← Back to ఇ · Booklets 11–20 (digitized file 2)

ఇంద్రియాగోచరుడు iṃdriyāgōcaruḍu

Original — తెలుగు
  1. నేత్రము చేతగాని,వాక్కుచేతగాని గ్రహింపబడనివాడు - కంటికి కనబడనివాడు కనుక ఇటివంటివాడని చెప్పుటకు వీలుకానివాడు; అందుచేత నోటితో ఎటువంటివాడో చెప్పుటకు వీలుకానివాడు.

  2. వాఙ్మన సయో రగోచరః - ” యతోచాచో నివర్తంతే అప్రాప్య మనసా సః ” యత్ర సవిశేషత్వం తత్రవాఙ్మనస గోచరత్వం.

(వాక్కు మనసు భగవంతుని పొందలేక తిరిగివచ్చినవి - అనగా చెప్పుటకుగాని - ఇటువంటివాడని మనసులో ఆలోచించుటకు గాని వీలులేనివాడు). (విశేషములున్నపుడే వాక్కునకు మనస్సునకు అందుబాటులోనుండును. భగవంతుడు నిర్విశేషుడు - విశేషములు లేనివాడు - అవయవములు లేనివాడు రూపములేనివాడు - అందుచేత వాక్కునకు, మనస్సునకు అందనివాడు).

Transliteration
  1. nētramu cētagāni,vākkucētagāni grahiṃpabaḍanivāḍu - kaṃṭiki kanabaḍanivāḍu kanuka iṭivaṃṭivāḍani ceppuṭaku vīlukānivāḍu; aṃducēta nōṭitō eṭuvaṃṭivāḍō ceppuṭaku vīlukānivāḍu.

  2. vāṅmana sayō ragōcaraḥ - ” yatōcācō nivartaṃtē aprāpya manasā saḥ ” yatra saviśēṣatvaṃ tatravāṅmanasa gōcaratvaṃ.

(vākku manasu bhagavaṃtuni poṃdalēka tirigivaccinavi - anagā ceppuṭakugāni - iṭuvaṃṭivāḍani manasulō ālōciṃcuṭaku gāni vīlulēnivāḍu). (viśēṣamulunnapuḍē vākkunaku manassunaku aṃdubāṭulōnuṃḍunu. bhagavaṃtuḍu nirviśēṣuḍu - viśēṣamulu lēnivāḍu - avayavamulu lēnivāḍu rūpamulēnivāḍu - aṃducēta vākkunaku, manassunaku aṃdanivāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.