← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జనః janaḥ

Original — తెలుగు
  1. జనుడు; మనుష్యుడు - జీవుడు ; జీవలోకము - జనలోకము.

  2. జాయతే ఇతి జనః (పుట్టినది కనుక జనః - జన్మము కలది).

  3. జనిమంతః = జనాః సంసరంతః. ఇత్యర్థః -

(జన్మకలవారు జనులు - సంసారములో పడి జన్మలు కలవారు).

  1. సర్వజననకర్తా; సకల జగజ్జననకర్తృత్వాత్ జనః.

(అన్నింటినీ పుట్టించువాడు - జగత్తులలోనుండు జనులను సృష్టించువాడు).

  1. జనయతీతి జనః - సర్వకారణత్వముచ్యతే.

(పుట్టించువాడు; అన్నింటినీపుట్టించువాడగుటచేత అన్నింటికికారణమైనవాడు - భగవంతుడు).

  1. జంతూనాం అంతరాత్మానం చోదయతీతి జనః, జంతువర్గం నయతీతివా జనః.

(ప్రాణులకు అంతరాత్మయై ప్రేరేపించువాడు - ప్రాణులను కర్మానుగుణముగ ఆ యా జన్మలలో పుట్టించువాడు. సకల జంతువులచేత పని చేయించువాడు).

  1. జనాః లోకే త్రివిధా - ముక్తాః, ముముక్షవః, విషయిణః -

(లోకములో జనులు మూడువిధములు - ముక్తులు (ఇక్కడే, ఈ లోకములోనే ముక్తిని పొందినవారు. - జీవన్ముక్తులు), ముముక్షువులు (మోక్షమును కోరువారు - అందుకు కృషిచేయు వారు), విషయిణః - (విషయముల భోగమందు ఇచ్ఛ ప్రవృత్తి గలవారు) - పామరులు, పండితులు. వేత్తలు)

Transliteration
  1. januḍu; manuṣyuḍu - jīvuḍu ; jīvalōkamu - janalōkamu.

  2. jāyatē iti janaḥ (puṭṭinadi kanuka janaḥ - janmamu kaladi).

  3. janimaṃtaḥ = janāḥ saṃsaraṃtaḥ. ityarthaḥ -

(janmakalavāru janulu - saṃsāramulō paḍi janmalu kalavāru).

  1. sarvajananakartā; sakala jagajjananakartṛtvāt janaḥ.

(anniṃṭinī puṭṭiṃcuvāḍu - jagattulalōnuṃḍu janulanu sṛṣṭiṃcuvāḍu).

  1. janayatīti janaḥ - sarvakāraṇatvamucyatē.

(puṭṭiṃcuvāḍu; anniṃṭinīpuṭṭiṃcuvāḍaguṭacēta anniṃṭikikāraṇamainavāḍu - bhagavaṃtuḍu).

  1. jaṃtūnāṃ aṃtarātmānaṃ cōdayatīti janaḥ, jaṃtuvargaṃ nayatītivā janaḥ.

(prāṇulaku aṃtarātmayai prērēpiṃcuvāḍu - prāṇulanu karmānuguṇamuga ā yā janmalalō puṭṭiṃcuvāḍu. sakala jaṃtuvulacēta pani cēyiṃcuvāḍu).

  1. janāḥ lōkē trividhā - muktāḥ, mumukṣavaḥ, viṣayiṇaḥ -

(lōkamulō janulu mūḍuvidhamulu - muktulu (ikkaḍē, ī lōkamulōnē muktini poṃdinavāru. - jīvanmuktulu), mumukṣuvulu (mōkṣamunu kōruvāru - aṃduku kṛṣicēyu vāru), viṣayiṇaḥ - (viṣayamula bhōgamaṃdu iccha pravṛtti galavāru) - pāmarulu, paṃḍitulu. vēttalu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.