యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః |
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం |
తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్టితం ||
ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతీహయః |
అఘాయురింద్రియా రామోమోఘం పార్థ సజీవతి ||“. (శ్రీమద్భగవద్గీత - 3 - 15 to 17)
“అన్నాత్ (భుక్తాత్) లోహితరేతః పరిణతాత్ భూతాని జాయంతే (ప్రత్యక్షం భవతి); పర్జన్యాత్ (వృష్టేః) అన్యస్య సంభవః; యజ్ఞాత్ భవతి పర్జన్యః; యజ్ఞః కర్మ సముద్భవః (ఋత్విగ్య జమానయోః చ వ్యాపారః కర్మ, తతః సముద్భవః); తత్కర్మ బ్రహ్మోద్భవం (బ్రహ్మ వేదః సః ఉద్భవః ప్రకాశకః యస్య తత్ కర్మ); బ్రహ్మ (వేదాఖ్యం బ్రహ్మ) అక్షరసముద్భవం (అక్షరః పరమాత్మా) (సాక్షాత్పరమాఖ్యాత్ అక్షరాత్ పురుషాత్ నిశ్వాసవత్సముద్భూతం బ్రహ్మ)” (శ్రీశంకరః)
(తినిన అన్నము రక్తమాంసములుగాను, రేతస్సుగాను మారుటచేత భూతములు - ప్రాణులు- పుట్టు చున్నవి. అన్నము మేఘములవలన (మేఘములు కురియు వర్షమువలన) కలుగుచున్నది.యజ్ఞమును చేయు వాడు, చేయించువాడు అను ఇద్దరు చేసిన కర్మ యజ్ఞము - ఇట్టి యజ్ఞమువలన మేఘము కలుగుచున్నది. ఈ యజ్ఞమను కర్మ వేదములో చెప్పబడినది. వేదము బ్రహ్మను ప్రకాశింపచేయునది. ఆ వేదము పరమాత్మ వలన కలిగినది).
శరీరాణి ప్రజాయంతే శృష్టేరన్నస్య జన్మ చ |
యజ్ఞా ద్ధర్మాద పూర్వాఖ్యా జ్జాయతే వృష్టి రర్కతః |
అగ్నే ప్రాప్తాహుతిః సమ్యగాదిత్యముపతిష్టతే |
ఆదిత్యాజ్జాయతే వృష్టిర్వృష్టే రన్నం తతః ప్రజాః |
సూక్ష్మో ధర్మః సయజ్ఞాఖ్య ఋత్విగాదేశ్చ కర్మణః |
అపూర్వాఖ్యస్య యజ్ఞస్య విహితంకర్మకారణం |
- - - అతోప్య తీంద్రియో ధర్మో (అ)నుష్ఠే యో వేద భోధితః |
- - - ఆదౌ సర్వేశ్వరా ద్వేనః, కర్మజ్ఞానన్ తతో భవేత్ ||
తతో ధర్మస్తతో నుష్టానతో వృష్టిస్తతః పరం|
అన్న మన్నాచ్ఛరీ రాణి పునస్తేషాం తదైవ చ |
కర్మప్రవృత్తి రిత్యేవ మీశ్వరేణ ప్రవర్తితం
జగన్నిర్వాహకం చక్రం మూఢో యో నాను తిష్టతి |
సపాప జీవితో వ్యర్థమేవ జీవతి కేవలం ||“. (గీతాభావప్రకాశము - 3 - 91 to 94, 101 to 103)
(శుక్రశోణితములు అన్నముగా మారును. అట్టి అన్నము (తిని) వలన శరీరములు కలుగుచున్నవి. అన్నము.- సస్యములు వర్షము వలన కలుగుచున్నవి. అపూర్వమను కర్మ(యజ్ఞము) వలన అపూర్వము అను ధర్మము ననుసరించి సూర్యుడు కారణముగా వర్షములు కురియుచున్నవి. అగ్నిలో ఆహుతి చేసినది సూర్యుని పొందుచున్నది. సూర్యునివలన వర్షము కురియుచున్నది. అన్నమువలన ప్రజలు కలుగు చున్నారు. పైన చెప్పిన యజ్ఞమను కర్మ ఋత్కిక్కు మొదలగువారు చేయు కర్మ. అపూర్వమను పేరు గల ఈ కర్మకారణము ఇది సూక్ష్మమైన ధర్మము - ఇంద్రియములకు గోచరము కానిది. ఇది వేదములో చెప్ప బడినది. అందుచేత అనుష్టింపవలసినదే. ఎందుచేతననగా మొదట భగవంతుని నుండి వేదము పుట్టినది, దానినుండి కర్మజ్ఞానము, దానినుండి ధర్మము, ఆ ధర్మముననుష్టించుటవలన వర్షము, వర్షము వలన అన్నము, అన్నము(తిని)వలన శరీరములు కలుగుచున్నవి - మరల అన్నము తినుటవలన శరీరములు - ఇట్లు చక్రమువలె ఈ కర్మ చేయుట, దాని ఫలితము కలుగుట మరల మరల కలుగుచున్నవి. ఇది భగ వంతునివలన చక్రము తిరుగునట్లు ప్రవర్తింపచేయబడుచున్నది. అందుచేత నిది జగత్తు చక్రరీతిగా తిరుగుచున్నదికాన జగచ్చక్రమనిచెప్పబడినది. ఇట్లు ఈ జగచ్చక్రమును నిర్వర్తించనివాడు పాపాత్ముడు. వాడు జీవించియుండుట వ్యర్థము).
వజ్రి సంతసింప వాన గురియు
వాన గురి యగ నవు వసుమతి బెరుగును
గసవుమేసి ధేనుగుణము బ్రతుకు.”
“క. ధేనువులు బ్రతికెనేనియు
మానక ఘనమైన పాడిమందల గలుగున్
నూనముగ బాడి కలిగిన
మానవులును సురలు దనిసి మనుదురు పుత్రా” (శ్రీమదాంధ్రమహాభాగవతము -10 - పూ. భా. 883, 884)
yajñāt bhavati parjanyō yajñaḥ karma samudbhavaḥ |
karma brahmōdbhavaṃ viddhi brahmākṣara samudbhavaṃ |
tasmāt sarvagataṃ brahma nityaṃ yajñē pratiṣṭitaṃ ||
ēvaṃ pravartitaṃ cakraṃ nānu vartayatīhayaḥ |
aghāyuriṃdriyā rāmōmōghaṃ pārtha sajīvati ||“. (śrīmadbhagavadgīta - 3 - 15 to 17)
“annāt (bhuktāt) lōhitarētaḥ pariṇatāt bhūtāni jāyaṃtē (pratyakṣaṃ bhavati); parjanyāt (vṛṣṭēḥ) anyasya saṃbhavaḥ; yajñāt bhavati parjanyaḥ; yajñaḥ karma samudbhavaḥ (ṛtvigya jamānayōḥ ca vyāpāraḥ karma, tataḥ samudbhavaḥ); tatkarma brahmōdbhavaṃ (brahma vēdaḥ saḥ udbhavaḥ prakāśakaḥ yasya tat karma); brahma (vēdākhyaṃ brahma) akṣarasamudbhavaṃ (akṣaraḥ paramātmā) (sākṣātparamākhyāt akṣarāt puruṣāt niśvāsavatsamudbhūtaṃ brahma)” (śrīśaṃkaraḥ)
(tinina annamu raktamāṃsamulugānu, rētassugānu māruṭacēta bhūtamulu - prāṇulu- puṭṭu cunnavi. annamu mēghamulavalana (mēghamulu kuriyu varṣamuvalana) kalugucunnadi.yajñamunu cēyu vāḍu, cēyiṃcuvāḍu anu iddaru cēsina karma yajñamu - iṭṭi yajñamuvalana mēghamu kalugucunnadi. ī yajñamanu karma vēdamulō ceppabaḍinadi. vēdamu brahmanu prakāśiṃpacēyunadi. ā vēdamu paramātma valana kaliginadi).
śarīrāṇi prajāyaṃtē śṛṣṭērannasya janma ca |
yajñā ddharmāda pūrvākhyā jjāyatē vṛṣṭi rarkataḥ |
agnē prāptāhutiḥ samyagādityamupatiṣṭatē |
ādityājjāyatē vṛṣṭirvṛṣṭē rannaṃ tataḥ prajāḥ |
sūkṣmō dharmaḥ sayajñākhya ṛtvigādēśca karmaṇaḥ |
apūrvākhyasya yajñasya vihitaṃkarmakāraṇaṃ |
- - - atōpya tīṃdriyō dharmō (a)nuṣṭhē yō vēda bhōdhitaḥ |
- - - ādau sarvēśvarā dvēnaḥ, karmajñānan tatō bhavēt ||
tatō dharmastatō nuṣṭānatō vṛṣṭistataḥ paraṃ|
anna mannāccharī rāṇi punastēṣāṃ tadaiva ca |
karmapravṛtti rityēva mīśvarēṇa pravartitaṃ
jagannirvāhakaṃ cakraṃ mūḍhō yō nānu tiṣṭati |
sapāpa jīvitō vyarthamēva jīvati kēvalaṃ ||“. (gītābhāvaprakāśamu - 3 - 91 to 94, 101 to 103)
(śukraśōṇitamulu annamugā mārunu. aṭṭi annamu (tini) valana śarīramulu kalugucunnavi. annamu.- sasyamulu varṣamu valana kalugucunnavi. apūrvamanu karma(yajñamu) valana apūrvamu anu dharmamu nanusariṃci sūryuḍu kāraṇamugā varṣamulu kuriyucunnavi. agnilō āhuti cēsinadi sūryuni poṃducunnadi. sūryunivalana varṣamu kuriyucunnadi. annamuvalana prajalu kalugu cunnāru. paina ceppina yajñamanu karma ṛtkikku modalaguvāru cēyu karma. apūrvamanu pēru gala ī karmakāraṇamu idi sūkṣmamaina dharmamu - iṃdriyamulaku gōcaramu kānidi. idi vēdamulō ceppa baḍinadi. aṃducēta anuṣṭiṃpavalasinadē. eṃducētananagā modaṭa bhagavaṃtuni nuṃḍi vēdamu puṭṭinadi, dāninuṃḍi karmajñānamu, dāninuṃḍi dharmamu, ā dharmamunanuṣṭiṃcuṭavalana varṣamu, varṣamu valana annamu, annamu(tini)valana śarīramulu kalugucunnavi - marala annamu tinuṭavalana śarīramulu - iṭlu cakramuvale ī karma cēyuṭa, dāni phalitamu kaluguṭa marala marala kalugucunnavi. idi bhaga vaṃtunivalana cakramu tirugunaṭlu pravartiṃpacēyabaḍucunnadi. aṃducēta nidi jagattu cakrarītigā tirugucunnadikāna jagaccakramaniceppabaḍinadi. iṭlu ī jagaccakramunu nirvartiṃcanivāḍu pāpātmuḍu. vāḍu jīviṃciyuṃḍuṭa vyarthamu).
vajri saṃtasiṃpa vāna guriyu
vāna guri yaga navu vasumati berugunu
gasavumēsi dhēnuguṇamu bratuku.”
“ka. dhēnuvulu bratikenēniyu
mānaka ghanamaina pāḍimaṃdala galugun
nūnamuga bāḍi kaligina
mānavulunu suralu danisi manuduru putrā” (śrīmadāṃdhramahābhāgavatamu -10 - pū. bhā. 883, 884)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.