(శాండిల్యోపనిషత్)
(జపమనగా శాస్త్రములో చెప్పిన ప్రకారము గురువు చేత ఉపదేశించబడిన వేదవిరుద్ధముగాని మంత్రమును అభ్యాసము చేయుట. ఇది రెండువిధములు - వాచకము, మానసము. మానస జపమనగా మనసులో ధ్యానము చేయుటతో కూడినది).
కల్ప సూత్రేయ యథా వేదే ధర్మశాస్త్రే పురాణకే |
ఇతిహాసే చ వృత్తిర్యా స జపః ప్రోచ్యతే మయా |
జప స్త్రివిధః ప్రోక్తో వాచకో,మానసస్తదా |
వాచకొపాం సురుచ్చైశ్చ ద్వివిధా పరికీర్తితః |
మానసో మనన ధ్యాన భేదాత్ ద్వైవిద్యమాశ్రితః ||“. (దర్శనోపనిషత్)
(వేదములో చెప్పిన మార్గము ననుసరించి మంత్రమునభ్యసించుట జపమని చెప్పబడినది. కల్పసూత్రమందు, ధర్మశాస్త్రమందు, పురాణమందు, ఇతిహాసమందు యే వృత్తి చెప్పబడినదో అదియే జపము - జపము వాచికమని మానసికమని రెండువిధములు. వాచకజపము ఉపాంసువని ఉచ్చమని రెండువిధములు - మానసికజపము మననము, ధ్యానము అని రెండువిధములు).
(వేదము మంత్రములే. అందుచేత వేదమును అధ్యయనము చేయుట జపమే - మంత్రమును పదే పదే వల్లించుట, జపించుట).
(జకారము జన్మలేకుండచేయును, పకారము పాపమును నశింపచేయునది. జన్మమును, పాపమును నశింపచేయునది కనుక జపము అని చెప్పబడినది).
ఉత్తరోత్త ఉత్కృష్టః సర్వపాప ప్రణాశకః ||“. (ఆగ్నేయ పురాణము)
(“ఉచ్ఛోపాంశు మానస లక్షణం త్రివిధో జపః”) (శ్రీశంకరః)
(వాచికము, ఉపాంశువు, మానసికము అని జపము మూడు విధములు. ఉదాత్తానుదాత్త స్వరితములనెడి స్వరములతో ఇతరులు వినునట్లు చేయు జపము వాచికము. మెల్లిగా ఉచ్ఛరించి పెదవులనుకదుపుటమాత్రమే చేయుచు మంత్రము వల్లించుట ఉపాంశువు. పైకివినబడకుండ మనసులోనే మంత్రములను వల్లించుట మానసికము).
మంత్రార్థాను సంధానం మానసం. (మంత్రము యొక్క అర్థమును అనుసంధానము చేయుట మానస జపము).
గాయత్ర్యాది మంత్రాణాం ఉపాంసుపాఠః
(గాయత్రి మొదలగు మంత్రములను ఎవరికిని వినబడకుండగనే ఉచ్ఛరించవలెను).
మనసా తజ్జపేన్నిత్యం తత్పరంజ్యోతిరోమితి ||“.
(వాక్కుచే మంత్రమును జపము చేయుచు, శరీరముతో దానిని అభ్యసింపవలెను. ఓంకారరూపమగు ఆ పరంజ్యోతిని మనస్సులో నిత్యము జపింపవలెను).
న నలిప్యతిపాపేన పద్మపత్రిమివాంభసా ||“.
(శుచియైగాని, అశుచియైగాని ప్రణవమును ఎల్లపుడును జపింపవలెను. తామరకును నీటిబిందువు అంటనట్లు అట్టివానిని పాపము అంటదు).
కుర్త్వాదన్య. నవాకుర్యాత్ మైత్రో | బ్రాహ్మణ ఉచ్యతే ||“.
(బ్రాహ్మణుడన్నవాడు ఇతరకర్మలను చేసినను చేయకపోయినను కేవలము జపము చేయుటవలననె సిద్ధిని - మోక్షమును పొండును).
(“తస్య వాచకః ప్రణవః”అని ఈశ్వరుని గుఱించిచెప్పి” జపస్తర్థభావనం” అని చెప్పుటవలన ప్రణవముయొక్క అర్థమును జపించుట అని అర్థము. అ, ఉ, మ అను మూడు అక్షరములు కలిసి ఓం అయినది కనుక ఆ అక్షరములు దేనిని తెలియచేయునో తెలుసుకొని భావించవలెను).
“జప్యతే ఇతి జపః” (జపించబడునది కనుక జపము).
“జపతో నాస్తి పాతకః” (జపమును చేయుటవలన పాపము అంటదు).
(śāṃḍilyōpaniṣat)
(japamanagā śāstramulō ceppina prakāramu guruvu cēta upadēśiṃcabaḍina vēdaviruddhamugāni maṃtramunu abhyāsamu cēyuṭa. idi reṃḍuvidhamulu - vācakamu, mānasamu. mānasa japamanagā manasulō dhyānamu cēyuṭatō kūḍinadi).
kalpa sūtrēya yathā vēdē dharmaśāstrē purāṇakē |
itihāsē ca vṛttiryā sa japaḥ prōcyatē mayā |
japa strividhaḥ prōktō vācakō,mānasastadā |
vācakopāṃ suruccaiśca dvividhā parikīrtitaḥ |
mānasō manana dhyāna bhēdāt dvaividyamāśritaḥ ||“. (darśanōpaniṣat)
(vēdamulō ceppina mārgamu nanusariṃci maṃtramunabhyasiṃcuṭa japamani ceppabaḍinadi. kalpasūtramaṃdu, dharmaśāstramaṃdu, purāṇamaṃdu, itihāsamaṃdu yē vṛtti ceppabaḍinadō adiyē japamu - japamu vācikamani mānasikamani reṃḍuvidhamulu. vācakajapamu upāṃsuvani uccamani reṃḍuvidhamulu - mānasikajapamu mananamu, dhyānamu ani reṃḍuvidhamulu).
(vēdamu maṃtramulē. aṃducēta vēdamunu adhyayanamu cēyuṭa japamē - maṃtramunu padē padē valliṃcuṭa, japiṃcuṭa).
(jakāramu janmalēkuṃḍacēyunu, pakāramu pāpamunu naśiṃpacēyunadi. janmamunu, pāpamunu naśiṃpacēyunadi kanuka japamu ani ceppabaḍinadi).
uttarōtta utkṛṣṭaḥ sarvapāpa praṇāśakaḥ ||“. (āgnēya purāṇamu)
(“ucchōpāṃśu mānasa lakṣaṇaṃ trividhō japaḥ”) (śrīśaṃkaraḥ)
(vācikamu, upāṃśuvu, mānasikamu ani japamu mūḍu vidhamulu. udāttānudātta svaritamulaneḍi svaramulatō itarulu vinunaṭlu cēyu japamu vācikamu. melligā ucchariṃci pedavulanukadupuṭamātramē cēyucu maṃtramu valliṃcuṭa upāṃśuvu. paikivinabaḍakuṃḍa manasulōnē maṃtramulanu valliṃcuṭa mānasikamu).
maṃtrārthānu saṃdhānaṃ mānasaṃ. (maṃtramu yokka arthamunu anusaṃdhānamu cēyuṭa mānasa japamu).
gāyatryādi maṃtrāṇāṃ upāṃsupāṭhaḥ
(gāyatri modalagu maṃtramulanu evarikini vinabaḍakuṃḍaganē ucchariṃcavalenu).
manasā tajjapēnnityaṃ tatparaṃjyōtirōmiti ||“.
(vākkucē maṃtramunu japamu cēyucu, śarīramutō dānini abhyasiṃpavalenu. ōṃkārarūpamagu ā paraṃjyōtini manassulō nityamu japiṃpavalenu).
na nalipyatipāpēna padmapatrimivāṃbhasā ||“.
(śuciyaigāni, aśuciyaigāni praṇavamunu ellapuḍunu japiṃpavalenu. tāmarakunu nīṭibiṃduvu aṃṭanaṭlu aṭṭivānini pāpamu aṃṭadu).
kurtvādanya. navākuryāt maitrō | brāhmaṇa ucyatē ||“.
(brāhmaṇuḍannavāḍu itarakarmalanu cēsinanu cēyakapōyinanu kēvalamu japamu cēyuṭavalanane siddhini - mōkṣamunu poṃḍunu).
(“tasya vācakaḥ praṇavaḥ”ani īśvaruni guṟiṃciceppi” japastarthabhāvanaṃ” ani ceppuṭavalana praṇavamuyokka arthamunu japiṃcuṭa ani arthamu. a, u, ma anu mūḍu akṣaramulu kalisi ōṃ ayinadi kanuka ā akṣaramulu dēnini teliyacēyunō telusukoni bhāviṃcavalenu).
“japyatē iti japaḥ” (japiṃcabaḍunadi kanuka japamu).
“japatō nāsti pātakaḥ” (japamunu cēyuṭavalana pāpamu aṃṭadu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.