(తిరుగునది. ఒక నిముషమైనను స్థిరముగా నుండనిది. క్షణక్షణము మార్పు చెందునది).
(కదలునది, చలించునది, పరిభ్రమణము చేయునది, పరిణమించునది మార్పులు కలది).
(స్థావరములు, జంగమములు, చరములు, అచరములు, కదలనివి, కదలునవి - ఇవన్నియు కలిసి యున్నది జగత్తు).
(జగత్తులోనివస్తువులన్నియు కలిసి జగత్తు అని చెప్పబడుచున్నది. ఈ వస్తువులన్నియు భగవంతునిలో నుండి - ఒకదానిలోనుండి ఒకటిగా - పుట్టినవి - భగవంతునిలోనుండి పుట్టుటచేత ఇవన్నియు భగవంతుని రూపములే. వ్యవహారముకొఱకు వాటికి వేరు వేరు నామములు పెట్టబడినవి. అందుచేత భగవంతుని రూపములు వాటినామములుకల వస్తువులన్నియు కలిసి జగత్తు అని చెప్పబడుచున్నది. ఇట్లు భగవంతుని నామరూపములు కలిసిజగత్తు అనునది వేరేలేదు. అందుచేత జగత్తు అనగా భగవంతుని నామ రూపములే).
(పదునాలుగు లోకములు కలిసియున్నది జగత్ - ఈ పదునాలుగులోకంబులేవి యనగా :” చతుర్దశ లోకంబులు కలిసిన జగత్తు పరబ్రహ్మ రూపమే - శరీరమే - అయినందున, ఆ శరీరావయవములు లోకములని చెప్పబడినవి - అది ఎట్లనగా - “చతుర్దశలోకంబులందు మీది ఏదు లోకంబులు మహా విష్ణువునకు గటి ప్రదేశముననుండి యూర్ధ్వదేహమనియును, క్రింది ఏడు లోకంబులు జఘనంబుననుండి యధో దేహమనియు బలుకుదురు - - - భూలోకంబు గటి పర్యంతప్రదేశంబు, భువర్లోకంబు నాభి, సువ ర్లోకంబు హృదయంబు, మహర్లోకంబు వక్షంబు, జనలోకంబు గ్రీవంబు, తపోలోకంబు స్తనద్వయంబు, సనాతనంబును, బ్రహ్మనివాసంబునునైన సత్యలోకంబు శిరంబు, గటిప్రదేశంబు తలంబు, తొడలు వితలంబు జానువులు సుతలంబు, జంఘలు తలాతలంబు, గుల్ఫంబులు మహాతలంబు, పాదాగ్రంబులు రసాతలంబు, పాదతలంబు పాతాళంబునని లోకమయుంగా భావింతురు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 89)
ఆద్యత్రయం బ్రహ్మరూపం నామరూపాత్మకం జగత్“.
(అస్తి = ఉన్నది, భాతి = ప్రకాశించునది, ప్రియం = ప్రియమైనది ఆనందకరమైనది; రూపము; నామము అనునవి అంశ పంచకము - అయిదు అంశలు, భగవంతుని అంశలు. ‘అస్తి’ ఉన్నది ఒక్క భగవంతుడే - మూడుకాలములందుండువాడు. అందుచేత ‘సత్’ - సత్యము - అని చెప్పబడుచున్నాడు, భాతి = భగ వంతుడు. చిద్రూపుడు - స్వయముగా ప్రకాశించువాడు. ప్రియం = భగవంతుడు పరమానందస్వరూపుడు - మోక్షరూపుడైనవాడు. వైకుంఠుడే వైకుంఠము, వైకింఠమే వైకుంఠుడు. అందుచేత ఈ మూడు అంశలు - అస్తి, భాతి, ప్రియం అనునవి - సచ్చిదానందములు - భగవంతుని తత్వము తెలియచేయునవి. మిగిలినవి రెండు అంశలు - రూపము, నామము - భగవంతునిలోనుండి - ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టినవగుట చేత ఈ జగత్తులోని వస్తువులన్నియు - రూపము, నామము గలవన్నియు భగవంతుని రూపములే. వాటి నామములన్నియు భగవంతుని నామములే. అవన్నియు అతని అంశలే - ఈ రెండు అంశలు జగత్తు - అందు చేత జగత్తు అంతయు భగవంతుడే, భగవంతుడు కానిది లేదు.
- (ఈ ప్రపంచమంతుయు - ఈ జగత్తు అంతయు పురుషుడే - పరబ్రహ్మమే).
(ఇదంతా బ్రహ్మమే - ఈ జగత్తంతా బ్రహ్మమే).
(నీవు చిద్రూపుడవు. ఈ జగత్తు నీకంటె భిన్నమైనదికాదు - నీకంటె వేరైనదికాదు).
“విష్ణుండు విశ్వంబు, విష్ణుని కంటెను వేరేమియును లేదు -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 5 - 65)
“నాకు నన్యమొకటి లేదు| సృష్టికాలమందు సృష్టినాశంబున |
జగము మత్స్వరూపమగును, వత్స |” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 9 -)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 13 - 288)
(జగత్తు అను రూపముతో పరబ్రహ్మమే ప్రకాశించుచున్నాడు).
ద్రష్టవ్యమాత్మవత్తస్మాత్ అవిభేదేన విచక్షణైః ||” (ఇతి విష్ణుపురాణే)
(సర్వభూతములు తానే అయిన విష్ణువే ఈ సర్వ ప్రపంచముగా విస్తరించియున్నాడు - జగత్తు అంతా విస్త రించిన విష్ణువే. అందుచేత జగత్తునకు విష్ణువునకు భేదము లేనట్లు తెలుసుకొనవలెను. O.F - వామనావతారము.
యథా న సంభవత్యేవం న జగత్ పృథగీశ్వరాత్ ||” (యోగవాశిష్టము - 60 - 4)
(బంగారముతోచేసిన ఆభరణములు బంగారముకంటె వేరుకానట్లు, నీటిలోని కెరటములు నీటికంటె వేరుకానట్లు జగత్తు ఈశ్వరునికంటె వేరుకాదు).
శివస్వరూప మేవాహు రిదం సర్వం విచక్షణాః |
సర్వస్వ రూపమజ్ఞానాద్దృశ్యతే నతు వస్తుతః |
ఏష ఏవ హి మంత్రార్థ ః సత్యం సత్యం న చాన్య థా |
వేదాః సర్వ పురాణాని స్మృతయో భారతం తథా |
అన్యాన్యాపి చ శాస్త్రాణి తథా తర్కిశ్చ సర్వ శః |
శైవాగమాశ్చ వివిధాః ఆగమా వైష్ణవా అపి |
అన్యాగమాశ్చ విదుషా మను భూతిశ్చ త దైవచ |
అస్మిన్నిర్థేస్వ సంవేద్యే పర్య వశ్యంతి నాన్య థా ||“.
- - -“కించ శివ ఏవ స్యాభిన్నపరశక్త్యా సహితస్సన్
ఈశ్వర సదాశివ రూపేణ సకలం జగత్సృష్ట్వాసర్వ స్వరూపేణవర్తతే.
“- -” ఈశ్వరాదికం సకలం
వస్తు శివ ఏవేతి యః పశ్యతి స ఏవ కృతార్థః ” (సూత సమ్హితాయాం)
(అనేక ప్రకారములుగా చెప్పుటవలన ప్రయోజనములేదు - శివుని కన్న - పరమాత్మకన్న - వేఱొకటి లేదు - విచక్షుణులైనవారు - సర్వమును తెలిసినవారు, పరబ్రహ్మతత్వమును తెలిసినవారు - ఇదంతయూ (ఈ జగత్తంతయు శివునిస్వరూపమే, ఈ సమస్త వస్తువులు వేరువేరు రూపములుగా కనబడుట అజ్ఞానమువలననే కాని, యధార్థముగా కాదు. ఇదియే మంత్రముల యొక్క అర్థము, ఇదే నిజము. ఇతరము నిజముకాదు. వేదములు, పురాణములు, స్మృతులు, భారతము, ఇతర శాస్త్రములు, తర్కశాస్త్రము, శైవాగమములు, వైష్ణవాగమములు, ఇతర ఆగమములు, విద్వాంసుల అనుభవము - ఇవన్నియు ఈ ప్రకారముగానే తెలియ చేయుచున్నవి, ఈ యర్థమునే చెప్పుచున్నవి, మఱొకవిధముగా కాదు. వ్యవహారమందు భేదమున్నను వాటి సారాంశమిదియే, ఇదియే వేదార్థమని నిశ్చయింపబడినది).
తథా సర్వ తయా భాతి శివస్సర్వావ భాసకః |
కటకాది విభాగేన యథా హేమప్రకాశతే |
తథా సర్వతయాభాతి శివస్సర్వావభాసకః |
- - అంధకారశ్చ ప్రకాశశ్చ యథా (ఆ)కాశే ప్రకాశతే |
జడాకడమిదం సర్వం తథాభాతి పరాత్మని | - - (సూతసమ్హితాయాం)
“కార్య ప్రపంచస్య కారణబ్రహ్మాత్మకత్వం దృష్టాం - తైరుపపాదయతి - యథా ఏకైవ మృత్తికా ఘటా శరా వాది నానా కార్యాత్మనా భసతే, తథా పరశివో పి మాయోపాధివశాత్ సకల జగదాత్మనా భాసతే |
యథా స్వప్న ద్రష్టా తైజసః ఆత్మోపాధివశాత్ నానావిధస్వప్న పదార్థాకారో భవతి, తథా అద్వితీయః ఈశ్వరోపి స్వ మాయావశాత్ నానాకార జగదాత్మకో భవతీత్యర్థః. యధా ఏకస్మన్నేవ నిరవయవే ఆకాశే ఉపాధివశా పరికల్పితభేదే తమః ప్రకాశౌ యుగపత్ భాసతే, తద్విదుపాధి పరికల్పిత భేదే వరశివస్యరూపే చేతనా చేతనాత్మక ప్రపంచో పి వ్యవస్థి తస్సన్ ప్రకాశతే. సర్వస్యాపి కార్య ప్రపంచస్య కారణమాత్రావశేషే స్పష్టం నిదర్శనం - మహానూర్మిర్వోచిః స ఏవ వశాత్ భగ్నస్తరంగః. యథా ఏకస్మిన్నేవ సముద్రే వీచీ తరంగ బుద్బుద్యాకార విశేషాః (ప్రతీతి సమయే (అ)వభాసతే పునస్త త్త్రైవ లీయతే, ఏవం పరశివస్వ రూపే (అ)పి ఆకాశాది భూత భౌతి కాద్యాత్మికాం ఆకాశాది విశేషాః స్వమాయా వశాత్ భాసంతే, తదైవ తత్రలీయంతే చ ||“.
(ఈ ప్రపంచమంతయు కార్యము. దీనికి కారణమైనవాడు భగవంతుడు. కార్యమగు ఈ ప్రపంచమునకు పరబ్రహ్మ ఎట్లు కారణమాయెనో ఉదాహరణములతో ఈ క్రిందను చెప్పబడుచున్నది : -మట్టి ఒకటే అయినప్పటికీ అదియే కుండ, మూకుడు మొదలగు వస్తువులుగా మారుచున్నది. ఆ ప్రకారముగానే పరమేశ్వరుడు (పరబ్రహ్మ) కూడా మాయ యను ఉపాధితో కూడియుండుటవలన ఈ సమస్త జగత్తువలె తానే అగుచున్నాడు. ఎట్లు స్వప్నమును కనిన తైజసుడు ఆత్మోపాధివలన స్వప్నములోని నానా విధములైన ఆకారములుగా అగుచున్నాడు. ఎట్లు ఒకటే అయిన ఆకాశమునందు ఒకచోట చీకటి ఇంకొక చోట వెలుతురు (తేజస్సు) ఉపాధికారణముగా కలుగుచున్నవో, అట్లే అద్వితీయుడైన పరమాత్మయందు ఉపాధిని బట్టి అనేకమైన రూపములుగల - చేతనా చేతనములుగల జగత్తు ప్రకాశించుచున్నది. ఎట్లు ఒకటే అయిన సముద్రమునందు, కెరటములు, బుడగలు ఎట్లు దానిలోనే పుట్టి దానిలోనే లీనమగునో అట్లే పరబ్రహ్మ స్వరూపమందు భూతములు, భౌతికములు మొదలగు ఆకార విశేషములు కలుగుచు పోవుచున్నవి.
(ఈ జగత్త్తంతయు భగవంతుని శరీరమే యగుటచేత భగవన్మయమే అయి యున్నది. పరబ్రహ్మమయమే యగుటచేత బ్రహ్మకు మారుపేరు జగత్తు)
క. “హరిమయము విశ్వమంతయు
హరి విశ్వమయుండు సంశయము పనిలేదా
హరిమయముగాని ద్రవ్యము
పరమాణువులేదు, వంశపావన వింటే“. (పోతన తెలుగు భాగవతము - 2-17)
(“విశ్వం నారాయణం దేవం” అని మంత్రపుష్పములో చెప్పియుండుటచేత శ్రీమన్నారాయణుడే జగత్తు అనితెలియవచ్చుచున్నది. “విశ్వం విష్ణుర్వషట్కారో” అని విష్ణు సహస్రనామములను బట్టిన్నీ, జగత్తు నారాయణుడే అయినందున అతని పేరే విశ్వమనికూడ చెప్పబడియున్నది).”విశ్వమే వేదం పురుషః” (మంత్ర పుష్పము)
ఈ జగత్తు అంతయు పురుషుడే - పరమపురుషుడే - పరబ్రహ్మమే.
“విశ్వేశ్వర, విశ్వరూప” (శ్రీమద్భగవద్గీత - 11 - 16)
(జగత్తే రూపముగా గలవాడు)
జగత్త్రయ మిదం సర్వం చిన్మాత్రం స్వ విచారతః ||“. (మహోపనిషత్, - వరాహోపనిషత్)
(మరుభూమిని యున్న జలమంతయు మరుభూమాత్రమే - అట్లే విచారించగా ఈ మూడు జగములు అన్నియు చిన్మాత్రమే - చైతన్యమాత్రమే - చిన్మాత్రుడైన భగవంతుడే).
(పరమశివుడే - పరబ్రహ్మమే - తనకన్న వేఱుకాని పరాశక్తితో కూడినవాడై ఈశ్వరుడు, సదాశివుడు అను రూపములతో ఈ సమస్త జగత్తును సృష్టించి అన్ని రూపములతో తానే ప్రవర్తించుచున్నాడు. ఈశ్వరుడు మొదలగు వస్తువులన్నీ - జగత్తులో ఉన్న వస్తువులన్నీ - శివుడే యని - పరబ్రహ్మమే యని - ఎవడు చూచునో, నమ్మకము కలిగి వర్తించునో అతడే కృతార్థుడు).
ఆత్మనో తథా భిన్నం విశ్వమాత్మ వినిర్గతం |
తం తు మాత్రో భవేదేవ పటో య ద్వద్విచారితః |
ఆత్మ తన్మాత్రమే వేదం తద్వద్విశ్వం విచారితం |
- - ఆత్మా జ్ఞానాత్ జగద్భాతి ఆత్మజ్ఞానాన్న భాసతే |
రజ్జ్వ జ్ఞానా దహిర్భాతి తత్ జ్ఞాద్భాసతే నహి |
ప్రకాశోమే నిజం రూపంచ నాతి రిక్తోస్మ్యహం తతః |
యథా ప్రకాశతే విశ్వం తథాహం భాస ఏవహి ||” (అష్టావక్రగీత - 2 - 4 to 8)
(నీటిలోనుండి పుట్టిన కెరటములు, నురగ, బుడగలు నీటికన్న వేరుకానట్లు, ఆత్మలోనుండి పుట్టిన జగత్తు ఆత్మకన్న వేరుకాదు. దారములతో నేయబడిన బట్ట దారములకన్న వేరుకాదు. ఆ ప్రకారముగానే జగత్తు ఆత్మమాత్రమేకాని ఆత్మకంటెవేరుకాదు. ఆత్మజ్ఞానము లేకపోవుట వలన - అనగా జగత్తు ఆత్మయే అను జ్ఞానము లేకపోవుటవలన - జగత్తు అనునది ఆత్మకన్న వేరైనదని తోచును. బ్రహ్మజ్ఞానము కలుగగనే - ఈ జగత్తు అంతయు బ్రహ్మమే యని తె లియగనే జగత్తు అనునది వేరే లేదు అను నిజము తెలియును. చీకటిలో త్రాడునుచూచి పాము అనుకొని, అది పాముకాదు త్రాడు అను జ్ఞానము కలుగగనే అది పాము అను భ్రాంతి పోవును. భగవంతుని నిజరూపము దానికన్న వేరైనవాడుకాడు. జగత్తు నావలననే ప్రకాశించుచున్నది - జగత్తువలె - జగత్తురూపములో - నేనే ప్రకాశించుచున్నాను).
(ప్రపంచమును సృష్టించి దానిలోనే - దానిలోనున్న అన్ని వస్తువులలోను - ప్రవేశించెను - అట్లు ప్రవేశించి ‘సత్’, ‘త్యత్’ అను రెండును - ఆత్మవస్తువు, అనాత్మవస్తువుగా తానే మారెను. అందుచేత జగత్తు అంతా - అందులోనున్న వస్తువులన్నింటితో కలిసి - భగవద్రూపమే అయినది - అందుచేతనే పరబ్రహ్మకంటె ఇతరమైన వస్తువు ఏదియును లేదు - ఉన్నదంతా - జగత్తు అంతా - అతనే - అద్వయుడు).
(భగవంతుని నిజరూపమును కప్పిపుచ్చి అనేక విధములైన, చిత్ర విచిత్రములైన విక్షేపములను చేయగలిగినటువంటిన్నీ, సత్తు అని గాని అసత్తు అని గాని నిర్ణయించుటకు వీలు కానటువంటి, అనాద్య విద్య, మాయ అను దోషముచేత నిర్విశేషుడు, స్వయంప్రకాశుడు అయిన పరబ్రహ్మయందు ఈ జగత్తు కల్పించబడినది).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 -12 -)
(చైతన్యమాత్రుడైన పరబ్రహ్మమే నేను - ఈ జగత్తు అంతయు నావలనే చైతన్యమాత్రుడైన భగవంతుడే - జగత్తు అని వేరుగా కనుపించుట ఇంద్రజాలము - మాయ).
“సకల జంతువులున్నూ కత్మఫలస్వరూపమంతే కాని వేరే జగత్తనేది లేదు. అంకురాదిపుష్ప ఫలాంతమైన వృక్షప్రపంచమున్నూ బీజంబువల్ల స్ఫురించేది యేలాగో అలాగే సుఖదుఃఖ్యాద్యనుభవ రూపమైన మాయా శక్తి యనెడి బీజమందు (జగత్తు) స్ఫురించింది”. (బ్రహ్మవిద్యా సుధార్ణవము - 4)
“సమస్త జగంబును జీవరూపంబున ధ్రువంబును దేహరూపంబున నధ్రువంబునైయుండు. మఱియొక్క పక్షంబున ధ్రువంబు నధ్రువంబును గాకయుండు. శుద్ధ బ్రహ్మ స్వరూపంబున ననిర్వచనీయంబై రెండునై యుండు”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము -1-13 -288)
(నాశరహితుడున్నూ, సర్వమునకు అధిష్టానమైనటువంటి వాడున్నూ అయిన పరబ్రహ్మను తెలుసుకొనలేనంతకాలము (బ్రహ్మజ్ఞానము కలగనంతకాలము) ముచ్చెపు చిప్ప వెండి వలె ప్రకాశించునట్లు (కనబడినట్లు) ఈ జగత్తు సత్యమైనదానివలె ప్రకాశించును. జ్ఞాన ము కలిగినతర్వాత ముచ్చెపుచిప్ప వెండికాదు ముచ్చెపు చిప్పయే అని తెలుసుకొనినట్లు బ్రహ్మజ్ఞానము కలుగగానే ఈ జగత్తు అంతా బ్రహ్మమేకాని జగత్తు అనేది వేరే లేదు అని తెలియవచ్చును. అంతవఱకు అది జగత్తేయని యనుకొనుట భ్రమయే).
(జగత్తు ‘సత్’ అయినచో నశించునదికాదు, ‘అసత్’ అయినచో ఉండునదికాదు, అందుచేత ‘సత్’ కంటె ‘అసత్’ కంటె వేరు లక్షణముకలది).
(ఈ సృష్టిలో ప్రకృతి, పురుషుడు అను రెండు తత్వములున్నవి. పురుషుడు అనగా “పురిశయనాత్ పురుషః”
పురమందు శయనించువాడు - భగవంతుడు - పురుషుడు లేక పరమ పురుషుడు సృష్టి చేయతలచి, కుమ్మరివాడు కుండలు చేయుటకు మట్టి చేకూర్చుకొనినట్లు, తన శక్తిని ప్రకృతిగా మొదట (matter) సృష్టించెను - ప్రకృతి జడము. అందుచేత తనచైతన్యశక్తితో భగవంతుడు ప్రకృతిలో ప్రవేశించి దానిని చైతన్యవంతముగా చేసెను - అప్పుడు ప్రకృతిలోనుండి మహత్తత్వము పుట్టెను - అందుచేత భగవంతుడు పురుషుడు అని, ప్రకృతి స్త్రీ అని భావింపబడుచున్నారు. మహత్తత్వము ప్రకృతియొక్క వికారమే - మార్పే - దానిలోకూడ భగవంతుడు తన (పురుష) శక్తితోనుండి దానిలోనుండి అహంకారమును పుట్టింపచేసెను. ఇట్లు ఒకదానిలోనుండి ఒకటిగా ఈ ప్రపంచములోని వస్తువులన్నియు పుట్టినవి. అట్లుపుట్టిన ప్రతి ఒక్క వస్తువులోను ప్రకృతియొక్క అంశ, భగవదంశ యున్నది. ఏవస్తువులోనైనను భగవదంశ - భగంతుని చైతన్య శక్తి - లేనిదే దానిలోనుండి మఱియొకవస్తువు పుట్టదు. అక్కడితో సృష్టి ఆగిపోయి యుండును. అందుచేత ప్రకృతి దాని పరిమాణ వస్తువులన్నియు, స్త్రీ ప్రాయములన్నియు, వాటిలోనున్న భగవంతుడు – చైతన్యశక్తితో నున్నవాడు పురుషుడనియు చెప్పబడుచున్నాడు - ఈ స్త్రీ పురుషుల సంయోగము వలననే సృష్టి జరుగుచున్నది. (creation is the result of the combination of matter and energy). ఇట్టి ప్రకృతి పురుష సంయోగము సృష్టిలో ప్రతి వస్తువులోను ఉన్నది. సృష్టి అంతటిలోను ఈ రెండు తత్వములు వేరువేరుగా - ఒకదానిని విడిచి ఒకటి కనబడదు. ఇదియే ఈ రెండింటికి గల అవినాభావసంబంధము. శివుని శక్తి పార్వతి (ప్రకృతి స్వరూపిణి) - ఈ శివశక్తుల సం యోగమే అర్థనారీశ్వర రూపముగా వ్యక్తపఱచబడినది). ప్రకృతి, దాని పరిణామ వస్తువులన్నియు కలిసి జగత్తు అయినది కనుక జగత్తు స్త్రీరూపమని, పుమాన్ - భగవంతుడు పురుష రూపమని చెప్పబడినది.
“మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్గర్భం దదామ్యహం |
సంభవః సర్వభూతానాం తతోభవతి భారత ||“.
సర్వ యోనిషు కౌంతేయ మూర్తయః సంభ వంతియాః |
తాసాం బ్రహ్మ మహధ్యోనిరహం బీజః ప్రదః పితా ||“. (శ్రీమద్భగవద్గీత -14 - 3 - 4)
(చతుర్ముఖ బ్రహ్మ అని చెప్పబడు ప్రకృతిని నేను సృష్టిచేయుటలో యోనిగా ఉపయోగించుకొని దానిలో గర్భము ధరింప చేయుచున్నాను. అందునుండి సమస్త భూతములు పుట్టుచున్నవి. ఎన్నెన్ని కారణవస్తువుల నుండి ఎన్నెన్నిరూపములు (వస్తువులు) కార్య వస్తువులు పుట్టినను వాటి అన్నింటికి ప్రకృతి (చతుర్ముఖ బ్రహ్మ) మహద్యోని - జననము కలుగచేయు గొప్ప యోని - మూల యోని. వాటి అన్నింటికి బీజము నిచ్చువాడను - అందుచేత జగత్తునకు నేను తండ్రిని, ప్రకృతి తల్లి-
“జగతః పితరౌవం దే పార్వతీపరమేశ్వరౌ”
(జగత్తునకు తలిదండ్రులయిన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారము చేయుచున్నాను).
“చ. జగములతండ్రియై తనరు శౌరి జగంబుల తల్లినిందిరం
దగ నురమందు దాల్చెనట - - -“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 8 - 286)
(tirugunadi. oka nimuṣamainanu sthiramugā nuṃḍanidi. kṣaṇakṣaṇamu mārpu ceṃdunadi).
(kadalunadi, caliṃcunadi, paribhramaṇamu cēyunadi, pariṇamiṃcunadi mārpulu kaladi).
(sthāvaramulu, jaṃgamamulu, caramulu, acaramulu, kadalanivi, kadalunavi - ivanniyu kalisi yunnadi jagattu).
(jagattulōnivastuvulanniyu kalisi jagattu ani ceppabaḍucunnadi. ī vastuvulanniyu bhagavaṃtunilō nuṃḍi - okadānilōnuṃḍi okaṭigā - puṭṭinavi - bhagavaṃtunilōnuṃḍi puṭṭuṭacēta ivanniyu bhagavaṃtuni rūpamulē. vyavahāramukoṟaku vāṭiki vēru vēru nāmamulu peṭṭabaḍinavi. aṃducēta bhagavaṃtuni rūpamulu vāṭināmamulukala vastuvulanniyu kalisi jagattu ani ceppabaḍucunnadi. iṭlu bhagavaṃtuni nāmarūpamulu kalisijagattu anunadi vērēlēdu. aṃducēta jagattu anagā bhagavaṃtuni nāma rūpamulē).
(padunālugu lōkamulu kalisiyunnadi jagat - ī padunālugulōkaṃbulēvi yanagā :” caturdaśa lōkaṃbulu kalisina jagattu parabrahma rūpamē - śarīramē - ayinaṃduna, ā śarīrāvayavamulu lōkamulani ceppabaḍinavi - adi eṭlanagā - “caturdaśalōkaṃbulaṃdu mīdi ēdu lōkaṃbulu mahā viṣṇuvunaku gaṭi pradēśamunanuṃḍi yūrdhvadēhamaniyunu, kriṃdi ēḍu lōkaṃbulu jaghanaṃbunanuṃḍi yadhō dēhamaniyu balukuduru - - - bhūlōkaṃbu gaṭi paryaṃtapradēśaṃbu, bhuvarlōkaṃbu nābhi, suva rlōkaṃbu hṛdayaṃbu, maharlōkaṃbu vakṣaṃbu, janalōkaṃbu grīvaṃbu, tapōlōkaṃbu stanadvayaṃbu, sanātanaṃbunu, brahmanivāsaṃbununaina satyalōkaṃbu śiraṃbu, gaṭipradēśaṃbu talaṃbu, toḍalu vitalaṃbu jānuvulu sutalaṃbu, jaṃghalu talātalaṃbu, gulphaṃbulu mahātalaṃbu, pādāgraṃbulu rasātalaṃbu, pādatalaṃbu pātāḷaṃbunani lōkamayuṃgā bhāviṃturu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 89)
ādyatrayaṃ brahmarūpaṃ nāmarūpātmakaṃ jagat”.
(asti = unnadi, bhāti = prakāśiṃcunadi, priyaṃ = priyamainadi ānaṃdakaramainadi; rūpamu; nāmamu anunavi aṃśa paṃcakamu - ayidu aṃśalu, bhagavaṃtuni aṃśalu. ‘asti’ unnadi okka bhagavaṃtuḍē - mūḍukālamulaṃduṃḍuvāḍu. aṃducēta ‘sat’ - satyamu - ani ceppabaḍucunnāḍu, bhāti = bhaga vaṃtuḍu. cidrūpuḍu - svayamugā prakāśiṃcuvāḍu. priyaṃ = bhagavaṃtuḍu paramānaṃdasvarūpuḍu - mōkṣarūpuḍainavāḍu. vaikuṃṭhuḍē vaikuṃṭhamu, vaikiṃṭhamē vaikuṃṭhuḍu. aṃducēta ī mūḍu aṃśalu - asti, bhāti, priyaṃ anunavi - saccidānaṃdamulu - bhagavaṃtuni tatvamu teliyacēyunavi. migilinavi reṃḍu aṃśalu - rūpamu, nāmamu - bhagavaṃtunilōnuṃḍi - okadānilōnuṃḍi okaṭigā puṭṭinavaguṭa cēta ī jagattulōni vastuvulanniyu - rūpamu, nāmamu galavanniyu bhagavaṃtuni rūpamulē. vāṭi nāmamulanniyu bhagavaṃtuni nāmamulē. avanniyu atani aṃśalē - ī reṃḍu aṃśalu jagattu - aṃdu cēta jagattu aṃtayu bhagavaṃtuḍē, bhagavaṃtuḍu kānidi lēdu.
- (ī prapaṃcamaṃtuyu - ī jagattu aṃtayu puruṣuḍē - parabrahmamē).
(idaṃtā brahmamē - ī jagattaṃtā brahmamē).
(nīvu cidrūpuḍavu. ī jagattu nīkaṃṭe bhinnamainadikādu - nīkaṃṭe vērainadikādu).
“viṣṇuṃḍu viśvaṃbu, viṣṇuni kaṃṭenu vērēmiyunu lēdu -” (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 5 - 65)
“nāku nanyamokaṭi lēdu| sṛṣṭikālamaṃdu sṛṣṭināśaṃbuna |
jagamu matsvarūpamagunu, vatsa |” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 9 -)
(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 13 - 288)
(jagattu anu rūpamutō parabrahmamē prakāśiṃcucunnāḍu).
draṣṭavyamātmavattasmāt avibhēdēna vicakṣaṇaiḥ ||” (iti viṣṇupurāṇē)
(sarvabhūtamulu tānē ayina viṣṇuvē ī sarva prapaṃcamugā vistariṃciyunnāḍu - jagattu aṃtā vista riṃcina viṣṇuvē. aṃducēta jagattunaku viṣṇuvunaku bhēdamu lēnaṭlu telusukonavalenu. O.F - vāmanāvatāramu.
yathā na saṃbhavatyēvaṃ na jagat pṛthagīśvarāt ||” (yōgavāśiṣṭamu - 60 - 4)
(baṃgāramutōcēsina ābharaṇamulu baṃgāramukaṃṭe vērukānaṭlu, nīṭilōni keraṭamulu nīṭikaṃṭe vērukānaṭlu jagattu īśvarunikaṃṭe vērukādu).
śivasvarūpa mēvāhu ridaṃ sarvaṃ vicakṣaṇāḥ |
sarvasva rūpamajñānāddṛśyatē natu vastutaḥ |
ēṣa ēva hi maṃtrārtha ḥ satyaṃ satyaṃ na cānya thā |
vēdāḥ sarva purāṇāni smṛtayō bhārataṃ tathā |
anyānyāpi ca śāstrāṇi tathā tarkiśca sarva śaḥ |
śaivāgamāśca vividhāḥ āgamā vaiṣṇavā api |
anyāgamāśca viduṣā manu bhūtiśca ta daivaca |
asminnirthēsva saṃvēdyē parya vaśyaṃti nānya thā ||“.
- - -“kiṃca śiva ēva syābhinnaparaśaktyā sahitassan
īśvara sadāśiva rūpēṇa sakalaṃ jagatsṛṣṭvāsarva svarūpēṇavartatē.
“- -” īśvarādikaṃ sakalaṃ
vastu śiva ēvēti yaḥ paśyati sa ēva kṛtārthaḥ ” (sūta samhitāyāṃ)
(anēka prakāramulugā ceppuṭavalana prayōjanamulēdu - śivuni kanna - paramātmakanna - vēṟokaṭi lēdu - vicakṣuṇulainavāru - sarvamunu telisinavāru, parabrahmatatvamunu telisinavāru - idaṃtayū (ī jagattaṃtayu śivunisvarūpamē, ī samasta vastuvulu vēruvēru rūpamulugā kanabaḍuṭa ajñānamuvalananē kāni, yadhārthamugā kādu. idiyē maṃtramula yokka arthamu, idē nijamu. itaramu nijamukādu. vēdamulu, purāṇamulu, smṛtulu, bhāratamu, itara śāstramulu, tarkaśāstramu, śaivāgamamulu, vaiṣṇavāgamamulu, itara āgamamulu, vidvāṃsula anubhavamu - ivanniyu ī prakāramugānē teliya cēyucunnavi, ī yarthamunē ceppucunnavi, maṟokavidhamugā kādu. vyavahāramaṃdu bhēdamunnanu vāṭi sārāṃśamidiyē, idiyē vēdārthamani niścayiṃpabaḍinadi).
tathā sarva tayā bhāti śivassarvāva bhāsakaḥ |
kaṭakādi vibhāgēna yathā hēmaprakāśatē |
tathā sarvatayābhāti śivassarvāvabhāsakaḥ |
- - aṃdhakāraśca prakāśaśca yathā (ā)kāśē prakāśatē |
jaḍākaḍamidaṃ sarvaṃ tathābhāti parātmani | - - (sūtasamhitāyāṃ)
“kārya prapaṃcasya kāraṇabrahmātmakatvaṃ dṛṣṭāṃ - tairupapādayati - yathā ēkaiva mṛttikā ghaṭā śarā vādi nānā kāryātmanā bhasatē, tathā paraśivō pi māyōpādhivaśāt sakala jagadātmanā bhāsatē |
yathā svapna draṣṭā taijasaḥ ātmōpādhivaśāt nānāvidhasvapna padārthākārō bhavati, tathā advitīyaḥ īśvarōpi sva māyāvaśāt nānākāra jagadātmakō bhavatītyarthaḥ. yadhā ēkasmannēva niravayavē ākāśē upādhivaśā parikalpitabhēdē tamaḥ prakāśau yugapat bhāsatē, tadvidupādhi parikalpita bhēdē varaśivasyarūpē cētanā cētanātmaka prapaṃcō pi vyavasthi tassan prakāśatē. sarvasyāpi kārya prapaṃcasya kāraṇamātrāvaśēṣē spaṣṭaṃ nidarśanaṃ - mahānūrmirvōciḥ sa ēva vaśāt bhagnastaraṃgaḥ. yathā ēkasminnēva samudrē vīcī taraṃga budbudyākāra viśēṣāḥ (pratīti samayē (a)vabhāsatē punasta ttraiva līyatē, ēvaṃ paraśivasva rūpē (a)pi ākāśādi bhūta bhauti kādyātmikāṃ ākāśādi viśēṣāḥ svamāyā vaśāt bhāsaṃtē, tadaiva tatralīyaṃtē ca ||“.
(ī prapaṃcamaṃtayu kāryamu. dīniki kāraṇamainavāḍu bhagavaṃtuḍu. kāryamagu ī prapaṃcamunaku parabrahma eṭlu kāraṇamāyenō udāharaṇamulatō ī kriṃdanu ceppabaḍucunnadi : -maṭṭi okaṭē ayinappaṭikī adiyē kuṃḍa, mūkuḍu modalagu vastuvulugā mārucunnadi. ā prakāramugānē paramēśvaruḍu (parabrahma) kūḍā māya yanu upādhitō kūḍiyuṃḍuṭavalana ī samasta jagattuvale tānē agucunnāḍu. eṭlu svapnamunu kanina taijasuḍu ātmōpādhivalana svapnamulōni nānā vidhamulaina ākāramulugā agucunnāḍu. eṭlu okaṭē ayina ākāśamunaṃdu okacōṭa cīkaṭi iṃkoka cōṭa veluturu (tējassu) upādhikāraṇamugā kalugucunnavō, aṭlē advitīyuḍaina paramātmayaṃdu upādhini baṭṭi anēkamaina rūpamulugala - cētanā cētanamulugala jagattu prakāśiṃcucunnadi. eṭlu okaṭē ayina samudramunaṃdu, keraṭamulu, buḍagalu eṭlu dānilōnē puṭṭi dānilōnē līnamagunō aṭlē parabrahma svarūpamaṃdu bhūtamulu, bhautikamulu modalagu ākāra viśēṣamulu kalugucu pōvucunnavi.
(ī jagatttaṃtayu bhagavaṃtuni śarīramē yaguṭacēta bhagavanmayamē ayi yunnadi. parabrahmamayamē yaguṭacēta brahmaku mārupēru jagattu)
ka. “harimayamu viśvamaṃtayu
hari viśvamayuṃḍu saṃśayamu panilēdā
harimayamugāni dravyamu
paramāṇuvulēdu, vaṃśapāvana viṃṭē”. (pōtana telugu bhāgavatamu - 2-17)
(“viśvaṃ nārāyaṇaṃ dēvaṃ” ani maṃtrapuṣpamulō ceppiyuṃḍuṭacēta śrīmannārāyaṇuḍē jagattu aniteliyavaccucunnadi. “viśvaṃ viṣṇurvaṣaṭkārō” ani viṣṇu sahasranāmamulanu baṭṭinnī, jagattu nārāyaṇuḍē ayinaṃduna atani pērē viśvamanikūḍa ceppabaḍiyunnadi).”viśvamē vēdaṃ puruṣaḥ” (maṃtra puṣpamu)
ī jagattu aṃtayu puruṣuḍē - paramapuruṣuḍē - parabrahmamē.
“viśvēśvara, viśvarūpa” (śrīmadbhagavadgīta - 11 - 16)
(jagattē rūpamugā galavāḍu)
jagattraya midaṃ sarvaṃ cinmātraṃ sva vicārataḥ ||“. (mahōpaniṣat, - varāhōpaniṣat)
(marubhūmini yunna jalamaṃtayu marubhūmātramē - aṭlē vicāriṃcagā ī mūḍu jagamulu anniyu cinmātramē - caitanyamātramē - cinmātruḍaina bhagavaṃtuḍē).
(paramaśivuḍē - parabrahmamē - tanakanna vēṟukāni parāśaktitō kūḍinavāḍai īśvaruḍu, sadāśivuḍu anu rūpamulatō ī samasta jagattunu sṛṣṭiṃci anni rūpamulatō tānē pravartiṃcucunnāḍu. īśvaruḍu modalagu vastuvulannī - jagattulō unna vastuvulannī - śivuḍē yani - parabrahmamē yani - evaḍu cūcunō, nammakamu kaligi vartiṃcunō ataḍē kṛtārthuḍu).
ātmanō tathā bhinnaṃ viśvamātma vinirgataṃ |
taṃ tu mātrō bhavēdēva paṭō ya dvadvicāritaḥ |
ātma tanmātramē vēdaṃ tadvadviśvaṃ vicāritaṃ |
- - ātmā jñānāt jagadbhāti ātmajñānānna bhāsatē |
rajjva jñānā dahirbhāti tat jñādbhāsatē nahi |
prakāśōmē nijaṃ rūpaṃca nāti riktōsmyahaṃ tataḥ |
yathā prakāśatē viśvaṃ tathāhaṃ bhāsa ēvahi ||” (aṣṭāvakragīta - 2 - 4 to 8)
(nīṭilōnuṃḍi puṭṭina keraṭamulu, nuraga, buḍagalu nīṭikanna vērukānaṭlu, ātmalōnuṃḍi puṭṭina jagattu ātmakanna vērukādu. dāramulatō nēyabaḍina baṭṭa dāramulakanna vērukādu. ā prakāramugānē jagattu ātmamātramēkāni ātmakaṃṭevērukādu. ātmajñānamu lēkapōvuṭa valana - anagā jagattu ātmayē anu jñānamu lēkapōvuṭavalana - jagattu anunadi ātmakanna vērainadani tōcunu. brahmajñānamu kalugaganē - ī jagattu aṃtayu brahmamē yani te liyaganē jagattu anunadi vērē lēdu anu nijamu teliyunu. cīkaṭilō trāḍunucūci pāmu anukoni, adi pāmukādu trāḍu anu jñānamu kalugaganē adi pāmu anu bhrāṃti pōvunu. bhagavaṃtuni nijarūpamu dānikanna vērainavāḍukāḍu. jagattu nāvalananē prakāśiṃcucunnadi - jagattuvale - jagatturūpamulō - nēnē prakāśiṃcucunnānu).
(prapaṃcamunu sṛṣṭiṃci dānilōnē - dānilōnunna anni vastuvulalōnu - pravēśiṃcenu - aṭlu pravēśiṃci ‘sat’, ‘tyat’ anu reṃḍunu - ātmavastuvu, anātmavastuvugā tānē mārenu. aṃducēta jagattu aṃtā - aṃdulōnunna vastuvulanniṃṭitō kalisi - bhagavadrūpamē ayinadi - aṃducētanē parabrahmakaṃṭe itaramaina vastuvu ēdiyunu lēdu - unnadaṃtā - jagattu aṃtā - atanē - advayuḍu).
(bhagavaṃtuni nijarūpamunu kappipucci anēka vidhamulaina, citra vicitramulaina vikṣēpamulanu cēyagaliginaṭuvaṃṭinnī, sattu ani gāni asattu ani gāni nirṇayiṃcuṭaku vīlu kānaṭuvaṃṭi, anādya vidya, māya anu dōṣamucēta nirviśēṣuḍu, svayaṃprakāśuḍu ayina parabrahmayaṃdu ī jagattu kalpiṃcabaḍinadi).
(śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 -12 -)
(caitanyamātruḍaina parabrahmamē nēnu - ī jagattu aṃtayu nāvalanē caitanyamātruḍaina bhagavaṃtuḍē - jagattu ani vērugā kanupiṃcuṭa iṃdrajālamu - māya).
“sakala jaṃtuvulunnū katmaphalasvarūpamaṃtē kāni vērē jagattanēdi lēdu. aṃkurādipuṣpa phalāṃtamaina vṛkṣaprapaṃcamunnū bījaṃbuvalla sphuriṃcēdi yēlāgō alāgē sukhaduḥkhyādyanubhava rūpamaina māyā śakti yaneḍi bījamaṃdu (jagattu) sphuriṃciṃdi”. (brahmavidyā sudhārṇavamu - 4)
“samasta jagaṃbunu jīvarūpaṃbuna dhruvaṃbunu dēharūpaṃbuna nadhruvaṃbunaiyuṃḍu. maṟiyokka pakṣaṃbuna dhruvaṃbu nadhruvaṃbunu gākayuṃḍu. śuddha brahma svarūpaṃbuna nanirvacanīyaṃbai reṃḍunai yuṃḍu”.
(śrīmadāṃdhramahābhāgavatamu -1-13 -288)
(nāśarahituḍunnū, sarvamunaku adhiṣṭānamainaṭuvaṃṭi vāḍunnū ayina parabrahmanu telusukonalēnaṃtakālamu (brahmajñānamu kalaganaṃtakālamu) muccepu cippa veṃḍi vale prakāśiṃcunaṭlu (kanabaḍinaṭlu) ī jagattu satyamainadānivale prakāśiṃcunu. jñāna mu kaliginatarvāta muccepucippa veṃḍikādu muccepu cippayē ani telusukoninaṭlu brahmajñānamu kalugagānē ī jagattu aṃtā brahmamēkāni jagattu anēdi vērē lēdu ani teliyavaccunu. aṃtavaṟaku adi jagattēyani yanukonuṭa bhramayē).
(jagattu ‘sat’ ayinacō naśiṃcunadikādu, ‘asat’ ayinacō uṃḍunadikādu, aṃducēta ‘sat’ kaṃṭe ‘asat’ kaṃṭe vēru lakṣaṇamukaladi).
(ī sṛṣṭilō prakṛti, puruṣuḍu anu reṃḍu tatvamulunnavi. puruṣuḍu anagā “puriśayanāt puruṣaḥ”
puramaṃdu śayaniṃcuvāḍu - bhagavaṃtuḍu - puruṣuḍu lēka parama puruṣuḍu sṛṣṭi cēyatalaci, kummarivāḍu kuṃḍalu cēyuṭaku maṭṭi cēkūrcukoninaṭlu, tana śaktini prakṛtigā modaṭa (matter) sṛṣṭiṃcenu - prakṛti jaḍamu. aṃducēta tanacaitanyaśaktitō bhagavaṃtuḍu prakṛtilō pravēśiṃci dānini caitanyavaṃtamugā cēsenu - appuḍu prakṛtilōnuṃḍi mahattatvamu puṭṭenu - aṃducēta bhagavaṃtuḍu puruṣuḍu ani, prakṛti strī ani bhāviṃpabaḍucunnāru. mahattatvamu prakṛtiyokka vikāramē - mārpē - dānilōkūḍa bhagavaṃtuḍu tana (puruṣa) śaktitōnuṃḍi dānilōnuṃḍi ahaṃkāramunu puṭṭiṃpacēsenu. iṭlu okadānilōnuṃḍi okaṭigā ī prapaṃcamulōni vastuvulanniyu puṭṭinavi. aṭlupuṭṭina prati okka vastuvulōnu prakṛtiyokka aṃśa, bhagavadaṃśa yunnadi. ēvastuvulōnainanu bhagavadaṃśa - bhagaṃtuni caitanya śakti - lēnidē dānilōnuṃḍi maṟiyokavastuvu puṭṭadu. akkaḍitō sṛṣṭi āgipōyi yuṃḍunu. aṃducēta prakṛti dāni parimāṇa vastuvulanniyu, strī prāyamulanniyu, vāṭilōnunna bhagavaṃtuḍu – caitanyaśaktitō nunnavāḍu puruṣuḍaniyu ceppabaḍucunnāḍu - ī strī puruṣula saṃyōgamu valananē sṛṣṭi jarugucunnadi. (creation is the result of the combination of matter and energy). iṭṭi prakṛti puruṣa saṃyōgamu sṛṣṭilō prati vastuvulōnu unnadi. sṛṣṭi aṃtaṭilōnu ī reṃḍu tatvamulu vēruvērugā - okadānini viḍici okaṭi kanabaḍadu. idiyē ī reṃḍiṃṭiki gala avinābhāvasaṃbaṃdhamu. śivuni śakti pārvati (prakṛti svarūpiṇi) - ī śivaśaktula saṃ yōgamē arthanārīśvara rūpamugā vyaktapaṟacabaḍinadi). prakṛti, dāni pariṇāma vastuvulanniyu kalisi jagattu ayinadi kanuka jagattu strīrūpamani, pumān - bhagavaṃtuḍu puruṣa rūpamani ceppabaḍinadi.
“mama yōnirmahadbrahma tasmingarbhaṃ dadāmyahaṃ |
saṃbhavaḥ sarvabhūtānāṃ tatōbhavati bhārata ||“.
sarva yōniṣu kauṃtēya mūrtayaḥ saṃbha vaṃtiyāḥ |
tāsāṃ brahma mahadhyōnirahaṃ bījaḥ pradaḥ pitā ||“. (śrīmadbhagavadgīta -14 - 3 - 4)
(caturmukha brahma ani ceppabaḍu prakṛtini nēnu sṛṣṭicēyuṭalō yōnigā upayōgiṃcukoni dānilō garbhamu dhariṃpa cēyucunnānu. aṃdunuṃḍi samasta bhūtamulu puṭṭucunnavi. ennenni kāraṇavastuvula nuṃḍi ennennirūpamulu (vastuvulu) kārya vastuvulu puṭṭinanu vāṭi anniṃṭiki prakṛti (caturmukha brahma) mahadyōni - jananamu kalugacēyu goppa yōni - mūla yōni. vāṭi anniṃṭiki bījamu niccuvāḍanu - aṃducēta jagattunaku nēnu taṃḍrini, prakṛti talli-
“jagataḥ pitarauvaṃ dē pārvatīparamēśvarau”
(jagattunaku talidaṃḍrulayina pārvatī paramēśvarulaku namaskāramu cēyucunnānu).
“ca. jagamulataṃḍriyai tanaru śauri jagaṃbula talliniṃdiraṃ
daga nuramaṃdu dālcenaṭa - - -“. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 8 - 286)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.