← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జీవభూతా jīvabhūtā

Original — తెలుగు
  1. క్షేత్రజ్ఞ లక్షణా పరా ప్రకృతీ - ప్రాణ ధారణ నిమిత్త భూతా” (శ్రీశంకరః)

(క్షేత్రజ్ఞలక్షణములుగల పరాప్రకృతి - ప్రాణమును ధరించి యుండుటకు కారణమైనది).

  1. “జీవానాం ప్రాణ ధారిణీ, చిద్రూప భూతా” (ఆనంద తీర్థః)

(జీవుల ప్రాణము ధరించునది - చైతన్య రూపమైనది).

  1. సర్వ జీవ దేహేషుస్థిత్వా తదీయాన్ ప్రాణాన్ తత్రధార యతి ఇత్యర్థః -

(సమస్తమైన జీవులయొక్క దేహములందుండి వాటి ప్రాణములను ఆ జీవ దేహములలో ధరించునది).

  1. “భూమిరాపో(అ)సలో వాయుః ఖం మనో బుద్ధిరేవచ |

అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా ||

అపరేయం, ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం |

జీవ భూతాం, మహాబాహో, యయేదం ధార్యతే జగత్ ||“. (శ్రీమద్భవద్గీత - 7 - 4, 5)

(నా ప్రకృతులు రెండు విధములు - ఒకటి అపరా క్రకృతి - ఇది జడము - అష్టవిధములుగా నున్నది - భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము - రెండవ ప్రకృతి పరాప్రకృతి - ఇదియే జీవభూతా, అపరాప్రకృతి రూపములైన జగత్తులోని వస్తువులను ధరించునది - ఇదియే భగవంతునియొక్క చిచ్ఛక్తి లేక చైతన్య శక్తి. ఈ శక్తితో భగవంతుడు జడశక్తి అయిన అపరాప్రకృతితో కలియుటచేత సృష్టి జరుగుచున్నది - ఇట్లు జరుగుచున్న సృష్టిలోని సమస్త వస్తువులలోను భగవంతుడు తన పరాప్రకృతితో ప్రవేశించియుండుటవలననే సృష్టి జరుగుచున్నది - ప్రకృతి పురుష సం యోగము వలననే సృష్టి జరుగుచున్నది – (creation is the result of the combination of matter and Energy).

Transliteration
  1. kṣētrajña lakṣaṇā parā prakṛtī - prāṇa dhāraṇa nimitta bhūtā” (śrīśaṃkaraḥ)

(kṣētrajñalakṣaṇamulugala parāprakṛti - prāṇamunu dhariṃci yuṃḍuṭaku kāraṇamainadi).

  1. “jīvānāṃ prāṇa dhāriṇī, cidrūpa bhūtā” (ānaṃda tīrthaḥ)

(jīvula prāṇamu dhariṃcunadi - caitanya rūpamainadi).

  1. sarva jīva dēhēṣusthitvā tadīyān prāṇān tatradhāra yati ityarthaḥ -

(samastamaina jīvulayokka dēhamulaṃduṃḍi vāṭi prāṇamulanu ā jīva dēhamulalō dhariṃcunadi).

  1. “bhūmirāpō(a)salō vāyuḥ khaṃ manō buddhirēvaca |

ahaṃkāra itīyaṃ mē bhinnā prakṛti raṣṭadhā ||

aparēyaṃ, itastvanyāṃ prakṛtiṃ viddhi mē parāṃ |

jīva bhūtāṃ, mahābāhō, yayēdaṃ dhāryatē jagat ||“. (śrīmadbhavadgīta - 7 - 4, 5)

(nā prakṛtulu reṃḍu vidhamulu - okaṭi aparā krakṛti - idi jaḍamu - aṣṭavidhamulugā nunnadi - bhūmi, jalamu, agni, vāyuvu, ākāśamu, manassu, buddhi, ahaṃkāramu - reṃḍava prakṛti parāprakṛti - idiyē jīvabhūtā, aparāprakṛti rūpamulaina jagattulōni vastuvulanu dhariṃcunadi - idiyē bhagavaṃtuniyokka cicchakti lēka caitanya śakti. ī śaktitō bhagavaṃtuḍu jaḍaśakti ayina aparāprakṛtitō kaliyuṭacēta sṛṣṭi jarugucunnadi - iṭlu jarugucunna sṛṣṭilōni samasta vastuvulalōnu bhagavaṃtuḍu tana parāprakṛtitō pravēśiṃciyuṃḍuṭavalananē sṛṣṭi jarugucunnadi - prakṛti puruṣa saṃ yōgamu valananē sṛṣṭi jarugucunnadi – (creation is the result of the combination of matter and Energy).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.