← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జంబూద్వీపము jaṃbūdvīpamu

Original — తెలుగు
  1. “జంబూద్వీపంబు భూపద్మంబునకు మధ్య ప్రదేశంబున లక్షయోజనంబుల వెడల్పు నంతియ నిడువునుం గలిగి కమలపత్రంబునుంబోలె వర్తులాకారంబయి నవసహస్ర యోజన పరిమితాయంబునుంగల నవ వర్షంబుల నష్ట మర్యాదాగిరులునుంగలిగి విభాలక్తంబయి యుండు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 2 - 16 -
  2. “శా. సంబంద్ధోరుతతరప్రకాండని చయ ఛ్చన్నాంబరప్రోల్లస

జ్జంబూ భూజపతత్ఫల ప్రజ రసస్రావ స్రవంతీ తటీ

జంబాలోజ్జ్వల హేమకాంతి విహితాశాకోణమై యుండుటన్

జంబూద్వీపమనంగ బెంపెసగు భాస్వల్లీల శోభిల్లుచున్. (కులశేఖరమహీపాలచరిత్ర - ఆశ్వా - 2)

Transliteration
  1. “jaṃbūdvīpaṃbu bhūpadmaṃbunaku madhya pradēśaṃbuna lakṣayōjanaṃbula veḍalpu naṃtiya niḍuvunuṃ galigi kamalapatraṃbunuṃbōle vartulākāraṃbayi navasahasra yōjana parimitāyaṃbunuṃgala nava varṣaṃbula naṣṭa maryādāgirulunuṃgaligi vibhālaktaṃbayi yuṃḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 2 - 16 -
  2. “śā. saṃbaṃddhōrutataraprakāṃḍani caya chcannāṃbaraprōllasa

jjaṃbū bhūjapatatphala praja rasasrāva sravaṃtī taṭī

jaṃbālōjjvala hēmakāṃti vihitāśākōṇamai yuṃḍuṭan

jaṃbūdvīpamanaṃga beṃpesagu bhāsvallīla śōbhillucun. (kulaśēkharamahīpālacaritra - āśvā - 2)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.