← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జాతి jāti

Original — తెలుగు
  1. కులము, వంశము, పుట్టుక.

  2. మలమూత్రములలో భేదమేమియులేకున్నను ఆవు పేడ, ఆవు మూత్రము పవిత్రములని అంగీకరించుచున్నాము - అట్లే జీవుడు కూడ ఒకటే అయినను దేహము మొదలగు ఉపాధులననుసరించి జాతిభేదము వ్యవహారములో కనబడుచున్నది. ఏయే జాతి విత్తనమునుండి ఆయా మొక్క మొలచుచున్నది. జాత్యంధగజ దృష్టిన్యాయము = పుట్టికతోనే గ్రుడ్డివాడు అయిన వారు. ఏనుగును పట్టుకొని, ఒక్కొక్కరు ఏనుగు యొక్క ఒక్కొక్క భాగమున తడిమి అదే ఏనుగు అనుకొనెదరు - అట్లేమలినమైన బుద్ధిగలవారు తర్కాభాస ప్రమాణములచేత అద్వితీయుడైనపరబ్రహ్మను నానా విధములుగా కల్పించుచున్నారు.

Transliteration
  1. kulamu, vaṃśamu, puṭṭuka.

  2. malamūtramulalō bhēdamēmiyulēkunnanu āvu pēḍa, āvu mūtramu pavitramulani aṃgīkariṃcucunnāmu - aṭlē jīvuḍu kūḍa okaṭē ayinanu dēhamu modalagu upādhulananusariṃci jātibhēdamu vyavahāramulō kanabaḍucunnadi. ēyē jāti vittanamunuṃḍi āyā mokka molacucunnadi. jātyaṃdhagaja dṛṣṭinyāyamu = puṭṭikatōnē gruḍḍivāḍu ayina vāru. ēnugunu paṭṭukoni, okkokkaru ēnugu yokka okkokka bhāgamuna taḍimi adē ēnugu anukonedaru - aṭlēmalinamaina buddhigalavāru tarkābhāsa pramāṇamulacēta advitīyuḍainaparabrahmanu nānā vidhamulugā kalpiṃcucunnāru.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.