← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జగద్యోనిః jagadyōniḥ

Original — తెలుగు
  1. “మమస్వరూప భూతా మదీయా మాయా త్రిగుణాత్మికా ప్రకృతిః యోనిః సర్వభూతానాం కారణం. సర్వకార్యే భ్యః మహత్వాత్ కారణత్వాత్ బృమ్హణత్వాచ్చ స్వవికారాణాం మహత్ బ్రహ్మ ఇతి యోనిరేవ విశిష్యతే” (శ్రీశంకరః)

(నా స్వరూపమే - భగవంతుని స్వరూపమే అయినటువంటిన్నీ, సత్వ రజ స్తమోగుణములు కలదిన్నీ,నా మాయయగు ప్రకృతియే సమస్త భూతములకు యోని, జన్మకారణము. ప్రకృతి యొక్క వికారములయిన సమస్త కార్య వస్తువులకన్న గొప్పదైనది, కారణమైనదిన్నీ, పెద్దదిన్నీ -జగత్తుగా వృద్ధిపొందునదిన్నీ అగుటచేత మహత్ బ్రహ్మ, అని ఆ యోనియే చెప్పబడుచున్నది).

  1. “జగత్పితృత్వేన అవస్థితస్య స్వస్య గర్భాదానక్షమ సాక్షా ద్వికారిద్రవ్యం యోని శబ్దేన వివక్షితం”. (శ్రీవేదాంత దేశికః)

(జగత్తును సృష్టించుటచేత జగత్తుకు తండ్రి అయిన తన గర్భాదానమునకు తగిన - భరించగలిగిన - వికారములు పొందు - అనేక వస్తువులుగా మారకలుగు - ద్రవ్యము యోని యని చెప్పబడినది).

  1. “కృత్స్నస్య జగతః యోనిభూతం మమ మహద్బ్రహ్మ –

“భూమి రా పో అనలోవాయుః ఖం మనో బుద్ధి రేవచ |

అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టథా |

అపరేయం - - ||“.

ఇతి నిర్దిష్టా అచేతన ప్రకృతిః

మహదహంకారాది వికారాణాం కారణతయా మహద్బ్రహ్మ ఇత్యుచ్యతే ||” (శ్రీమాన్ రామానుజః)

(భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి అని యెనిమిది విధములుగనున్న ప్రకృతి యని చెప్పబడు నా అపరా శక్తి (అపరాప్రకృతి) యైనదిన్నీ, అచేతనమైనదిన్నీ (inert), మహత్తత్వము, అహంకారము మొదలగు దాని వికారములగువాటికి కారణమైనదగుటవలననా మహద్బ్రహ్మ అని చెప్పబడునదే జగత్తు అంతటికీ యోని అయినది).

  1. “యమ యోనిర్మహద్బ్రహ్మ - - - అహం భీజప్రదః పితా ||”. (శ్రీమద్భగవద్గీత - 14 - 3, 4)

(చూడుము : - ‘జగత్కారణము’ - 6 - 2).

Transliteration
  1. “mamasvarūpa bhūtā madīyā māyā triguṇātmikā prakṛtiḥ yōniḥ sarvabhūtānāṃ kāraṇaṃ. sarvakāryē bhyaḥ mahatvāt kāraṇatvāt bṛmhaṇatvācca svavikārāṇāṃ mahat brahma iti yōnirēva viśiṣyatē” (śrīśaṃkaraḥ)

(nā svarūpamē - bhagavaṃtuni svarūpamē ayinaṭuvaṃṭinnī, satva raja stamōguṇamulu kaladinnī,nā māyayagu prakṛtiyē samasta bhūtamulaku yōni, janmakāraṇamu. prakṛti yokka vikāramulayina samasta kārya vastuvulakanna goppadainadi, kāraṇamainadinnī, peddadinnī -jagattugā vṛddhipoṃdunadinnī aguṭacēta mahat brahma, ani ā yōniyē ceppabaḍucunnadi).

  1. “jagatpitṛtvēna avasthitasya svasya garbhādānakṣama sākṣā dvikāridravyaṃ yōni śabdēna vivakṣitaṃ”. (śrīvēdāṃta dēśikaḥ)

(jagattunu sṛṣṭiṃcuṭacēta jagattuku taṃḍri ayina tana garbhādānamunaku tagina - bhariṃcagaligina - vikāramulu poṃdu - anēka vastuvulugā mārakalugu - dravyamu yōni yani ceppabaḍinadi).

  1. “kṛtsnasya jagataḥ yōnibhūtaṃ mama mahadbrahma –

“bhūmi rā pō analōvāyuḥ khaṃ manō buddhi rēvaca |

ahaṃkāra itīyaṃ mē bhinnā prakṛti raṣṭathā |

aparēyaṃ - - ||“.

iti nirdiṣṭā acētana prakṛtiḥ

mahadahaṃkārādi vikārāṇāṃ kāraṇatayā mahadbrahma ityucyatē ||” (śrīmān rāmānujaḥ)

(bhūmi, nīru, agni, vāyuvu, ākāśamu, manassu, buddhi ani yenimidi vidhamuluganunna prakṛti yani ceppabaḍu nā aparā śakti (aparāprakṛti) yainadinnī, acētanamainadinnī (inert), mahattatvamu, ahaṃkāramu modalagu dāni vikāramulaguvāṭiki kāraṇamainadaguṭavalananā mahadbrahma ani ceppabaḍunadē jagattu aṃtaṭikī yōni ayinadi).

  1. “yama yōnirmahadbrahma - - - ahaṃ bhījapradaḥ pitā ||”. (śrīmadbhagavadgīta - 14 - 3, 4)

(cūḍumu : - ‘jagatkāraṇamu’ - 6 - 2).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.