(ఇదివరకు లేని దేహము, ఇంద్రియములు మొదలగువాటిని గ్రహించుట. ఇదివరకు లేని దేహముతో ఆత్మకు సంబంధము కలుగుట - (ఆత్మనో దేహ సం యోగ విశేషః).
(జీవునకు తెలియకుండగనే అతను చేసిన కర్మవలన జన్మము కలుగుచున్నది).
విత్తనమునుండి మొక్క మొలచుట జన్మము - ఒక వస్తువులోనుండి ఇంకొక వస్తువు పుట్టుట జన్మము - కారణవస్తువునుండి కార్య వస్తువు పుట్టుట (ఆవిర్భవించుట) జన్మ. ఇది కాల కర్మ స్వభావములను శక్తులతోకూడిన భగవంతుడు ఆ వస్తువులలో తన చైతన్య శక్తితో - చిచ్ఛక్తితో - నుండుటవలన, వాటిని ప్రేరేపించుటచేత - తపింప చేయుటవలనకలుగుచున్నది - ఇదియే సృష్టి విధము).
“వర్తమాన వసంతాదికాలంబు భూత భావి వసంతాదికాల యోగ్యంబైన పుష్ప ఫలాదులు తత్కాల జ్ఞాపకంబు నెట్లుసేయు నట్లు భూత భావి జన్మంబులకు ధర్మాధర్మంబులు నిదర్శనంబు సేయుచునుండు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - -)
“జీవోపాధి భూతంబగు లింగదేహంబుచే స్వావాస భూతలోకంబునుండి లోకాంతరంబు నొందుచు బ్రారబ్దకర్మఫలంబులనుభవించుచు, మరలం గర్మాదులం దాసక్తుండగుచు - - - జీవుండు భూతేంద్రియ మనోమయంబైన దేహంబు గలిగియుండు. అట్టి దేహ నిరోధంబె మరణంబునావిర్భావంచె జన్మంబు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 31 - 1009)
యధా నహి వంధ్యా పుత్రః పరమార్థతః మాయ యావా కదాపి జాయతే, తథా కాలత్రయే అపి శశవిషాణవత్ అసతః అవిద్యమానస్య తత్వతః మాయ యావా అపి జన్మ న విద్యతే.
(పరమార్థదృష్టిలోకాని, మాయవలనకాని వంధ్యా స్త్రీకి ఎట్లుకుమారుడు కలుగుటలేదో, కుందేటికి కొమ్ము ఎట్లుపుట్టదో, అట్లే మూడుకాలములందును అసత్పదార్థమునుండి, లేనివస్తువునుండి, తత్వరీత్యాగాని,మాయవలనగాని, జన్మకలుగదు -మఱియొకవస్తువు పుట్టదు).
(పురుషునియొక్క శరీరమంతటినుండి సేకరించిన తేజస్సు కషాయరూపమై రేతస్సుగా మారును. ఆ రేతస్సు స్త్రీలో ఉంచబడి స్త్రీచే వృద్ధిపొందింపబడును - ఇది మొదటి జన్మ. ఆ రేతస్సు స్త్రీలో స్త్రీశరీరములోని అంగములవలె కలిసి పోవును. అందుచేత స్త్రీ దానిని తన శరీరములోని ఒక అంగమువలెనే భావించి పోషించును - ఇది తన రెండవ జన్మ. ఎందు చేతననగా తండ్రియే కొడుకై జన్మించునుకనుక - “పుత్రోవై ఆత్మనామాసి” అట్టి తండ్రి కాలముగడిచి వృద్ధుడైన తర్వాత చనిపోయి మరల జన్మించును - ఇది తన మూడవ జన్మ”.
(పుట్టినవానికి చావు తప్పదు - చనిపోయినవానికి మరల జన్మ తప్పదు).
(అవిద్య, దాని కార్యములు - వీటినే అజ్ఞానము వల్ల జన్మ మొదలగునవి అని భ్రమించుచున్నారు - అజ్ఞానము వలననే నేను జన్మను పొందినాను అని అనుకొనుట. అందుచేత అజ్ఞానమునకు అది ఉపలక్షణము - అంతా భగవంతుడే అయినప్పుడు జన్మ ఏమిటి, మరణమేమిటి ?. అంతా మాయయే –
“మ. జనకుండెవ్వడు, జాతుడెవ్వడు, జనిస్థానంబులెచ్చోటు, సం
జననం బెయ్యది,మేనులేకొలది,సంసారంబులే రూపముల్
వినుమా, యింతయు విష్ణుమాయ దలపన్ వేఱేమియున్ లేదు, మో
హ నిబంధంబు నిధానమింతటికి జాయా! విన్నబోనేటికిన్“. (పోతన తెలుగు భాగవతము – 8 - 475)
వరులు దాసీనమధ్యస్థవర్గములును
సరవి గనుచుందు రొక్కొక్క జన్మమునను
నెఱయ బ్రాణికి నొక వావి గలదె“.
“జన్మములలో ఒక జన్మ కంటె ఒకటి ఉత్తమమైనదని చెప్పబడినది. అది ఎట్లంటే : -
బ్రాణవతంబులై స్పర్శజ్ఞానంబు గలుగు చైతన్య వృక్షములకంటె
ఘనరసజ్ఞానసంకలిత చేతను లుత్తములు, రసజ్ఞానంబు గలుగు వాని
కంటె గంధ జ్ఞానకరిత బృందంబులు గడు శ్రేష్టములు,వాని కంటె శబ్ద
తే. వేదులగుదురు శ్రేష్ఠమై, వెలయు శబ్ద
విదుల కంటెను సద్రూప వేదులైన
వాయసాదులు శ్రేష్టముల్, వాని కంటె
వరుస బహుపాదలుత్తముల్; వారికంటె.
క. తలప జతుష్పదులధికులు
బలకొని మఱివారికంటె బాద ద్వయముం
గల మనుజులలఘతము,లి
మ్ములవారలయందు వర్ణములు నాల్గరయన్
వ. అందు,
సీ. తలప బ్రాహ్మణులుత్తములు, వారి కంటెను వేద వేత్తలు; వేద విదులకంటె
విలసిత వేదార్థ విదులు, వారలకంటె సమధిక శాస్త్ర సంశయము మాన్పు
మీ మాంసకులు; మఱి మీ మాంసకులకంటె నిజధర్మ విజ్ఞాన నిపుణు; లరయ
వారి కంటెను సంగవర్జిత చిత్తులు; దగ వారికంటెను సద్ధర్మపరులు;
తే. ధార్మికుల కంటె నుత్త మోత్తముడ, వినుము
మత్సమర్పిత సకలధర్మస్వభావ
మహిమలు గల్గి యితర ధర్మములు విడిచి
సమతవర్తించు నప్పుణ్యతముడు ఘనుడు“. (శ్రీ మదాంధ్రమహాభాగవతము - 3 - 29 - 963 to 966)
(idivaraku lēni dēhamu, iṃdriyamulu modalaguvāṭini grahiṃcuṭa. idivaraku lēni dēhamutō ātmaku saṃbaṃdhamu kaluguṭa - (ātmanō dēha saṃ yōga viśēṣaḥ).
(jīvunaku teliyakuṃḍaganē atanu cēsina karmavalana janmamu kalugucunnadi).
vittanamunuṃḍi mokka molacuṭa janmamu - oka vastuvulōnuṃḍi iṃkoka vastuvu puṭṭuṭa janmamu - kāraṇavastuvunuṃḍi kārya vastuvu puṭṭuṭa (āvirbhaviṃcuṭa) janma. idi kāla karma svabhāvamulanu śaktulatōkūḍina bhagavaṃtuḍu ā vastuvulalō tana caitanya śaktitō - cicchaktitō - nuṃḍuṭavalana, vāṭini prērēpiṃcuṭacēta - tapiṃpa cēyuṭavalanakalugucunnadi - idiyē sṛṣṭi vidhamu).
“vartamāna vasaṃtādikālaṃbu bhūta bhāvi vasaṃtādikāla yōgyaṃbaina puṣpa phalādulu tatkāla jñāpakaṃbu neṭlusēyu naṭlu bhūta bhāvi janmaṃbulaku dharmādharmaṃbulu nidarśanaṃbu sēyucunuṃḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - -)
“jīvōpādhi bhūtaṃbagu liṃgadēhaṃbucē svāvāsa bhūtalōkaṃbunuṃḍi lōkāṃtaraṃbu noṃducu brārabdakarmaphalaṃbulanubhaviṃcucu, maralaṃ garmādulaṃ dāsaktuṃḍagucu - - - jīvuṃḍu bhūtēṃdriya manōmayaṃbaina dēhaṃbu galigiyuṃḍu. aṭṭi dēha nirōdhaṃbe maraṇaṃbunāvirbhāvaṃce janmaṃbu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 31 - 1009)
yadhā nahi vaṃdhyā putraḥ paramārthataḥ māya yāvā kadāpi jāyatē, tathā kālatrayē api śaśaviṣāṇavat asataḥ avidyamānasya tatvataḥ māya yāvā api janma na vidyatē.
(paramārthadṛṣṭilōkāni, māyavalanakāni vaṃdhyā strīki eṭlukumāruḍu kaluguṭalēdō, kuṃdēṭiki kommu eṭlupuṭṭadō, aṭlē mūḍukālamulaṃdunu asatpadārthamunuṃḍi, lēnivastuvunuṃḍi, tatvarītyāgāni,māyavalanagāni, janmakalugadu -maṟiyokavastuvu puṭṭadu).
(puruṣuniyokka śarīramaṃtaṭinuṃḍi sēkariṃcina tējassu kaṣāyarūpamai rētassugā mārunu. ā rētassu strīlō uṃcabaḍi strīcē vṛddhipoṃdiṃpabaḍunu - idi modaṭi janma. ā rētassu strīlō strīśarīramulōni aṃgamulavale kalisi pōvunu. aṃducēta strī dānini tana śarīramulōni oka aṃgamuvalenē bhāviṃci pōṣiṃcunu - idi tana reṃḍava janma. eṃdu cētananagā taṃḍriyē koḍukai janmiṃcunukanuka - “putrōvai ātmanāmāsi” aṭṭi taṃḍri kālamugaḍici vṛddhuḍaina tarvāta canipōyi marala janmiṃcunu - idi tana mūḍava janma”.
(puṭṭinavāniki cāvu tappadu - canipōyinavāniki marala janma tappadu).
(avidya, dāni kāryamulu - vīṭinē ajñānamu valla janma modalagunavi ani bhramiṃcucunnāru - ajñānamu valananē nēnu janmanu poṃdinānu ani anukonuṭa. aṃducēta ajñānamunaku adi upalakṣaṇamu - aṃtā bhagavaṃtuḍē ayinappuḍu janma ēmiṭi, maraṇamēmiṭi ?. aṃtā māyayē –
“ma. janakuṃḍevvaḍu, jātuḍevvaḍu, janisthānaṃbuleccōṭu, saṃ
jananaṃ beyyadi,mēnulēkoladi,saṃsāraṃbulē rūpamul
vinumā, yiṃtayu viṣṇumāya dalapan vēṟēmiyun lēdu, mō
ha nibaṃdhaṃbu nidhānamiṃtaṭiki jāyā! vinnabōnēṭikin”. (pōtana telugu bhāgavatamu – 8 - 475)
varulu dāsīnamadhyasthavargamulunu
saravi ganucuṃdu rokkokka janmamunanu
neṟaya brāṇiki noka vāvi galade”.
“janmamulalō oka janma kaṃṭe okaṭi uttamamainadani ceppabaḍinadi. adi eṭlaṃṭē : -
brāṇavataṃbulai sparśajñānaṃbu galugu caitanya vṛkṣamulakaṃṭe
ghanarasajñānasaṃkalita cētanu luttamulu, rasajñānaṃbu galugu vāni
kaṃṭe gaṃdha jñānakarita bṛṃdaṃbulu gaḍu śrēṣṭamulu,vāni kaṃṭe śabda
tē. vēdulaguduru śrēṣṭhamai, velayu śabda
vidula kaṃṭenu sadrūpa vēdulaina
vāyasādulu śrēṣṭamul, vāni kaṃṭe
varusa bahupādaluttamul; vārikaṃṭe.
ka. talapa jatuṣpaduladhikulu
balakoni maṟivārikaṃṭe bāda dvayamuṃ
gala manujulalaghatamu,li
mmulavāralayaṃdu varṇamulu nālgarayan
va. aṃdu,
sī. talapa brāhmaṇuluttamulu, vāri kaṃṭenu vēda vēttalu; vēda vidulakaṃṭe
vilasita vēdārtha vidulu, vāralakaṃṭe samadhika śāstra saṃśayamu mānpu
mī māṃsakulu; maṟi mī māṃsakulakaṃṭe nijadharma vijñāna nipuṇu; laraya
vāri kaṃṭenu saṃgavarjita cittulu; daga vārikaṃṭenu saddharmaparulu;
tē. dhārmikula kaṃṭe nutta mōttamuḍa, vinumu
matsamarpita sakaladharmasvabhāva
mahimalu galgi yitara dharmamulu viḍici
samatavartiṃcu nappuṇyatamuḍu ghanuḍu”. (śrī madāṃdhramahābhāgavatamu - 3 - 29 - 963 to 966)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.