← Back to ఇ · Booklets 11–20 (digitized file 2)

ఇంద్రియసర్గము iṃdriyasargamu

Original — తెలుగు

జ్ఞానకర్మేంద్రియాత్మకో యః ఇంద్రియ సర్గః స చ చతుర్థః సర్గః.

“జ్ఞానేంద్రియంబులైన త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణంబులు, కర్మేంద్రియంబులైన వాక్పాణి పాయూపస్థములను దశవిధ ఇంద్రియ జననంబు చతుర్ధ సర్గము” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 10 - 344)

(సృష్టిలో ఉన్న ప్రతివస్తువు క్షణక్షణమునకు మార్పుచెందుచుండును. అందుచేతనే దీనిని ‘జగత్తు’ అని చెప్పుచున్నారు - పురుష ప్రకృతుల సంయోగమువలన ఈ మార్పు కలుగుచున్నవి. ఈ మార్పులు ఆగకుండ జరుగుచున్నవి. అట్టి మార్పులలో ముఖ్యమైన ఘట్టములు సర్గములు అని చెప్పబడినవి - అట్టి సర్గములలో ఇంద్రియములు పుట్టుట నాలుగవ సర్గము).

Transliteration

jñānakarmēṃdriyātmakō yaḥ iṃdriya sargaḥ sa ca caturthaḥ sargaḥ.

“jñānēṃdriyaṃbulaina tvak cakṣu śrōtra jihva ghrāṇaṃbulu, karmēṃdriyaṃbulaina vākpāṇi pāyūpasthamulanu daśavidha iṃdriya jananaṃbu caturdha sargamu” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 10 - 344)

(sṛṣṭilō unna prativastuvu kṣaṇakṣaṇamunaku mārpuceṃducuṃḍunu. aṃducētanē dīnini ‘jagattu’ ani ceppucunnāru - puruṣa prakṛtula saṃyōgamuvalana ī mārpu kalugucunnavi. ī mārpulu āgakuṃḍa jarugucunnavi. aṭṭi mārpulalō mukhyamaina ghaṭṭamulu sargamulu ani ceppabaḍinavi - aṭṭi sargamulalō iṃdriyamulu puṭṭuṭa nālugava sargamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.