← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జగదాభాసము jagadābhāsamu

Original — తెలుగు

లేని జగత్తు ఉన్నట్లు తోచుట - అభాసమనగా వాస్తవము కాకపోయినను పైకి వాస్తవమైన దానివలె కనబడునది. వాస్తవముగా జగత్తు భగవంతుని పరిణామమే - సృష్టి అంతటిలోను భగవంతునికంటె వేరైనవస్తువు లేదు, భగవంతుడుకాని వస్తువులేదు - అన్ని వస్తువులు భగవంతునిలోనుండి - ఒక దానిలో నుండి ఒకటిగా పుట్టినవే. ఆ పుట్టిన అన్నింటిలోను భగవంతుడు ప్రవేశించి తానే ఆ వస్తువులన్నింటిగా ఆయెను - “తత్ సృష్ట్వాత దేవాను ప్రావిశతు, తదనుప్రనిశ్యసచ్చత్యచ్చాభవత్”అందుచేత వస్తువులన్నియు భగవంతుని రూపములే. జగత్తంతా భగవంతుడే, వేరేమియు లేదు –

క. “హరిమయము విశ్వమంతయు

హరి విశ్వమయుండు; సంశయము పనిలేదా

హరి మయముగాని ద్రవ్యము

పరమాణువు లేదు వంశపావన ! వింటే“. (పోతన తెలుగు భాగవతము - 2-17)

పారమార్థికముగా జగత్తు అనగా ఇంతే. కాని వ్యావహారికముగాజగత్తు, జగత్తులోని వస్తువులు, వేరు వేరుగా కనబడుచున్నవి. జగత్తు భగవంతునికంటె వేరుకాకపోయి వేరుగా జగత్తుగా కనిపించుట జగదాభాసము.

Transliteration

lēni jagattu unnaṭlu tōcuṭa - abhāsamanagā vāstavamu kākapōyinanu paiki vāstavamaina dānivale kanabaḍunadi. vāstavamugā jagattu bhagavaṃtuni pariṇāmamē - sṛṣṭi aṃtaṭilōnu bhagavaṃtunikaṃṭe vērainavastuvu lēdu, bhagavaṃtuḍukāni vastuvulēdu - anni vastuvulu bhagavaṃtunilōnuṃḍi - oka dānilō nuṃḍi okaṭigā puṭṭinavē. ā puṭṭina anniṃṭilōnu bhagavaṃtuḍu pravēśiṃci tānē ā vastuvulanniṃṭigā āyenu - “tat sṛṣṭvāta dēvānu prāviśatu, tadanupraniśyasaccatyaccābhavat”aṃducēta vastuvulanniyu bhagavaṃtuni rūpamulē. jagattaṃtā bhagavaṃtuḍē, vērēmiyu lēdu –

ka. “harimayamu viśvamaṃtayu

hari viśvamayuṃḍu; saṃśayamu panilēdā

hari mayamugāni dravyamu

paramāṇuvu lēdu vaṃśapāvana ! viṃṭē”. (pōtana telugu bhāgavatamu - 2-17)

pāramārthikamugā jagattu anagā iṃtē. kāni vyāvahārikamugājagattu, jagattulōni vastuvulu, vēru vērugā kanabaḍucunnavi. jagattu bhagavaṃtunikaṃṭe vērukākapōyi vērugā jagattugā kanipiṃcuṭa jagadābhāsamu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.