu navalaṃbhiṃpavalenu).

  1. “idaṃ jagat vibhramaṃ” - atra hētuvaḥ - manō vijṛṃbhitatvāt, dṛṣṭatvāt, vināśitvācca, svapnavat ati caṃcalatvāt ca alāta cakravat ”

(ī jagattu okabhrama - eṃducētananagā, manassunubaṭṭi unnaṭlu kanabaḍuṭavalananu, kaṃṭiki kanabaḍuṭavalananu, naśiṃcavalasinadēkanuka. cakramuvale jariginadē marala marala jarugucuṃḍunadi ganukanu).

  1. “vistārassarvabhūtasya viṣṇōḥ sarva midaṃ jagat |

draṣṭavyamātmavattasmāt abhēdēna vicakṣaṇaiḥ ||“. (viṣṇupurāṇamu)

(ī jagattu aṃtayu sarvasvarūpuḍaina viṣṇuvuyokka vistāramē, viṣṇuvē, okkaḍē ī jagattu aṃtaṭilāga, jagattulōni annivastuvulugānu vyāpiṃciyunnāḍu. aṃducēta paṃḍitulaguvāru - brahmajñānulainavāru - paramātmaki jagattuku (jagattulōni anni vastuvulaku) bhēdamulēdani, paramātma jagattu okaṭēyani, dṛṣṭikaligiyuṃḍavalenu - ī sṛṣṭi aṃtā, aṃdulōni vastuvulannī bhagavaṃtuḍē ani dīni arthamu).

  1. viśvaṃ idānīṃ ajñānadṛṣṭyā pradṛśyatē, tatsarvaṃ vastu tattvadṛṣṭyā puruṣaḥ ēva, paramātma ēva.

(ī kanabaḍu prapaṃcamaṃtā ajñānadṛṣṭilō bhagavaṃtunikaṃṭe vērugā ayinaṭlu kanabaḍucunnadi - kāni tatvadṛṣṭilō idaṃtā puruṣuḍē - paramapuruṣuḍē - paramātmayē).

“viśvaṃ nārayaṇaṃ dēvaṃ” -

    1. “puruṣa ē vēdaṃ viśvaṃ” (muṃḍakōpaniṣat)

    2. “sarvaṃ khilvidaṃ brahma, svātirikta sarvā bhāvāt” (chāṃdōgyōpaniṣat)

(brahma kānidi ēdiyu lēdukanuka idaṃtayu brahmamē). (cūḍumu – 23.6.).

  1. “ātmai vēdaṃ sarvaṃ” (chāṃdōgyōpaniṣat)

(ī kanabaḍunadaṃtayu ātmayē, brahmamē).

“ātmamātraṃ midaṃ sarvaṃ, ātmanō(a)nyanna kiṃcina” iti śrutiḥ.

  1. “sattāmātra midaṃ sarvaṃ”

(idi aṃtayu sattāmātramē, sanmātruḍu, sadrūpuḍu ayina bhagavaṃtuḍē - idaṃtayu bhagavaṃtuni yokka sadrūpamē, caitanyamē).

  1. “saccidānaṃda rūpamidaṃ sarvaṃ” iti śrutēḥ -

(idaṃtayu sat, cit, ānaṃdamu anu mūḍukalisina parabrahmayokka rūpamē)

  1. “sarvaṃ khilvidaṃ brahma, tajjalāniti śāṃta upāsīta” (chāṃdōgyōpaniṣat)

“yasmāt sarvamidaṃ vikārajātaṃ brahma, tajjatvāt, tallayatvāt tadanatvācca. naca sarvasyaikātmatvē rāgādayaḥ saṃbhavaṃti, tasmāt śāṃta upāsīta itiśrutēḥ.

(nāmarūpamulagala ī vikārajātamaṃtayu - prakṛtiyē ī nāmarūpamulugala samasta vastuvulugā vikāramunu, mārpunu - poṃdinadi. parabrahma tana caitanyaśaktitō - sattasphūrtitō - prakṛtilō pravēśiṃcuṭavalana - prakṛti puruṣa saṃyōgamuvalana - prakṛti mārpulu ceṃdinadi - vikāramu ceṃdinadi. iṭlu vikāramulugānunnavi ī prapaṃcamulōni vastuvulanniyu. aṃducēta avanniyu bhaganaṃtuninuṃḍi puṭṭinavē ivanniyu parabrahmamē. avanniyu tirigi atanilōnē laya,magucunnavi. aṃtavaraku, sthitikālamulō atanilōnē uṃḍunavi - aṃducēta avanniyu okē atmagalavi, okaṭē kanuka, rāgamumodalagu dōṣamulu kalugavu. aṃducēta śāṃtuḍai idi aṃtā parabrahmamē ani telisi upāsiṃcavalenu. - tat = ā brahmanuṃḍi, ja = puṭṭinadi, la = ā brahmayaṃdu layamagucunnadi. an iti = ā brahmayaṃdu caliṃcucunnavi).

  1. “kasminnu bhagavō vijñātē sarvamidaṃ vijñātaṃ bhavati”. –

“ātmani khalvarē dṛṣṭē, śrutē, matē, vijñātē, idaṃ sarvaṃ vijñātaṃ”.

“ātmani vijñātē sarvamidaṃ vijjātaṃ bhavati. idaṃ sarvaṃ yadayamātmā brahmā” (bṛhadāraṇyakōpaniṣat)

(dēnini telusukonina yī sarvamunu - īdaṃtā - telusukonabaḍinadagunu? anu praśnaku uttaramugā - ātmanucūcina, vinina, telusukonina ī sarvaprapaṃcamu teliyabaḍinadagunu - anagā - ī sarvaprapaṃcamu ātmayēkanuka ā ātmatatvamu telusukonina ī prapaṃcamaṃtayu adētatvamu kaladikanuka telisinadagunu).

  1. “yathā sōmya! ēkēna mṛtpiṃḍēna sarvaṃ mṛṇmayaṃ vijñātaṃ syā dvācāraṃbhaṇaṃ vikārō nāmadhēyaṃ, mṛttikētyēva satyaṃ”.

(cāṃdōgyōpaniṣat - 6 - 1 - 4)

(maṭṭimudda - uṃḍa - ēmiṭō telusukoninacō ā maṭṭitō cēyabaḍina vastuvulanniyu teliyanagunu. ā maṭṭiyokka vikāramē - mārpē - kuṃḍa modalagunavi - maṭṭitō cēyabaḍina vastuvulu - kuṃḍa, mūkuḍu, kūjā anu pērumātramē vēru. avikūḍā maṭṭiyē anuṭayē satyamu.maṭṭi enni mārpulu kaligi, enni vastuvulugā mārinā maṭṭiyē. upādānamunu telusukonina upādēyamunu telusukonavaccunu - brahmalōnuṃḍi idi aṃtā puṭṭinadikanuka brahmanu telusukonina ‘idaṃtā’ telusukonabaḍunu - aṃtā brahmamē).

  1. “ātmāvā idamēka ēvāgra āsīt nānyat kiṃcanamuṣat” (aitarēyōpaniṣat)

“sadēva sōmya! idamagra āsīt - ēkamēvā dvitīyaṃ”.

(ippuḍu anēkamaina nāmarūpamulatō kanabaḍu idaṃtayu - ī prapaṃcamaṃtayu - sṛṣṭikimuṃdu - ivi yēviyu puṭṭakamuṃdu - okka ātmagānē, satpadārthamugānē uṃḍenu - ātmakāka iṃkēdiyu appuḍulēdu. aṃducēta idaṃtā, ī kanabaḍu prapaṃcamulōni nāmarūpamulatō unnavastuvulanniyu, vēru vērugā puṭṭakamuṃdu ātmagānē uṃḍenu. aṃducēta avi puṭṭi prapaṃcamugāmārinā avi ātmarūpamulē - ātmayē ātmakāka iṃkokaṭi sṛṣṭilō ēdiyulēdu. “harimayamugāni dravyamu paramāṇuvu lēdu”

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 1 - 17)

  1. “ma yi sarvamidaṃ prōtaṃ sūtrēmaṇigaṇā iva” (śrīmadbhagavadgīta - 7 - 7)

(dāramulō guccabaḍina maṇulavale ī jagattu aṃtā - idaṃtā - kūrcabaḍinadi).

  1. “mayā tatamidaṃ sarvaṃ jagadīvyakta mūrtinā” (śrīmadbhagavadgīta - 9 - 4)

(kaṃṭiki kanabaḍani rūpamutō nēnu dīninaṃtaṭilōnu - ī prapaṃcakamu aṃtaṭilōnu lōpala paina pūrtigāvyāpiṃci yunnānu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.