← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జవనః javanaḥ

Original — తెలుగు

దూరగామీ, సర్వవ్యాపీత్యర్థః (దూరముగా వెళ్ళునది, అన్నింటిలోను వ్యాపించియుండునది).

జహద జహల్లక్షణ = ముఖ్యార్థములో కొంతభాగమునువిడిచి కొంతభాగమును ప్రతిపాదించుట. “సోయందేవ దత్తః”

(ఈ దేవదత్తుడు అప్పుడు చూచిన దేవదత్తుడే). అను వాక్యములో అయం అనగా ఇప్పుడు చూచిన దేవదత్తుడు, ‘సః’ అనగా అప్పుడు చూచిన దేవదత్తుడు. ఈ రెండు వాక్యములలో కాలవ్యత్యాసమున్నది, చూచిన స్థలములో కూడ వ్యత్యాసమున్నది.కాలవ్యత్యాసము, స్థలవ్యత్యాసము వదలివేసి కేవలము దేవదత్తుడు అను మాటనే గ్రహించుట జహదజహలక్షణ - దీనినే భాగత్యాగలక్షణము అని కూడ అందురు - “తత్వమసి ’ (ఆ భగవంతుడు నీవే అయి యున్నావు) అను మహావాక్యములో పరబ్రహ్మ లక్షణములు వేరు, జీవుని లక్షణములు వేరు. ఈ వేరు లక్షణములను విడిచిపెట్టగా పరమాత్మ, జీవాత్మ ఒకటే - అను జీవాత్మైక్యమును తెలుపును.

Transliteration

dūragāmī, sarvavyāpītyarthaḥ (dūramugā veḷḷunadi, anniṃṭilōnu vyāpiṃciyuṃḍunadi).

jahada jahallakṣaṇa = mukhyārthamulō koṃtabhāgamunuviḍici koṃtabhāgamunu pratipādiṃcuṭa. “sōyaṃdēva dattaḥ”

(ī dēvadattuḍu appuḍu cūcina dēvadattuḍē). anu vākyamulō ayaṃ anagā ippuḍu cūcina dēvadattuḍu, ‘saḥ’ anagā appuḍu cūcina dēvadattuḍu. ī reṃḍu vākyamulalō kālavyatyāsamunnadi, cūcina sthalamulō kūḍa vyatyāsamunnadi.kālavyatyāsamu, sthalavyatyāsamu vadalivēsi kēvalamu dēvadattuḍu anu māṭanē grahiṃcuṭa jahadajahalakṣaṇa - dīninē bhāgatyāgalakṣaṇamu ani kūḍa aṃduru - “tatvamasi ’ (ā bhagavaṃtuḍu nīvē ayi yunnāvu) anu mahāvākyamulō parabrahma lakṣaṇamulu vēru, jīvuni lakṣaṇamulu vēru. ī vēru lakṣaṇamulanu viḍicipeṭṭagā paramātma, jīvātma okaṭē - anu jīvātmaikyamunu telupunu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.