← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జడము jaḍamu

Original — తెలుగు
  1. యత్ కార్యం తత్ జడం; అంతఃకరణం, ఇంద్రియాణి చ జడాని, తైః కస్యాపి వస్తునః ప్రకాశో నశ్యాత్. ఆత్మైవ సర్వపదార్థానాం ప్రకాశకః.

(ఏది కార్యమో అది జడము. అంత ఃకరణము, ఇంద్రియములు జడములు. అవి యేవస్తువునైనను ప్రకాశింపచేయలేవు. ఆత్మ అన్ని పదార్థములలోనుండి వాటిని ప్రకాశింపచేయును. వాటి వాటి పనులలో వాటిని నియమించి చేయించును).

  1. బుద్ధి రహితం; అర్థవిచార చాతుర్య రహితం; విద్యాది రహితం; కృత్యా కృత్య వివేక శూన్యం.

(బుద్ధి లేనిది; అర్థవిచారము చేయు చాతుర్యము లేనిది; ఇది చేయవలసినది, ఇది చేయరానిది అను వివేకము లేనిది, విద్య - బ్రహ్మవిద్య - మొదలగునవి లేనివాడు).

  1. మందః ; మూర్ఖః. (మందమైనది, మూర్ఖుడు, మూఢుడు).

  2. భగవత్స్వరూపం అజాననః. (భగవత్స్వరూపమును తెలియనివాడు).

  3. యన్మాత్మా తజ్జడం, యథా ఘటాది. (ఆత్మ కానిది జడము, - ఘటము మొదలగునవి).

  4. చేతనారహితం అచేతనః

(స్వతహా చైతన్యము లేనిది - చైతన్యము (చిత్పదార్థము) లేనిదే లోకములో ఏ పదార్థమైనను ఏ కార్యమును దానంతట అది చేయలేదు. అందుచేత అవి జడములు).

  1. జన్మ (పుట్టుట), అస్తిత్వము (ఉనికి), వృద్ధి (పెరుగుట), పరిణామము (మార్పు), అపక్షయము (తరుగుట), వినాశము (నశించుట) అను ఆరును షడ్భావ వికారములు. ఇవి కలది జడము (అవి ఆత్మకు లేవుకనుక ఆత్మ జడము కాదు).

  2. “దేహస్తానజ్జడో మూఢో నాహమిత్యేవ నిశ్చయః |

కర్మేంద్రియ గణశ్చాస్మాద్భిన్నో జడ ఏవ సః ||“. (వాసిష్టే)

అస్మాద్దేహాద భిన్నః ఇతి జడ ఏవ ఇత్యర్థః -

(దేహము జడము. అది నేను కాదు, దేహముకంటె వేరుకానివి కర్మేద్రియములు. అందుచేత అవికూడ జడములే).

  1. “బుద్దీంద్రియ గణోప్యేవం జడ ఏ వేతి నిశ్చయః ప్రేర్యతే మనసా | యస్మాద్యేష్ట్యేవ భువి లోష్టకః ||”.

“బుద్ధీంద్రియగణో పి యష్టాలోష్టక ఇవ మనసా యస్మాత్ ప్రేర్యతే, తస్మాత్ జడ ఏవేతి నిశ్చయః ఇత్యర్థః”.

(జ్ఞానేంద్రియములు మొదలగునవి జడములు. అవి మనసుచేత ప్రేరేపించబడి పనులు చేయుచున్నవి).

  1. “మనశ్చైవం జడం మన్యే సంకల్పాత్మక శక్తిమత్ |

క్షేపణైరివ పాషాణాః ప్రేర్యతే బుద్ధి నిశ్చ యైః ||“.

“సంకల్పాత్మకశక్తిమత్ మనశ్చ క్షేపణైః పాషాణ ఇవ బుద్ధి కృతైర్నిశ్చ యైః ప్రేర్యతే ఇతి జడం మన్యే”.

(సంకల్పశక్తిగల మనస్సు జడమే - బుద్ధిచేత ప్రేరేపించ బడుచున్నదికనుక).

  1. “బుద్ధిర్నిశ్చ యరూపైవం జడమేతి వి నిశ్చయః |

ఖాతౌ నేవ సరిత్కూలమహంకారేణ చాల్యతే ||“.

“ఖనేన జనితశ్వభ్రేణ సరిత్కూలమివ అహంకారేణ చాల్యతే ప్రేర్యతే ఇతి జడైవేతి నిశ్చయః”.

(నిశ్చ యరూపమైన బుద్ధి జడము. ఇది అహంకారముచేత ప్రేరేపించబడుచున్నది - అందుచేత జడము).

  1. “అహంకారోపి నిస్సారో జడ ఏవ శవాత్మకః |

జీవేన జన్యతే యక్షో బాలేనేవ భ్రమాత్మకః ||“.

“నిస్సారః, విపరీతజ్ఞాన రూపత్వాత్ నిస్సత్వః, చేష్టా రహితత్వాత్ శవాత్మకః |

అహంకారో అపి బాలేన భ్రమాత్మకో యక్ష ఇవ జీవేన జన్యతే, కల్ప్యతే ఇతి జడ ఏవ”.

(అహంకారము విపరీత జ్ఞానము గలదగుటచేత శవమువలె సత్వములేనిది. అది జీవునిచేత కల్పించబడుచున్నది. అందుచేత జడము).

  1. “లోకంబున వేదంబులందు గ్రాహ్యరూపంబైన వస్తువు యాచ్యమానంబగుచుండ నెవ్వండొసంగం డెవ్వండిందు దయమానంబగుచుండం గోరండట్టి వీరలిద్దరును జడస్వభావులని సత్పురుషులు శోకంబు నొందుచుందురు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 27 - 815)

(వేద రహస్యమైన బ్రహ్మజ్ఞానమును అధికారియైనశిష్యుడు తెలుసుకొన గోరినవానికి ఆ బ్రహ్మ విద్యను నేర్పుటకు నిరాకరించిన గురువున్నూ, ఆ బ్రహ్మవిద్య నేర్పుదునని గురువు చెప్పినప్పటికీ నేర్చుకొనుటకు ఇష్టపడనివాడునూ - ఈ ఇద్దరు జడులు, జడస్వభావము గలవారు).

Transliteration
  1. yat kāryaṃ tat jaḍaṃ; aṃtaḥkaraṇaṃ, iṃdriyāṇi ca jaḍāni, taiḥ kasyāpi vastunaḥ prakāśō naśyāt. ātmaiva sarvapadārthānāṃ prakāśakaḥ.

(ēdi kāryamō adi jaḍamu. aṃta ḥkaraṇamu, iṃdriyamulu jaḍamulu. avi yēvastuvunainanu prakāśiṃpacēyalēvu. ātma anni padārthamulalōnuṃḍi vāṭini prakāśiṃpacēyunu. vāṭi vāṭi panulalō vāṭini niyamiṃci cēyiṃcunu).

  1. buddhi rahitaṃ; arthavicāra cāturya rahitaṃ; vidyādi rahitaṃ; kṛtyā kṛtya vivēka śūnyaṃ.

(buddhi lēnidi; arthavicāramu cēyu cāturyamu lēnidi; idi cēyavalasinadi, idi cēyarānidi anu vivēkamu lēnidi, vidya - brahmavidya - modalagunavi lēnivāḍu).

  1. maṃdaḥ ; mūrkhaḥ. (maṃdamainadi, mūrkhuḍu, mūḍhuḍu).

  2. bhagavatsvarūpaṃ ajānanaḥ. (bhagavatsvarūpamunu teliyanivāḍu).

  3. yanmātmā tajjaḍaṃ, yathā ghaṭādi. (ātma kānidi jaḍamu, - ghaṭamu modalagunavi).

  4. cētanārahitaṃ acētanaḥ

(svatahā caitanyamu lēnidi - caitanyamu (citpadārthamu) lēnidē lōkamulō ē padārthamainanu ē kāryamunu dānaṃtaṭa adi cēyalēdu. aṃducēta avi jaḍamulu).

  1. janma (puṭṭuṭa), astitvamu (uniki), vṛddhi (peruguṭa), pariṇāmamu (mārpu), apakṣayamu (taruguṭa), vināśamu (naśiṃcuṭa) anu ārunu ṣaḍbhāva vikāramulu. ivi kaladi jaḍamu (avi ātmaku lēvukanuka ātma jaḍamu kādu).

  2. “dēhastānajjaḍō mūḍhō nāhamityēva niścayaḥ |

karmēṃdriya gaṇaścāsmādbhinnō jaḍa ēva saḥ ||“. (vāsiṣṭē)

asmāddēhāda bhinnaḥ iti jaḍa ēva ityarthaḥ -

(dēhamu jaḍamu. adi nēnu kādu, dēhamukaṃṭe vērukānivi karmēdriyamulu. aṃducēta avikūḍa jaḍamulē).

  1. “buddīṃdriya gaṇōpyēvaṃ jaḍa ē vēti niścayaḥ prēryatē manasā | yasmādyēṣṭyēva bhuvi lōṣṭakaḥ ||”.

“buddhīṃdriyagaṇō pi yaṣṭālōṣṭaka iva manasā yasmāt prēryatē, tasmāt jaḍa ēvēti niścayaḥ ityarthaḥ”.

(jñānēṃdriyamulu modalagunavi jaḍamulu. avi manasucēta prērēpiṃcabaḍi panulu cēyucunnavi).

  1. “manaścaivaṃ jaḍaṃ manyē saṃkalpātmaka śaktimat |

kṣēpaṇairiva pāṣāṇāḥ prēryatē buddhi niśca yaiḥ ||“.

“saṃkalpātmakaśaktimat manaśca kṣēpaṇaiḥ pāṣāṇa iva buddhi kṛtairniśca yaiḥ prēryatē iti jaḍaṃ manyē”.

(saṃkalpaśaktigala manassu jaḍamē - buddhicēta prērēpiṃca baḍucunnadikanuka).

  1. “buddhirniśca yarūpaivaṃ jaḍamēti vi niścayaḥ |

khātau nēva saritkūlamahaṃkārēṇa cālyatē ||“.

“khanēna janitaśvabhrēṇa saritkūlamiva ahaṃkārēṇa cālyatē prēryatē iti jaḍaivēti niścayaḥ”.

(niśca yarūpamaina buddhi jaḍamu. idi ahaṃkāramucēta prērēpiṃcabaḍucunnadi - aṃducēta jaḍamu).

  1. “ahaṃkārōpi nissārō jaḍa ēva śavātmakaḥ |

jīvēna janyatē yakṣō bālēnēva bhramātmakaḥ ||“.

“nissāraḥ, viparītajñāna rūpatvāt nissatvaḥ, cēṣṭā rahitatvāt śavātmakaḥ |

ahaṃkārō api bālēna bhramātmakō yakṣa iva jīvēna janyatē, kalpyatē iti jaḍa ēva”.

(ahaṃkāramu viparīta jñānamu galadaguṭacēta śavamuvale satvamulēnidi. adi jīvunicēta kalpiṃcabaḍucunnadi. aṃducēta jaḍamu).

  1. “lōkaṃbuna vēdaṃbulaṃdu grāhyarūpaṃbaina vastuvu yācyamānaṃbagucuṃḍa nevvaṃḍosaṃgaṃ ḍevvaṃḍiṃdu dayamānaṃbagucuṃḍaṃ gōraṃḍaṭṭi vīraliddarunu jaḍasvabhāvulani satpuruṣulu śōkaṃbu noṃducuṃduru” (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 27 - 815)

(vēda rahasyamaina brahmajñānamunu adhikāriyainaśiṣyuḍu telusukona gōrinavāniki ā brahma vidyanu nērpuṭaku nirākariṃcina guruvunnū, ā brahmavidya nērpudunani guruvu ceppinappaṭikī nērcukonuṭaku iṣṭapaḍanivāḍunū - ī iddaru jaḍulu, jaḍasvabhāvamu galavāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.