← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జన్మాదిః janmādiḥ

Original — తెలుగు
  1. జన్మస్థితి లయాః - (జన్మస్థితి భంగాః) (జన్మ, స్థితి, ప్రళయములు).

  2. “జన్మ ఉత్పత్తిః ఆదిర్యస్య జన్మ స్థితి భంగస్య తత్ జన్మాదిః (భాష్యార్థరత్నమాల - బ్రహ్మసూత్రభాష్యము - 1 - 1 - 2)

  3. “జన్మ స్థితి భంగాః, అన్యేషా మపి భావ వికారాణాం త్రిష్వేవాంతర్భావః ఇతి”, (శ్రీ శంకరః - బ్రహ్మ సూత్రభాష్యే)

(జన్మ,స్థితి,ప్రళయములు ఈ మూడుజన్మాదులు, జన్మము మొదలగునవి.షడ్భావవికారములలోని ఈ మూడుకాక మిగిలినమూడు ఈ మూడింటిలోనివే - ఈ మూడింటి అంతర్భావములే).

  1. ’ఆది శబ్దేన స్థితి సమ్హార నియమ జ్ఞానా జ్ఞాన బంధమోక్షాః గృహ్యంతే, న కేవలం స్థితిసమ్హారౌ“.

(జన్మాదులు అనుమాటలో అదులు - మొదలగునవి అనగా స్థితిలయములేకాదు,స్థితి,సమ్హార,నియమ, జ్ఞానా జ్ఞాన, బంధమోక్షములు కూడా గ్రహింపవలెను).

  1. జాయతే, అస్తి, వర్థతే, వివరిణమతే, అపక్షీయతే, నశ్యతి ఇతి షడ్వికారాః.

(పుట్టుచున్నాడు, ఉన్నాడు, వృద్ధిపొందుచున్నాడు, మార్పుచెందుచున్నాడు, క్షీణించుచున్నాడు, నశించుచున్నాడు - అను ఆరు వికారములు జన్మ మొదలగునవి).

  1. ప్రపంచముయొక్క సృష్టి స్థితిలయములు - శ్ర్తిలో ఇట్లు చెప్పబడినవి : - “యతోవా ఇమాని భూతాని జాయంతే, యాని జాతాని జీవంతి, యస్మిన్నం ప్యేత్యభిసం విశంతి తద్బ్రహ్మ”.

(ఈ భూతములు దేనివలన పుట్టుచున్నవి, పుట్టినవి దేనివలన జీవించుచున్నవి, దేనిలో లయమైపోవుచున్నవి, అది బ్రహ్మ). జన్మించిన ప్రతివస్తువునకు స్థితిలయములు తప్పవు. అందుచేత జన్మాదిః (జన్మ మొదలగునవి) అనగా జన్మ, స్థితి, లయములు -జన్మాదిషట్కము = యాస్క మునివాక్యము - (చూడుము - జన్మాదిః - 5)

దేహమునకు కలుగు ఆరు అవస్థలు. (Seven stages of man - Shakespear).

Transliteration
  1. janmasthiti layāḥ - (janmasthiti bhaṃgāḥ) (janma, sthiti, praḷayamulu).

  2. “janma utpattiḥ ādiryasya janma sthiti bhaṃgasya tat janmādiḥ (bhāṣyārtharatnamāla - brahmasūtrabhāṣyamu - 1 - 1 - 2)

  3. “janma sthiti bhaṃgāḥ, anyēṣā mapi bhāva vikārāṇāṃ triṣvēvāṃtarbhāvaḥ iti”, (śrī śaṃkaraḥ - brahma sūtrabhāṣyē)

(janma,sthiti,praḷayamulu ī mūḍujanmādulu, janmamu modalagunavi.ṣaḍbhāvavikāramulalōni ī mūḍukāka migilinamūḍu ī mūḍiṃṭilōnivē - ī mūḍiṃṭi aṃtarbhāvamulē).

  1. ’ādi śabdēna sthiti samhāra niyama jñānā jñāna baṃdhamōkṣāḥ gṛhyaṃtē, na kēvalaṃ sthitisamhārau”.

(janmādulu anumāṭalō adulu - modalagunavi anagā sthitilayamulēkādu,sthiti,samhāra,niyama, jñānā jñāna, baṃdhamōkṣamulu kūḍā grahiṃpavalenu).

  1. jāyatē, asti, varthatē, vivariṇamatē, apakṣīyatē, naśyati iti ṣaḍvikārāḥ.

(puṭṭucunnāḍu, unnāḍu, vṛddhipoṃducunnāḍu, mārpuceṃducunnāḍu, kṣīṇiṃcucunnāḍu, naśiṃcucunnāḍu - anu āru vikāramulu janma modalagunavi).

  1. prapaṃcamuyokka sṛṣṭi sthitilayamulu - śrtilō iṭlu ceppabaḍinavi : - “yatōvā imāni bhūtāni jāyaṃtē, yāni jātāni jīvaṃti, yasminnaṃ pyētyabhisaṃ viśaṃti tadbrahma”.

(ī bhūtamulu dēnivalana puṭṭucunnavi, puṭṭinavi dēnivalana jīviṃcucunnavi, dēnilō layamaipōvucunnavi, adi brahma). janmiṃcina prativastuvunaku sthitilayamulu tappavu. aṃducēta janmādiḥ (janma modalagunavi) anagā janma, sthiti, layamulu -janmādiṣaṭkamu = yāska munivākyamu - (cūḍumu - janmādiḥ - 5)

dēhamunaku kalugu āru avasthalu. (Seven stages of man - Shakespear).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.