← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జనార్ధనుడు janārdhanuḍu

Original — తెలుగు
  1. జనాన్ మర్ధయతీతి జనార్ధనః; జనాన్ అసురాన్ అర్ధయతిపీడయతీతి జనార్ధనః, జనాన్ దుర్జనాన్ అర్ధయతీతి. హినస్తి, నరకాన్ గమయతి ఇతివా జనార్ధనః (శ్రీశంకరః)

(జనులలో అంతరాత్మగానుండి, ఇదివరకు జన్మలలో వారు చేసినపాపకర్మ ఫలముగా వారిని పీడించువాడు, జనులను - అసురభావముగలవారిని పీడించువాడు; జనులను, (దుర్జనులను) హింసించువాడు, నరకము పంపించువాడు).

  1. జనానాం దేవ శత్రూణాం ప్రాణాదీనామ్నియోగతః యాతనాగమయి తృత్వాద్య తస్త్వం శ్రీ జనార్ధనః ||“.

(దేవతులకు శత్రువులైన రాక్షసులు మొదలగువారి ప్రాణములు తీసి వారిని యాతనపొందించువాడు).

  1. జననం జన్మ అర్ధయతి హంతి భక్తస్య. (భక్తునికి మరల జన్మము కలుగకుండ చేసి, మోక్షమునిచ్చు వాడు).

  2. ప్రళయకాలే జనానర్ధయతి నాశయతీతి జనార్ధనః

(ప్రళయకాలమందు జనులను నాశమునొందింప చేయువాడు).

  1. జన్మ మరణాన్యర్ధయ తీతి, నాశయతి. (జనన మరణములు లేకుండ చేయువాడు) - (మోక్షమునిచ్చువాడు).

  2. “జనైః పురుషార్థం అభ్యుదయ నిశ్రేయసలక్షణం యాచ్యతే ఇతిజనార్ధనః”.(శ్రీశంకరః).

(అభ్యుదయ మోక్షలక్షణమగు పురుషార్ధమును పొందుటకు జనులచేత యాచింపబడుచున్నాడు, కనుక జనార్ధనుడు).

  1. జనం జననం, తత్కారణమజ్ఞానంచ, స్వసాక్షాత్కారేణ అర్ధయతినాశయతి ఇతి జనార్ధనః.

(పుట్టుట, చనిపోవుట, మరల పుట్టుట, మరల చనిపోవుట అను సంసారమునకు కారణమైన అజ్ఞానమును తాను సాక్షాత్కరించుటచేత నాశము చేయువాడు).

Transliteration
  1. janān mardhayatīti janārdhanaḥ; janān asurān ardhayatipīḍayatīti janārdhanaḥ, janān durjanān ardhayatīti. hinasti, narakān gamayati itivā janārdhanaḥ (śrīśaṃkaraḥ)

(janulalō aṃtarātmagānuṃḍi, idivaraku janmalalō vāru cēsinapāpakarma phalamugā vārini pīḍiṃcuvāḍu, janulanu - asurabhāvamugalavārini pīḍiṃcuvāḍu; janulanu, (durjanulanu) hiṃsiṃcuvāḍu, narakamu paṃpiṃcuvāḍu).

  1. janānāṃ dēva śatrūṇāṃ prāṇādīnāmniyōgataḥ yātanāgamayi tṛtvādya tastvaṃ śrī janārdhanaḥ ||“.

(dēvatulaku śatruvulaina rākṣasulu modalaguvāri prāṇamulu tīsi vārini yātanapoṃdiṃcuvāḍu).

  1. jananaṃ janma ardhayati haṃti bhaktasya. (bhaktuniki marala janmamu kalugakuṃḍa cēsi, mōkṣamuniccu vāḍu).

  2. praḷayakālē janānardhayati nāśayatīti janārdhanaḥ

(praḷayakālamaṃdu janulanu nāśamunoṃdiṃpa cēyuvāḍu).

  1. janma maraṇānyardhaya tīti, nāśayati. (janana maraṇamulu lēkuṃḍa cēyuvāḍu) - (mōkṣamuniccuvāḍu).

  2. “janaiḥ puruṣārthaṃ abhyudaya niśrēyasalakṣaṇaṃ yācyatē itijanārdhanaḥ”.(śrīśaṃkaraḥ).

(abhyudaya mōkṣalakṣaṇamagu puruṣārdhamunu poṃduṭaku janulacēta yāciṃpabaḍucunnāḍu, kanuka janārdhanuḍu).

  1. janaṃ jananaṃ, tatkāraṇamajñānaṃca, svasākṣātkārēṇa ardhayatināśayati iti janārdhanaḥ.

(puṭṭuṭa, canipōvuṭa, marala puṭṭuṭa, marala canipōvuṭa anu saṃsāramunaku kāraṇamaina ajñānamunu tānu sākṣātkariṃcuṭacēta nāśamu cēyuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.