← Back to ఇ · Booklets 11–20 (digitized file 2)

ఇంద్రియ జయము iṃdriya jayamu

Original — తెలుగు
  1. “యదా బాహ్యేంద్రియాణి విషయైః సన్ని కృష్యతే, తథా తద్ద్వారా మనః తత్రప్రవర్తతే, ప్రవృత్తేచ మనసిరాగో భవతి; తతః ఆత్మనః క్షోభః, ఏవం ఇంద్రియాణాం అవిజయః. యోహియం వ్యాకులం కరోతి, సతేన జితః ఇత్యుచ్యతే యదా తు బాహ్యేంద్రీయాణి విషయ సన్నిథానే అపి సతైః సన్నికృష్యంతే, సన్ని కృష్టాన్నపి న మనః తథా భి ముఖ్యేనా హరంతి, ఆహృతేపి మనసి న విషయరావో జాయతే, తథా నాత్మనః క్షోభో భవతి ఇత్యేషః ఇంద్రియజయః సోయం సంగ్రహేణ ద్విథా :- బాహ్యేంద్రియాణాం శక్తి క్షయాన్మనసో రాగ క్షయాచ్చ; ఏతత్ ద్వయంచ పురుష భేదేన ఉక్త ప్రకాకారద్వయేన నిరాహారత్వ బ్రహ్మసాక్షాత్కారాభ్యాం భవతి ఇత్యేవం ఇంద్రియ జయస్య మహా ప్రయత్నసాధ్యత్వం ఇతి”.

(బాహ్యేంద్రియములు విషయములచేత ఆకర్షింపబడునప్పుడు మనస్సు వాటియందు ప్రవర్తించును, అప్పుడు వాటియందు అనురాగము కలుగును, దానివలన ఆత్మకు క్షోభ కలుగును. ఈ ప్రకారముగా ఇంద్రియములను జయించుట కలుగదు. ఎవరు ఎవరిని వ్యాకులపఱచెదరో, అట్లు వ్యాకులపడినవారు వ్యాకుల పఱచినవారిచే జయింప బడిరి అని లోకమందు ప్రసిద్ధమే - బాహ్యేంద్రియములు విషయముల సన్నిధిలో ఉన్నప్పటికీ వాటిచే ఎప్పుడు ఆకర్షింపబడవో - చలింపవో - అవి ఆకర్షింపబడినను మనస్సు వాటియందు మనస్సు ప్రవర్తింపదో, మనసు ఆకర్షింపబడినను ఆ విషయములందు అనురాగము కలుగదో, అప్పుడు ఆత్మకు క్షోభముకలుగదు. ఇదియే ఇంద్రియ జయము - ఇది సంగ్రహముగా రెండు విధములు - బాహ్యేంద్రియముల శక్తి సన్నగిలుటవలన, మనసులో అనురాగము క్షీణించుటవలన - ఈ రెండును పురుషులలో భేదమువలన ఆహారము తినకపోవుటవలనగాని, బ్రహ్మ సాక్షాత్కారమువలనగాని కలుగును - ఇట్లు ఇంద్రియజయము గొప్ప ప్రయత్నమువలన సమకూరును).

  1. “కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః |

మహాశనోమహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణం |

ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే |

ఏతర్వి మోహా యత్యేష జ్ఞానమావృత్య దేహినం |

తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ |

పాప్నానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాన నాశనం ||“. (శ్రీమద్భగవద్గీత - 3 - 37, 40, 51)

“శృణు తంవైరిణం యంత్వం పృచ్ఛస్యత్యంత రుస్సహం |

బలాదనర్థ మార్గే(అ)స్మిన్ కామ ఏష ప్రవర్తకః |

సర్వానర్థ పరిప్రాప్తినిమిత్తం శత్రురాత్మనః |

కేన చిద్ధేతునా కామః ప్రతిబద్ధః స ఏవహి |

క్రోధః పరిణతో భాతి. తస్మిన్ కామే వినివారితే |

సర్వ శ్రేయః పరిప్రాప్తిః తతో(అ)స్య శ్రుణుకారణం |

- - - జ్ఞాతే శత్రో రధిస్టానే సజేతుం శక్యతే(అ)జసా |

తద ధిష్టా నమేవాహ సమస్తానీంద్రియాణిచ |

శబ్దాది గ్రాహకా వచనాది కరాణి చ |

సంకల్పాత్మా మనో జ్ఞేయం బుద్ధిర్నిశ్చయ రూపిణీ |

కామస్యహ్యాశ్రయః యస్మాత్ ఏతైః సోపీంద్రియాదిభిః |

స్వస్వవ్యాపారవద్భిస్తైరాశ్రయై ర్మోహ యత్యసౌ |

వివేకజ్ఞానమాసాద్యమూఢం దేహాభి మానినం |

యతోసావింద్రియాధారః కామో మోహాయ దేహినః |

తస్మాత్త్వం మోహనాత్పూర్వం ప్రాగ్వా కామ నిరోధతః |

శ్రోత్రా దీనీంద్రియాణ్యేన వశీకృత్య సువంశజ |

పాపమూలం రిపుం కామం మారయైనమశేషతః ||“. (గీతాభావప్రకాశము - 3 - 239 to 241; 270 to 275)

(అనర్థములకు మూలమైన పనులందు ఇష్టములేకపోయినను పాపకర్మలు చేయుటలో కారణము కామము, క్రోధము - ఇవి రజోగుణమువలన పుట్టినవి. ఇవి ఈ కారణమువలననే పురుషునికి శత్రువువలె ప్రేరేపించుచున్నవి. ఈ కామము - కోరిక - నెఱవేరుటలో ఆటంకము వచ్చినయడల అది క్రోధముక్రింద పరిణమించును. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమను శత్రువునకు అధిష్టానములు. దేహియొక్క జ్ఞానమును హరించి వీటిచేత ఈ కామము మోహపెట్టుచున్నది. అందుచేత ముందు ఇంద్రియములను జయించి జ్ఞానవిజ్ఞానములను నశింపచేయు ఈ పాపి అయిన కామమును జయించుము. అధిస్టానమును జయించినయడల దానిని ఆశ్రయించియున్న కామమును జయించవచ్చును. అందుచేత ముందు ఇంద్రియములను జయించుము - నీ స్వాధీనములో నుంచుకొనుము).

  1. “యతతో హ్యపి కౌంతేయ పురుషశ్చ విపశ్చితః |

ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః |

తాని సర్వాణి సం యమ్య యుక్త అసీతమత్పరః |

వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 60. 61)

“ప్రజ్ఞా స్థైర్యే పరో హేతుః సేంద్రియ స్వాంత నిగ్రహః |

తదభావే పరాహానిః ప్రజ్ఞా యా ఇతి కధ్యతే |

భూయో భూయోపి భోగేషు దోష దృష్టిం ప్రకుర్వతః |

సమ్యగ్వి వేకినో అప్యేతన్మానః స్థితమపి క్షణం |

వికారం ప్రాపయంత్యేనీంద్రియాణి ప్రసహ్యతత్ |

పశ్యత్యేవ బలాత్కరాత్ స్వామిన్యపి విపశ్చతి |

క్షోభకాణి బలీయస్త్వాద్వివేకసతి రక్షకే |

ప్రవిష్ణుం తాని ప్రచ్యావ్య వివేక జమతో మతః |

విషయావేశ సామర్థ్యాత్ ధరంత్యేవేంద్రియాణ్యదః |

యధా ప్రమాధి నశ్చోరాః ప్రసహ్య ధనినో ధనం |

హరంత్యేవం మనః స్వే స్వే విషయేంద్రియా ణి వై |

ఏవంతర్హి ప్రతీకారః కస్తత్రేత్యత ఆహతం |

తానీంద్రియాణి ధీకర్మ సాధకాన్య ఖిలాన్యపి |

సమాహితో వశీకృత్య నిగృహీత మనశ్చసన్ |

నిర్వ్యాపారతయా తిష్ఠేన్మాం సమాశ్రిత్య మత్పరః |

వాసదేవో హమేవేశో యస్యోపాదేయ అంతరః |

సచాస్త్యేకాంత మద్భక్తో వశీకర్తుం క్షమో అఖిలం |

యథారాజా నమాశ్రిత్య నిగృహ్యం తేహి శత్రవః |

రాజాశ్రితోయమిత్యేవం జ్ఞాత్వావశ్యా భవంతితే |

భగవంతం తథాశ్రిత్య తత్ప్రభావేన సర్వశః |

నిగృహ్యాణీం దియాన్యేవక్షోభకాణ్యపి యోగినః |

కృష్ణాశ్రితోయం మత్వేత్థం స్వయం పశ్చాని సం తివై |

మాహాత్మ్యం భగవద్భక్తేః స్ఫుటం చాగ్రే భవిష్యతి |

ఇంద్రియాణాం వశీకారే ఫలమాహ రమాపతిః |

వశేహీతి స్పష్టమిదం కిమానీతేతి పృచ్చతః |

ఉత్తరంప్రోక్తమిత్యేత దతః కౄత్యం యతేః శ్రుణు ||” (గీతాభావప్రకాశము - 2 - 594 to 606)

(ఇంద్రియములతోకూడ మనస్సును నిగ్రహించుట - తన వశములో నుంచుకొనుట. స్థితప్రజ్ఞుడు అగుటకు అవసరము - ఎంత వివేకవంతుడైనను, భోగములను పదే పదే ద్వేషించువాడైనను అతని మనస్సును అతని ఇంద్రియములు వికారమును పొంద చేయును, చలింపచేయును. బలవంతముగా దొంగలు ధనవంతుని ధనము నపహరించురీతిని ప్రజ్ఞావంతుడైనవాని యొక్కమనస్సును బలవంతములైన ఇంద్రియములు వాటి వాటి విషయముల విషయమై లాగుచుండును. దీనికి ప్రతీకారమేమనగా - ఇంద్రియములుమనోకర్మసాధనములు. అందుచేత సమాహితమైన మనస్సుకలవాడు, మనస్సుని నిగ్రహించి, తన ఆధీనములో నుంచుకొని, సమస్త వ్యాపారములను మాని భగవంతుని ఆశ్రయించి భగవత్పరుడై యుండవలెను. వాసుదేవుడు - సమస్త దేహములలోను నివసించియుండువాడు - ఈశ్వరుడు అయిన నన్ను ఏకాంత భక్తిచేత భజించువాడు ఇంద్రియములను, మనస్సును, ఇంద్రియములను జయించుటకు శక్తికలిగియుండును. రాజును ఆశ్రయించినవారిని చూచి వారిశత్రువులు వారిని వశము చేసుకొనలేనట్లు భగవంతుని ఆశ్రయించిన యోగులు ఆ ఆశ్రయణప్రభావమువలన ఇంద్రియములు తనకు క్షోభకలుగచేయుచున్నప్పటికీ ఇతను భగవంతుని ఆశ్రయించియున్నాడు అని తెలుసుకొని ఆ ఇంద్రియములే యోగికిస్వయముగా వశమగును. అందుచేత భగవద్భక్తివలన ఇంద్రియములు వశమగును - ఇంద్రియ జయము కలుగును).

  1. “సీ. కామహర్షాది సంఘటితమై చిత్తంబు భవదీయ చింతన వదలి సొరదు

మధురాదిరసముల మరిగిచొక్కుచు జిహ్వ నీవర్ణనమునకు నిగుడనీదు

సుందరముఖముల జూడగోరెడి చూడ్కి తావకాకృతులపై దగులు వడదు

వివిధ దుర్భాషలు వినగోరు వీనులు వినవు యుష్మత్కథా విరచనములు

తే. ఘ్రాణ మురవడి తిరుగు దుర్గంధములకు

దనువు గొలువదు వైష్ణవధర్మములకు

నడగియుండవు కర్మేంద్రియములు, పురుషు

గలచు; సవతులు గృహమేధి గలచునట్లు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 9 - 363)

అందుచేత ఇంద్రియములను జయించవలెను - తనవశములో నుంచకొనవలెను

  1. శృత్వా, సృష్ట్వా చ దృష్ట్వా చ భుక్త్వా ఘ్రాత్వా చ యోనరః |

న హృష్యతి; గాయతి వా సవి జ్ఞేయో జితేంద్రియః ||“. (మనుః)

(స్తోత్రము చేసినను, ఆనందకరమైన మృదువైన వస్తువుము తాకినను, సుందరమైన వస్తువులను చూచినను, ఇష్టమైన రుచికరమైన ఆహారము తినినను, సువాసనగల వస్తువులను చూచినను సంతోషముపొందక, కఠినమైన కష్టమును కలిగించు వస్తువు తాకినను, భయంకరమైన వస్తువులను చూచినను, ఇష్టముకానివి, నిషేధింపబడినవి యగు, అనారోగ్యము కలుగచేయునవి అగు భోజ్యపదార్థములు తినవలసివచ్చినను, దుఃఖము చెందక, ఈ అన్ని అవస్థల యందు సమముగా నుండువాడు జితేంద్రియుడు).

  1. “యథా సమ్హరతే చాయం కూర్మో(అ) oగానీవ సర్వశః |

ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా ||“. (శ్రీమద్భగవద్గీత - 2 - 58)

“విక్షిప్తానీంద్రియాణ్యేష వ్యుత్థానేసతి కర్మణా |

సమస్తానీంద్రియార్థేభ్యః శబ్దాదిభ్యో యదా స్వయం |

సంకోచయతి ధైర్యేణ కూర్మోంగానీవ సర్వ శః |

సమాధికాలే తస్యాస్తి ప్రజ్ఞా సమ్యక్పృతిష్ఠితా ||“. (గీతాభావప్రకాశము - 2 - 584 to 585)

(తనశరీరములోనుండి పైకి వచ్చి వాటి పనులు అవి చేయుచున్న ఇంద్రియములను తాబేలు తిరిగి తనశరీరములోనికి ముడుచుకొనునట్లు యోగి సమాధిలోనుండి మేల్కొనినప్పుడు బాహ్యవిషయములందు తగుల్కొనకుండా తన ఇంద్రియములను వాటి వృత్తులను చేయనీయకుండా తనలోనికి లాగుకొని ఉంచువాడు స్థితప్రజ్ఞుడు).

  1. “మధుకర రాజనం యథా మక్షికాః చలంత మనుచలంతి స్థిత మనుస్థితా భవంతి, తథా చిత్తానుసారీణీంద్రియాణి చిత్త నిరోధే నైవ నిరుధ్యతే, న యత్నాంతరేణ”.

(తేనెటీగలరాణి పోయిన స్థలమునకు తేనెటీగలు అన్నియు పోవును. ఆ ఈగరాణి చలించిన ఈగలన్నియు చలించును, ఈగరాణి చలింపకున్న ఈగలన్నియు మాని నిలుచును. ఆ విధముగా ఇంద్రియములన్నియు చిత్తమును అనుసరించి చరించును - చిత్తము నిరోధింపబడినయడల ఇంద్రియములుకూడ నిరోధింపబడి యుండును).

  1. “ఇంద్రియై రజితైర్నగ్నో దుకూలేనాపి సంవృతం |

తైరేవ సంవృతైర్గుప్తో న వస్త్రం కారణం స్మృతం ||“.

(ఇంద్రియములను జయించనివాడు బట్ట కట్టుకొనినను కట్టుకొననివాదే. ఇంద్రియజయముకలవానికి అవియే - ఇంద్రియ జయమే బట్ట. బట్టకట్టినంతమాత్రమున గోప్యముకాదు).

(నగ్నుండును, ధరుణుండునై చను తనకొడుకుం గని వస్త్రపరిధానంబొనరింపక, వస్త్రధారియు, వృద్ధుండునునైన తనుంజూచి చేలంబులు ధరియించు దేవరమణులంగని వ్యాసుండు గారణంబడిగిన వారలు “నీ పుత్రుండు స్త్రీపురుషులనెడి భేదదృష్టి లేకయుండు, మఱియునతడు నిర్వికల్పుండుగాన నీకు నతనికి మహాంతరంబుగలదనిరి”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 4 - 41)

(దీనిని బట్టి శుకుడు జితేంద్రియుడు ఎట్టి వాడో తెలియనగును). ఇది జితేంద్రియునకు ఒక ఉదాహరణ).

  1. “మాత్రా స్వస్రా దుహిత్రా వా న వివిక్తా సనో భవేత్ |

బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాన్సమపి కర్షితి ||“.

(తల్లితోగాని, చెల్లెలుతోగాని, కుమార్తెతోగాని ఎవరూలేనిచోట కలిసి ఒకే ఆసనముమీద కూర్చుండరాదు - - ఇంద్రియములు బలవంతములైనవి. విద్వాంసునికూడ బలవంతముగా విషయములందు ఆకర్షింపచేయును -)

“ఆ. అక్క, తల్లి, చెల్లెలాత్మజ యెక్కిన

పానుపెక్కజనదు పద్మనయన

పరమ యోగికైన బలిమిని నింద్రియ

గ్రామమధికపీడ గలుగజేయు“.

(ఎంత పండితుడైనను, నీతులు తెలిసినవాడైనను స్త్రీ ఒంటరిగా దొరికిన వావివరుసలు మరచెదరు).

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 9 - 19 - 582)

(ఇది పురుషుని గుఱించి చెప్పబడినది).

  1. “సుందర పురుషం దృష్ట్వా పితరం, భాతరం, సుతం |

యోనిర్ద్రవతి నారీణాం - - - ”

(ఇది స్త్రీనిగుఱించి చెప్పబడినది).

(తండ్రినిగాని, అన్నతమ్ములనుకాని, కొడుకునిగాని సుందరమైన పురుషుడైన యడల స్త్రీకి సంభోగేఛ్ఛ కలుగును).

“ఒకే ఇంద్రియమునకు లొంగి అధికమైన బాధలకు గురియగుచుండగా పంచేంద్రియములు తన స్వాధీనములోలేని యడల ఇంకా అధికమైన బాధలకు గురియగును -

“భుజంగమాతంగ పతంగ భృంగమీనాహతాః పంచభిరేవ పంచ |

ఏకః ప్రమాదీ స కథా సహన్యతే యః సేదతౌ పంచ భిరింద్రియాఇశ్చ ||“.

(పాము, ఏనుగు, మిడుతలు, తుమ్మెదలు, చేపలు - ఈ అయిదులో ఒక్కొక్కటి పంచేంద్రియములలోని ఒక్కొక్క ఇంద్రియమునకు లోబడినంతమాత్రమున బాధపడుచున్నవి. ఇట్లుండగా, పంచేంద్రియముల వశమై యున్నవాడు ఎంత బాధపడునో? నాగస్వరముయొక్క శబ్దమును వినుటయందు అసక్తిచేత పాము పాములవాడివలన బాధపడుచున్నది. పెంపుడు ఆడ ఏనుగు కొఱకు ఆసపడి అడవిలో స్వేచ్ఛగా తిరుగుచుండు మగ ఏనుగులు గోతిలోపడి స్వేచ్ఛపోగొట్టుకొనుచున్నవి. దీపమును చూచి ఫలమని భ్రమపడి రెక్కపురుగులు దానిలో ఆహుతియై చనిపోవుచున్నవి. చేపలు పట్టువాని గేలమునకు కట్టబడిన పురుగునకు అసించి చేపలు ఆ గేలమునకు తగులుకొని వానికి ఆహారమగుచున్నవి. కమలములందలి సువాసనకు తుమ్మెదలు ఆసించి వాటిని ఆశ్రయించి అవి మూసుకొనిపోగా వాటిలో చనిపోవుచున్నవి. పైన చెప్పినట్లు ఒక్కొక్క జీవి ఒక్కొక్క ఇంద్రియమునకు లోనై దాని విషయముకొఱకు ఆశపడి బాధపడుచున్నవి. శబ్ద, స్పర్శ, రూప రస గంధములను విషయములందాశచే శ్రోత్రము, త్వక్, చక్షువు, జిహ్వ, నాసిక అను ఇంద్రియములు ఒక్కొక్కటి ఆకర్షింపబడిన ఫలితము ఇట్లుండగా ఇంద్రియములు కలిసి మనస్సును వాటి విషయముల ప్రక్క లాగినప్పటి బాధ ఎంత అధికముగా నుండునో అందుచేత ఇంద్రియములను జయింపవలెను -.

చ. వనకరి చిక్కెమైనసకు, వాచవికిం జెడిపోయె మీను, దా

వినివికి జిక్కె జిల్వ, కనువేదుఱు జెందెను లేళ్ళు; తావిలో

మనకి నశించెదేటి; తరమా యిరు మూటిని గెల్వ? నైదు సా

ధనముల నీవె కావదగు దాశరధీ! కరుణాపయోనిధీ

Transliteration
  1. “yadā bāhyēṃdriyāṇi viṣayaiḥ sanni kṛṣyatē, tathā taddvārā manaḥ tatrapravartatē, pravṛttēca manasirāgō bhavati; tataḥ ātmanaḥ kṣōbhaḥ, ēvaṃ iṃdriyāṇāṃ avijayaḥ. yōhiyaṃ vyākulaṃ karōti, satēna jitaḥ ityucyatē yadā tu bāhyēṃdrīyāṇi viṣaya sannithānē api sataiḥ sannikṛṣyaṃtē, sanni kṛṣṭānnapi na manaḥ tathā bhi mukhyēnā haraṃti, āhṛtēpi manasi na viṣayarāvō jāyatē, tathā nātmanaḥ kṣōbhō bhavati ityēṣaḥ iṃdriyajayaḥ sōyaṃ saṃgrahēṇa dvithā :- bāhyēṃdriyāṇāṃ śakti kṣayānmanasō rāga kṣayācca; ētat dvayaṃca puruṣa bhēdēna ukta prakākāradvayēna nirāhāratva brahmasākṣātkārābhyāṃ bhavati ityēvaṃ iṃdriya jayasya mahā prayatnasādhyatvaṃ iti”.

(bāhyēṃdriyamulu viṣayamulacēta ākarṣiṃpabaḍunappuḍu manassu vāṭiyaṃdu pravartiṃcunu, appuḍu vāṭiyaṃdu anurāgamu kalugunu, dānivalana ātmaku kṣōbha kalugunu. ī prakāramugā iṃdriyamulanu jayiṃcuṭa kalugadu. evaru evarini vyākulapaṟacedarō, aṭlu vyākulapaḍinavāru vyākula paṟacinavāricē jayiṃpa baḍiri ani lōkamaṃdu prasiddhamē - bāhyēṃdriyamulu viṣayamula sannidhilō unnappaṭikī vāṭicē eppuḍu ākarṣiṃpabaḍavō - caliṃpavō - avi ākarṣiṃpabaḍinanu manassu vāṭiyaṃdu manassu pravartiṃpadō, manasu ākarṣiṃpabaḍinanu ā viṣayamulaṃdu anurāgamu kalugadō, appuḍu ātmaku kṣōbhamukalugadu. idiyē iṃdriya jayamu - idi saṃgrahamugā reṃḍu vidhamulu - bāhyēṃdriyamula śakti sannagiluṭavalana, manasulō anurāgamu kṣīṇiṃcuṭavalana - ī reṃḍunu puruṣulalō bhēdamuvalana āhāramu tinakapōvuṭavalanagāni, brahma sākṣātkāramuvalanagāni kalugunu - iṭlu iṃdriyajayamu goppa prayatnamuvalana samakūrunu).

  1. “kāma ēṣa krōdha ēṣa rajōguṇa samudbhavaḥ |

mahāśanōmahāpāpmā viddhyēnamiha vairiṇaṃ |

iṃdriyāṇi manōbuddhirasyādhiṣṭhānamucyatē |

ētarvi mōhā yatyēṣa jñānamāvṛtya dēhinaṃ |

tasmāt tvamiṃdriyāṇyādau niyamya bharatarṣabha |

pāpnānaṃ prajahi hyēnaṃ jñānavijñāna nāśanaṃ ||“. (śrīmadbhagavadgīta - 3 - 37, 40, 51)

“śṛṇu taṃvairiṇaṃ yaṃtvaṃ pṛcchasyatyaṃta russahaṃ |

balādanartha mārgē(a)smin kāma ēṣa pravartakaḥ |

sarvānartha pariprāptinimittaṃ śatrurātmanaḥ |

kēna ciddhētunā kāmaḥ pratibaddhaḥ sa ēvahi |

krōdhaḥ pariṇatō bhāti. tasmin kāmē vinivāritē |

sarva śrēyaḥ pariprāptiḥ tatō(a)sya śruṇukāraṇaṃ |

- - - jñātē śatrō radhisṭānē sajētuṃ śakyatē(a)jasā |

tada dhiṣṭā namēvāha samastānīṃdriyāṇica |

śabdādi grāhakā vacanādi karāṇi ca |

saṃkalpātmā manō jñēyaṃ buddhirniścaya rūpiṇī |

kāmasyahyāśrayaḥ yasmāt ētaiḥ sōpīṃdriyādibhiḥ |

svasvavyāpāravadbhistairāśrayai rmōha yatyasau |

vivēkajñānamāsādyamūḍhaṃ dēhābhi māninaṃ |

yatōsāviṃdriyādhāraḥ kāmō mōhāya dēhinaḥ |

tasmāttvaṃ mōhanātpūrvaṃ prāgvā kāma nirōdhataḥ |

śrōtrā dīnīṃdriyāṇyēna vaśīkṛtya suvaṃśaja |

pāpamūlaṃ ripuṃ kāmaṃ mārayainamaśēṣataḥ ||“. (gītābhāvaprakāśamu - 3 - 239 to 241; 270 to 275)

(anarthamulaku mūlamaina panulaṃdu iṣṭamulēkapōyinanu pāpakarmalu cēyuṭalō kāraṇamu kāmamu, krōdhamu - ivi rajōguṇamuvalana puṭṭinavi. ivi ī kāraṇamuvalananē puruṣuniki śatruvuvale prērēpiṃcucunnavi. ī kāmamu - kōrika - neṟavēruṭalō āṭaṃkamu vaccinayaḍala adi krōdhamukriṃda pariṇamiṃcunu. iṃdriyamulu, manassu, buddhi ī kāmamanu śatruvunaku adhiṣṭānamulu. dēhiyokka jñānamunu hariṃci vīṭicēta ī kāmamu mōhapeṭṭucunnadi. aṃducēta muṃdu iṃdriyamulanu jayiṃci jñānavijñānamulanu naśiṃpacēyu ī pāpi ayina kāmamunu jayiṃcumu. adhisṭānamunu jayiṃcinayaḍala dānini āśrayiṃciyunna kāmamunu jayiṃcavaccunu. aṃducēta muṃdu iṃdriyamulanu jayiṃcumu - nī svādhīnamulō nuṃcukonumu).

  1. “yatatō hyapi kauṃtēya puruṣaśca vipaścitaḥ |

iṃdriyāṇi pramādhīni haraṃti prasabhaṃ manaḥ |

tāni sarvāṇi saṃ yamya yukta asītamatparaḥ |

vaśē hi yasyēṃdriyāṇi tasya prajñā pratiṣṭitā ||“. (śrīmadbhagavadgīta - 2 - 60. 61)

“prajñā sthairyē parō hētuḥ sēṃdriya svāṃta nigrahaḥ |

tadabhāvē parāhāniḥ prajñā yā iti kadhyatē |

bhūyō bhūyōpi bhōgēṣu dōṣa dṛṣṭiṃ prakurvataḥ |

samyagvi vēkinō apyētanmānaḥ sthitamapi kṣaṇaṃ |

vikāraṃ prāpayaṃtyēnīṃdriyāṇi prasahyatat |

paśyatyēva balātkarāt svāminyapi vipaścati |

kṣōbhakāṇi balīyastvādvivēkasati rakṣakē |

praviṣṇuṃ tāni pracyāvya vivēka jamatō mataḥ |

viṣayāvēśa sāmarthyāt dharaṃtyēvēṃdriyāṇyadaḥ |

yadhā pramādhi naścōrāḥ prasahya dhaninō dhanaṃ |

haraṃtyēvaṃ manaḥ svē svē viṣayēṃdriyā ṇi vai |

ēvaṃtarhi pratīkāraḥ kastatrētyata āhataṃ |

tānīṃdriyāṇi dhīkarma sādhakānya khilānyapi |

samāhitō vaśīkṛtya nigṛhīta manaścasan |

nirvyāpāratayā tiṣṭhēnmāṃ samāśritya matparaḥ |

vāsadēvō hamēvēśō yasyōpādēya aṃtaraḥ |

sacāstyēkāṃta madbhaktō vaśīkartuṃ kṣamō akhilaṃ |

yathārājā namāśritya nigṛhyaṃ tēhi śatravaḥ |

rājāśritōyamityēvaṃ jñātvāvaśyā bhavaṃtitē |

bhagavaṃtaṃ tathāśritya tatprabhāvēna sarvaśaḥ |

nigṛhyāṇīṃ diyānyēvakṣōbhakāṇyapi yōginaḥ |

kṛṣṇāśritōyaṃ matvētthaṃ svayaṃ paścāni saṃ tivai |

māhātmyaṃ bhagavadbhaktēḥ sphuṭaṃ cāgrē bhaviṣyati |

iṃdriyāṇāṃ vaśīkārē phalamāha ramāpatiḥ |

vaśēhīti spaṣṭamidaṃ kimānītēti pṛccataḥ |

uttaraṃprōktamityēta dataḥ kṝtyaṃ yatēḥ śruṇu ||” (gītābhāvaprakāśamu - 2 - 594 to 606)

(iṃdriyamulatōkūḍa manassunu nigrahiṃcuṭa - tana vaśamulō nuṃcukonuṭa. sthitaprajñuḍu aguṭaku avasaramu - eṃta vivēkavaṃtuḍainanu, bhōgamulanu padē padē dvēṣiṃcuvāḍainanu atani manassunu atani iṃdriyamulu vikāramunu poṃda cēyunu, caliṃpacēyunu. balavaṃtamugā doṃgalu dhanavaṃtuni dhanamu napahariṃcurītini prajñāvaṃtuḍainavāni yokkamanassunu balavaṃtamulaina iṃdriyamulu vāṭi vāṭi viṣayamula viṣayamai lāgucuṃḍunu. dīniki pratīkāramēmanagā - iṃdriyamulumanōkarmasādhanamulu. aṃducēta samāhitamaina manassukalavāḍu, manassuni nigrahiṃci, tana ādhīnamulō nuṃcukoni, samasta vyāpāramulanu māni bhagavaṃtuni āśrayiṃci bhagavatparuḍai yuṃḍavalenu. vāsudēvuḍu - samasta dēhamulalōnu nivasiṃciyuṃḍuvāḍu - īśvaruḍu ayina nannu ēkāṃta bhakticēta bhajiṃcuvāḍu iṃdriyamulanu, manassunu, iṃdriyamulanu jayiṃcuṭaku śaktikaligiyuṃḍunu. rājunu āśrayiṃcinavārini cūci vāriśatruvulu vārini vaśamu cēsukonalēnaṭlu bhagavaṃtuni āśrayiṃcina yōgulu ā āśrayaṇaprabhāvamuvalana iṃdriyamulu tanaku kṣōbhakalugacēyucunnappaṭikī itanu bhagavaṃtuni āśrayiṃciyunnāḍu ani telusukoni ā iṃdriyamulē yōgikisvayamugā vaśamagunu. aṃducēta bhagavadbhaktivalana iṃdriyamulu vaśamagunu - iṃdriya jayamu kalugunu).

  1. “sī. kāmaharṣādi saṃghaṭitamai cittaṃbu bhavadīya ciṃtana vadali soradu

madhurādirasamula marigicokkucu jihva nīvarṇanamunaku niguḍanīdu

suṃdaramukhamula jūḍagōreḍi cūḍki tāvakākṛtulapai dagulu vaḍadu

vividha durbhāṣalu vinagōru vīnulu vinavu yuṣmatkathā viracanamulu

tē. ghrāṇa muravaḍi tirugu durgaṃdhamulaku

danuvu goluvadu vaiṣṇavadharmamulaku

naḍagiyuṃḍavu karmēṃdriyamulu, puruṣu

galacu; savatulu gṛhamēdhi galacunaṭlu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 9 - 363)

aṃducēta iṃdriyamulanu jayiṃcavalenu - tanavaśamulō nuṃcakonavalenu

  1. śṛtvā, sṛṣṭvā ca dṛṣṭvā ca bhuktvā ghrātvā ca yōnaraḥ |

na hṛṣyati; gāyati vā savi jñēyō jitēṃdriyaḥ ||“. (manuḥ)

(stōtramu cēsinanu, ānaṃdakaramaina mṛduvaina vastuvumu tākinanu, suṃdaramaina vastuvulanu cūcinanu, iṣṭamaina rucikaramaina āhāramu tininanu, suvāsanagala vastuvulanu cūcinanu saṃtōṣamupoṃdaka, kaṭhinamaina kaṣṭamunu kaligiṃcu vastuvu tākinanu, bhayaṃkaramaina vastuvulanu cūcinanu, iṣṭamukānivi, niṣēdhiṃpabaḍinavi yagu, anārōgyamu kalugacēyunavi agu bhōjyapadārthamulu tinavalasivaccinanu, duḥkhamu ceṃdaka, ī anni avasthala yaṃdu samamugā nuṃḍuvāḍu jitēṃdriyuḍu).

  1. “yathā samharatē cāyaṃ kūrmō(a) ogānīva sarvaśaḥ |

iṃdriyāṇīṃdriyārthēbhyaḥ tasya prajñā pratiṣṭitā ||“. (śrīmadbhagavadgīta - 2 - 58)

“vikṣiptānīṃdriyāṇyēṣa vyutthānēsati karmaṇā |

samastānīṃdriyārthēbhyaḥ śabdādibhyō yadā svayaṃ |

saṃkōcayati dhairyēṇa kūrmōṃgānīva sarva śaḥ |

samādhikālē tasyāsti prajñā samyakpṛtiṣṭhitā ||“. (gītābhāvaprakāśamu - 2 - 584 to 585)

(tanaśarīramulōnuṃḍi paiki vacci vāṭi panulu avi cēyucunna iṃdriyamulanu tābēlu tirigi tanaśarīramulōniki muḍucukonunaṭlu yōgi samādhilōnuṃḍi mēlkoninappuḍu bāhyaviṣayamulaṃdu tagulkonakuṃḍā tana iṃdriyamulanu vāṭi vṛttulanu cēyanīyakuṃḍā tanalōniki lāgukoni uṃcuvāḍu sthitaprajñuḍu).

  1. “madhukara rājanaṃ yathā makṣikāḥ calaṃta manucalaṃti sthita manusthitā bhavaṃti, tathā cittānusārīṇīṃdriyāṇi citta nirōdhē naiva nirudhyatē, na yatnāṃtarēṇa”.

(tēneṭīgalarāṇi pōyina sthalamunaku tēneṭīgalu anniyu pōvunu. ā īgarāṇi caliṃcina īgalanniyu caliṃcunu, īgarāṇi caliṃpakunna īgalanniyu māni nilucunu. ā vidhamugā iṃdriyamulanniyu cittamunu anusariṃci cariṃcunu - cittamu nirōdhiṃpabaḍinayaḍala iṃdriyamulukūḍa nirōdhiṃpabaḍi yuṃḍunu).

  1. “iṃdriyai rajitairnagnō dukūlēnāpi saṃvṛtaṃ |

tairēva saṃvṛtairguptō na vastraṃ kāraṇaṃ smṛtaṃ ||“.

(iṃdriyamulanu jayiṃcanivāḍu baṭṭa kaṭṭukoninanu kaṭṭukonanivādē. iṃdriyajayamukalavāniki aviyē - iṃdriya jayamē baṭṭa. baṭṭakaṭṭinaṃtamātramuna gōpyamukādu).

(nagnuṃḍunu, dharuṇuṃḍunai canu tanakoḍukuṃ gani vastraparidhānaṃbonariṃpaka, vastradhāriyu, vṛddhuṃḍununaina tanuṃjūci cēlaṃbulu dhariyiṃcu dēvaramaṇulaṃgani vyāsuṃḍu gāraṇaṃbaḍigina vāralu “nī putruṃḍu strīpuruṣulaneḍi bhēdadṛṣṭi lēkayuṃḍu, maṟiyunataḍu nirvikalpuṃḍugāna nīku nataniki mahāṃtaraṃbugaladaniri”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 4 - 41)

(dīnini baṭṭi śukuḍu jitēṃdriyuḍu eṭṭi vāḍō teliyanagunu). idi jitēṃdriyunaku oka udāharaṇa).

  1. “mātrā svasrā duhitrā vā na viviktā sanō bhavēt |

balavān iṃdriya grāmō vidvānsamapi karṣiti ||“.

(tallitōgāni, cellelutōgāni, kumārtetōgāni evarūlēnicōṭa kalisi okē āsanamumīda kūrcuṃḍarādu - - iṃdriyamulu balavaṃtamulainavi. vidvāṃsunikūḍa balavaṃtamugā viṣayamulaṃdu ākarṣiṃpacēyunu -)

“ā. akka, talli, cellelātmaja yekkina

pānupekkajanadu padmanayana

parama yōgikaina balimini niṃdriya

grāmamadhikapīḍa galugajēyu”.

(eṃta paṃḍituḍainanu, nītulu telisinavāḍainanu strī oṃṭarigā dorikina vāvivarusalu maracedaru).

(śrīmadāṃdhramahābhāgavatamu - 9 - 19 - 582)

(idi puruṣuni guṟiṃci ceppabaḍinadi).

  1. “suṃdara puruṣaṃ dṛṣṭvā pitaraṃ, bhātaraṃ, sutaṃ |

yōnirdravati nārīṇāṃ - - - ”

(idi strīniguṟiṃci ceppabaḍinadi).

(taṃḍrinigāni, annatammulanukāni, koḍukunigāni suṃdaramaina puruṣuḍaina yaḍala strīki saṃbhōgēchcha kalugunu).

“okē iṃdriyamunaku loṃgi adhikamaina bādhalaku guriyagucuṃḍagā paṃcēṃdriyamulu tana svādhīnamulōlēni yaḍala iṃkā adhikamaina bādhalaku guriyagunu -

“bhujaṃgamātaṃga pataṃga bhṛṃgamīnāhatāḥ paṃcabhirēva paṃca |

ēkaḥ pramādī sa kathā sahanyatē yaḥ sēdatau paṃca bhiriṃdriyāiśca ||“.

(pāmu, ēnugu, miḍutalu, tummedalu, cēpalu - ī ayidulō okkokkaṭi paṃcēṃdriyamulalōni okkokka iṃdriyamunaku lōbaḍinaṃtamātramuna bādhapaḍucunnavi. iṭluṃḍagā, paṃcēṃdriyamula vaśamai yunnavāḍu eṃta bādhapaḍunō? nāgasvaramuyokka śabdamunu vinuṭayaṃdu asakticēta pāmu pāmulavāḍivalana bādhapaḍucunnadi. peṃpuḍu āḍa ēnugu koṟaku āsapaḍi aḍavilō svēcchagā tirugucuṃḍu maga ēnugulu gōtilōpaḍi svēcchapōgoṭṭukonucunnavi. dīpamunu cūci phalamani bhramapaḍi rekkapurugulu dānilō āhutiyai canipōvucunnavi. cēpalu paṭṭuvāni gēlamunaku kaṭṭabaḍina purugunaku asiṃci cēpalu ā gēlamunaku tagulukoni vāniki āhāramagucunnavi. kamalamulaṃdali suvāsanaku tummedalu āsiṃci vāṭini āśrayiṃci avi mūsukonipōgā vāṭilō canipōvucunnavi. paina ceppinaṭlu okkokka jīvi okkokka iṃdriyamunaku lōnai dāni viṣayamukoṟaku āśapaḍi bādhapaḍucunnavi. śabda, sparśa, rūpa rasa gaṃdhamulanu viṣayamulaṃdāśacē śrōtramu, tvak, cakṣuvu, jihva, nāsika anu iṃdriyamulu okkokkaṭi ākarṣiṃpabaḍina phalitamu iṭluṃḍagā iṃdriyamulu kalisi manassunu vāṭi viṣayamula prakka lāginappaṭi bādha eṃta adhikamugā nuṃḍunō aṃducēta iṃdriyamulanu jayiṃpavalenu -.

ca. vanakari cikkemainasaku, vācavikiṃ jeḍipōye mīnu, dā

viniviki jikke jilva, kanuvēduṟu jeṃdenu lēḷḷu; tāvilō

manaki naśiṃcedēṭi; taramā yiru mūṭini gelva? naidu sā

dhanamula nīve kāvadagu dāśaradhī! karuṇāpayōnidhī

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.