← Back to ఇ · Booklets 11–20 (digitized file 2)

ఇతిహాసములు itihāsamulu

Original — తెలుగు
  1. ఇతి ఏవం, హా పూర్వం, ఆస అస్తీత్యర్థః.

(‘ఇతి’ అనగా ఈ ప్రకారము, ‘హా’ అనగా పూర్వము, అస్తి అనగా కలదు - ఈ ప్రకారముగా పూర్వము జరిగినది, కలిగినది. పూర్వము జరిగిన సంగతులను చెప్పునదికనుక ఇతిహాసములని చెప్పబడినవి).

  1. పురావృత్తః, సకలార్థ ప్రతిపాదకః.

(పరంపరగా చెప్పుకొనుచూ వచ్చునది, పూర్వకాలమునకు సంబంధించినది - చతుర్విధ పురుషార్థములను ప్రతిపాదించు పురాణకధ).

  1. “శ్లో||. ధర్మార్థకామమోక్షాణాం ఉపదేశ సమన్వితం |

పూర్వ వృత్తం కథాయిక్తం ఇతిహాసం ప్రచక్షతే ||“.

(ధర్మార్థకామమోక్షములను నాలుగు విధముల పురుషార్థములను ఉపదేశించునది. పూర్వము జరిగి, పూర్వమునుండి చెప్పుకొనుచున్న కథలలో కూడియున్నది).

  1. “ఇతి హ అస్మి అస్తీతి” ఇతిహాసః.

(పూర్వ రాజులు మొదలైనవారి కధలు ఇందులోకలవు - ఆ కథలను తెలుపునది).

  1. “అస్య మహతో భూతస్య నిశ్శ్వసితమే వైతత్ యదృగ్వేదో యజుర్వేదస్సామవేదో (అ)ధర్వాంగిరస ఇతిహాసః పురాణంవిద్యా ఉపనిషదః సూత్రాణి”. (బృహదారణ్యకోపనిషత్ - 2 - 4 - 10)

(మహాభూతమైన భగవంతునియొక్క నిశ్వాసమే ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము, ఇతిహాసములు, ఉపనిషత్తులు, సూత్రములు - అనగా, సృష్టి అంతయు పుట్టినట్లే భగవంతునినుండి ఇవన్నియు, సునాయాసముగ, ప్రయత్నము చేయనక్కరలేకనే పైకి వదలు ఊపిరివలె గలిగినవి).

  1. “పంచంవేదంబగు ఇతిహాస పురాణంబులు సర్వముఖంబులం గలిగె” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 12 - 388)

  2. పాంచరాత్రం భారతం చ మూలరామాయణం తథా |

ఇతిహాస ఇతి ప్రోక్తం బ్రహ్మాద్యంచ పురాణకం ||“.

(పాంచరాత్రము, భారతము, రామాయణము ఇవి ఇతిహాసములు - బ్రాహ్మము మొదలగునవి పురాణములు).

  1. “ఇతిహాస పురాణాభ్యాం వేదం సమవ బృమ్హ యేత్”

(ఇతిహాసపురాణములచేత వేదమును అన్వయించుకోవలెను -)

  1. “వేదాశ్చేతిహాసాశ్చ పురాణం భాగవతం తథా |

మూలప్రమాణముద్దిష్టం మీమాంసా చ తధోత్తరా |

యతేషామ విరోధేతు మాన మన్యదుదీరితం |

యేతేషాం తు విరుద్ధం యద ప్రమాణం విదో విదుః ||’.

(వేదములు. ఇతిహాసములు, భాగవతపురాణము, ఉత్తరమీమాంస, ఇవి ప్రమాణగ్రంధములు. వీటికి విరోధముకానివి - వీటికి వ్యతిరేకముగా బోధించునవి అప్రమాణము అని పండితులు తెలుసుకొనిరి).

Transliteration
  1. iti ēvaṃ, hā pūrvaṃ, āsa astītyarthaḥ.

(‘iti’ anagā ī prakāramu, ‘hā’ anagā pūrvamu, asti anagā kaladu - ī prakāramugā pūrvamu jariginadi, kaliginadi. pūrvamu jarigina saṃgatulanu ceppunadikanuka itihāsamulani ceppabaḍinavi).

  1. purāvṛttaḥ, sakalārtha pratipādakaḥ.

(paraṃparagā ceppukonucū vaccunadi, pūrvakālamunaku saṃbaṃdhiṃcinadi - caturvidha puruṣārthamulanu pratipādiṃcu purāṇakadha).

  1. “ślō||. dharmārthakāmamōkṣāṇāṃ upadēśa samanvitaṃ |

pūrva vṛttaṃ kathāyiktaṃ itihāsaṃ pracakṣatē ||“.

(dharmārthakāmamōkṣamulanu nālugu vidhamula puruṣārthamulanu upadēśiṃcunadi. pūrvamu jarigi, pūrvamunuṃḍi ceppukonucunna kathalalō kūḍiyunnadi).

  1. “iti ha asmi astīti” itihāsaḥ.

(pūrva rājulu modalainavāri kadhalu iṃdulōkalavu - ā kathalanu telupunadi).

  1. “asya mahatō bhūtasya niśśvasitamē vaitat yadṛgvēdō yajurvēdassāmavēdō (a)dharvāṃgirasa itihāsaḥ purāṇaṃvidyā upaniṣadaḥ sūtrāṇi”. (bṛhadāraṇyakōpaniṣat - 2 - 4 - 10)

(mahābhūtamaina bhagavaṃtuniyokka niśvāsamē ī ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu, adharvaṇavēdamu, itihāsamulu, upaniṣattulu, sūtramulu - anagā, sṛṣṭi aṃtayu puṭṭinaṭlē bhagavaṃtuninuṃḍi ivanniyu, sunāyāsamuga, prayatnamu cēyanakkaralēkanē paiki vadalu ūpirivale galiginavi).

  1. “paṃcaṃvēdaṃbagu itihāsa purāṇaṃbulu sarvamukhaṃbulaṃ galige” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 12 - 388)

  2. pāṃcarātraṃ bhārataṃ ca mūlarāmāyaṇaṃ tathā |

itihāsa iti prōktaṃ brahmādyaṃca purāṇakaṃ ||“.

(pāṃcarātramu, bhāratamu, rāmāyaṇamu ivi itihāsamulu - brāhmamu modalagunavi purāṇamulu).

  1. “itihāsa purāṇābhyāṃ vēdaṃ samava bṛmha yēt”

(itihāsapurāṇamulacēta vēdamunu anvayiṃcukōvalenu -)

  1. “vēdāścētihāsāśca purāṇaṃ bhāgavataṃ tathā |

mūlapramāṇamuddiṣṭaṃ mīmāṃsā ca tadhōttarā |

yatēṣāma virōdhētu māna manyadudīritaṃ |

yētēṣāṃ tu viruddhaṃ yada pramāṇaṃ vidō viduḥ ||’.

(vēdamulu. itihāsamulu, bhāgavatapurāṇamu, uttaramīmāṃsa, ivi pramāṇagraṃdhamulu. vīṭiki virōdhamukānivi - vīṭiki vyatirēkamugā bōdhiṃcunavi apramāṇamu ani paṃḍitulu telusukoniri).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.