← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జీవన్ముక్తః jīvanmuktaḥ

Original — తెలుగు
  1. “జీవన్ సన్ ఏవ ముక్తః”. (జీవించియుండగనే మోక్షమును పొందినవాడు).

  2. “జీవన్నేవహి సదా ముక్తః కృతార్థో బ్రహ్మ విత్తమః |

ఉపాధినాశాత్ బ్రహ్మైవసన్ బ్రహ్మప్యేతి నిర్ద్వయం ||”

ఇతి శ్రుతేః.

(బ్రహ్మజ్ఞానము కలిగిన వారిలో ఉత్తముడైనవాడు జీవించియుండియే ఎప్పుడూ ముక్తిని పొందినవాడువలె నుండువాడు. తాను జీవించియున్న ఉపాధి నశించగనే - శరీరము విడిచిన తర్వాత - బ్రహ్మమే యగుచు బ్రహ్మలో లీనమైపోవును అని శ్రుతి చెప్పుచున్నది).

  1. “ఇహ లోకే పరేచైవ కర్తవ్యం నాస్తితత్రవై| జీవన్ముక్తో యతస్తస్మాత్ బ్రహ్మ విత్పరమార్థతః ||” (లైంగే)

(ఈ లోకమునందుకాని పరలోకమందుకాని శాస్త్రప్రకారము చేయవలసిన పని లేని బ్రహ్మజ్ఞానియే పరమాత్మ దృష్టిలో జీవన్ముక్తుడు).

  1. “యస్మిన్నేవకాలే స్వమాత్మానం యోగీ జానాతి కేవలం| తస్మాత్ కాలాత్ సమారభ్య జీవన్ముక్తో భవేద్యసౌ” (వరాహోపనిషత్)

(భగవంతుడన్నవాడొక్కడే, అంతా భగవంతుడే. ఆ భగవంతుడు నేనే యని యోగియగువాడు ఎప్పుడు తలుచునో అప్పటినుండియే అతను జీవన్ముక్తుడు).

  1. “పురుషస్య భోక్తృత్వ సుఖదుఃఖాదిలక్షణః చిత్త ధర్మాః క్లేశరూపత్వాత బంధోభవతి. తన్నిరోధనం జీవన్ముక్తిః” (ముక్తికోపనిషత్)

(పురుషునికి భోక్తృత్వము, సుఖదుఃఖములు లక్షణములు ఇవి చిత్త ధర్మములు. క్లేశములు - (బాధలను కలిగించునవి). అందుచ్ హేత బంధమును కలిగించునవి. ఆ మనోధర్మములను - చిత్తవృత్తులను నిరోధిఒంచుట జీవన్ముక్తి - అది చేయగలిగినవాడు జీవన్ముక్ల్తుడు).

  1. “జీవవంతుడైన పురుషుని కర్తృత్వ భోక్తృత్వ, సుఖత్వ దుఃఖత్వాది గుణాలు ఏవి కలవో అవి చిత్తధర్మాలు, క్లేశరూపాలు కాబట్టి బంధమనిపించును. వీటి నివారణము జీవన్ముక్తి - - యోగాభ్యాసంచేత సమస్తమైన చిత్తవృత్తులున్నూ నివారింపబడును” (బ్రహ్మవిద్యాసుధార్నవము). అట్లు వాటిని నివారించుకొన్మినవాడు జీవన్ముక్తుడు.

  2. “క్రియానాశాద్భవే చ్చింత నాశో (అ)స్మాద్వాసనా క్షయః | వాసనా ప్రక్షయే మోక్షస్సజీవన్ముక్తి రిష్యతే” (ఆధ్యాత్మోపనిషత్)

(కర్మలు లేకుండుటవలన కర్మవాసన నశించును. వాసనలు నశించుతవలన మోక్షము కలుగును. ఇట్టి మోక్షమే జీవన్ముక్తి. అట్టి మోక్షముగలవాడు జీవన్ముక్తుడు).

  1. “న చిద్ధోస్మి సచ్చిదానందలక్షణః |

ఏవం భావ యత్నేన జీవంకుక్తో భవిష్యసి ||“. (అన్నపూర్ణోపనిషత్)

(నేను బద్దుడనుకాను - నాకు బంధము లేదు - నేను ముక్తుడనుకాను - నిరామయుడైన బ్రహ్మను నేను. బ్రహ్మము కాక ఇంకొక వస్తువు ఉన్నది అను భావము - అభిప్రాయము - నాకు లేదు - సత్, చిత్, ఆనందము అను లక్షణములు గల బ్రహ్మమును నేను - అని యీ విధమైన భావముంచుకొనుకొనుటకు ప్రయత్నము చేసినవాడు జీవన్ముక్తుడు అగుదువు).

  1. “బ్రహ్మాత్మనో శ్శోధిత యోరేక భావాపగా హినీ |

నిర్వికల్పాచ చిన్మాత్రా వృత్తిః ప్రజ్ఞేతి కద్ధ్యతే |

న సర్వదా భవేద్యస్య స జీన్ముక్త ఇష్యతే ||

దేహేంద్రియేష్వహం భావః, ఇదం భావస్తదన్యకే |

యస్యనో భవతః క్వాపిన సజీవన్ముక్త ఇష్యతే |

ప్రత్యక్ బ్రహ్మణార్భేదం కదాపి బ్రహ్మసర్గియోః |

ప్రజ్ఞయా యో విజానాతి సజీవన్ముక్త ఇష్యతే ||

సాధుభిః పూజ్యమానేస్మిన్ పీడ్యమానే దుర్జనైః |

సమభావో భవేద్యస్య స జీవన్ముక్త ఇష్యతే ||’ (అధ్యాత్మోపనిషత్)

(జీవాత్మ పరమాత్మల తత్వమును శోధించి రెండు ఒకటే యని భావము కలిగియుండుట ప్రజ్ఞావము అని చెప్పబడుచున్నది. అట్టి ప్రజ్ఞానము ఎల్లపుడు ఎవనికి కలదో అతను జీవన్ముక్తుడని చెప్పబడుచున్నాడు - దేహముంద్రియములు నేనే అను అహంకారము, మిగిలిన ప్రపంచము - నేనుకానిది అంతయు ప్రపంచము అను భావము లేనివాడు జీవన్ముక్తుడు. జీవాత్మ పరమాత్మలకు, పరబ్రహ్మ జగత్తులకు భేదములేదు అని ప్రజ్ఞానమువల్ల ఎవడు తెలుసుకొనునో వాడు జీవన్ముక్తుడు. సాధుజనులు తనను పూజించినను, దుర్మార్గులు తనను బాధపెట్టినను సమభావముతో నుండువాడు జీవన్ముక్తుడు).

  1. “జీవన్ముక్తోనామ స్వస్వరూపాఖండ బ్రహ్మజ్ఞానేన తదజ్ఞాన బాధన ద్వారా స్వస్వరూపాఖండ బ్రహ్మణి సాక్షాత్కృతే , అజ్ఞాన తత్కార్య సంచిత కర్మ సంశయ విపర్యయా దీనామపి బాధితత్వాత్ అఖిలబంధరహితః బ్రహ్మ నిష్టః”.

(స్వస్వరూపమైన అఖండ బ్రహ్మజ్ఞానము కలిగినందువలన బ్రహ్మ గుఱించి అయిన అజ్ఞానము తొలగిపోగాస్వస్వరూపాఖండ బ్రహ్మ సాక్షాత్కారము పొందుటవలన అజ్ఞానము, దాని వలన కలిగిన కర్మల ఫలము, సంశయము, విపర్యయములు మొదలగునవికూడా తొలగిపోవుటవలన సమస్తమైన బంధములు తెగిపోయి పరబ్రహ్మయందే నిష్టకలిగి యుండువాడు జీవన్ముక్తుడు).

  1. “జ్ఞానసమకాలం పాపనాశా జ్జీవన్ముక్తః”.

(బ్రహ్మజ్ఞానము కలుగగనే పాపములు నశించుటచేత జీవన్ముక్తుడు).

  1. “ఆపతత్సుయ థా కాలం సుఖ దుఃఖే ష్వనారతః |

నహృష్యతి గ్లాయతి యస్స జీవన్ముక్త ఉచ్యతే ||

హర్ష మర్ష భయ క్రోధ కామ కార్పణ్య వృష్టిభిః |

న పరామృశ్యతే యో(అ)oతస్స జీవన్ముక్త ఉచ్యతే ||

అహంకారమ యీం త్యక్త్వా వాసనాం లీలయై వయః |

తిష్ట తిధ్యే య సంత్యాగీ స జీవన్ముక్త ఉచ్యతే ||

ఈప్సితా నీప్సితానస్తో యస్యాంతర్వత్తి దృష్టిషు |

సుషిప్తి వద్యచ్చరతి స జీవన్ముక్త ఉచ్యతే ||

అధ్యాత్మరతిరా నీనః పూర్ణః పావన మానసః |

ప్రాప్తానుత్తమ విశ్రాంతిర్న కించి దివ వాంఛతి |

యో జీవతి గతస్నేహస్స జీవన్ముక్త ఉచ్యతే |

సంవేద్యే హృదాకాశే మనాగపి న లిప్యతే |

యస్యా సావ జడా సంది త్స జీవన్ముక్తః ఉచ్యతే ||

రాగద్వేషౌ సుఖం దుఃఖం ధర్మా ధర్మౌ ఫలాపలౌ |

యః కరోత్య నపేక్ష్యైవ స జీవన్ముక్త ఉచ్యతే ||

మౌనవాన్ని రహంభావో నిర్మానో ముక్త మత్సరః |

యః కరోతి గతోద్వేగః స జీవన్ముక్త ఉచ్యతే ||

సర్వత్ర విగతస్నేహో యస్సాక్షివదవస్థితః |

నిరిచ్ఛో వర్తతే కార్యే స జీవన్ముక్త ఉచ్యతే |

యేన ధర్మ మధర్మంచ మనో మనన మీహితం |

సర్వ మంతః పరిత్యక్తం స జీవన్ముక్త ఉచ్యతే ||

యావతీ దృశ్య కలనా సకలేయం విలోక్యతే |

సాయేన సుష్టు సంత్యక్తా స జీవన్ముక్త ఉచ్యతే ||

కట్వామ్ల లవణం తిక్తమ మృష్టం మృష్టమేవచ |

సమమేవ యో భుంక్తే సజీవన్ముక్త ఉచ్యతే ||

ఉద్వేగానందరహిత సమయా స్వచ్ఛయాధియా |

న శోచతి నోదేతి స జీవన్ముక్త ఉచ్యతే |

సర్వేచ్ఛస్సకలా శ్శంకాః సర్వే హాసర్వ నిశ్చయాః |

ధియో యేన పరిత్యక్తాస్స జీవన్ముక్త ఉచ్యతే ||

జన్మ స్థితి వినాశేషు సోదయాస్తమ యేషు చ |

సమమేవ మనో యస్య స జీవన్ముక్త ఉచ్యతే ||

న కించినద్వేష్టి తథా నకించిదపి కాంక్షతి |

భుంక్తేయః ప్రకౄతాన్ భోగాన్ సజీవన్ముక్త ఉచ్యతే ||

శాంత సంసార కలనః కలా వానపి నిష్కలః |

యస్స చిత్తో పి నిశ్చిత్త స్స జీవన్ముక్త ఉచ్యతే ||

యస్సమస్తార్థ జాలేషు వ్యవహార్యపి నిస్పృహః |

పరార్థే ష్వివ పూర్ణాత్మా స జీవన్ముక్త ఉచ్యతే ||” (మహోపనిషత్)

(సుఖ దుఃఖములు వచ్చిన వాటితో సంతోషించక, దుఃఖించక యుండువాడు; సంతోషము, దుఃఖము, భయము, క్రోధము, కామము, కార్పణ్యము మనస్సులో లేనివాడు, అహంకారముతో కూడిన వాసనలను అవలీలగా విడిచిపెట్టి, త్యాగియై, ధ్యేయ వస్తువైన పరమాత్మయందుండువాడు; మనస్సులో ఈప్సితములను కోరక సుషుప్త్యవస్థలో నుండునట్లుండువాడు; అధ్యాత్మమందే రతి గలిగి నిర్మలమైన మనస్సు గలవాడు. అనుత్తమమైన శాంతిని పొందుటచేత ఈ లోకములోని కోరికలు ఏవియు లేనివాడు; దేని యందు ఆశలేనివాడు; రాగ ద్వేషములు, సుఖ దుఃఖములు, ధర్మా ధర్మములు, ఫలాఫలములు - వీటి యందు అపేక్ష లేనివాడు; మౌనమవలంబించినవాడు; అహంభావము లేనివాడు - అభిమానము లేని వాడు, మాత్సర్యము లేనివాడు, ఉద్వేగము లేక పనిచేయువాడు; దేనియందును ఆశ లేక సాక్షివలెనుండువాడు; చేయుచున్న కార్యములందు కోరిక లేనివాడు; ధర్మమును అధర్మమును మనస్సులో కోరక అన్నింటినీ మనస్సులోనే వదలివేసినవాడు; ఈ ప్రపంచమందు ఇటివంటి దృష్టి కలిగియుండువాడు; చేదు, పులుపు, ఉప్పు మొదలగువాటిని సమముగానే భుజించువాడు, జరామరణములను, ఆపత్తులను, సంపదలను, దరిద్రమును, మంచిని ఒకే రీతిగా అనుభవించువాడు; ధర్మా ధర్మములు, సుఖ దుఃఖములు, జననమరణములు - వీటిని లెక్క సేయనివాడు; ఉద్వేగముగాని ఆనందము గాని లేక సమమైన స్వచ్ఛమైన బుద్ధి కలిగి, శోకముగాని, తొందరపాటుగాని లేనివాడు; సమస్తమైన కోరికలు, అన్ని శంకలు, అన్ని నిశ్చయములు మనస్సులో విడిచిపెట్టినవాడు; జన్మ స్థితి విలయములందు, ఉదయాస్తమయములందు సమమైన మనస్సు గలవాడు; దేనినైనను, ఏ కొంచెమైనను ద్వేషించక, కోరక, ప్రకృతి భోగములననుభవించువాడు; శాంతుడై, కళావంతుడైనను - విద్యలు నేర్చినవాడైనను - కళలు లేనివాడువలె నుండువాడు; మనస్సు కలిగి యుండియు మనస్సు లేనివానివలె నుండువాడు; అన్ని పురుషార్థములందు పరార్థములని స్పృహ లేని వాడు - ఇట్లు పైన చెప్పబడిన వారు జీవన్ముక్తులు).

  1. “నోదేతి నాస్తమ యాతి సుఖ దుఃఖే మనః ప్రభాః |

యధా ప్రాపతస్థితిర్యస్య స జీవన్ముక్త ఉచ్యతే |

యా జాగరి సుషుప్తి స్థో యస్య జాగ్రన్న విద్యతే |

యస్య నిర్వాసనో బోధ స్స జీవన్ముక్త ఉచ్యతే ||

రాగద్వేష భయాదీనా మనురూపం చరన్నపి |

యోంతర్వ్యోమవదత్య చ్చస్స జీవన్ముక్త ఉచ్యతే ||

యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే |

కుర్వతో (అ)కుర్వతో వాపి స జీవన్ముక్త ఉచ్యతే ||

యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే యః |

హర్షా హర్షభయాన్ముక్తః స జీవన్ముక్త ఉచ్యతే ||

యస్సమస్తార్థ జాలేషు వ్యవహార్యపి శీతళః |

పరార్థేష్వివ పూర్ణాత్మా స జీవన్ముక్త ఉచ్యతే ||

ప్రజహాతి యదా కామాన్ సర్వాంశ్చిత్త గతాన్ మునే |

మయి సర్వాత్మనే తుష్టస్స జీవన్ముక్త ఉచ్యతే ||

చైత్య వర్జిత చిన్మాత్రే పదే పరమపావనే |

అక్షుబ్ధ చిత్తో విశ్రాంత స్స జీవన్ముక్త ఉచ్యతే ||

ఇదం జగదహం సోయం దృశ్య మాన మవాస్తవం |

యస్య చిత్తే నస్ఫురతి స జీవన్ముక్త ఉచ్యతే ||” (వరాహోపనిషత్)

(సుఖము కలిగినపుడు సంతోషింపక, దుఃఖము కలిగినపుడు విచారింపక మనస్సును ప్రాప్తించిన వాటితో సమాధానపరచుకొనువాడు; జాగ్రదవస్థలోనున్నను సుషుప్త్యవస్థలోనున్నను ఎవని జాగ్రదవస్థ తెలియబడదో; ఎవనికి నిర్వాసకయైన జ్ఞానము కలుగునో; రాగ ద్వేష భయములు మొదలగువాటికి అనురూపమైన ప్రవర్తన కలిగినవాడైనను ఎవడు అంతరంగమందు - అంతరాకాశమువలె వాటికి అతీతుడగునో; ఎవనికి అహంకారము లేదో, ఎవడు కర్మ చేసినను, చేయకపోయినను కర్మఫలమంటదో; ఎవనివలన లోకము ఉద్వేగము పొందదో; ఎవడు లోకమువలన ఉద్వేగమును పొందడో,హర్షాహర్ష భయములు ఎవనికిలేవో; ఎవడు సమస్తమైన అర్థములందు వ్యవహరించుచున్నను, అవిఇతరులకు సంబంధించినవని వాటి యడల శీతకళగలవాడో; ఎవడు మనసులో కలుగు సమస్తమైన కోరికలను వదలివేసి సర్వాత్మ అయిన - భగవంతుడు అయిన - నాయందే సంతుష్టిపొందునో; కనబడుఈ జగత్తు అంతయు వాస్తవముకానిది యని ఎవని చిత్తమందు స్ఫురించునో వాడు జీవన్ముక్తుడు).

  1. “దేహేంద్రియే ష్వహం భావః ఇదం బావస్తన్యకే |

యస్యనో భవతః క్వాపి స జీవన్ముక్త ఇష్యతే ||

స ప్రత్యక్ బ్రహ్మణోర్భేదం కదాపి బ్రహ్మ సర్గయోః |

ప్రజ్ఞయా యో విజానాతి స జీవన్ముక్త ఇష్యతే ||“.

(దేహమందు, ఇంద్రియములందు అవి నేనే అను భావమున్నూ, మిగిలినదంతయు ఈ ప్రపంచము అను భావము ఎవనికి కలుగదో అట్టివాడు జీవన్ముక్తుడు. జీవ బ్రహ్మలకు భేదము లేదని, పరబ్రహ్మకు ఈ సృష్టికి భేదములేదని, జ్ఞానము కలిగియుండుటచేత ఎవడు తెలుసుకొనునో వాడు జీవన్ముక్తుడు).

  1. “సాధుభిః పూజ్యమానే అస్మిన్ పీడ్యమానే పి దుర్జనైః |

సమభావో భవేద్యస్య స జీవన్ముక్త ఇష్యతే ||“.

(సాధు జనులచేత పూజింప బడినను, దుర్మార్గులచేత పీడింపబడినను సమభావముతో నుండువాడు జీవన్ముక్తుడు).

  1. “సదా సన్నిహితశ్శంభు శ్శ్రీశైలే మల్లికార్జునః |

తస్మిన్ దృష్టే తటే లింగే జీవన్ముక్తో న సంశయః (శ్రీ శైల ఖండము)

(శ్రీ శైలమందు మల్లికార్జునుడున్నాడు - సన్నిహితుడై ఉన్నాడు. ఆ మల్లికార్జున లింగమును చూచినవాడు జీవన్ముక్తుడగును. ఇందుకు సందేహములేదు).

  1. “అద్వేష్టా సర్వ భూతానాం - - - భక్తాస్తే (అ)తీవమత్ప్రియాః. (శ్రీమద్భగవద్గీత - 12 - 13 to

“అద్వేష్టత్వాది చిహ్నాని జీవన్ముక్త శరీరిణాం |

స్వభావ భూతానీ మానితదుక్తం వార్తికే స్ఫుటం || -”

ఉత్పన్నావ బోధస్య హ్య ద్వేష్టృత్వాది యో గుణాః |

అయత్నతో భవంత్యేవ న తు సాధన రూపిణః |

సంసాధ్య మానం యత్నేన ధర్మ జాతమిదం సతః |

విరక్తస్యాత్మ జిజ్ఞాసోర్ముముక్షోర్మోక్ష సాధనం ||” (గీతాభావ ప్రకాశము - 12 - 126 to 129)

(శ్రీమద్భగవద్గీతలో 12 వ అధ్యాయములో“అద్వేష్టా సర్వ భూతానాం” అని మొదలుకొని అధ్యాయాంతము వరకు చెప్పబడినవి జీవన్ముక్తుని లక్షణములు - ఇవి స్వభావముగా కలిగినవి - ఈ విషయము వార్తికమందు ఈ విధముగా చెప్పబడినది - ఆత్మజ్ఞానముదయించిన వారికి ఈ గుణములు వారు ప్రయత్నము చేయకనే కలుగును. ఇవి వారి యడల సాధనరూపములు కావు, ధర్మరూపములైనవి).

  1. “కాచేయం జీవన్ముక్తిః ? న శరీరస్య చ మోక్షః ఇతి చేత్ -”మాతామే వంధ్యా” ఇతి వత్

అసంగతార్థం వచః. యతః స శరీరత్వం బంధః, అశరీరత్వమేవ మోక్షః ” ఇతి త్వయైవ. (అద్వైతినా). శ్రుతి భిరుపపాదితం”

(శ్రీమాన్ రామానుజః)

(జీవన్ముక్తి అనగా ఏమిటి ? - శరీరము కలిగియుండగా మోక్షము అనిన యడల - ‘మా తల్లి వంధ్య - గొడ్రాలు’ అనినట్లు అసందర్భముగా నుండును - ఎందుచేతననగా శరీరము కలిగియున్నయడల బంధమే - శరీరము లేకుండుటయే మోక్షము అని అద్వైతులుకూడ చెప్పియున్నారు).

Transliteration
  1. “jīvan san ēva muktaḥ”. (jīviṃciyuṃḍaganē mōkṣamunu poṃdinavāḍu).

  2. “jīvannēvahi sadā muktaḥ kṛtārthō brahma vittamaḥ |

upādhināśāt brahmaivasan brahmapyēti nirdvayaṃ ||”

iti śrutēḥ.

(brahmajñānamu kaligina vārilō uttamuḍainavāḍu jīviṃciyuṃḍiyē eppuḍū muktini poṃdinavāḍuvale nuṃḍuvāḍu. tānu jīviṃciyunna upādhi naśiṃcaganē - śarīramu viḍicina tarvāta - brahmamē yagucu brahmalō līnamaipōvunu ani śruti ceppucunnadi).

  1. “iha lōkē parēcaiva kartavyaṃ nāstitatravai| jīvanmuktō yatastasmāt brahma vitparamārthataḥ ||” (laiṃgē)

(ī lōkamunaṃdukāni paralōkamaṃdukāni śāstraprakāramu cēyavalasina pani lēni brahmajñāniyē paramātma dṛṣṭilō jīvanmuktuḍu).

  1. “yasminnēvakālē svamātmānaṃ yōgī jānāti kēvalaṃ| tasmāt kālāt samārabhya jīvanmuktō bhavēdyasau” (varāhōpaniṣat)

(bhagavaṃtuḍannavāḍokkaḍē, aṃtā bhagavaṃtuḍē. ā bhagavaṃtuḍu nēnē yani yōgiyaguvāḍu eppuḍu talucunō appaṭinuṃḍiyē atanu jīvanmuktuḍu).

  1. “puruṣasya bhōktṛtva sukhaduḥkhādilakṣaṇaḥ citta dharmāḥ klēśarūpatvāta baṃdhōbhavati. tannirōdhanaṃ jīvanmuktiḥ” (muktikōpaniṣat)

(puruṣuniki bhōktṛtvamu, sukhaduḥkhamulu lakṣaṇamulu ivi citta dharmamulu. klēśamulu - (bādhalanu kaligiṃcunavi). aṃduc hēta baṃdhamunu kaligiṃcunavi. ā manōdharmamulanu - cittavṛttulanu nirōdhioṃcuṭa jīvanmukti - adi cēyagaliginavāḍu jīvanmukltuḍu).

  1. “jīvavaṃtuḍaina puruṣuni kartṛtva bhōktṛtva, sukhatva duḥkhatvādi guṇālu ēvi kalavō avi cittadharmālu, klēśarūpālu kābaṭṭi baṃdhamanipiṃcunu. vīṭi nivāraṇamu jīvanmukti - - yōgābhyāsaṃcēta samastamaina cittavṛttulunnū nivāriṃpabaḍunu” (brahmavidyāsudhārnavamu). aṭlu vāṭini nivāriṃcukonminavāḍu jīvanmuktuḍu.

  2. “kriyānāśādbhavē cciṃta nāśō (a)smādvāsanā kṣayaḥ | vāsanā prakṣayē mōkṣassajīvanmukti riṣyatē” (ādhyātmōpaniṣat)

(karmalu lēkuṃḍuṭavalana karmavāsana naśiṃcunu. vāsanalu naśiṃcutavalana mōkṣamu kalugunu. iṭṭi mōkṣamē jīvanmukti. aṭṭi mōkṣamugalavāḍu jīvanmuktuḍu).

  1. “na ciddhōsmi saccidānaṃdalakṣaṇaḥ |

ēvaṃ bhāva yatnēna jīvaṃkuktō bhaviṣyasi ||“. (annapūrṇōpaniṣat)

(nēnu badduḍanukānu - nāku baṃdhamu lēdu - nēnu muktuḍanukānu - nirāmayuḍaina brahmanu nēnu. brahmamu kāka iṃkoka vastuvu unnadi anu bhāvamu - abhiprāyamu - nāku lēdu - sat, cit, ānaṃdamu anu lakṣaṇamulu gala brahmamunu nēnu - ani yī vidhamaina bhāvamuṃcukonukonuṭaku prayatnamu cēsinavāḍu jīvanmuktuḍu aguduvu).

  1. “brahmātmanō śśōdhita yōrēka bhāvāpagā hinī |

nirvikalpāca cinmātrā vṛttiḥ prajñēti kaddhyatē |

na sarvadā bhavēdyasya sa jīnmukta iṣyatē ||

dēhēṃdriyēṣvahaṃ bhāvaḥ, idaṃ bhāvastadanyakē |

yasyanō bhavataḥ kvāpina sajīvanmukta iṣyatē |

pratyak brahmaṇārbhēdaṃ kadāpi brahmasargiyōḥ |

prajñayā yō vijānāti sajīvanmukta iṣyatē ||

sādhubhiḥ pūjyamānēsmin pīḍyamānē durjanaiḥ |

samabhāvō bhavēdyasya sa jīvanmukta iṣyatē ||’ (adhyātmōpaniṣat)

(jīvātma paramātmala tatvamunu śōdhiṃci reṃḍu okaṭē yani bhāvamu kaligiyuṃḍuṭa prajñāvamu ani ceppabaḍucunnadi. aṭṭi prajñānamu ellapuḍu evaniki kaladō atanu jīvanmuktuḍani ceppabaḍucunnāḍu - dēhamuṃdriyamulu nēnē anu ahaṃkāramu, migilina prapaṃcamu - nēnukānidi aṃtayu prapaṃcamu anu bhāvamu lēnivāḍu jīvanmuktuḍu. jīvātma paramātmalaku, parabrahma jagattulaku bhēdamulēdu ani prajñānamuvalla evaḍu telusukonunō vāḍu jīvanmuktuḍu. sādhujanulu tananu pūjiṃcinanu, durmārgulu tananu bādhapeṭṭinanu samabhāvamutō nuṃḍuvāḍu jīvanmuktuḍu).

  1. “jīvanmuktōnāma svasvarūpākhaṃḍa brahmajñānēna tadajñāna bādhana dvārā svasvarūpākhaṃḍa brahmaṇi sākṣātkṛtē , ajñāna tatkārya saṃcita karma saṃśaya viparyayā dīnāmapi bādhitatvāt akhilabaṃdharahitaḥ brahma niṣṭaḥ”.

(svasvarūpamaina akhaṃḍa brahmajñānamu kaliginaṃduvalana brahma guṟiṃci ayina ajñānamu tolagipōgāsvasvarūpākhaṃḍa brahma sākṣātkāramu poṃduṭavalana ajñānamu, dāni valana kaligina karmala phalamu, saṃśayamu, viparyayamulu modalagunavikūḍā tolagipōvuṭavalana samastamaina baṃdhamulu tegipōyi parabrahmayaṃdē niṣṭakaligi yuṃḍuvāḍu jīvanmuktuḍu).

  1. “jñānasamakālaṃ pāpanāśā jjīvanmuktaḥ”.

(brahmajñānamu kalugaganē pāpamulu naśiṃcuṭacēta jīvanmuktuḍu).

  1. “āpatatsuya thā kālaṃ sukha duḥkhē ṣvanārataḥ |

nahṛṣyati glāyati yassa jīvanmukta ucyatē ||

harṣa marṣa bhaya krōdha kāma kārpaṇya vṛṣṭibhiḥ |

na parāmṛśyatē yō(a)otassa jīvanmukta ucyatē ||

ahaṃkārama yīṃ tyaktvā vāsanāṃ līlayai vayaḥ |

tiṣṭa tidhyē ya saṃtyāgī sa jīvanmukta ucyatē ||

īpsitā nīpsitānastō yasyāṃtarvatti dṛṣṭiṣu |

suṣipti vadyaccarati sa jīvanmukta ucyatē ||

adhyātmaratirā nīnaḥ pūrṇaḥ pāvana mānasaḥ |

prāptānuttama viśrāṃtirna kiṃci diva vāṃchati |

yō jīvati gatasnēhassa jīvanmukta ucyatē |

saṃvēdyē hṛdākāśē manāgapi na lipyatē |

yasyā sāva jaḍā saṃdi tsa jīvanmuktaḥ ucyatē ||

rāgadvēṣau sukhaṃ duḥkhaṃ dharmā dharmau phalāpalau |

yaḥ karōtya napēkṣyaiva sa jīvanmukta ucyatē ||

maunavānni rahaṃbhāvō nirmānō mukta matsaraḥ |

yaḥ karōti gatōdvēgaḥ sa jīvanmukta ucyatē ||

sarvatra vigatasnēhō yassākṣivadavasthitaḥ |

niricchō vartatē kāryē sa jīvanmukta ucyatē |

yēna dharma madharmaṃca manō manana mīhitaṃ |

sarva maṃtaḥ parityaktaṃ sa jīvanmukta ucyatē ||

yāvatī dṛśya kalanā sakalēyaṃ vilōkyatē |

sāyēna suṣṭu saṃtyaktā sa jīvanmukta ucyatē ||

kaṭvāmla lavaṇaṃ tiktama mṛṣṭaṃ mṛṣṭamēvaca |

samamēva yō bhuṃktē sajīvanmukta ucyatē ||

udvēgānaṃdarahita samayā svacchayādhiyā |

na śōcati nōdēti sa jīvanmukta ucyatē |

sarvēcchassakalā śśaṃkāḥ sarvē hāsarva niścayāḥ |

dhiyō yēna parityaktāssa jīvanmukta ucyatē ||

janma sthiti vināśēṣu sōdayāstama yēṣu ca |

samamēva manō yasya sa jīvanmukta ucyatē ||

na kiṃcinadvēṣṭi tathā nakiṃcidapi kāṃkṣati |

bhuṃktēyaḥ prakṝtān bhōgān sajīvanmukta ucyatē ||

śāṃta saṃsāra kalanaḥ kalā vānapi niṣkalaḥ |

yassa cittō pi niścitta ssa jīvanmukta ucyatē ||

yassamastārtha jālēṣu vyavahāryapi nispṛhaḥ |

parārthē ṣviva pūrṇātmā sa jīvanmukta ucyatē ||” (mahōpaniṣat)

(sukha duḥkhamulu vaccina vāṭitō saṃtōṣiṃcaka, duḥkhiṃcaka yuṃḍuvāḍu; saṃtōṣamu, duḥkhamu, bhayamu, krōdhamu, kāmamu, kārpaṇyamu manassulō lēnivāḍu, ahaṃkāramutō kūḍina vāsanalanu avalīlagā viḍicipeṭṭi, tyāgiyai, dhyēya vastuvaina paramātmayaṃduṃḍuvāḍu; manassulō īpsitamulanu kōraka suṣuptyavasthalō nuṃḍunaṭluṃḍuvāḍu; adhyātmamaṃdē rati galigi nirmalamaina manassu galavāḍu. anuttamamaina śāṃtini poṃduṭacēta ī lōkamulōni kōrikalu ēviyu lēnivāḍu; dēni yaṃdu āśalēnivāḍu; rāga dvēṣamulu, sukha duḥkhamulu, dharmā dharmamulu, phalāphalamulu - vīṭi yaṃdu apēkṣa lēnivāḍu; maunamavalaṃbiṃcinavāḍu; ahaṃbhāvamu lēnivāḍu - abhimānamu lēni vāḍu, mātsaryamu lēnivāḍu, udvēgamu lēka panicēyuvāḍu; dēniyaṃdunu āśa lēka sākṣivalenuṃḍuvāḍu; cēyucunna kāryamulaṃdu kōrika lēnivāḍu; dharmamunu adharmamunu manassulō kōraka anniṃṭinī manassulōnē vadalivēsinavāḍu; ī prapaṃcamaṃdu iṭivaṃṭi dṛṣṭi kaligiyuṃḍuvāḍu; cēdu, pulupu, uppu modalaguvāṭini samamugānē bhujiṃcuvāḍu, jarāmaraṇamulanu, āpattulanu, saṃpadalanu, daridramunu, maṃcini okē rītigā anubhaviṃcuvāḍu; dharmā dharmamulu, sukha duḥkhamulu, jananamaraṇamulu - vīṭini lekka sēyanivāḍu; udvēgamugāni ānaṃdamu gāni lēka samamaina svacchamaina buddhi kaligi, śōkamugāni, toṃdarapāṭugāni lēnivāḍu; samastamaina kōrikalu, anni śaṃkalu, anni niścayamulu manassulō viḍicipeṭṭinavāḍu; janma sthiti vilayamulaṃdu, udayāstamayamulaṃdu samamaina manassu galavāḍu; dēninainanu, ē koṃcemainanu dvēṣiṃcaka, kōraka, prakṛti bhōgamulananubhaviṃcuvāḍu; śāṃtuḍai, kaḷāvaṃtuḍainanu - vidyalu nērcinavāḍainanu - kaḷalu lēnivāḍuvale nuṃḍuvāḍu; manassu kaligi yuṃḍiyu manassu lēnivānivale nuṃḍuvāḍu; anni puruṣārthamulaṃdu parārthamulani spṛha lēni vāḍu - iṭlu paina ceppabaḍina vāru jīvanmuktulu).

  1. “nōdēti nāstama yāti sukha duḥkhē manaḥ prabhāḥ |

yadhā prāpatasthitiryasya sa jīvanmukta ucyatē |

yā jāgari suṣupti sthō yasya jāgranna vidyatē |

yasya nirvāsanō bōdha ssa jīvanmukta ucyatē ||

rāgadvēṣa bhayādīnā manurūpaṃ carannapi |

yōṃtarvyōmavadatya ccassa jīvanmukta ucyatē ||

yasya nāhaṃ kṛtō bhāvō buddhiryasya na lipyatē |

kurvatō (a)kurvatō vāpi sa jīvanmukta ucyatē ||

yasmānnō dvijatē lōkō lōkānnō dvijatē yaḥ |

harṣā harṣabhayānmuktaḥ sa jīvanmukta ucyatē ||

yassamastārtha jālēṣu vyavahāryapi śītaḷaḥ |

parārthēṣviva pūrṇātmā sa jīvanmukta ucyatē ||

prajahāti yadā kāmān sarvāṃścitta gatān munē |

mayi sarvātmanē tuṣṭassa jīvanmukta ucyatē ||

caitya varjita cinmātrē padē paramapāvanē |

akṣubdha cittō viśrāṃta ssa jīvanmukta ucyatē ||

idaṃ jagadahaṃ sōyaṃ dṛśya māna mavāstavaṃ |

yasya cittē nasphurati sa jīvanmukta ucyatē ||” (varāhōpaniṣat)

(sukhamu kaliginapuḍu saṃtōṣiṃpaka, duḥkhamu kaliginapuḍu vicāriṃpaka manassunu prāptiṃcina vāṭitō samādhānaparacukonuvāḍu; jāgradavasthalōnunnanu suṣuptyavasthalōnunnanu evani jāgradavastha teliyabaḍadō; evaniki nirvāsakayaina jñānamu kalugunō; rāga dvēṣa bhayamulu modalaguvāṭiki anurūpamaina pravartana kaliginavāḍainanu evaḍu aṃtaraṃgamaṃdu - aṃtarākāśamuvale vāṭiki atītuḍagunō; evaniki ahaṃkāramu lēdō, evaḍu karma cēsinanu, cēyakapōyinanu karmaphalamaṃṭadō; evanivalana lōkamu udvēgamu poṃdadō; evaḍu lōkamuvalana udvēgamunu poṃdaḍō,harṣāharṣa bhayamulu evanikilēvō; evaḍu samastamaina arthamulaṃdu vyavahariṃcucunnanu, aviitarulaku saṃbaṃdhiṃcinavani vāṭi yaḍala śītakaḷagalavāḍō; evaḍu manasulō kalugu samastamaina kōrikalanu vadalivēsi sarvātma ayina - bhagavaṃtuḍu ayina - nāyaṃdē saṃtuṣṭipoṃdunō; kanabaḍuī jagattu aṃtayu vāstavamukānidi yani evani cittamaṃdu sphuriṃcunō vāḍu jīvanmuktuḍu).

  1. “dēhēṃdriyē ṣvahaṃ bhāvaḥ idaṃ bāvastanyakē |

yasyanō bhavataḥ kvāpi sa jīvanmukta iṣyatē ||

sa pratyak brahmaṇōrbhēdaṃ kadāpi brahma sargayōḥ |

prajñayā yō vijānāti sa jīvanmukta iṣyatē ||“.

(dēhamaṃdu, iṃdriyamulaṃdu avi nēnē anu bhāvamunnū, migilinadaṃtayu ī prapaṃcamu anu bhāvamu evaniki kalugadō aṭṭivāḍu jīvanmuktuḍu. jīva brahmalaku bhēdamu lēdani, parabrahmaku ī sṛṣṭiki bhēdamulēdani, jñānamu kaligiyuṃḍuṭacēta evaḍu telusukonunō vāḍu jīvanmuktuḍu).

  1. “sādhubhiḥ pūjyamānē asmin pīḍyamānē pi durjanaiḥ |

samabhāvō bhavēdyasya sa jīvanmukta iṣyatē ||“.

(sādhu janulacēta pūjiṃpa baḍinanu, durmārgulacēta pīḍiṃpabaḍinanu samabhāvamutō nuṃḍuvāḍu jīvanmuktuḍu).

  1. “sadā sannihitaśśaṃbhu śśrīśailē mallikārjunaḥ |

tasmin dṛṣṭē taṭē liṃgē jīvanmuktō na saṃśayaḥ (śrī śaila khaṃḍamu)

(śrī śailamaṃdu mallikārjunuḍunnāḍu - sannihituḍai unnāḍu. ā mallikārjuna liṃgamunu cūcinavāḍu jīvanmuktuḍagunu. iṃduku saṃdēhamulēdu).

  1. “advēṣṭā sarva bhūtānāṃ - - - bhaktāstē (a)tīvamatpriyāḥ. (śrīmadbhagavadgīta - 12 - 13 to

“advēṣṭatvādi cihnāni jīvanmukta śarīriṇāṃ |

svabhāva bhūtānī mānitaduktaṃ vārtikē sphuṭaṃ || -”

utpannāva bōdhasya hya dvēṣṭṛtvādi yō guṇāḥ |

ayatnatō bhavaṃtyēva na tu sādhana rūpiṇaḥ |

saṃsādhya mānaṃ yatnēna dharma jātamidaṃ sataḥ |

viraktasyātma jijñāsōrmumukṣōrmōkṣa sādhanaṃ ||” (gītābhāva prakāśamu - 12 - 126 to 129)

(śrīmadbhagavadgītalō 12 va adhyāyamulō”advēṣṭā sarva bhūtānāṃ” ani modalukoni adhyāyāṃtamu varaku ceppabaḍinavi jīvanmuktuni lakṣaṇamulu - ivi svabhāvamugā kaliginavi - ī viṣayamu vārtikamaṃdu ī vidhamugā ceppabaḍinadi - ātmajñānamudayiṃcina vāriki ī guṇamulu vāru prayatnamu cēyakanē kalugunu. ivi vāri yaḍala sādhanarūpamulu kāvu, dharmarūpamulainavi).

  1. “kācēyaṃ jīvanmuktiḥ ? na śarīrasya ca mōkṣaḥ iti cēt -”mātāmē vaṃdhyā” iti vat

asaṃgatārthaṃ vacaḥ. yataḥ sa śarīratvaṃ baṃdhaḥ, aśarīratvamēva mōkṣaḥ ” iti tvayaiva. (advaitinā). śruti bhirupapāditaṃ”

(śrīmān rāmānujaḥ)

(jīvanmukti anagā ēmiṭi ? - śarīramu kaligiyuṃḍagā mōkṣamu anina yaḍala - ‘mā talli vaṃdhya - goḍrālu’ aninaṭlu asaṃdarbhamugā nuṃḍunu - eṃducētananagā śarīramu kaligiyunnayaḍala baṃdhamē - śarīramu lēkuṃḍuṭayē mōkṣamu ani advaitulukūḍa ceppiyunnāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.