← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జలతత్వము jalatatvamu

Original — తెలుగు
  1. సూక్ష్మరూపములోనున్న జలము - పంచీకృతము కాని స్థితిలోనున్న జలము. (Hydrogen gas).

  2. “అతండె పరమాత్మయును. నమ్మహాత్ముండు లీలార్థంబై జగత్సర్జనంబు సేయు తలంపున బ్రహ్మాండంబు వినిర్భేదించి తనకు సుఖశయనంబు నపేక్షించి మొదల జలతత్వంబు సృజియించె స్వతః పరిశుద్దుండుగావున స్వ సృష్టంబై యేకార్ణవాకారంబైన జలరాశియందు శయనంబు జేయుటం జేసి –

“శ్లో. అపోనారా ఇతి ప్రోక్తా అపోవైనరసూ నవః |

అయనం తస్యతాః పూర్వం తేన నారాయణః స్మృతః ||”

యను ప్రమాణము చొప్పున నారాయణ శబ్ద్వాచ్యుండు -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - 268)

(నరుడు అనగా క్షీణించనివాడు - పరమాత్మ నిత్యుడు - అతనిలోనుండి పుట్టినవి నారములు - ఉదకములు - ఆ ఉదకములే తాని నివసించుటకు స్థానముగా చేసుకొని వాటిలోనున్నవాడు కనుక భగవంతుడు నారాయణుడని చెప్పబడుచున్నాడు. “మొదల జలతత్వమును సృజియించె”అని చెప్పబడియున్నది. జలతత్వమనగా సూక్ష్మరూపములోనున్న జలము. అందులో భగవంతుడు శయనించియున్నాడు - అనగా ప్రాణవాయువు (Oxygen) రూపములో నీటిలోనున్నాడు - (Hydrogen + Oxygen = Water) - అందుచేత “ఆపోమయః ప్రాణాః” (ప్రాణములు జలమయములు) అని చెప్పబడినది - ప్రాణవాయువునకు జలము ఆఛ్ఛాదనము.

  1. “అగ్నియొక్క నిజాంశమే రసవిషయమాయెను, పృధివితో గూడగాను గంధివిషయమాయెను, అగ్నితో గూడంగాను రూపవిషయమాయెను, ఆకాశానగూడి శబ్దవిషయమాయెను. ఇవి జలతత్వ భేదాలు”. (బ్రహ్మవిద్యాసుధార్ణవము -
  2. “మూత్రం రక్తస్థధా శ్లేష్మం శుక్లం మేధస్తు పంచమః ఆపః పంచగుణాః ప్రోక్తాస్సమాంశాః పరికీర్తితాః||”.

(జలము అయిదు గుణములు గలది - మూత్రము, రక్తము, శ్లేష్మము, శుక్లము, మేధస్సు. త్రాగిన జలముయొక్క స్థూలభాగము మూత్రముగాను, సూక్ష్మభాగము రక్తముగాను, అతిసూక్ష్మభాగము ప్రాణముగా పరిణమించును.

  1. “తేజంబు గాలమాయాంశ యోగంబున నుత్తమ శ్లోకుని విలోకనంబున బవమానయుక్తంబగుచు రసతన్మాత్రంబువలన నంబువులంబుట్టించె. సలిలంబుగాల మాయాంశ యోగంబునం బరమేశ్వరానుగ్రహంబుగలిగి, తేజోయుక్తంబయిన గంధగుణంబువలనం బృధివిగలిగించె”- -” సలిలంబునకు శబ్ద స్పర్శరూప రసంబులును - - - గుణంబులై యుండు”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - 202)

  1. అగ్నియొక్క ఉరుమే జలము, ఆయప్పు బలియంగాను పృధివి “. (నీరు గడ్డ కట్టి, భూమిగా మారెను)”

ఆ ఆకాశమే అప్పు సంయోగాన చిత్తమాయెను - - - వాయువు - - - జీవనముం గూడి అపానవాయువాయెను”

(బ్రహ్మవిద్యాసుధార్ణవము - 1)

Transliteration
  1. sūkṣmarūpamulōnunna jalamu - paṃcīkṛtamu kāni sthitilōnunna jalamu. (Hydrogen gas).

  2. “ataṃḍe paramātmayunu. nammahātmuṃḍu līlārthaṃbai jagatsarjanaṃbu sēyu talaṃpuna brahmāṃḍaṃbu vinirbhēdiṃci tanaku sukhaśayanaṃbu napēkṣiṃci modala jalatatvaṃbu sṛjiyiṃce svataḥ pariśudduṃḍugāvuna sva sṛṣṭaṃbai yēkārṇavākāraṃbaina jalarāśiyaṃdu śayanaṃbu jēyuṭaṃ jēsi –

“ślō. apōnārā iti prōktā apōvainarasū navaḥ |

ayanaṃ tasyatāḥ pūrvaṃ tēna nārāyaṇaḥ smṛtaḥ ||”

yanu pramāṇamu coppuna nārāyaṇa śabdvācyuṃḍu -” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - 268)

(naruḍu anagā kṣīṇiṃcanivāḍu - paramātma nityuḍu - atanilōnuṃḍi puṭṭinavi nāramulu - udakamulu - ā udakamulē tāni nivasiṃcuṭaku sthānamugā cēsukoni vāṭilōnunnavāḍu kanuka bhagavaṃtuḍu nārāyaṇuḍani ceppabaḍucunnāḍu. “modala jalatatvamunu sṛjiyiṃce”ani ceppabaḍiyunnadi. jalatatvamanagā sūkṣmarūpamulōnunna jalamu. aṃdulō bhagavaṃtuḍu śayaniṃciyunnāḍu - anagā prāṇavāyuvu (Oxygen) rūpamulō nīṭilōnunnāḍu - (Hydrogen + Oxygen = Water) - aṃducēta “āpōmayaḥ prāṇāḥ” (prāṇamulu jalamayamulu) ani ceppabaḍinadi - prāṇavāyuvunaku jalamu āchchādanamu.

  1. “agniyokka nijāṃśamē rasaviṣayamāyenu, pṛdhivitō gūḍagānu gaṃdhiviṣayamāyenu, agnitō gūḍaṃgānu rūpaviṣayamāyenu, ākāśānagūḍi śabdaviṣayamāyenu. ivi jalatatva bhēdālu”. (brahmavidyāsudhārṇavamu -
  2. “mūtraṃ raktasthadhā ślēṣmaṃ śuklaṃ mēdhastu paṃcamaḥ āpaḥ paṃcaguṇāḥ prōktāssamāṃśāḥ parikīrtitāḥ||”.

(jalamu ayidu guṇamulu galadi - mūtramu, raktamu, ślēṣmamu, śuklamu, mēdhassu. trāgina jalamuyokka sthūlabhāgamu mūtramugānu, sūkṣmabhāgamu raktamugānu, atisūkṣmabhāgamu prāṇamugā pariṇamiṃcunu.

  1. “tējaṃbu gālamāyāṃśa yōgaṃbuna nuttama ślōkuni vilōkanaṃbuna bavamānayuktaṃbagucu rasatanmātraṃbuvalana naṃbuvulaṃbuṭṭiṃce. salilaṃbugāla māyāṃśa yōgaṃbunaṃ baramēśvarānugrahaṃbugaligi, tējōyuktaṃbayina gaṃdhaguṇaṃbuvalanaṃ bṛdhivigaligiṃce”- -” salilaṃbunaku śabda sparśarūpa rasaṃbulunu - - - guṇaṃbulai yuṃḍu”

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - 202)

  1. agniyokka urumē jalamu, āyappu baliyaṃgānu pṛdhivi “. (nīru gaḍḍa kaṭṭi, bhūmigā mārenu)”

ā ākāśamē appu saṃyōgāna cittamāyenu - - - vāyuvu - - - jīvanamuṃ gūḍi apānavāyuvāyenu”

(brahmavidyāsudhārṇavamu - 1)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.