← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జంతవః jaṃtavaḥ

Original — తెలుగు
  1. జనన ధర్మాః

(పుట్టుట వాటి ధర్మము - స్వభావము - నైజముగా గలవి).

  1. ‘జన్’ ధాతువునకు జన్మించుట యని అర్థము - జన్మ కలవన్నియు జంతువులు -

  2. బ్రహ్మాది స్తంబ పర్యంత ప్రాణి జాతం. (చతుర్ముఖ బ్రహ్మ మొదలు స్తంబము వరకు గల ప్రాణులు)

ప్రాణినః; జీవాః (ప్రాణము గలవి, జీవించియున్నవి).

  1. అజ్ఞాః, జ్ఞానహీనాః, పామర జనాః ; ఇదమీ దృగితి నిశ్చేతు మసమర్థాః ఇత్యర్థః.

(జ్ఞానము లేనివారు; పామరులు; ఇది ఇటువంటిది అని నిశ్చయించు సమర్థత లేనివారు -).

  1. “ఆహార నిద్రా భయ మైధునంచ సామాన్యమే తత్ప శుభిర్నరాణాం} జ్ఞానం నరాణా మధి కో విశేషః జ్ఞానేన హీనః పశుభిస్సమానః”

(జంతువులలో - జన్మముకలవాటిలో - నరులకు ఆహారము, నిద్ర, భయము, మైధునము అనునవి పశువు లతో సమానముగనే కలుగును - ఈ విషయములో జంతువులు, నరులు సమానమే - కాని నరులకు జ్ఞానము అనునది పశువులకంటె అధికము. అదియే నరులందు విశేషము. కాని ఆ జ్ఞానములేని నరుడు పశువులతో సమానుడు - (Man belongs to the animal kingdom). (జంతువులలో నరజన్మ ఉత్తమము - నరులలో పురుషుడై పుట్టుట దుర్లభము) –

“వ. సకల జన్మంబు లందును ధర్మార్థాచరణ కారణంబయిన మానుష జన్మంబు దుర్లభంబు; అందు పురుషత్వంబు దుర్లభంబు - - -”). (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 6 - 213)

Transliteration
  1. janana dharmāḥ

(puṭṭuṭa vāṭi dharmamu - svabhāvamu - naijamugā galavi).

  1. ‘jan’ dhātuvunaku janmiṃcuṭa yani arthamu - janma kalavanniyu jaṃtuvulu -

  2. brahmādi staṃba paryaṃta prāṇi jātaṃ. (caturmukha brahma modalu staṃbamu varaku gala prāṇulu)

prāṇinaḥ; jīvāḥ (prāṇamu galavi, jīviṃciyunnavi).

  1. ajñāḥ, jñānahīnāḥ, pāmara janāḥ ; idamī dṛgiti niścētu masamarthāḥ ityarthaḥ.

(jñānamu lēnivāru; pāmarulu; idi iṭuvaṃṭidi ani niścayiṃcu samarthata lēnivāru -).

  1. “āhāra nidrā bhaya maidhunaṃca sāmānyamē tatpa śubhirnarāṇāṃ} jñānaṃ narāṇā madhi kō viśēṣaḥ jñānēna hīnaḥ paśubhissamānaḥ”

(jaṃtuvulalō - janmamukalavāṭilō - narulaku āhāramu, nidra, bhayamu, maidhunamu anunavi paśuvu latō samānamuganē kalugunu - ī viṣayamulō jaṃtuvulu, narulu samānamē - kāni narulaku jñānamu anunadi paśuvulakaṃṭe adhikamu. adiyē narulaṃdu viśēṣamu. kāni ā jñānamulēni naruḍu paśuvulatō samānuḍu - (Man belongs to the animal kingdom). (jaṃtuvulalō narajanma uttamamu - narulalō puruṣuḍai puṭṭuṭa durlabhamu) –

“va. sakala janmaṃbu laṃdunu dharmārthācaraṇa kāraṇaṃbayina mānuṣa janmaṃbu durlabhaṃbu; aṃdu puruṣatvaṃbu durlabhaṃbu - - -”). (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 6 - 213)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.