జీవుడు; దేహి.
“ఇరువది యైదు తత్వాలతో గూడింది జీవునియొక్క స్థూలదేహము. ఇందులోని ఆత్మ జీవాత్మ”. (బ్రహ్మవిద్యా సుధార్ణవము - 6)
“జీవాత్మ అంతరాత్మ పరమాత్మ అను నాత్మ త్రయంబు. అందు తప్తా యః పిండంబునంబోలె దేహాదులతోడి సంబంధంబువలన సకల సంసార వ్యవహారంబు గలుగునతండు జీవాత్ముడు” (వివేక చింతామణి - పరమానందతీర్థ)
“స్థావర జంగమంబులయిన జీవులకు బవనుండు బ్రాణంబై యున్న చందంబున నీశ్వరుండు సర్వభూతాంతర్యామి యగుచు జీవాత్మ స్వరూపంబున నుండు. జీవాత్ముండు జ్ఞానోదయంబునం జేసి మాయ నెంతకాలంబు గెలువకుండు నంతకాలంబు ముక్తసంగుండు గాడు. అరిషడ్వర్గంబును జయించిపరతత్త్వంబు నెఱింగిన సర్వేశ్వరుండగు - చిత్తంబెంత కాలంబు విషయాసక్తంబగు నంత తడవు సంసార చక్రంబునందు సంచరించు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 11 - 155)
“నీవు జీవాత్మ స్వరూపకుండవును సకలాత్మలకు నాత్మయైన పరమాత్మ స్వరూపకుండవు”
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ, భా. - 569)
విస్ఫులింగోల్ముఖ విపుల ధూమములచే హవ్యవాహనుడు వేరు అయిన రీతి
వలనొప్ప దేహంబువలన జీవాత్మ పరికింప భిన్నరూపముననుండు
- - -“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 28 - 943)
(బాగా మండుచున్న అగ్నినుండి వేలకొలది విస్ఫులింగములు ఏ ప్రకారముగా రూపములు గలిగి పైకి ఎగయుచున్నవో, ఆ ప్రకారముగానే నాశరహితుడైన పరబ్రహ్మనుండి అనేకములైన భావములు పుట్టుచున్నవి, మఱియు అందులోనే లీనమగుచున్నవి. ఆ ప్రకారముగానే జీవాత్మలయొక్క ఉత్పత్తి ప్రళయములు అగుచున్నవి. పరమాత్మయొక్క చైతన్యము కలిగియుండుటచేత జీవాత్మలు పరమాత్మ రూపములే).
jīvuḍu; dēhi.
“iruvadi yaidu tatvālatō gūḍiṃdi jīvuniyokka sthūladēhamu. iṃdulōni ātma jīvātma”. (brahmavidyā sudhārṇavamu - 6)
“jīvātma aṃtarātma paramātma anu nātma trayaṃbu. aṃdu taptā yaḥ piṃḍaṃbunaṃbōle dēhādulatōḍi saṃbaṃdhaṃbuvalana sakala saṃsāra vyavahāraṃbu galugunataṃḍu jīvātmuḍu” (vivēka ciṃtāmaṇi - paramānaṃdatīrtha)
“sthāvara jaṃgamaṃbulayina jīvulaku bavanuṃḍu brāṇaṃbai yunna caṃdaṃbuna nīśvaruṃḍu sarvabhūtāṃtaryāmi yagucu jīvātma svarūpaṃbuna nuṃḍu. jīvātmuṃḍu jñānōdayaṃbunaṃ jēsi māya neṃtakālaṃbu geluvakuṃḍu naṃtakālaṃbu muktasaṃguṃḍu gāḍu. ariṣaḍvargaṃbunu jayiṃciparatattvaṃbu neṟiṃgina sarvēśvaruṃḍagu - cittaṃbeṃta kālaṃbu viṣayāsaktaṃbagu naṃta taḍavu saṃsāra cakraṃbunaṃdu saṃcariṃcu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 11 - 155)
“nīvu jīvātma svarūpakuṃḍavunu sakalātmalaku nātmayaina paramātma svarūpakuṃḍavu”
(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū, bhā. - 569)
visphuliṃgōlmukha vipula dhūmamulacē havyavāhanuḍu vēru ayina rīti
valanoppa dēhaṃbuvalana jīvātma parikiṃpa bhinnarūpamunanuṃḍu
- - -“. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 28 - 943)
(bāgā maṃḍucunna agninuṃḍi vēlakoladi visphuliṃgamulu ē prakāramugā rūpamulu galigi paiki egayucunnavō, ā prakāramugānē nāśarahituḍaina parabrahmanuṃḍi anēkamulaina bhāvamulu puṭṭucunnavi, maṟiyu aṃdulōnē līnamagucunnavi. ā prakāramugānē jīvātmalayokka utpatti praḷayamulu agucunnavi. paramātmayokka caitanyamu kaligiyuṃḍuṭacēta jīvātmalu paramātma rūpamulē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.