← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జన్మ కర్మ ఫలం janma karma phalaṃ

Original — తెలుగు
  1. కర్మణః ఫలం కర్మఫలం, జన్మ ఏవకర్మణః ఫలం జన్మ కర్మఫలం.

(కర్మము వలన కలుగు ఫలము కర్మ ఫలము, జన్మమే కర్మ వలన కలుగు ఫలము).

  1. జన్మ కర్మాదేః సర్వస్య కర్మ శేషమూలత్వే స్మృతయశ్చ - వర్ణాః ఆశ్రమాశ్చ స్వకర్మ నిష్టాః ప్రేత్య స్వకర్మఫలం అనుభూయ తతశ్శేషేణ విశిష్ట దేశకులజాతి రూపాయుశ్శ్రుతవిత్త వృత్త సుఖమేధసః జన్మ ప్రతిపద్యంతే. విష్వంభో విపరీతా నశ్యంతి. “ఇతి తథా తతః పరివృత్తౌ కర్మఫలశేషేణ జాతిం రూపం, వర్ణం, బలం, మేధాం, ప్రజ్ఞాం, ద్రవ్యాణి ధర్మానుష్టానం ఇతి ప్రతిపద్యతే. తచ్చక్రవత్ ఉభయోః లోకయోః. సుఖ ఏవ వర్తతే”ఇత్యాదయః“.

(జన్మ కర్మాదులన్నింటికీ కర్మ శేషమే మూలము అను విషయములో స్మృతి ఇట్లు చెప్పుచున్నది : -

వర్ణాశ్రమ ధర్మముల పాటించినవారు చనిపోయి, వారికి కర్మఫలముననుభవించి, మిగిలిన కర్మఫలము వలన విశిష్టమైన - శ్రేష్టమైన దేశములో, జాతిలో, కులమందు, రూపముతో, దీర్ఘాయుష్మంతులై, జ్ఞానులై, ధనవంతులై, మంచివృత్తి చేయువారై, మంచిసుఖము, బుద్ధి గల జన్మలను పొందుదురు. ఇతరులు నశించెదరు“. తర్వాత మిగిలిన కర్మవలన మంచి జాతి, రూపము, వర్ణము, బలము, బుద్ధి, ప్రజ్ఞ, ధనము, ధర్మానుష్టానము కలవారగుదురు. ఇట్లు చక్రమువలె ఉభయలోకములందు సుఖముగనే యుందురు).

Transliteration
  1. karmaṇaḥ phalaṃ karmaphalaṃ, janma ēvakarmaṇaḥ phalaṃ janma karmaphalaṃ.

(karmamu valana kalugu phalamu karma phalamu, janmamē karma valana kalugu phalamu).

  1. janma karmādēḥ sarvasya karma śēṣamūlatvē smṛtayaśca - varṇāḥ āśramāśca svakarma niṣṭāḥ prētya svakarmaphalaṃ anubhūya tataśśēṣēṇa viśiṣṭa dēśakulajāti rūpāyuśśrutavitta vṛtta sukhamēdhasaḥ janma pratipadyaṃtē. viṣvaṃbhō viparītā naśyaṃti. “iti tathā tataḥ parivṛttau karmaphalaśēṣēṇa jātiṃ rūpaṃ, varṇaṃ, balaṃ, mēdhāṃ, prajñāṃ, dravyāṇi dharmānuṣṭānaṃ iti pratipadyatē. taccakravat ubhayōḥ lōkayōḥ. sukha ēva vartatē”ityādayaḥ”.

(janma karmādulanniṃṭikī karma śēṣamē mūlamu anu viṣayamulō smṛti iṭlu ceppucunnadi : -

varṇāśrama dharmamula pāṭiṃcinavāru canipōyi, vāriki karmaphalamunanubhaviṃci, migilina karmaphalamu valana viśiṣṭamaina - śrēṣṭamaina dēśamulō, jātilō, kulamaṃdu, rūpamutō, dīrghāyuṣmaṃtulai, jñānulai, dhanavaṃtulai, maṃcivṛtti cēyuvārai, maṃcisukhamu, buddhi gala janmalanu poṃduduru. itarulu naśiṃcedaru”. tarvāta migilina karmavalana maṃci jāti, rūpamu, varṇamu, balamu, buddhi, prajña, dhanamu, dharmānuṣṭānamu kalavāraguduru. iṭlu cakramuvale ubhayalōkamulaṃdu sukhamuganē yuṃduru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.