← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జిజ్ఞాసువు jijñāsuvu

Original — తెలుగు
  1. “భగవత్తత్త్వం జ్ఞాతుం ఇచ్ఛతి యః” (శ్రీశంకరః)

(భగవంతుని తత్వమును తెలుసుకొనుటకు కోరిక గలవాడు).

  1. జ్ఞాతుం ఇచ్ఛ జిజ్ఞాస, తత్ అస్య అస్తీతి జిజ్ఞాసుః.

(తెలుసుకొనుటకు ఇచ్ఛ జిజ్ఞాస - జిజ్ఞాస గలవాడు జిజ్ఞాసువు).

  1. “జిజ్ఞాసు రాత్మ జ్ఞానార్ధీ - జనకశ్చో ద్ధ వోయధా |” (గీతాభావప్రకాశము - 7 - 99)

(జనకుడు, ఉద్ధవుడు వలెనే ఆత్మజ్ఞానమును తెలుసుకొనుటకు అర్ధించినవాడు).

  1. “భగవంతమేవ వా జిజ్ఞాసుః భక్తి శ్రద్ధా రహితః కుతూహల మాత్రేణ, భగవంతం జిజ్ఞాసమానోవా, ఆత్మార్ధి విషయోరియం జిజ్ఞాసు శబ్దః ఇతి-” (వేదాంత దేశికః)

(భగవంతునియందు భక్త శ్రద్ధలు లేకపోయినను కుతూహలము మాత్రముచేతనే భగవంతుని తెలుసుకొను కోరిక గలవాడు. ఆత్మగుఱించి తెలుసుకొనుటకు అర్థించుటే జిజ్ఞాసువు అను పదమునకు ఇక్కడ అర్థము).

  1. “యస్తు శాస్త్రీయోత్తమ సంస్కారబలాత్ ఆథ్యాత్మాది సత్ శ్రవణం కరోతి తస్య వివేకో జాయతే, తథా వివేకో యస్య భవతి స ఏవ జిజ్ఞాసుః. నిఖిల దుఃఖ నివృత్యుపలక్షిత స్వస్వరూప భూతా ఖండానంద ప్రాప్తేః సాక్షాత్సాధనం స్వస్వరూప జ్ఞానమేవ. తస్మాత్ స్వస్వరూప విచార ఏవ కర్తవ్యః ఇత్థం యస్య వివేకో జాయతే స ఏవ జిజ్ఞాసుః ఇత్యుచ్యతే”.

(శాస్త్రప్రకారము నవలంభించుటవలన కలిగి ఉత్తమ సంస్కారబలమున ఎవడు సత్ శాస్త్ర శ్రవణము చేయునో అట్టివానికి వివేకము కలుగును. అతనే జిజ్ఞాసువు. సమస్త దుఃఖముల నివృత్తికి ఉపలక్షణమైన స్వస్వరూపానందమునకు (ముక్తికి) సాధనము స్వస్వరూప. జ్ఞానమే అందుచేత స్వస్వరూప విచారమే - ఇట్లు వివేకముగలవాడు జిజ్ఞాసువు).

Transliteration
  1. “bhagavattattvaṃ jñātuṃ icchati yaḥ” (śrīśaṃkaraḥ)

(bhagavaṃtuni tatvamunu telusukonuṭaku kōrika galavāḍu).

  1. jñātuṃ iccha jijñāsa, tat asya astīti jijñāsuḥ.

(telusukonuṭaku iccha jijñāsa - jijñāsa galavāḍu jijñāsuvu).

  1. “jijñāsu rātma jñānārdhī - janakaścō ddha vōyadhā |” (gītābhāvaprakāśamu - 7 - 99)

(janakuḍu, uddhavuḍu valenē ātmajñānamunu telusukonuṭaku ardhiṃcinavāḍu).

  1. “bhagavaṃtamēva vā jijñāsuḥ bhakti śraddhā rahitaḥ kutūhala mātrēṇa, bhagavaṃtaṃ jijñāsamānōvā, ātmārdhi viṣayōriyaṃ jijñāsu śabdaḥ iti-” (vēdāṃta dēśikaḥ)

(bhagavaṃtuniyaṃdu bhakta śraddhalu lēkapōyinanu kutūhalamu mātramucētanē bhagavaṃtuni telusukonu kōrika galavāḍu. ātmaguṟiṃci telusukonuṭaku arthiṃcuṭē jijñāsuvu anu padamunaku ikkaḍa arthamu).

  1. “yastu śāstrīyōttama saṃskārabalāt āthyātmādi sat śravaṇaṃ karōti tasya vivēkō jāyatē, tathā vivēkō yasya bhavati sa ēva jijñāsuḥ. nikhila duḥkha nivṛtyupalakṣita svasvarūpa bhūtā khaṃḍānaṃda prāptēḥ sākṣātsādhanaṃ svasvarūpa jñānamēva. tasmāt svasvarūpa vicāra ēva kartavyaḥ itthaṃ yasya vivēkō jāyatē sa ēva jijñāsuḥ ityucyatē”.

(śāstraprakāramu navalaṃbhiṃcuṭavalana kaligi uttama saṃskārabalamuna evaḍu sat śāstra śravaṇamu cēyunō aṭṭivāniki vivēkamu kalugunu. atanē jijñāsuvu. samasta duḥkhamula nivṛttiki upalakṣaṇamaina svasvarūpānaṃdamunaku (muktiki) sādhanamu svasvarūpa. jñānamē aṃducēta svasvarūpa vicāramē - iṭlu vivēkamugalavāḍu jijñāsuvu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.