(కారణము లేనిదీ కార్యములేదు, కర్త లేనిదీ కార్యముండదు).
(కర్త అనువాడు లేనిదే జగత్తు పుట్టి ఉండినయెడల, కుమ్మరివాడు లేనిదే కుండ పుట్టి యుండును. కుండను చేయువాడు కర్త ఒకడు (కుమ్మరి) ఉన్నాడు కనుక కుండపుట్టినది - అట్లే జగత్తు పుట్టుటకు కూడా దాని కర్త యనువాడు ఒకడు ఉండవలెను - ఎవడో ఒకడు ఉన్నాడు - ఉండుటవలననే అతని వలన జగత్తు పుట్టినది).
విద్యతే నేహ తత్కార్యం తత్సం విత్తుస్తు విభ్రమః |
అవిద్యామానమేవత్వం విద్ధి, సర్వం భ్రమోదితం|
అకారణం హి యద్వస్తు తన్మిద్యా రజ్జు సర్పవత్”
(ఏ కార్యవస్తువునకు కారణము కనబడదో - తెలియదో ఆ కార్య వస్తువే కనబడదు, లేదు - అనగా కారణములేని కార్యముండదు. అట్టిది కార్యమనుట భ్రమయే. కారణము కనబడినట్లుండుట భ్రమయే, అది మిధ్యయే - చీకటిలో త్రాడును చూచి పాము అనుకొనుట భ్రమయే అయినట్లు కుండ కార్యము - చేయబడిన వస్తువు, ఒకరిచే చేయబడిన వస్తువు - అందుచేత దానిని చేసినవాడు - కుమ్మరివాడు - కారణము. కుమ్మరివాడు లేనిదే కుండ తయారుకాదు). “యత్ కార్యం తత్ సకర్తౄకం” (కార్య వస్తువనునది దానికి కర్త అనునది యుండిననే కలుగుచున్నది).మఱియు - “నహి మృద్వ్యతిరేకేణ ఘటోనామ న కశ్చిదుప లభ్యతే - అతఃకారణ వ్యతిరేకేణ కార్యమ్నాస్తి”. (మట్టితో కుండ చేయబడుచున్నది. మట్టిలేనిదే మట్టికుండ తయారుకాదు. అందుచేత కుండ అను కార్యవస్తువునకు మట్టి అనునది కారణము. మట్టి ఉపాదానకారణము, కుమ్మరివాడు నిమిత్తకారణము. సాలెవాడు బట్టలు నేయును. బట్టలు కార్యము - అవి చేసినవాడు సాలెవాడు ఆ సాలెవాడు బట్టకు కారణము - నిమిత్తకారణము. దారముతో సాలెవాడు బట్టలు నేయును. దారములు లేనిదే బట్ట తయారుకాదు. అందుచేత బట్టకు దారములు ఉపాదానకారణము, సాలెవాడు నిమిత్తకారణము - నిమిత్తకారణము, ఉపాదానకారణము అను ఈ రెండు కారణములు లేనిదే యే వస్తువు తయారుకాదు. ఈ జగత్తులో కోటానుకోట్లు వస్తువులున్నవి. ఈ వస్తువులన్నియు ఒకదానిలో నుండి ఒకటిగా పుట్టుచున్నవి. ఇట్లు పుట్టు ప్రతివస్తువునకు కారణముండవలెను - పుట్టిన వస్తువునకు అది యేవస్తువులోనుండి పుట్టినదో అది దానికి కారణము - పుట్టిన వస్తువు కార్యము - ఈ వస్తువు లన్నియు కలిసి ఒక పెద్దకార్యము, జగత్తు దానికి కారణముండవలెను - అవి వీటి అన్నింటికీ కారణము - జగత్తునకు కారణము - ఆ కారణమే భగవంతుడు - పరబ్రహ్మ, పరమాత్మ - అతను లేనిదే జగత్తు పుట్టి ఉండదు.
ఈ జగత్తునకు భగవంతుడు - పరబ్రహ్మ కారణమెట్లాయెననగా : -
“స ఈక్షత లోకాన్ను సృజా ఇతి. స ఇమాన్ లోకాననృజత”
(ఇప్పుడు అనేకనామరూపములతో కనబడుచున్న సమస్తవస్తువులు మొదట -సృష్టికి పూర్వము, అవి సృష్టింపబడకముందు - ఒక్క ఆత్మగానే యుండెను. ఇతరమైనదేదియు లేదు - తనవంటి ఆత్మ వస్తువుగాని, ఇతరవస్తువేదియైనగాని, లేదు - ఆ ఆత్మ లోకములను సృజించెదను అని సంకల్పించెను - అట్లుసంకల్పించినంతమాత్రమున లోకములను సృష్టించెను).
(ఇప్పుడు అనేక నామరూపములతో కనబడుచున్న సమస్త వస్తువులు మొదట - సృష్టికి పూర్వము, అవి సృష్టింపబడకపూర్వము - ఒక్క ‘సత్’ పదార్థముగానే యుండెను - అది సంకల్పించెను - సంకల్పించి తేజస్సును సృష్టించెను). (అదొక్కటియే యుండెను - రెండవ వస్తువే లేదు).
(ఇప్పుడు అనేకరూపములుగల సమస్త వస్తువులుగల జగత్తు అవి పుట్టకముందు పరబ్రహ్మగానే యుండెను).
(పైన 4.1, .2, .3 లలో చెప్పబడిన దానినిబట్టి సృష్టికి పూర్వము ఆత్మ, లేక, పరబ్రహ్మము, లేక ‘సత్’ పదార్థము అనునది ఒకటే యుండెను, ఇంకొక వస్తువు ఎటువంటిదైనను లేదు అని స్పష్టమైనది - అదియే లోకములను సృజించెను అని కూద స్పష్టము, అదియే జగత్తునకు కారణము.
“ప్రాగవస్థాయాం ఇదం జగత్ అవ్యాకృతమా సీత్”- - -” స్థూలశరీరాం భకం భూత సూక్ష్మకారణమవ్యక్త శబ్దేన దర్శయంతి”
(శ్రీ శంకరః)
(ఈ జగత్తు నామరూపములతో ఉన్న స్థితిలో - వ్యాకృత (వ్యాపించియున్న స్థితిలోనున్న జగత్తు - దానికి ముందు ఉన్న అవ్యాకృత అవస్థలోనున్న దానిని అవ్యక్తమని చెప్పుచున్నారు - వ్యక్తముగానిది, సూక్ష్మరూపములో నుండుటచేత వేరువేరు వస్తువులుగా స్పష్తముగా కనబడనిది అవ్యక్తమని చెప్పబడినది. ఈ అవ్యక్తమని చెప్పబడినదే ప్రకృతి. భగవంతునికి రెండు శక్తులున్నవి
(1) ప్రకృతి - జడము
(2) చైతన్య శక్తి.
“భూమిరాసో (అ)నలో వాయుః ఖం మనోబుద్ధి రేవచ |
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టథా |
అపరేయమతస్త్యన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 4, 5)
కుమ్మరివానికి కుండలు చేయుటకు మట్టి కావలెను - అట్లే బంగారపు నగలు చేయువానికి బంగారము కావలెను - అట్లే పరమాత్మ జగత్తును సృష్టించుటకు ప్రకృతిని సృష్టించెను - ప్రకృతి మట్టివలె జడము. అందుచేత దానిలో పరబ్రహ్మ తన చైతన్యశక్తితో ప్రవేశించి దానిలోనుండి సమస్త వస్తువులను సృష్టించెను - ఒకే వస్తువునుండి అనేక విధములైన వస్తువులెట్లు పుట్టినవనగా - క్షీరసాగరమును భగవంతుని శక్తితో మధించగా దానిలోనుండి హాలాహలము (విషము), అమృతము, ఐరావతము, ఉచ్ఛైశ్రవము, శ్రీమహాలక్ష్మి పుట్టినట్లే. ప్రకృతి = ప్రధమం కృతం - మొట్టమొదట చేయబడినది. (ప్రకర్షేణ కృతం ఇతి ప్రకృతిః).
(బాగా చేయబడినది, అన్ని వస్తువులు దానిలోనుండి పుట్టింపచేయుటకు తగిన వస్తువు). ఒకవస్తువులో నుండి ఇంకొకవస్తువు పుట్టుటకు మొదటి దానిలో భగవంతుని చైతన్యశక్తి యే, భగవంతుడే తన చైతన్యశక్తి రూపములో కారణము. భగవంతుడిట్లు చేయుటయే ‘ఈక్షణమని’, ‘అకామయత’ అని, ‘అభ్యతపత్’ అనిన్నీ చెప్పబడినది. ఇట్లు సౄష్టి ప్రారంభములోనే కాక, అప్పటినుండి ఇప్పటివరకు - ఒక వస్తువులోనుండి ఇంకొక వస్తువు పుట్టుటకు వాటిలో నున్న భగవంతుడేకారణము.
ఆత్మ అనుమాట యీ విధముగా నిర్వచనము చేయబడినది - “ఆప్నోతి, ఆదత్తే, అత్తి, అతతి ఇతి ఆత్మా”. అదత్తే అనగా “కారణాత్ కార్యమా విర్భావయతి” (కారణవస్తువునుండి కార్యవస్తువును పుట్టింపచేయునది - “కృష్యతే ఆకృష్యతే, - కారణాత్ ఉత్పత్తికాలే ఇతి కృట్, సర్వం జగత్ న యతి కార్యాత్మ తాంప్రాపయతి సన్ బీజం కారణం” (ఉత్పత్తికాలమందు కారణవస్తువునుండి ఆకర్షించునది అని ‘కృట్’ అను ధాతువునకు అర్థము - సమస్తమైన జగత్తును కార్యమగునట్లు చేయునది - దానికి బీజము అయినది అని కృష్ణ శబ్దమునకు అర్థము చెప్పబడినది. పైన చెప్పిన కారణములవలన ఈ జగత్తునకు కారణము భగవంతుడే - పరబ్రహ్మమే. పరమాత్మయే).
(ఎవనివలన ఈ భూతములు పుట్టుచున్నవో, అట్లు పుట్టినవి జీవించి ఉండును, యవనియందు లీనమగుచున్నది అదియే బ్రహ్మయని తెలుసుకొనుము).
(అనేక నామరూపములతో ఉన్న ఈ జగత్తునకు సృష్టి స్థితిలయములు ఎవరి వలన జరుగుచున్నవో అతనే బ్రహ్మ అని బ్రహ్మసూత్రములలో చెప్పబడినది - ఇందువల్ల జగత్తునకు కారణము పరబ్రహ్మ).
(యదార్థముగా ఈ కనుపించు జగత్తునకంతకును కారణవస్తువును నిరూపించుటలో కేవలము పరబ్రహ్మ కారణముకాదు - శుధ్ధనిర్వికారుడగుటవలన. మాయా శక్తి అయిన ప్రకృతికి స్వతంత్రశక్తిలేనందున (అది జడము అగుటవలన) అది జగత్తునకు కారణము కాజాలదు. అందుచేత ఈ రెండును కలిసియే జగత్కారణమగుచున్నట్లుకనబడును - అందుచేత ఆ రెండునూ - చైతన్య శక్తితోకూడిన పరబ్రహ్మ, (పురుషుడు), (నిమిత్తకారణము), జడశక్తి అయిన ప్రకృతి (ఉపాదానకారణము) నేనే అని శ్రీదేవీ చెప్పియున్నది) - దీనివలన స్ఫురించు సారాంశమేమనగా - తన చైతన్యశక్తి - పరాశక్తి - పరమపురుషుడు తన జడశక్తి అయిన ప్రకృతితో కలియుటవలననే సృష్టియగుచున్నది. (creation is the result of the combination of matter and Energy).
(ఈ జగత్తునకు ఉపాదానకారణము, నిమిత్తకారణము ఈశ్వరుడే, పరమాత్మయే.సాలి పురుగు దాని గూడు కట్టుకొనుటకు కావలసిన దారములను తనశరీరములోనుండే తీసుకొనుట చేత తనగూడుకు తానే ఉపాదానకారణమున్నూ, ఆగూడు కట్టునదికూడా తానే అగుటచేత నిమిత్త కారణమున్నూ అయి ఉన్నది. ఆ ప్రకారముగానే ఈశ్వరుడు (పరమాత్మ) జగత్తునకు ఉపాదానకారణమున్నూ, నిమిత్త కారణమున్నూ అయి యున్నాడు - సాలెపురుగు విషయములో జడవస్తువైన తన శరీరమునుండి సాలెపురుగు దారములను పైకి తీయుటవలన దాని శరీరము ఉపాదానకారణమున్నూ, ఆ సాలెపురుగు శరీరములోనున్న అంతఃకరణముతో కూడిన చైతన్యశక్తి (పరమాత్మశక్తి) నిమిత్తకారణము అగుచున్నది. ఆ ప్రకారముగానే పరమాత్మయొక్క శరీరరూపమైన జడమగు మాయ (ప్రకృతి) జగత్తునకు ఉపాదానకారణము, పరమాత్మలోనున్న చైతన్యశక్తి నిమిత్తకారణము అయి ఉన్నది. అందు. చేత ఒకడే అయిన ఈశ్వరుడు (పరమాత్మ) జగత్తునకు ఉపాదానకారణమున్నూ, నిమిత్తకారణమున్నూ అని చెప్పుటకు సాలెపురుగు దృష్టాంతముగా చెప్పబడినది).
(మట్టి యున్నను - ఉపాదానకారణమున్నను - కుమ్మరివాడులేనిదే మట్టికుండ తయారవదు. అట్లే కుమ్మరివాడు ఉన్నను,మట్టిలేనియెడల మట్టికుండ తయారుకాదు. అందుచేతమట్టికుండ తయారగుటకుమట్టి, కుమ్మరివాడు - ఉపాదానకారణము, నిమిత్తకారణము - రెండునూ ఉండవలెను. అందుచేత సృష్టిలో ప్రతివస్తువులోను ప్రకృతి పరిణామవస్తువు (ప్రకృతి అంశ), భగవంతుని చిచ్ఛక్తి రెండునూ ఉన్నవి. ఇందువలననే ప్రతివస్తువులోను భగన్వతుడు ఉన్నాడని చెప్పబడినది - (ప్రహ్లాదుని వచనము - “ఇందుగలడందులేడని సందేహము వలదు - - -”).
“మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్గర్భం దధామ్యహం |
సంభవః సర్వభూతానాం తతో భవతి భారత |
సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః |
తాసాం బ్రహ్మమహద్యోనిరహం బీజప్రదః పితా ||” (శ్రీమద్బ్గవద్గీత - 14 - 3, 4)
(ఇచ్చట మహద్బ్రహ్మయనగా ప్రకృతి - వృద్ధిపొందునది, జగత్తుగా తానే మారునది - జగత్తునకు ఉపాదానకారణమైనదగుట చేత బ్రహ్మ అని చెప్పబడినది.ఈ ప్రకృతియే చతుర్ముఖబ్రహ్మ - అట్టి ప్రకృతి పరబ్రహ్మకి యోనిస్థానము - అందులోనుండి మఱియొక వస్తువును - జగత్తును - పుట్టించునది - తానే జగత్తుగా మాఱినది. అందుచేత కుండకు మట్టివలె జగత్తునకు ఉపాదానకారణమైనది. దానిలో నేను (పరబ్రహ్మ) నా చిచ్ఛక్తియను సృష్టిబీజము (వృక్షమునకు బీజమువలె) నుంచుదును - దానివలన సమస్త భూతములు పుట్టుచున్నవి. సృష్టిలోని కారణవస్తువులన్నియు యోనులు - వాటి అన్నింటికీ మూలకారణమైన ప్రకృతిమహద్యోని. ఆ యోనులన్నింటిలోనుండి పుట్టిన కార్యవస్తువులకు బీజము నిచ్చినవాడను నేనే. అందుచేత నేనే వాటికి తండ్రిని - జగత్తు అంతటకీ తండ్రిని, ప్రకృతి జగత్తునకు తల్లి- రూపములను కలిగించునది కనుక –
“జగతః పితరౌవందే పార్వతీ పరమేశ్వరౌ ||”.
(జగత్తునకు తలితండ్రులైన పార్వతీ పరమేశ్వరుల గుఱించి నమస్కరించుచున్నాను).
“బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ,సనాతనః |”
(సమస్త భూతములకు బీజము సనాతనుడనైన నేనే యని తెలుసుకొనుము)
- - - (అహం త తో హరిః |
సర్వజ్ఞో(అ)నంతశక్తిశ్చ మాయోపాధి రధీశ్వరః |
సర్వస్య కార్య వర్గస్య జగతో జన్మకారణం ||” (గీతాభావప్రకాశము - 7 - 39, 40)
(సర్వజ్ఞుడను, మాయ యని చెప్పబడు ప్రకృతిని ఉపాధిగా చేసుకొనినవాడను అయిన నేను (పరబ్రహ్మ) సనస్తమైన జగత్తు పుట్టుటకు కారణమైనవాడను).
శక్తి శివకారణుండవై జగతినిర్వి
కార బ్రహ్మంబవగు నిన్ను గడిగి విశ్వ
నాధుగానె ఆగెదనా మనమున నభవ”
“తే. సమతనదిగాక తావకాంశంబు లైన
శక్తి శివరూపముల గ్రీడసలుపు దూర్ణ
నా భిగతి విశ్వజననవినాశవృద్ధి
హేతు భూతుండవగుచుందు వీశ, రుద్ర. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 6 - 145,146)
వినుతికెక్కిన యట్టి యవిద్య యందు.
“క. పురుషాకృతి నాత్మాంశ
స్ఫురణముగల శక్తి నిలిపి పురుషోత్తము డీ
శ్వరుడభవుండజుడు నిజో
దర సంస్థిత విశ్వమపుడు దగబుట్టించెన్” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - 199, 200)
(త్రాడునకు పేనిన రెండు దారములు కారణమయినట్లు మాయతో కూడిన బ్రహ్మ జగత్తునకు కారణము; లేక మాయ యను శక్తి గలిగిన బ్రహ్మ కారణము, లేక జగత్తునకు ఉపాదానకారణమైన మాయ ఆశ్రయముగా గల బ్రహ్మ కారణము).
(శ్రీశంకరః - బ్రహ్మసూత్రభాష్యే - 2 - 1 - 25)
(లోకములో కుమ్మరివాడు మొదలగు చేతనవస్తువులు ఏపనిచేసినను, దానికికావలసిన సామగ్రిని అపేక్షించే చేయుచున్నారు. కుమ్మరివానికి కుండలు చేయుటకు చక్రము, దండము కావలసి యున్నది. అవిలేక కుండచేయలేడు. సత్ అయిన బ్రహ్మ - చేతనమైన బ్రహ్మ ఏ సహాయము లేనిదే ఎట్లు జగత్తునకు చేయుచున్నాడు ? సాలెపురుగు తనంతట తానే దారమును సృజించుచున్నది - ఆ ప్రకారముగానే చేతనమైన బ్రహ్మ ఇతర సహాయమునపేక్షింపకనే తనంతట తానే జగత్తును సృష్టించు చున్నాడు).
(కరణములు లేకపోయినను కార్యముకలుగుటకు అవకాశమున్నది. క్షీరములు ఉపకరణముల అవసరము లేకనే పెరుగు అగుచున్నవి. అట్లేబ్రహ్మనుండి జగత్తుపుట్టుటకు ఉపకరణములేదు - బ్రహ్మకు కార్యము కరణము లేవు. అతనితో సమానుడుగాని అధికుడుగాని లేడు - అతనిశక్తులు జ్ఞానము,బలము, క్రియ వేరు. అతనితో పోల్చతగినది జగత్తులో లేదు. అందుచేత జగత్తులో లేనివస్తువులతో అతనిశక్తి పోల్చుటకు అలవికాదు - ఈ శక్తులు అతనికి స్వాభావికములు).
అద్వితీయ మనాద్యంతం యదాద్యముపలంభనం |
అప్రతర్క్యమవిజ్ఞేయం తచ్ఛివం శాంతమవ్యయం |
తత్ కథం కస్య కేనైవ కర్తృవా భోక్తృవా భవేత్ |
అతోనేరం కృతం కించి జ్జగదేతన్న విద్యతే |
చిన్మాత్ర కల్పితో వేధాశ్చి దేవేతి వినిశ్చయః |
తన్మాత్ర జనిత స్సర్గదాత్మక ఇతి స్థితిః ||“.
“అనంతాది లక్షణం యదాద్యముపలంభనం జ్ఞానస్వరూపం వస్త్వస్తి. తద్వస్తు శివం శాంతం అవ్యయం చేతికృత్వా తత్కథం కేనప్రకారేణ కర్తృ భవేత్ ?,కస్యవా స్వవ్యతిరిక్త కార్యస్యా భావాత్. కేనవా ఉపకరణేన? నకేనచిత్, తస్యాప్యభావాత్. ఏవం కర్తృత్వాభావాత్ ఇదం జగత్ కించిదపి న కృతం. అతశ్చ వేధాశ్చి న్మాత్ర పరికల్పితత్వాత్ చిదేవ, సర్గశ్చ తన్మాత్ర జనితః చిన్మాత్ర రూపిణా వేధ సైవ జనితత్వాత్ తదాత్మకః, చిన్మాత్రకః ఇత్యేవం స్థితో నిశ్చితః”.
(పరమాత్మ, పరబ్రహ్మము అనువాడు అనంతుడు (అంతములేని శక్తిగలవాడు), జన్మ లేనివాడు, వ్యక్తము కానివాడు (కనబడనివాడు), అజరుడు (ముసలితనము లేనివాడు - క్షీణించనివాడు),శాంతుడు, అచ్యుతుడు (తనశక్తిలోగాని, తనపదవినుండిగాని ఎన్నడు దిగజారనివాడు), తనుతప్ప మరొకవస్తువు లేనివాడు, జన్మకాని, వినాశముకాని లేనివాడు, ఎటువంటివాడు అని తర్కించుటకు వీలులేనివాడు, తెలుసుకొనుటకు వీలులేనివాడు, వ్యయరహితుడు, అటువంటి పరమాత్మ ఎట్లు దేనికి కర్తగాని, భోక్తగాని కాగలడు ? అందుచేత ఈ జగత్తు ఎవరిచేతను కల్పించబడినదికాదు - సృష్టింపబడినదికాదు. చిన్మాత్రుడు - చైతన్యుమే అయిన పరబ్రహ్మచేత కల్పించబడిన జతుర్ముఖబ్రహ్మ (అవ్యక్తము, లేక ప్రకృతి) చిన్మాత్రమే యగును. అట్టి చిన్మాత్రమైన చతుర్ముఖబ్రహ్మనుండి పుట్టిన జగత్తుకూడ చిన్మాత్రమే) - అంతా పరబ్రహ్మమే - ఇదియే సిద్ధాంతము).” నకర్తా స్తి, నభోక్తాస్తి సర్వం శాంతమజం శివం” (కర్తయనువాడులేడు, భోక్తయనువాడు లేడు. సర్వము జన్మలేనిదిన్నీ, మార్పులేనిదిన్నీ మంగళప్రదుడైన శివుడు).”
“కొందఱు ఈ జగత్తునకు కారణమే లేదని, లేక భగవంతుడు కారణముకాదని, ఎవరిమతానుసారముగా వారు వాదించుచున్నారు - కాని, ఈ వాదనలన్నియు ఖండింపబడినవి, భగవంతుడే కారణమని సిద్ధాంతము చేయబడినది. అది ఎట్లంటే : -
“ఉ. కర్మ వశంబునన్ జగము గల్గును, హెచ్చు, నడంగు నన్నచో
గర్మము బుద్ధి జూడ జడ కార్యముగాని, ప్రపంచకల్పనా
కర్మమనందు గర్తయనగా విలసిల్లగ జాలదీ జగ
త్కర్మక కార్యకారణము గావున నీశుడు విష్ణుడారయన్” (పోతన తెలుగు భాగవతము- 4 -581)
(కూటస్తుడై యే పనియును చేయకయుండి, క్రియారహితుడగుటవలన బ్రహ్మ జగత్కారణముకాదు - సత్వరజస్తమోగుణములు కలిగియుండుటవలన క్రియాశక్తిగల ప్రథానమే జగత్తునకు కారణము అని సాంఖ్యులవాదము - ఈ వాదము కుదరదు - ఎందుచేతననగా : -
“నసాంఖ్యా కల్పితం అచేతనం ప్రథానం జగతః కారణం శక్యం వేదాం తేష్ట్వాశ్రయితుం, అశబ్దం హి తత్” –
(శ్రీ శంకరః - బ్రహ్మసూత్రభాష్యే)
(సాంఖ్యమతములో కల్పించబడిన ప్రథానమనునది అచేతనమగుటవలన, ఉపనిషత్తులలో చెప్పబడియుండక పోవుటవలన జగత్తునకు కారణమని చెప్పుటకు వలనుపడదు. అది అశబ్దము - అనగా అట్లు వేదములో చెప్పబడియుండలేదు - శబ్దము అనగా వేదము).
(‘అశబ్దత్వాత్’ అని బ్రహ్మసూత్రము, అనగా అవేదప్రమాణత్వాత్ - వేదములో దీనికి ప్రమాణము లేనందున - ప్రథానమనునది కారణమని వేదములో చెప్పబడియుండకపోవుటవలన. “నహి అచేతనస్య ప్రథానస్య ఈక్షితృత్వం సంభవతి, తస్య చేతన ధర్మత్వాత్. న చ కూటస్థబ్రహ్మణః జ్ఞానక్రియా శక్త్యభావః, మాయా మహిన్నూ సర్వస్యా స్యుపత్తేః. అతః సత్ ఈక్షితృ చేతనం బ్రహ్మైవ జగదుపాదానం”. (భాష్యార్థరత్నమాల)
(“స ఈక్షిత” (బ్రహ్మ సంకల్పించెను) అని సృష్టి ప్రారంభముగుఱించి చెప్పబడెను. “స అకామయత”
(బ్రహ్మ కోరెను - జగత్తుగా మారెదను, జగత్తును సృష్టించెదను) అనియు కూడాచెప్పబడెను. ఈక్షితృత్వము వలననే, దృజ్మాత్రముచేతనే సృష్టి జరిగినది. ఈక్షితృత్వము చేతనధర్మము - చైతన్యముగల వస్తువుయొక్క ధర్మము - శక్తి (Energy). ఈ శక్తి అచేతనమగు ప్రథానమునకు లేదు - కూటస్థబ్రహ్మకు జ్ఞానక్రియాశక్తులు లేకపోలేదు. తనకు ఉపాధిగాచేసుకొనిన మాయా మహిమచేత సమస్త శక్తులు కలిగియే యున్నవి. అందుచేత సత్పదార్థము, ఈక్షితృ చేతనశక్తి గలది యగు పరబ్రహ్మమే జగత్తునకు ఉపాదానకారణము).
(అభావమునుండి భావముకలుగుటయే నిజమైతే - అనగా, లేనివస్తువునుండి ఒకవస్తువు పుట్ట్గలిగి ఉన్నయెడల, ఏపని చేయక, తటస్థముగానున్నవానికైనను, ఏ ప్రయత్నము చేయకపోయినను, ఏ కోరికలు లేనివారికైనను వారికి కావలసినవన్నియు సిద్ధించవలెను - వ్యవసాయదారుడు పొలమును దున్నకనే సస్యము పండవలెను; కుమ్మరివాడు మట్టిని సాధించకనే కుండ తయారుకావలసియుండును; సాలెపురుగు తనశరీరములోనుండి కుమ్మరివాడు మట్టిని సాధించకనే కుండ తయారు కావలసియుండును, సాలెపురుగు తన శరీరములోనుండి తీయకనే గూడు తయారుకావలెను, బట్టలునేయువాడు దారము లేకుండ గనే బట్ట తయారుకావలసి యుండును. ఈ ప్రకారముగా ఎవరు అయినను అందుకుతగిన ప్రయత్నము చేయకనే, కోరకుండగనే స్వర్గాపవర్గములు పొందగలుగుదురు. ఈ పరిస్థితి కుదరదు. ఇది ప్రకృతి విరుద్ధము. అందుచేత అభావమునుండి భావము పుట్టనేరదు - ఏమీ లేనిదానినుండి జగత్తు కలుగదు -).
శూన్యము జగత్కారణము అనికొందఱి అభిప్రాయము. విత్తనములేక మొక్కమొలచుటలేదు. అందుచేత శూన్యమునుండి జగత్తు పుట్టియుండదు - ఇట్లు పుట్టుట అసంభవము.
పరమాణువులు జగత్కారణమని నైయాయికుల అభిప్రాయము : -
“బ్రహ్మవినా జగజ్జన్మాదికం నసంభవతి, కారణాంతరా సంభవాత్ - - - పరమాణునా అచేతనానాం స్వతః
(ప్రవృత్త్య యోగాత్ - జీవాన్యస్య జ్ఞాన శూన్యత్వ నియమేనాను మానాత్ సర్వజ్ఞేశ్వరా సిద్ధౌ తేషాః ప్రేరకా భావాత్ జగదారంభకత్వా సంభవః -
(జగత్తునకు బ్రహ్మకారణము కానియెడల జగత్తు పుట్టుట, పెరుగుట, నశించుట జరుగనేరదు - ఇంకొక కారణము లేనందున. పరమాణువులు అచేతనములగుటవలన వాటంతట అవి ప్రవృత్తిని కలుగచేయలేవు. జీవుడు తప్ప మిగిలినవి జ్ఞానశూన్యములు. సర్వజ్ఞుడు (సృష్టి విదానము తెలిసినవాడు) అయిన ఈశ్వరుడు, (బ్రహ్మ) లేనియెడల - వాటిలో అంతర్యామిగా లేనియెడల - వాటిని తన చైతన్యశక్తితో ప్రేరేపించువాడు ఉండడు కనుక అవి జగత్తు ను పుట్టించుట అసంభవము).
(అణువు అణువులోను భగవంతుడు తన చిచ్ఛక్తిరూపములోనుండి వాటిని ఒకదానితోనొకటి ఆకర్షింపచేసి ఒకపదార్థముగా అగుటకు అవకాశము కల్పించుచున్నాడు (Every particle of matter contains Energy. Every particle of matter attracts every other particle). ఇందువలననే పరమాణువులు ఒకదానితో ఒకటి కలిసి పదార్థములుగను, అట్టి పదార్థములన్నియు కలిసి జగత్తును అగుచున్నవి. ఈ పరమాణువులలో భగవంతుని శక్తిలేని యెడల - భగవంతుడు తన శక్తిరూపములో లేనియెడల అవి జగత్తునకు కారణముకానేరవు. వాటిలోనుండి,వాటికి తన చిచ్ఛక్తినిచ్చి వాటిని ప్రేరేపించు పరబ్రహ్మయే జగత్తునకు కారణము).
“న చ స్వభావతః విశిష్టదేశకాల నిమిత్తానాం ఇహోపాదానాత్”
(జగత్సృష్టిలో దేశకాలనిమిత్తములు ఉపాదానకారణములు. అందుచేత స్వభావము జగత్కారణము కాదు. గొడ్రాలు వీర్యవంతమైనదైనను గర్భోత్పత్తి స్వభావము వలన కలుగుటలేదు - అందుచేత స్వభావము జగత్కారణముకాదు - జగత్సృష్టికి దేశకాలశక్తులుకూడా అవసరము -కాలము జరిగినకొలదియే ఒక వస్తువులో పరిణామముకలిగి అందులోనుండి ఇంకొక వస్తువు పుట్టుట).
కొందఱు కాలము జగత్కారణమందురు. కాలము భగవంతుని శక్తి - ఇది భగవంతునివలె మూడుకాలములందుడనది. అయినను కార్యములన్నియు ఎల్లపుడు ఉండవు. అందుచేత కాలము జగత్కారణముకాదు -
అదృష్టము జగత్కారణమని మీమాంసుకులనుచున్నారు. అదృష్టము జడమగుటవలన ఈ కారణమువలన ఈ కార్యము జరుగుచున్నదని చెప్పుటకువీలులేదు - అందుచేత అదృష్టము జగత్కారణముకాదు -
పంచభూతములు కారణమని మఱికొందఱి అభిప్రాయము - పంచభూతములు జడములు. వాటికి మఱియొక కారణమున్నది. కనుక అవి జగత్కారణముకాదు.
(పైన చెప్పిన ప్రకారము వివిధవాదములన్నియు నిరాకరించబడినవి. సిద్ధాంతమేమనగా - భగవంతుని అపరాశక్తి అయిన ప్రకృతిలో అతని పరాశక్తి అయిన చైతన్య శక్తితో భగవంతుడు కలియుటచేతనే సృష్టి జరుగుచున్నది. అందుచేత భగవంతుడే, పరబ్రహ్మయే జగత్తునకు కారణము.ఈ రెండు శక్తులలోను ఒకటి ఉపాదానకారణము, రెండవది నిమిత్తకారణము).
“మఱియు నెట్లన్నను చేతనుండైన జీవుండు జగత్కర్తయగుననిన కించిజ్ఞత్వ, అదృష్త పరతంత్రత్వ, అనీశ్వరత్వాది దోషంబులు గలుగుటంజేసి జగంబు సృజియింప యోగ్యంబుకాదు. అట్లగుటంజేసి పారిశేష న్యాయంబున పరమేశ్వరుండు జగత్కర్తయగుట నిశ్చయంబు”. (వివేకచింతామణి - పరమానందతీర్థ)
సన్మూలాః సోమేమాః ప్రజాః “ఇత్యాదిశ్రు త్యా సత ఏవ జగత్కారణా వగమాచ్చ”. అసద్వా ఇదమగ్ర ఆసీత్”
(తైత్తిరీయోపనిషత్ - 2 - 7)
ఇతి శ్రుతి స్థా సత్సదంతు అనభివ్యక్త నామరూపత్వేన గౌణాయావృత్యా సత్యేవ యోజనీయం “ఇతి న్యాయాత్”
(బ్రహ్మసూత్రభాష్యము)
(శూన్యము జగత్తునకు కారణము కాజాలదు. “అసత్తునుండి సత్పదార్థమెట్లు పుట్టగలదు - అను తర్కము ననుసరించి చెప్పు శ్రుతివాక్యమువలన అసత్తు కారణముకాజాలదు అని నిషేధింపబడినది.”సత్పదార్థమే జగత్తు పుట్టు టకుముందు ఉండెను” అని ఛాందోగ్యోపనిషత్తులోను - ఈ ప్రజలందరు, ఈ పుట్టినవస్తువులన్నియు సత్పదార్థమే కారణముగా గలవి - సత్పదార్థములోనుండి పుట్టినవే” అను మొదలగు శ్రుతివాక్యములవలననూ, సత్పదార్థమే జగత్తునకు కారణమని తెలియుచున్నది. “అసత్పదార్థము జగత్తు పుట్టకముందుండెను” - అని తైత్తిరీయోపనిషత్తులో చెప్పబడిన అసత్పదార్థమనగా వ్యక్తముగాక - సూక్ష్మాతి సూక్ష్మ దశలోనున్న, కారణరూపములోనున్నటువంటిదిన్నీ, నామరూపములు గలిగియుండుటచేత - గౌణ వృత్తిని పొందిన సత్పదార్థమేయని యోచించుకొనవలసినది).
(kāraṇamu lēnidī kāryamulēdu, karta lēnidī kāryamuṃḍadu).
(karta anuvāḍu lēnidē jagattu puṭṭi uṃḍinayeḍala, kummarivāḍu lēnidē kuṃḍa puṭṭi yuṃḍunu. kuṃḍanu cēyuvāḍu karta okaḍu (kummari) unnāḍu kanuka kuṃḍapuṭṭinadi - aṭlē jagattu puṭṭuṭaku kūḍā dāni karta yanuvāḍu okaḍu uṃḍavalenu - evaḍō okaḍu unnāḍu - uṃḍuṭavalananē atani valana jagattu puṭṭinadi).
vidyatē nēha tatkāryaṃ tatsaṃ vittustu vibhramaḥ |
avidyāmānamēvatvaṃ viddhi, sarvaṃ bhramōditaṃ|
akāraṇaṃ hi yadvastu tanmidyā rajju sarpavat”
(ē kāryavastuvunaku kāraṇamu kanabaḍadō - teliyadō ā kārya vastuvē kanabaḍadu, lēdu - anagā kāraṇamulēni kāryamuṃḍadu. aṭṭidi kāryamanuṭa bhramayē. kāraṇamu kanabaḍinaṭluṃḍuṭa bhramayē, adi midhyayē - cīkaṭilō trāḍunu cūci pāmu anukonuṭa bhramayē ayinaṭlu kuṃḍa kāryamu - cēyabaḍina vastuvu, okaricē cēyabaḍina vastuvu - aṃducēta dānini cēsinavāḍu - kummarivāḍu - kāraṇamu. kummarivāḍu lēnidē kuṃḍa tayārukādu). “yat kāryaṃ tat sakartṝkaṃ” (kārya vastuvanunadi dāniki karta anunadi yuṃḍinanē kalugucunnadi).maṟiyu - “nahi mṛdvyatirēkēṇa ghaṭōnāma na kaścidupa labhyatē - ataḥkāraṇa vyatirēkēṇa kāryamnāsti”. (maṭṭitō kuṃḍa cēyabaḍucunnadi. maṭṭilēnidē maṭṭikuṃḍa tayārukādu. aṃducēta kuṃḍa anu kāryavastuvunaku maṭṭi anunadi kāraṇamu. maṭṭi upādānakāraṇamu, kummarivāḍu nimittakāraṇamu. sālevāḍu baṭṭalu nēyunu. baṭṭalu kāryamu - avi cēsinavāḍu sālevāḍu ā sālevāḍu baṭṭaku kāraṇamu - nimittakāraṇamu. dāramutō sālevāḍu baṭṭalu nēyunu. dāramulu lēnidē baṭṭa tayārukādu. aṃducēta baṭṭaku dāramulu upādānakāraṇamu, sālevāḍu nimittakāraṇamu - nimittakāraṇamu, upādānakāraṇamu anu ī reṃḍu kāraṇamulu lēnidē yē vastuvu tayārukādu. ī jagattulō kōṭānukōṭlu vastuvulunnavi. ī vastuvulanniyu okadānilō nuṃḍi okaṭigā puṭṭucunnavi. iṭlu puṭṭu prativastuvunaku kāraṇamuṃḍavalenu - puṭṭina vastuvunaku adi yēvastuvulōnuṃḍi puṭṭinadō adi dāniki kāraṇamu - puṭṭina vastuvu kāryamu - ī vastuvu lanniyu kalisi oka peddakāryamu, jagattu dāniki kāraṇamuṃḍavalenu - avi vīṭi anniṃṭikī kāraṇamu - jagattunaku kāraṇamu - ā kāraṇamē bhagavaṃtuḍu - parabrahma, paramātma - atanu lēnidē jagattu puṭṭi uṃḍadu.
ī jagattunaku bhagavaṃtuḍu - parabrahma kāraṇameṭlāyenanagā : -
“sa īkṣata lōkānnu sṛjā iti. sa imān lōkānanṛjata”
(ippuḍu anēkanāmarūpamulatō kanabaḍucunna samastavastuvulu modaṭa -sṛṣṭiki pūrvamu, avi sṛṣṭiṃpabaḍakamuṃdu - okka ātmagānē yuṃḍenu. itaramainadēdiyu lēdu - tanavaṃṭi ātma vastuvugāni, itaravastuvēdiyainagāni, lēdu - ā ātma lōkamulanu sṛjiṃcedanu ani saṃkalpiṃcenu - aṭlusaṃkalpiṃcinaṃtamātramuna lōkamulanu sṛṣṭiṃcenu).
(ippuḍu anēka nāmarūpamulatō kanabaḍucunna samasta vastuvulu modaṭa - sṛṣṭiki pūrvamu, avi sṛṣṭiṃpabaḍakapūrvamu - okka ‘sat’ padārthamugānē yuṃḍenu - adi saṃkalpiṃcenu - saṃkalpiṃci tējassunu sṛṣṭiṃcenu). (adokkaṭiyē yuṃḍenu - reṃḍava vastuvē lēdu).
(ippuḍu anēkarūpamulugala samasta vastuvulugala jagattu avi puṭṭakamuṃdu parabrahmagānē yuṃḍenu).
(paina 4.1, .2, .3 lalō ceppabaḍina dāninibaṭṭi sṛṣṭiki pūrvamu ātma, lēka, parabrahmamu, lēka ‘sat’ padārthamu anunadi okaṭē yuṃḍenu, iṃkoka vastuvu eṭuvaṃṭidainanu lēdu ani spaṣṭamainadi - adiyē lōkamulanu sṛjiṃcenu ani kūda spaṣṭamu, adiyē jagattunaku kāraṇamu.
“prāgavasthāyāṃ idaṃ jagat avyākṛtamā sīt”- - -” sthūlaśarīrāṃ bhakaṃ bhūta sūkṣmakāraṇamavyakta śabdēna darśayaṃti”
(śrī śaṃkaraḥ)
(ī jagattu nāmarūpamulatō unna sthitilō - vyākṛta (vyāpiṃciyunna sthitilōnunna jagattu - dāniki muṃdu unna avyākṛta avasthalōnunna dānini avyaktamani ceppucunnāru - vyaktamugānidi, sūkṣmarūpamulō nuṃḍuṭacēta vēruvēru vastuvulugā spaṣtamugā kanabaḍanidi avyaktamani ceppabaḍinadi. ī avyaktamani ceppabaḍinadē prakṛti. bhagavaṃtuniki reṃḍu śaktulunnavi
(1) prakṛti - jaḍamu
(2) caitanya śakti.
“bhūmirāsō (a)nalō vāyuḥ khaṃ manōbuddhi rēvaca |
ahaṃkāra itīyaṃ mē bhinnā prakṛti raṣṭathā |
aparēyamatastyanyāṃ prakṛtiṃ viddhimē parāṃ ||“. (śrīmadbhagavadgīta - 7 - 4, 5)
kummarivāniki kuṃḍalu cēyuṭaku maṭṭi kāvalenu - aṭlē baṃgārapu nagalu cēyuvāniki baṃgāramu kāvalenu - aṭlē paramātma jagattunu sṛṣṭiṃcuṭaku prakṛtini sṛṣṭiṃcenu - prakṛti maṭṭivale jaḍamu. aṃducēta dānilō parabrahma tana caitanyaśaktitō pravēśiṃci dānilōnuṃḍi samasta vastuvulanu sṛṣṭiṃcenu - okē vastuvunuṃḍi anēka vidhamulaina vastuvuleṭlu puṭṭinavanagā - kṣīrasāgaramunu bhagavaṃtuni śaktitō madhiṃcagā dānilōnuṃḍi hālāhalamu (viṣamu), amṛtamu, airāvatamu, ucchaiśravamu, śrīmahālakṣmi puṭṭinaṭlē. prakṛti = pradhamaṃ kṛtaṃ - moṭṭamodaṭa cēyabaḍinadi. (prakarṣēṇa kṛtaṃ iti prakṛtiḥ).
(bāgā cēyabaḍinadi, anni vastuvulu dānilōnuṃḍi puṭṭiṃpacēyuṭaku tagina vastuvu). okavastuvulō nuṃḍi iṃkokavastuvu puṭṭuṭaku modaṭi dānilō bhagavaṃtuni caitanyaśakti yē, bhagavaṃtuḍē tana caitanyaśakti rūpamulō kāraṇamu. bhagavaṃtuḍiṭlu cēyuṭayē ‘īkṣaṇamani’, ‘akāmayata’ ani, ‘abhyatapat’ aninnī ceppabaḍinadi. iṭlu sṝṣṭi prāraṃbhamulōnē kāka, appaṭinuṃḍi ippaṭivaraku - oka vastuvulōnuṃḍi iṃkoka vastuvu puṭṭuṭaku vāṭilō nunna bhagavaṃtuḍēkāraṇamu.
ātma anumāṭa yī vidhamugā nirvacanamu cēyabaḍinadi - “āpnōti, ādattē, atti, atati iti ātmā”. adattē anagā “kāraṇāt kāryamā virbhāvayati” (kāraṇavastuvunuṃḍi kāryavastuvunu puṭṭiṃpacēyunadi - “kṛṣyatē ākṛṣyatē, - kāraṇāt utpattikālē iti kṛṭ, sarvaṃ jagat na yati kāryātma tāṃprāpayati san bījaṃ kāraṇaṃ” (utpattikālamaṃdu kāraṇavastuvunuṃḍi ākarṣiṃcunadi ani ‘kṛṭ’ anu dhātuvunaku arthamu - samastamaina jagattunu kāryamagunaṭlu cēyunadi - dāniki bījamu ayinadi ani kṛṣṇa śabdamunaku arthamu ceppabaḍinadi. paina ceppina kāraṇamulavalana ī jagattunaku kāraṇamu bhagavaṃtuḍē - parabrahmamē. paramātmayē).
(evanivalana ī bhūtamulu puṭṭucunnavō, aṭlu puṭṭinavi jīviṃci uṃḍunu, yavaniyaṃdu līnamagucunnadi adiyē brahmayani telusukonumu).
(anēka nāmarūpamulatō unna ī jagattunaku sṛṣṭi sthitilayamulu evari valana jarugucunnavō atanē brahma ani brahmasūtramulalō ceppabaḍinadi - iṃduvalla jagattunaku kāraṇamu parabrahma).
(yadārthamugā ī kanupiṃcu jagattunakaṃtakunu kāraṇavastuvunu nirūpiṃcuṭalō kēvalamu parabrahma kāraṇamukādu - śudhdhanirvikāruḍaguṭavalana. māyā śakti ayina prakṛtiki svataṃtraśaktilēnaṃduna (adi jaḍamu aguṭavalana) adi jagattunaku kāraṇamu kājāladu. aṃducēta ī reṃḍunu kalisiyē jagatkāraṇamagucunnaṭlukanabaḍunu - aṃducēta ā reṃḍunū - caitanya śaktitōkūḍina parabrahma, (puruṣuḍu), (nimittakāraṇamu), jaḍaśakti ayina prakṛti (upādānakāraṇamu) nēnē ani śrīdēvī ceppiyunnadi) - dīnivalana sphuriṃcu sārāṃśamēmanagā - tana caitanyaśakti - parāśakti - paramapuruṣuḍu tana jaḍaśakti ayina prakṛtitō kaliyuṭavalananē sṛṣṭiyagucunnadi. (creation is the result of the combination of matter and Energy).
(ī jagattunaku upādānakāraṇamu, nimittakāraṇamu īśvaruḍē, paramātmayē.sāli purugu dāni gūḍu kaṭṭukonuṭaku kāvalasina dāramulanu tanaśarīramulōnuṃḍē tīsukonuṭa cēta tanagūḍuku tānē upādānakāraṇamunnū, āgūḍu kaṭṭunadikūḍā tānē aguṭacēta nimitta kāraṇamunnū ayi unnadi. ā prakāramugānē īśvaruḍu (paramātma) jagattunaku upādānakāraṇamunnū, nimitta kāraṇamunnū ayi yunnāḍu - sālepurugu viṣayamulō jaḍavastuvaina tana śarīramunuṃḍi sālepurugu dāramulanu paiki tīyuṭavalana dāni śarīramu upādānakāraṇamunnū, ā sālepurugu śarīramulōnunna aṃtaḥkaraṇamutō kūḍina caitanyaśakti (paramātmaśakti) nimittakāraṇamu agucunnadi. ā prakāramugānē paramātmayokka śarīrarūpamaina jaḍamagu māya (prakṛti) jagattunaku upādānakāraṇamu, paramātmalōnunna caitanyaśakti nimittakāraṇamu ayi unnadi. aṃdu. cēta okaḍē ayina īśvaruḍu (paramātma) jagattunaku upādānakāraṇamunnū, nimittakāraṇamunnū ani ceppuṭaku sālepurugu dṛṣṭāṃtamugā ceppabaḍinadi).
(maṭṭi yunnanu - upādānakāraṇamunnanu - kummarivāḍulēnidē maṭṭikuṃḍa tayāravadu. aṭlē kummarivāḍu unnanu,maṭṭilēniyeḍala maṭṭikuṃḍa tayārukādu. aṃducētamaṭṭikuṃḍa tayāraguṭakumaṭṭi, kummarivāḍu - upādānakāraṇamu, nimittakāraṇamu - reṃḍunū uṃḍavalenu. aṃducēta sṛṣṭilō prativastuvulōnu prakṛti pariṇāmavastuvu (prakṛti aṃśa), bhagavaṃtuni cicchakti reṃḍunū unnavi. iṃduvalananē prativastuvulōnu bhaganvatuḍu unnāḍani ceppabaḍinadi - (prahlāduni vacanamu - “iṃdugalaḍaṃdulēḍani saṃdēhamu valadu - - -”).
“mama yōnirmahadbrahma tasmingarbhaṃ dadhāmyahaṃ |
saṃbhavaḥ sarvabhūtānāṃ tatō bhavati bhārata |
sarvayōniṣu kauṃtēya mūrtayaḥ saṃbhavaṃti yāḥ |
tāsāṃ brahmamahadyōnirahaṃ bījapradaḥ pitā ||” (śrīmadbgavadgīta - 14 - 3, 4)
(iccaṭa mahadbrahmayanagā prakṛti - vṛddhipoṃdunadi, jagattugā tānē mārunadi - jagattunaku upādānakāraṇamainadaguṭa cēta brahma ani ceppabaḍinadi.ī prakṛtiyē caturmukhabrahma - aṭṭi prakṛti parabrahmaki yōnisthānamu - aṃdulōnuṃḍi maṟiyoka vastuvunu - jagattunu - puṭṭiṃcunadi - tānē jagattugā māṟinadi. aṃducēta kuṃḍaku maṭṭivale jagattunaku upādānakāraṇamainadi. dānilō nēnu (parabrahma) nā cicchaktiyanu sṛṣṭibījamu (vṛkṣamunaku bījamuvale) nuṃcudunu - dānivalana samasta bhūtamulu puṭṭucunnavi. sṛṣṭilōni kāraṇavastuvulanniyu yōnulu - vāṭi anniṃṭikī mūlakāraṇamaina prakṛtimahadyōni. ā yōnulanniṃṭilōnuṃḍi puṭṭina kāryavastuvulaku bījamu niccinavāḍanu nēnē. aṃducēta nēnē vāṭiki taṃḍrini - jagattu aṃtaṭakī taṃḍrini, prakṛti jagattunaku talli- rūpamulanu kaligiṃcunadi kanuka –
“jagataḥ pitarauvaṃdē pārvatī paramēśvarau ||”.
(jagattunaku talitaṃḍrulaina pārvatī paramēśvarula guṟiṃci namaskariṃcucunnānu).
“bījaṃ māṃ sarvabhūtānāṃ viddhi pārtha,sanātanaḥ |”
(samasta bhūtamulaku bījamu sanātanuḍanaina nēnē yani telusukonumu)
- - - (ahaṃ ta tō hariḥ |
sarvajñō(a)naṃtaśaktiśca māyōpādhi radhīśvaraḥ |
sarvasya kārya vargasya jagatō janmakāraṇaṃ ||” (gītābhāvaprakāśamu - 7 - 39, 40)
(sarvajñuḍanu, māya yani ceppabaḍu prakṛtini upādhigā cēsukoninavāḍanu ayina nēnu (parabrahma) sanastamaina jagattu puṭṭuṭaku kāraṇamainavāḍanu).
śakti śivakāraṇuṃḍavai jagatinirvi
kāra brahmaṃbavagu ninnu gaḍigi viśva
nādhugāne āgedanā manamuna nabhava”
“tē. samatanadigāka tāvakāṃśaṃbu laina
śakti śivarūpamula grīḍasalupu dūrṇa
nā bhigati viśvajananavināśavṛddhi
hētu bhūtuṃḍavagucuṃdu vīśa, rudra. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 6 - 145,146)
vinutikekkina yaṭṭi yavidya yaṃdu.
“ka. puruṣākṛti nātmāṃśa
sphuraṇamugala śakti nilipi puruṣōttamu ḍī
śvaruḍabhavuṃḍajuḍu nijō
dara saṃsthita viśvamapuḍu dagabuṭṭiṃcen” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - 199, 200)
(trāḍunaku pēnina reṃḍu dāramulu kāraṇamayinaṭlu māyatō kūḍina brahma jagattunaku kāraṇamu; lēka māya yanu śakti galigina brahma kāraṇamu, lēka jagattunaku upādānakāraṇamaina māya āśrayamugā gala brahma kāraṇamu).
(śrīśaṃkaraḥ - brahmasūtrabhāṣyē - 2 - 1 - 25)
(lōkamulō kummarivāḍu modalagu cētanavastuvulu ēpanicēsinanu, dānikikāvalasina sāmagrini apēkṣiṃcē cēyucunnāru. kummarivāniki kuṃḍalu cēyuṭaku cakramu, daṃḍamu kāvalasi yunnadi. avilēka kuṃḍacēyalēḍu. sat ayina brahma - cētanamaina brahma ē sahāyamu lēnidē eṭlu jagattunaku cēyucunnāḍu ? sālepurugu tanaṃtaṭa tānē dāramunu sṛjiṃcucunnadi - ā prakāramugānē cētanamaina brahma itara sahāyamunapēkṣiṃpakanē tanaṃtaṭa tānē jagattunu sṛṣṭiṃcu cunnāḍu).
(karaṇamulu lēkapōyinanu kāryamukaluguṭaku avakāśamunnadi. kṣīramulu upakaraṇamula avasaramu lēkanē perugu agucunnavi. aṭlēbrahmanuṃḍi jagattupuṭṭuṭaku upakaraṇamulēdu - brahmaku kāryamu karaṇamu lēvu. atanitō samānuḍugāni adhikuḍugāni lēḍu - ataniśaktulu jñānamu,balamu, kriya vēru. atanitō pōlcataginadi jagattulō lēdu. aṃducēta jagattulō lēnivastuvulatō ataniśakti pōlcuṭaku alavikādu - ī śaktulu ataniki svābhāvikamulu).
advitīya manādyaṃtaṃ yadādyamupalaṃbhanaṃ |
apratarkyamavijñēyaṃ tacchivaṃ śāṃtamavyayaṃ |
tat kathaṃ kasya kēnaiva kartṛvā bhōktṛvā bhavēt |
atōnēraṃ kṛtaṃ kiṃci jjagadētanna vidyatē |
cinmātra kalpitō vēdhāści dēvēti viniścayaḥ |
tanmātra janita ssargadātmaka iti sthitiḥ ||“.
“anaṃtādi lakṣaṇaṃ yadādyamupalaṃbhanaṃ jñānasvarūpaṃ vastvasti. tadvastu śivaṃ śāṃtaṃ avyayaṃ cētikṛtvā tatkathaṃ kēnaprakārēṇa kartṛ bhavēt ?,kasyavā svavyatirikta kāryasyā bhāvāt. kēnavā upakaraṇēna? nakēnacit, tasyāpyabhāvāt. ēvaṃ kartṛtvābhāvāt idaṃ jagat kiṃcidapi na kṛtaṃ. ataśca vēdhāści nmātra parikalpitatvāt cidēva, sargaśca tanmātra janitaḥ cinmātra rūpiṇā vēdha saiva janitatvāt tadātmakaḥ, cinmātrakaḥ ityēvaṃ sthitō niścitaḥ”.
(paramātma, parabrahmamu anuvāḍu anaṃtuḍu (aṃtamulēni śaktigalavāḍu), janma lēnivāḍu, vyaktamu kānivāḍu (kanabaḍanivāḍu), ajaruḍu (musalitanamu lēnivāḍu - kṣīṇiṃcanivāḍu),śāṃtuḍu, acyutuḍu (tanaśaktilōgāni, tanapadavinuṃḍigāni ennaḍu digajāranivāḍu), tanutappa marokavastuvu lēnivāḍu, janmakāni, vināśamukāni lēnivāḍu, eṭuvaṃṭivāḍu ani tarkiṃcuṭaku vīlulēnivāḍu, telusukonuṭaku vīlulēnivāḍu, vyayarahituḍu, aṭuvaṃṭi paramātma eṭlu dēniki kartagāni, bhōktagāni kāgalaḍu ? aṃducēta ī jagattu evaricētanu kalpiṃcabaḍinadikādu - sṛṣṭiṃpabaḍinadikādu. cinmātruḍu - caitanyumē ayina parabrahmacēta kalpiṃcabaḍina jaturmukhabrahma (avyaktamu, lēka prakṛti) cinmātramē yagunu. aṭṭi cinmātramaina caturmukhabrahmanuṃḍi puṭṭina jagattukūḍa cinmātramē) - aṃtā parabrahmamē - idiyē siddhāṃtamu).” nakartā sti, nabhōktāsti sarvaṃ śāṃtamajaṃ śivaṃ” (kartayanuvāḍulēḍu, bhōktayanuvāḍu lēḍu. sarvamu janmalēnidinnī, mārpulēnidinnī maṃgaḷapraduḍaina śivuḍu).”
“koṃdaṟu ī jagattunaku kāraṇamē lēdani, lēka bhagavaṃtuḍu kāraṇamukādani, evarimatānusāramugā vāru vādiṃcucunnāru - kāni, ī vādanalanniyu khaṃḍiṃpabaḍinavi, bhagavaṃtuḍē kāraṇamani siddhāṃtamu cēyabaḍinadi. adi eṭlaṃṭē : -
“u. karma vaśaṃbunan jagamu galgunu, heccu, naḍaṃgu nannacō
garmamu buddhi jūḍa jaḍa kāryamugāni, prapaṃcakalpanā
karmamanaṃdu gartayanagā vilasillaga jāladī jaga
tkarmaka kāryakāraṇamu gāvuna nīśuḍu viṣṇuḍārayan” (pōtana telugu bhāgavatamu- 4 -581)
(kūṭastuḍai yē paniyunu cēyakayuṃḍi, kriyārahituḍaguṭavalana brahma jagatkāraṇamukādu - satvarajastamōguṇamulu kaligiyuṃḍuṭavalana kriyāśaktigala prathānamē jagattunaku kāraṇamu ani sāṃkhyulavādamu - ī vādamu kudaradu - eṃducētananagā : -
“nasāṃkhyā kalpitaṃ acētanaṃ prathānaṃ jagataḥ kāraṇaṃ śakyaṃ vēdāṃ tēṣṭvāśrayituṃ, aśabdaṃ hi tat” –
(śrī śaṃkaraḥ - brahmasūtrabhāṣyē)
(sāṃkhyamatamulō kalpiṃcabaḍina prathānamanunadi acētanamaguṭavalana, upaniṣattulalō ceppabaḍiyuṃḍaka pōvuṭavalana jagattunaku kāraṇamani ceppuṭaku valanupaḍadu. adi aśabdamu - anagā aṭlu vēdamulō ceppabaḍiyuṃḍalēdu - śabdamu anagā vēdamu).
(‘aśabdatvāt’ ani brahmasūtramu, anagā avēdapramāṇatvāt - vēdamulō dīniki pramāṇamu lēnaṃduna - prathānamanunadi kāraṇamani vēdamulō ceppabaḍiyuṃḍakapōvuṭavalana. “nahi acētanasya prathānasya īkṣitṛtvaṃ saṃbhavati, tasya cētana dharmatvāt. na ca kūṭasthabrahmaṇaḥ jñānakriyā śaktyabhāvaḥ, māyā mahinnū sarvasyā syupattēḥ. ataḥ sat īkṣitṛ cētanaṃ brahmaiva jagadupādānaṃ”. (bhāṣyārtharatnamāla)
(“sa īkṣita” (brahma saṃkalpiṃcenu) ani sṛṣṭi prāraṃbhamuguṟiṃci ceppabaḍenu. “sa akāmayata”
(brahma kōrenu - jagattugā māredanu, jagattunu sṛṣṭiṃcedanu) aniyu kūḍāceppabaḍenu. īkṣitṛtvamu valananē, dṛjmātramucētanē sṛṣṭi jariginadi. īkṣitṛtvamu cētanadharmamu - caitanyamugala vastuvuyokka dharmamu - śakti (Energy). ī śakti acētanamagu prathānamunaku lēdu - kūṭasthabrahmaku jñānakriyāśaktulu lēkapōlēdu. tanaku upādhigācēsukonina māyā mahimacēta samasta śaktulu kaligiyē yunnavi. aṃducēta satpadārthamu, īkṣitṛ cētanaśakti galadi yagu parabrahmamē jagattunaku upādānakāraṇamu).
(abhāvamunuṃḍi bhāvamukaluguṭayē nijamaitē - anagā, lēnivastuvunuṃḍi okavastuvu puṭṭgaligi unnayeḍala, ēpani cēyaka, taṭasthamugānunnavānikainanu, ē prayatnamu cēyakapōyinanu, ē kōrikalu lēnivārikainanu vāriki kāvalasinavanniyu siddhiṃcavalenu - vyavasāyadāruḍu polamunu dunnakanē sasyamu paṃḍavalenu; kummarivāḍu maṭṭini sādhiṃcakanē kuṃḍa tayārukāvalasiyuṃḍunu; sālepurugu tanaśarīramulōnuṃḍi kummarivāḍu maṭṭini sādhiṃcakanē kuṃḍa tayāru kāvalasiyuṃḍunu, sālepurugu tana śarīramulōnuṃḍi tīyakanē gūḍu tayārukāvalenu, baṭṭalunēyuvāḍu dāramu lēkuṃḍa ganē baṭṭa tayārukāvalasi yuṃḍunu. ī prakāramugā evaru ayinanu aṃdukutagina prayatnamu cēyakanē, kōrakuṃḍaganē svargāpavargamulu poṃdagaluguduru. ī paristhiti kudaradu. idi prakṛti viruddhamu. aṃducēta abhāvamunuṃḍi bhāvamu puṭṭanēradu - ēmī lēnidāninuṃḍi jagattu kalugadu -).
śūnyamu jagatkāraṇamu anikoṃdaṟi abhiprāyamu. vittanamulēka mokkamolacuṭalēdu. aṃducēta śūnyamunuṃḍi jagattu puṭṭiyuṃḍadu - iṭlu puṭṭuṭa asaṃbhavamu.
paramāṇuvulu jagatkāraṇamani naiyāyikula abhiprāyamu : -
“brahmavinā jagajjanmādikaṃ nasaṃbhavati, kāraṇāṃtarā saṃbhavāt - - - paramāṇunā acētanānāṃ svataḥ
(pravṛttya yōgāt - jīvānyasya jñāna śūnyatva niyamēnānu mānāt sarvajñēśvarā siddhau tēṣāḥ prērakā bhāvāt jagadāraṃbhakatvā saṃbhavaḥ -
(jagattunaku brahmakāraṇamu kāniyeḍala jagattu puṭṭuṭa, peruguṭa, naśiṃcuṭa jaruganēradu - iṃkoka kāraṇamu lēnaṃduna. paramāṇuvulu acētanamulaguṭavalana vāṭaṃtaṭa avi pravṛttini kalugacēyalēvu. jīvuḍu tappa migilinavi jñānaśūnyamulu. sarvajñuḍu (sṛṣṭi vidānamu telisinavāḍu) ayina īśvaruḍu, (brahma) lēniyeḍala - vāṭilō aṃtaryāmigā lēniyeḍala - vāṭini tana caitanyaśaktitō prērēpiṃcuvāḍu uṃḍaḍu kanuka avi jagattu nu puṭṭiṃcuṭa asaṃbhavamu).
(aṇuvu aṇuvulōnu bhagavaṃtuḍu tana cicchaktirūpamulōnuṃḍi vāṭini okadānitōnokaṭi ākarṣiṃpacēsi okapadārthamugā aguṭaku avakāśamu kalpiṃcucunnāḍu (Every particle of matter contains Energy. Every particle of matter attracts every other particle). iṃduvalananē paramāṇuvulu okadānitō okaṭi kalisi padārthamuluganu, aṭṭi padārthamulanniyu kalisi jagattunu agucunnavi. ī paramāṇuvulalō bhagavaṃtuni śaktilēni yeḍala - bhagavaṃtuḍu tana śaktirūpamulō lēniyeḍala avi jagattunaku kāraṇamukānēravu. vāṭilōnuṃḍi,vāṭiki tana cicchaktinicci vāṭini prērēpiṃcu parabrahmayē jagattunaku kāraṇamu).
“na ca svabhāvataḥ viśiṣṭadēśakāla nimittānāṃ ihōpādānāt”
(jagatsṛṣṭilō dēśakālanimittamulu upādānakāraṇamulu. aṃducēta svabhāvamu jagatkāraṇamu kādu. goḍrālu vīryavaṃtamainadainanu garbhōtpatti svabhāvamu valana kaluguṭalēdu - aṃducēta svabhāvamu jagatkāraṇamukādu - jagatsṛṣṭiki dēśakālaśaktulukūḍā avasaramu -kālamu jariginakoladiyē oka vastuvulō pariṇāmamukaligi aṃdulōnuṃḍi iṃkoka vastuvu puṭṭuṭa).
koṃdaṟu kālamu jagatkāraṇamaṃduru. kālamu bhagavaṃtuni śakti - idi bhagavaṃtunivale mūḍukālamulaṃduḍanadi. ayinanu kāryamulanniyu ellapuḍu uṃḍavu. aṃducēta kālamu jagatkāraṇamukādu -
adṛṣṭamu jagatkāraṇamani mīmāṃsukulanucunnāru. adṛṣṭamu jaḍamaguṭavalana ī kāraṇamuvalana ī kāryamu jarugucunnadani ceppuṭakuvīlulēdu - aṃducēta adṛṣṭamu jagatkāraṇamukādu -
paṃcabhūtamulu kāraṇamani maṟikoṃdaṟi abhiprāyamu - paṃcabhūtamulu jaḍamulu. vāṭiki maṟiyoka kāraṇamunnadi. kanuka avi jagatkāraṇamukādu.
(paina ceppina prakāramu vividhavādamulanniyu nirākariṃcabaḍinavi. siddhāṃtamēmanagā - bhagavaṃtuni aparāśakti ayina prakṛtilō atani parāśakti ayina caitanya śaktitō bhagavaṃtuḍu kaliyuṭacētanē sṛṣṭi jarugucunnadi. aṃducēta bhagavaṃtuḍē, parabrahmayē jagattunaku kāraṇamu.ī reṃḍu śaktulalōnu okaṭi upādānakāraṇamu, reṃḍavadi nimittakāraṇamu).
“maṟiyu neṭlannanu cētanuṃḍaina jīvuṃḍu jagatkartayagunanina kiṃcijñatva, adṛṣta parataṃtratva, anīśvaratvādi dōṣaṃbulu galuguṭaṃjēsi jagaṃbu sṛjiyiṃpa yōgyaṃbukādu. aṭlaguṭaṃjēsi pāriśēṣa nyāyaṃbuna paramēśvaruṃḍu jagatkartayaguṭa niścayaṃbu”. (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)
sanmūlāḥ sōmēmāḥ prajāḥ “ityādiśru tyā sata ēva jagatkāraṇā vagamācca”. asadvā idamagra āsīt”
(taittirīyōpaniṣat - 2 - 7)
iti śruti sthā satsadaṃtu anabhivyakta nāmarūpatvēna gauṇāyāvṛtyā satyēva yōjanīyaṃ “iti nyāyāt”
(brahmasūtrabhāṣyamu)
(śūnyamu jagattunaku kāraṇamu kājāladu. “asattunuṃḍi satpadārthameṭlu puṭṭagaladu - anu tarkamu nanusariṃci ceppu śrutivākyamuvalana asattu kāraṇamukājāladu ani niṣēdhiṃpabaḍinadi.”satpadārthamē jagattu puṭṭu ṭakumuṃdu uṃḍenu” ani chāṃdōgyōpaniṣattulōnu - ī prajalaṃdaru, ī puṭṭinavastuvulanniyu satpadārthamē kāraṇamugā galavi - satpadārthamulōnuṃḍi puṭṭinavē” anu modalagu śrutivākyamulavalananū, satpadārthamē jagattunaku kāraṇamani teliyucunnadi. “asatpadārthamu jagattu puṭṭakamuṃduṃḍenu” - ani taittirīyōpaniṣattulō ceppabaḍina asatpadārthamanagā vyaktamugāka - sūkṣmāti sūkṣma daśalōnunna, kāraṇarūpamulōnunnaṭuvaṃṭidinnī, nāmarūpamulu galigiyuṃḍuṭacēta - gauṇa vṛttini poṃdina satpadārthamēyani yōciṃcukonavalasinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.