← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జీవేశ్వరులు jīvēśvarulu

Original — తెలుగు
  1. “జీవస్య అసర్వజ్ఞత్వ పరిచ్ఛిన్న త్వా దయః నికృష్ట ధర్మాః. ఈశ్వరస్య సర్వజ్ఞత్వ వ్యాపకత్వాదయః ఉత్కృష్ట ధర్మాః. తథా చ విరుద్ధ ధర్మ విశిష్ట యోః తయోరైక్యం అభేదో నైవ ఘటేత. తర్హి కథం అభేదః ప్రతి పద్యతే ఇతి చేత్ - సృతిస్థయోః తత్వయోః ‘తత్’ ; ‘త్వం’ పదయోః లక్షణాకర్తవ్యా. సర్వజ్ఞత్వాది విశిష్టం బ్రహ్మ, అసర్వజ్ఞత్వాది విశిష్టం బ్రహ్మ చైతన్యం జీవః. తత్ర ధర్మ ద్వయం విహాయ చిన్మాత్ర మేవ భాగత్యాగ లక్షణ యా గ్రాహ్యం తస్మిన్ తయోర్ష క్షణార్థ యోః ఐక్యస్య సంభవః అస్తి”.

(జీవుడు సర్వజ్ఞుడుకాడు - సర్వమును తెలిసినవాడు కాడు - పరిచ్ఛిన్నుడు (హద్దులు గలవాడు,పరిమితి గలవాడు - ఇవి జీవునియొక్క నికృష్ట ధర్మములు. ఈశ్వరుడు (పరబ్రహ్మ) సర్వజ్ఞుడు (అన్నియును తెలిసినవాడు). కనుకనే సృష్టి స్థితి లయములు చేయువాడు; వ్యాపకుడు (తాను చేసిన సృష్టి అంతటిలోను వ్యాపించియుండువాడు - ఇట్టి ఉత్కృష్ట ధర్మములు గలవాడు. ఇట్లు విరుద్ధ ధర్మములు గల ఈ రెండింటికి (జీవేశ్వరులకు) ఐక్యత (భేదము లేకపోవుట - అవి రెండునూ ఒకటే అనుట) ఘటింపదు - (కుదరదు). ఇట్లైన యడల ఈ రెండింటికీ భేదము లేదు, రెండూ ఒకటే అని చెప్పుట యెట్లు ? శ్రుతిలో చెప్పిన ప్రకారము ‘తత్వమసి’ (ఆ పరమాత్మ నీవే) అనుమహావాక్యమును సమర్థించుటలో వలె లక్షణ నుపయోగించవలెను. సరజ్ఞుడు అను మొదలగాగల లక్షణములు గలవాడు ఈశ్వరుడు - సర్వజ్ఞుడు కాని లక్షణములుగల బ్రహ్మ చైతన్యము జీవుడు. ఈ ఇద్దరియొక్క యీ విరుద్ధ ధర్మములను విడిచిపెట్టి, భాగత్యాగలక్షణనుసరించి (కొంత భాగమును వదలివేయుట, సరిపడనిది వదలివేయుట) ఇద్దఱిలో చిన్మాత్రమే (చైతన్యమే) గ్రహించవలెను. అట్లు చేసినయడల విరుద్ధ లక్షణములు పోయి మిగిలిన చైతన్యము వలన ఇద్దరికి ఐక్యము కుదురును).

  1. “ఏకో జీవః ప్రకృతి గుణాన్ భుంజమానః తత్పరతంత్ర తయా సం సరతి. అపరః ఈశ్వరః తాం పరిత్యజ్య నిత్యముక్త తయా అవతిష్టతే”.

(జీవుడు ప్రకృతి గుణముల ననుభవించుచు అందులో మునిగిపోయినవాడై వాటి ఫలముగా సంసారములో పడి తిరుగుచుండును - పుట్టుచు, చనిపోవుచు కర్మఫలము ననుభవించుచుండును - ఈశ్వరుడు ప్రకృతికి అతీతుడై దాని గుణములకు స్వాధీనుడు కాకయుండుటచేత ఏ విధమైన బంధములేక నిత్యముక్తుడై యుండును).

  1. ఘటాకాశ మఠాకాశ యదాకాశ ప్రభేద తః |

కల్పితౌ పరమే జీవ శివ రూపేణ కల్పితౌ |

తత్వ తశ్చ శివస్సాక్షాత్ చిత్ జీవశ్చ స్వతస్సదా |

చిచ్చిదాకారతో భిన్నా వ భిన్నా భిన్నాచిత్వ హానితః ||“. (రుద్రహృదయోపనిషత్)

(ఘటాకాశమని, మఠాకాశమని ఒకే ఆకాశములో భేదమున్నట్లు కల్పించబడినది. జీవుడని, శివుడని పరమాత్మయే కల్పించబడెను - యథార్థముగా చూచిన రెండింటి తత్వములు ఒకటే. శివుడు సాక్షాత్ చైతన్యము. జీవుడు కూడ చైతన్యమే. సాక్షాత్ చైతన్యమునకు, చైతన్యమునకు భేదము లేదు -)

  1. పరో వికృతః ఏవాత్మా, స్వాత్మా అయం జీవః. (చాందోగ్యోపనిషత్)

(పరమాత్మయే వికారమును పొంది ఆత్మగా మారెను - ఆ ఆత్మయే జీవుడు).

  1. “జీవేశ్వరయోః భేదా భేదౌ భవతః, అహి కుండలవత్ అహేహి సంస్థాన విశేషోహి కుండలం, తయో రహిత్వేనా భేదః, కుండలత్వేన భేదో యథా, తద్వదిత్యర్థః , యథా అహిత్వానా భేదః కుండలాఖ్యస్య సర్పావస్థా విశేషస్య కుండలత్వేన భేదః తథా జీవస్య బ్రహ్మత్వేన అభేదః జీవత్వేన భేదః.

(కుండలత్వం వలయాకారత్వం, అభోగిత్వం, వక్రాకారత్వం ప్రాంశుత్వం దీర్ఘ దండాకారత్వం ఉద్గత ముఖత్వ మాది శబ్దార్థః).

(జీవేశ్వరులకు భేదము, అభేదము కలుగుచున్నవి. అది ఎట్లనగా - అహి, కుండలము వలె. అహి అనగా పాము - అది ఉన్న స్థితిని బట్టి కుండలమని చెప్పబడును. (గుండ్రముగా చుట్టుకొని యుండుటవలన కుండలము). అహి యనినను, కుండలము అనినను పామే యని ఊర్థము - రెండునూ ఒకటే. అయితే ఒకటి కుండలముగా (గుండ్రముగా) చుట్టుకొని యున్నందున రెండింటికి భేదము చెప్పబడుచున్నది. రెండును పామే యగుటవలన రెండూ ఒకటే, రెండింటికి భేదము లేదు. ఆ ప్రకారముగానే జీవుడు పరమాత్మ ఒకటియే, రెండింటికి భేదము లేదు. కాని జీవుడుగా పరమాత్మకన్న వేరు అని చెప్పబడుచున్నాడు).

  1. “సీ. నలువొంద నఖిల జీవులయందు గల నన్ను దెలిసి సేవింపుము నలిన గర్భ

భవదీయ దోషముల్వాయును; భూతేంద్రియాశ్రయ విరహితమై విశుద్ధ

మైన జీవుని విమలాంతరాత్ముడనైన నను నేకముగ జూచు నరుడు మోక్ష

పదమార్గవర్తియై భాసిల్లు - - - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 9 - 320)

  1. “అన్నమయకోశమైన స్థూల శరీరమునున్నూ, అందుకు లోనైన ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయమనెడి కోశత్రయాత్మక లింగ శరీరమునున్నూ, అందుకు లోనైన ఆనందమయాత్మకమై తమోరూపమైన కారణ శరీరమునున్నూ వేరు చేసి, అందుకు లోనై యున్న తన స్వరూపమైన ప్రత్యగానంద కూటస్థ చైతన్యానకున్నూ విశ్వసాక్షికమైన అద్వయానంద బ్రహ్మ చైతన్యానకున్నూ, గురు కారుణ్య రూపమైన మహా వాక్యం వల్లనే ఐక్యత్వమునున్నూ తెలిసి అనుపమానంద స్వరూపుండే ‘సోహం’ (అతనే, ఆ బ్రహ్మయే, నేను) అనును.

(బ్రహ్మవిద్యా సుధార్ణవము)

  1. “ఏ తత్సరి దౄశ్యమాన నామరూపాత్మక మాయాయాః సత్యత్వ బుద్ధిం విహాయ కేవల సత్యాత్మక సచ్చిదానంద నిరూప నిర్గుణ నిరంజన పరబ్రహ్మాణం సాధన చతుష్టయ సంపత్యా విజ్ఞాయ”అహం బ్రహ్మస్మి” ఇతి భావనయా మానవః స్వయం జీవోపి జీవ బ్రహ్మైక్య సాయుజ్యం ప్రాప్తవ్యం“.

(నామరూపములతో కూడియున్న యీ కనబడు మాయయగు ప్రపంచము సత్యమైనది - (మూడుకాలములందుండునది, సత్య వస్తువు పరమాత్మ -) అను అభిప్రాయము వదలి అసలు సత్యమైనది - సచ్చిదానందమైనది యగు పరబ్రహ్మను సాధనచతుష్టయముల ద్వారా తెలుసుకొని “నేను పరబ్రహ్మను అయితిని” అను మహాక్యార్థమును సార్థకము చేసినవాడు, తాను ప్రస్తుతము స్వయముగా జీవుడైనప్పటికీ ‘జీవబ్రహ్మైక్యము’ అను సాయుజ్య ముక్తిని పొందును - జీవుడు పరబ్రహ్మతో ఏకమగును అని చెప్పబడి యుండుటచేత ఇద్దరూ ఒకటే, కాని ఇద్దఱకు భేదము లేదు).

  1. చైతన్య స్యేఇక్య రూపత్వాత్ భేదో యుక్తోన కర్హిచిత్ |

జీవత్వం హి తథా జ్ఞేయం రజ్వాం సర్ప గ్రహో యథా |

రజ్జ్విజ్ఞానాత్ క్షణే ణైవ యద్వద్రజ్జర్హి సర్పిణీ |

భాతి తద్వచ్చితి స్సాక్షాత్ విశ్వా కారేణ కేవలా |

ఉపాదానం ప్రపంచస్య బ్రహ్మణోన్యన్న విద్యతే |

తస్మాత్ సర్వ ప్రపంచో యం బ్రహ్మైవాస్తి న చేతరత్ |

వ్యాప్య వ్యాపకతా మిథ్యా సర్వమాత్మేతి శాసనాత్ |

ఇతి జ్ఞాతే పరే తత్వే భేదస్యావ సరః కుతః |

బ్రహ్మణస్సర్వ భూతాని జాయంతే పరమాత్మనః |

తస్నాదేతాని బ్రహ్మైవ భవం తీతి విచింతయ |

బ్రహ్మైవ సర్వ నామాని రూపాణి వివిధానిచ |

కార్యాణ్యా పి సమగ్రాణి భాసం తీ వేతి భావయ |

సువర్ణాజ్జాయ మానస్య సువర్ణత్వం చ శాస్వతం |

బ్రహ్మణో జాయ మానస్య బ్రహ్మత్వం చ తథా భవేత్ |

స్వల్పమప్యంతరం కృత్వా జీవాత్మ పరమాత్మనోః |

యస్తిష్టతి సమూఢాత్మా భయం తస్యాపి భాషితం |

యదజ్ఞానాద్భవే ద్ద్వైత మితరత్త త్ప్రపస్యతి |

ఆత్మత్వేన తదా సర్వం నేతరత్తత్ర చాణ్వపి |

అనుభూతో ప్యయం లోకో వ్యవహార క్షమోపిసన్ |

అసద్రూపో యదా స్వప్నః ఉత్తరక్షణ బాధితః |

స్వప్నే జాగరితం నాస్తి జాగరితం నాస్తి జాగరే |

స్వప్నతా నహి ద్వయమేవ లయే లాస్తి లయోపి హ్య నయోర్నిచ |

త్రయమేవ భవేన్మిధ్యా గుణ త్రయ వినిర్మితం |

అస్య దృష్ట్వా గుణాతీతో నిత్యోహేష చిదాత్మకః |

యద్వన్మృదిఘట భ్రాంతిః శుక్తేతు రజత స్థితిః |

తద్వద్బ్రహ్మణి జీవత్వం వీక్షమాణే వినశ్యతి |

యథామృది ఘటోనామ కనకే కుండ లాభిదా |

శుక్తాహి రజతఖ్యాతిః జీవశబ్దస్తథా పరే |

యధైవ వ్యోమ్ని నీలత్వం యథా నీరం మరుస్థలే |

పురుషత్వం యథా స్థాణౌ తద్విద్విశ్వం చిదాత్మని |

యధైవశూన్య వేతాళో గంధిర్వాణాం పురం యథా |

యథాకాశే ద్వి చంద్రత్వం తద్వత్సత్యే జగత్స్థితిః |

యధా తరంగ కల్లోలై జలమేవస్ఫురత్యలం |

ఘటనామ్నా యథా పృధ్వీ వానామ్నాహి తంతవః |

జగన్నామ్నా చిదాభాతి సర్వం బ్రహ్మైవ కేవలం |

యథా వంధ్యా సుతో యథా నాస్తి మరౌ జలం |

యథా నాస్తి నభో వృక్షః తథా నాస్తి జగత్ స్థితిః |

గృహ్యమాణే ఘటే యద్వన్మృత్తికా భాతి వై బలాత్ |

వీక్షమాణే ప్రపంచే తు బ్రహ్మైవాభాతి భాసురం |

స దైవాత్మా విశుద్ధో స్మిహ్యశుద్ధో భాతి వై సదా |

యదైవ ద్వివిధా రజ్జు ర్జ్ఞానినో (అ)జ్ఞానినో(అ)నిశం |

యధైవ మృణ్మయః కుంభః తద్వద్దేహోపి చిన్మయః |

ఆత్మానాత్మవివేకోయం మిధ్యైవక్రియతే బుధైః |

సర్పత్వేన యథా రజ్జౌ రజత త్వేన శుక్తికా |

వినిర్ణీతా విమూఢేన దేహత్వే తథాత్మతా |

ఘటత్వేన యధా పృధ్వీ జలత్వేన మరీచికా |

గృహత్వేన చ కాష్టాని ఖడ్గత్వే నైవ లోహితా |

తద్వదాత్మని దేహత్వం పశ్యంత్య జ్ఞాన యోగతః ||“. (యోగశిఖోపనిషత్)

(చైతన్యం జీవేశ్వరులిద్దరికి ఒకటే. అందుచేత ఇద్దరికీ భేదములేదు. చీకటిలో త్రాడును చూచి పాము అని భ్రమించినట్లే జీవుడు వేరు అని అనుకొనుట. రెండింటిలోనున్న చైతన్యము ఒకటే అయి యుండగా ఒకటి ఈశ్వరుడని ఒకటి శివుడు అని అనుకొనుట భ్రమ. చీకటిలో త్రాడు త్రాడు అని తెలియకపోవుటచేత త్రాడు సర్పమై తోచినట్లు పరమాత్మయొక్క చైతన్యము (చిచ్ఛక్తి) ప్రపంచమువలె తోచును. ప్రపంచమునకు ఉపాదానకారణము పరమేశ్వరుడు కాక మఱియొకటి కనబడదు - అందుచేత ఈ ప్రపంచమంతయు బ్రహ్మమే కాని మఱియొకటికాదు - ప్రపంచమంతటిలోను వ్యాపించియుండునది అంతయు ఆత్మయే - పరమేశ్వరుని తత్వము - (పరబ్రహ్మ తత్వము). ఈ ప్రకారముగ తెలుసుకొనిన పరబ్రహ్మను ఇతర వస్తువునకు (జీవునకు) భేదమెట్లు కలుగును ? పరబ్రహ్మ వలననే సమస్త భూతములు ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టుచున్నవి. అందుచేత ఇవన్నియు పరబ్రహ్మమే యగుచున్నవి. ఈ సమస్త రూపములు, వాటి నామములు, సమస్త కార్య వస్తువులు పరబ్రహ్మయే అని భావింపుము - బంగారముతో చేయబడిన వస్తువులు బంగారు వస్తువులే. వాటిలో నున్నది బంగారమే - అందుచేత బ్రహ్మనుండి పుట్టినవన్నియు బ్రహ్మమే. జీవాత్మకు పరమాత్మకు ఏ కొంచెమైనను భేదముకలదనువాడు మూఢుడు. అజ్ఞానము వలన బ్రహ్మకాని వస్తువు మఱియొకటి యున్నదని భ్రమించువానికి బ్రహ్మకానిదిగ కనబడును - ఆ ప్రకారమే సమస్తమూ బ్రహ్మమే (ఆత్మయే) యని చూచువానికి అంతయు (అణువణువును) బ్రహ్మముగానే కనబడును. అసద్రూపమైన స్వప్నము మరు క్షణమందే లేకుండును. స్వప్నమందు జాగ్రదవస్థ లేదు - జాగ్రదవస్థయందు స్వప్నములేదు. లయమందు జాగ్రత్స్వప్నములు లేవు. లయము జీవేశ్వరులిద్దరికీ లేదు. ఈ మూడు అవస్థలు త్రిగుణములవలన కలుగునవి, కనుక ఇవి మిధ్యలే. చిదాత్మగుణాతీతుడు, నిత్యుడు. మట్టిని చూచి (ఆకారమునుబట్టి) కుండయను భ్రాంతి కలుగుచున్నది. బంగారమును చూచి కుండలములను భ్రాంతి కలుగుచున్నది. చీకటిలో ముత్యపు చిప్పను చూచి వెండియని భ్రాంతి కలుగుచున్నది. ఆ ప్రకారముగానే పరబ్రహ్మను చూచి జీవుడని భ్రాంతి కలుగుచున్నది. నిర్మలమైన ఆకాశము నీలివర్ణముగా నున్నట్లు, మరుభూమియందు (ఎండమావులందు) నీరు వలెనే, చీకటిలో స్తంబమును చూచి మనిషి యని భ్రమించినట్లే. ఈ ప్రకారముగానే అంతా పరమాత్మయే అయి యుండగా ప్రపంచమనునది భ్రమచేత తోచినట్లుండును. ఆకాశములో గంధర్వనగరము, రెండు చంద్రులు కనబడినట్లుండుట. ఆ ప్రకారముగానే సత్పదార్థమైన పరమాత్మయే అంతయు అయి యుండగా దానిలో వేరే ప్రపంచమనుదానిని చూచుట. అంతయు నీరు అయి యుండగా దానిలోనే కెరటములు వేరు అని అనుకొనుట, మట్టిని కుండయని, దారములు (కలిసియున్న వాటిని) చూచి బట్ట యనికొనునట్లే ప్రపంచమువలె ఆ చిదాభాసమే యున్నది. (ఆ పరమాత్మ చైతన్యమే యున్నది). అంతయు కేవలము బ్రహ్మమే - గొడ్రాలికి కొడుకు లేనట్లుగనే, ఎండమావులలో నీరు లేనట్లుగనే, ఆకాశములో చెట్టు లేనట్టుగనే జగత్తు అనునది లేదు. కుండలో దాని ఉపాదానకారణమైన మట్టి కనబడినట్లు ఈ కనబడు ప్రపంచములో దానికి ఉపాదాన కారణమైన పరబ్రహ్మమే కానవచ్చుచున్నది (కార్య వస్తువు దాని ఉపాదానకారణము కన్న వేరు కాదు). త్రాడు అజ్ఞానికి పాము వలెనూ,జ్ఞానికి త్రాడువలె రెండు రీతులను కనబడును. కుండ మట్టీగా జ్ఞానికి కనబడును, కుండగా అజ్ఞానికి కనబడును. ఈ ప్రకారముగానే పరమాత్మ జీవునివలె, జీవునివలె కనబడును. ఈ ప్రకారముగా బుద్ధిమంతులు (జ్ఞానులు) (బ్రహ్మజ్ఞానము గలవారు), అంతా ఆత్మయే యని వారు తెలియుటచేత, ఆత్మ యేదో అనాత్మ యేదో అను వివేకము మిధ్యయని తలంచెదరు. చీకటిలో త్రాడును చూచి పాము అని, ముచ్చెపు చిప్పను చూచి వెండియని మూఢులు తలచెదరు. ఆ ప్రకారమే దేహమే ఆత్మయని తలంతురు, మట్టిని కుండయని, ఎండమావులు నీరు అని, లోహమును చూచి ఖడ్గమని అజ్ఞానమువలన తలచినట్లే అంతా పరబ్రహ్మమే అయి యుండగా ఆత్మ దేహమని తలంచెదరు).

  1. “వ్యాపకస్య ఈశ్వరస్య జీవస్య చ స్వరూపతః నాస్తి భేదః, కింతు ఉపాధినా భేదో అస్తి అవచ్ఛేద వాదే మాయా విశిష్ట చైతన్యం ఈశ్వరః ఇత్యుచ్యతే, అవిద్యా విశిష్ట చైతన్యంతు జీవః ఇతి. ఆభాసవాదేమాయాయాః ఆభాసేన చ (resemblance) విశిష్టం చైతన్యం ఈశ్వరః ఇతి వర్ణ్యతే. ఆభాససహితా విద్యా విశిష్టం చైతన్యం జీవః ఇతిచ. ఆభాసవాదే అభాస సహితా విద్యయాః ఆభాస సహిత మాయాయాః చ భేదఓ అస్తి - తధైవా వచ్ఛేదవాదే అవిద్యాయాః మాయా యాశ్చ భేదో అస్తి, స్వరూపతఃచైతన్యస్య భేదో నాస్తి. బింబ ప్రతిబింబ పక్షే అజ్ఞానగత చైతన్య ప్రతిబింబో జీవః, బింబ చైతన్యం ఈశ్వరః. అస్మిన్ పక్షే అపి చైతన్యస్య నాస్తి భేదః, కింతు ఏకస్మిన్నేవ చైతన్యే జీవస్యే శ్వరత్వే కల్పితే. ఈశ్వరస్య జీవస్యచ విశేషణ మాత్రేణ భేదః, స్వరూపతః నాస్తి భేదః”.

(అన్నింటిలోను అంతటను వ్యాపించియుండు ఈశ్వరునకును (పరబ్రహ్మమునకును), జీవునకును స్వరూపములో భేదము లేదు, కాని వారు నివసించియుండు ఉపాధిని బట్టి భేదము - అవచ్ఛేదవాదమందు మాయతో కలిసిన చైతన్యము (పరబ్రహ్మయొక్క చిచ్ఛక్తి - లేక, చైతన్య శక్తితో ఉన్న పరబ్రహ్మ) ఈశ్వరుడని చెప్పబడుచున్నాడు. అవిద్యతో కూడిన చైతన్యము జీవుడని చెప్పబడుచున్నాడు - ఆభాసవాదమందు మాయాభాసమైన చైతన్యము ఈశ్వరుడు - ఆభాసతో కూడిన అవిద్యతో కూడిన చైతన్యము జీవుడు - ఈ ఆభాసవాదములో ఆభాససహిత అవిద్యకు ఆభాససహిత మాయకు భేదమున్నది. అవచ్చేదవాదములో కూడా అవిద్యకున్నూ, మాయకున్నూ భేదమున్నది. స్వరూపములో చైతన్యమునకు భేదములేదు - బింబ ప్రతిబింబ వాదములో అజ్ఞానముచేత ఆవరించబడిన చైతన్యముయొక్క ప్రతిబింబము జీవుడు, అసలు బింబ చైతన్యము ఈశ్వరుడు - ఈ వాదములో కూడ చైతన్యములో భేదము లేదు - ఒకే చైతన్యమును జీవునుయందు, ఈశ్వరునియందు కల్పితమైనది. జీవేశ్వరులకు విశేషణమాత్రము చేతనే భేదము, రూపములో భేదము లేదు).

  1. ‘తత్వ మసి’ (ఆ పరమాత్మ నీవే అయి యున్నావు), “అహం బ్రహ్మస్మి” (నేను పరబ్రహ్మనైతిని) అను మహావాక్యములవలనను, “తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్” , “తదనుప్రవిశ్య సచ్చ త్వచ్చ అభవత్” (ప్రపంచమును సృష్టించి, ఆ సృష్టించిన ప్రతిదానిలోను తానే ప్రవేశించి సత్, త్యత్ అను పదార్థములు రెండును తానే ఆయెను) అనిన్నీ, “నాన్యతోస్తి ద్రష్టా” (తానే ఈ ప్రపంచమంతయు - ఈప్రపంచములోని వస్తువులన్నియు - అయి యుండుటచేత వాటిని చూచువాడు, తాను కాక ఇంకొకడు (ద్రష్ట లేడు), అనిన్నీ; “మృత్యోః స మృత్యు మాప్నోతి య ఇవా నానేవ పశ్యతి”. ఎవడు ఈ సృష్టి అంతటిలోను భగవంతుడొకడే యున్నప్పటికీ, భగవంతుడు కాక అనేకములున్నవి యని అభిప్రాయ పడువాడు జననమరణరూపమైన సంసారములో పడును అనిన్నీ “మమై వాంశో జీవలోకే, జీవ భూతస్సనాతనః”) నా యొక్క అంశయే జీవలోకమందు సనాతనుడైన జీవుడు) అనిన్నీ, “పాదో అస్య జీవ భూతాని” (ఈ పరమాత్మ యొక్క భాగమే సమస్తమైన భూతములు) అనిన్నీ; అనేక విధములుగా చేప్పిన శ్రుతి స్మృతి వాక్యములవలన ఈశ్వరుడు (భగవంతుడు) జీవుడు ఒకడే యని వారిద్దరికి భేదము లేదని స్పష్టముగా తెలియుచున్నది, అయినను ఈశ్వరునకున్న శక్తులు జీవుడుగా నున్నపుడు లేవు. ఎందుచేతననగా జీవుడు అవిద్యా ప్రభావమువలన ప్రకృతికి సంబంధించిన ఉపాధులలో చిక్కుకొని వాటి ప్రభావమువలన తన స్వస్వరూపమును మఱచి, తన శక్తులను కోలుపోయెను. సద్గురువు ద్వారా శ్రుతి వాక్యములవలన బ్రహ్మజ్ఞానమును పొందుటచేత ’అహం బ్రహ్మస్మి “అని తన ఈశ్వరత్వమును తెలుసుకొని -”బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి” బ్రహ్మలో ఐక్యమగును.
Transliteration
  1. “jīvasya asarvajñatva paricchinna tvā dayaḥ nikṛṣṭa dharmāḥ. īśvarasya sarvajñatva vyāpakatvādayaḥ utkṛṣṭa dharmāḥ. tathā ca viruddha dharma viśiṣṭa yōḥ tayōraikyaṃ abhēdō naiva ghaṭēta. tarhi kathaṃ abhēdaḥ prati padyatē iti cēt - sṛtisthayōḥ tatvayōḥ ‘tat’ ; ‘tvaṃ’ padayōḥ lakṣaṇākartavyā. sarvajñatvādi viśiṣṭaṃ brahma, asarvajñatvādi viśiṣṭaṃ brahma caitanyaṃ jīvaḥ. tatra dharma dvayaṃ vihāya cinmātra mēva bhāgatyāga lakṣaṇa yā grāhyaṃ tasmin tayōrṣa kṣaṇārtha yōḥ aikyasya saṃbhavaḥ asti”.

(jīvuḍu sarvajñuḍukāḍu - sarvamunu telisinavāḍu kāḍu - paricchinnuḍu (haddulu galavāḍu,parimiti galavāḍu - ivi jīvuniyokka nikṛṣṭa dharmamulu. īśvaruḍu (parabrahma) sarvajñuḍu (anniyunu telisinavāḍu). kanukanē sṛṣṭi sthiti layamulu cēyuvāḍu; vyāpakuḍu (tānu cēsina sṛṣṭi aṃtaṭilōnu vyāpiṃciyuṃḍuvāḍu - iṭṭi utkṛṣṭa dharmamulu galavāḍu. iṭlu viruddha dharmamulu gala ī reṃḍiṃṭiki (jīvēśvarulaku) aikyata (bhēdamu lēkapōvuṭa - avi reṃḍunū okaṭē anuṭa) ghaṭiṃpadu - (kudaradu). iṭlaina yaḍala ī reṃḍiṃṭikī bhēdamu lēdu, reṃḍū okaṭē ani ceppuṭa yeṭlu ? śrutilō ceppina prakāramu ‘tatvamasi’ (ā paramātma nīvē) anumahāvākyamunu samarthiṃcuṭalō vale lakṣaṇa nupayōgiṃcavalenu. sarajñuḍu anu modalagāgala lakṣaṇamulu galavāḍu īśvaruḍu - sarvajñuḍu kāni lakṣaṇamulugala brahma caitanyamu jīvuḍu. ī iddariyokka yī viruddha dharmamulanu viḍicipeṭṭi, bhāgatyāgalakṣaṇanusariṃci (koṃta bhāgamunu vadalivēyuṭa, saripaḍanidi vadalivēyuṭa) iddaṟilō cinmātramē (caitanyamē) grahiṃcavalenu. aṭlu cēsinayaḍala viruddha lakṣaṇamulu pōyi migilina caitanyamu valana iddariki aikyamu kudurunu).

  1. “ēkō jīvaḥ prakṛti guṇān bhuṃjamānaḥ tatparataṃtra tayā saṃ sarati. aparaḥ īśvaraḥ tāṃ parityajya nityamukta tayā avatiṣṭatē”.

(jīvuḍu prakṛti guṇamula nanubhaviṃcucu aṃdulō munigipōyinavāḍai vāṭi phalamugā saṃsāramulō paḍi tirugucuṃḍunu - puṭṭucu, canipōvucu karmaphalamu nanubhaviṃcucuṃḍunu - īśvaruḍu prakṛtiki atītuḍai dāni guṇamulaku svādhīnuḍu kākayuṃḍuṭacēta ē vidhamaina baṃdhamulēka nityamuktuḍai yuṃḍunu).

  1. ghaṭākāśa maṭhākāśa yadākāśa prabhēda taḥ |

kalpitau paramē jīva śiva rūpēṇa kalpitau |

tatva taśca śivassākṣāt cit jīvaśca svatassadā |

ciccidākāratō bhinnā va bhinnā bhinnācitva hānitaḥ ||“. (rudrahṛdayōpaniṣat)

(ghaṭākāśamani, maṭhākāśamani okē ākāśamulō bhēdamunnaṭlu kalpiṃcabaḍinadi. jīvuḍani, śivuḍani paramātmayē kalpiṃcabaḍenu - yathārthamugā cūcina reṃḍiṃṭi tatvamulu okaṭē. śivuḍu sākṣāt caitanyamu. jīvuḍu kūḍa caitanyamē. sākṣāt caitanyamunaku, caitanyamunaku bhēdamu lēdu -)

  1. parō vikṛtaḥ ēvātmā, svātmā ayaṃ jīvaḥ. (cāṃdōgyōpaniṣat)

(paramātmayē vikāramunu poṃdi ātmagā mārenu - ā ātmayē jīvuḍu).

  1. “jīvēśvarayōḥ bhēdā bhēdau bhavataḥ, ahi kuṃḍalavat ahēhi saṃsthāna viśēṣōhi kuṃḍalaṃ, tayō rahitvēnā bhēdaḥ, kuṃḍalatvēna bhēdō yathā, tadvadityarthaḥ , yathā ahitvānā bhēdaḥ kuṃḍalākhyasya sarpāvasthā viśēṣasya kuṃḍalatvēna bhēdaḥ tathā jīvasya brahmatvēna abhēdaḥ jīvatvēna bhēdaḥ.

(kuṃḍalatvaṃ valayākāratvaṃ, abhōgitvaṃ, vakrākāratvaṃ prāṃśutvaṃ dīrgha daṃḍākāratvaṃ udgata mukhatva mādi śabdārthaḥ).

(jīvēśvarulaku bhēdamu, abhēdamu kalugucunnavi. adi eṭlanagā - ahi, kuṃḍalamu vale. ahi anagā pāmu - adi unna sthitini baṭṭi kuṃḍalamani ceppabaḍunu. (guṃḍramugā cuṭṭukoni yuṃḍuṭavalana kuṃḍalamu). ahi yaninanu, kuṃḍalamu aninanu pāmē yani ūrthamu - reṃḍunū okaṭē. ayitē okaṭi kuṃḍalamugā (guṃḍramugā) cuṭṭukoni yunnaṃduna reṃḍiṃṭiki bhēdamu ceppabaḍucunnadi. reṃḍunu pāmē yaguṭavalana reṃḍū okaṭē, reṃḍiṃṭiki bhēdamu lēdu. ā prakāramugānē jīvuḍu paramātma okaṭiyē, reṃḍiṃṭiki bhēdamu lēdu. kāni jīvuḍugā paramātmakanna vēru ani ceppabaḍucunnāḍu).

  1. “sī. naluvoṃda nakhila jīvulayaṃdu gala nannu delisi sēviṃpumu nalina garbha

bhavadīya dōṣamulvāyunu; bhūtēṃdriyāśraya virahitamai viśuddha

maina jīvuni vimalāṃtarātmuḍanaina nanu nēkamuga jūcu naruḍu mōkṣa

padamārgavartiyai bhāsillu - - - (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 9 - 320)

  1. “annamayakōśamaina sthūla śarīramununnū, aṃduku lōnaina prāṇamaya, manōmaya, vijñānamayamaneḍi kōśatrayātmaka liṃga śarīramununnū, aṃduku lōnaina ānaṃdamayātmakamai tamōrūpamaina kāraṇa śarīramununnū vēru cēsi, aṃduku lōnai yunna tana svarūpamaina pratyagānaṃda kūṭastha caitanyānakunnū viśvasākṣikamaina advayānaṃda brahma caitanyānakunnū, guru kāruṇya rūpamaina mahā vākyaṃ vallanē aikyatvamununnū telisi anupamānaṃda svarūpuṃḍē ‘sōhaṃ’ (atanē, ā brahmayē, nēnu) anunu.

(brahmavidyā sudhārṇavamu)

  1. “ē tatsari dṝśyamāna nāmarūpātmaka māyāyāḥ satyatva buddhiṃ vihāya kēvala satyātmaka saccidānaṃda nirūpa nirguṇa niraṃjana parabrahmāṇaṃ sādhana catuṣṭaya saṃpatyā vijñāya”ahaṃ brahmasmi” iti bhāvanayā mānavaḥ svayaṃ jīvōpi jīva brahmaikya sāyujyaṃ prāptavyaṃ”.

(nāmarūpamulatō kūḍiyunna yī kanabaḍu māyayagu prapaṃcamu satyamainadi - (mūḍukālamulaṃduṃḍunadi, satya vastuvu paramātma -) anu abhiprāyamu vadali asalu satyamainadi - saccidānaṃdamainadi yagu parabrahmanu sādhanacatuṣṭayamula dvārā telusukoni “nēnu parabrahmanu ayitini” anu mahākyārthamunu sārthakamu cēsinavāḍu, tānu prastutamu svayamugā jīvuḍainappaṭikī ‘jīvabrahmaikyamu’ anu sāyujya muktini poṃdunu - jīvuḍu parabrahmatō ēkamagunu ani ceppabaḍi yuṃḍuṭacēta iddarū okaṭē, kāni iddaṟaku bhēdamu lēdu).

  1. caitanya syēikya rūpatvāt bhēdō yuktōna karhicit |

jīvatvaṃ hi tathā jñēyaṃ rajvāṃ sarpa grahō yathā |

rajjvijñānāt kṣaṇē ṇaiva yadvadrajjarhi sarpiṇī |

bhāti tadvacciti ssākṣāt viśvā kārēṇa kēvalā |

upādānaṃ prapaṃcasya brahmaṇōnyanna vidyatē |

tasmāt sarva prapaṃcō yaṃ brahmaivāsti na cētarat |

vyāpya vyāpakatā mithyā sarvamātmēti śāsanāt |

iti jñātē parē tatvē bhēdasyāva saraḥ kutaḥ |

brahmaṇassarva bhūtāni jāyaṃtē paramātmanaḥ |

tasnādētāni brahmaiva bhavaṃ tīti viciṃtaya |

brahmaiva sarva nāmāni rūpāṇi vividhānica |

kāryāṇyā pi samagrāṇi bhāsaṃ tī vēti bhāvaya |

suvarṇājjāya mānasya suvarṇatvaṃ ca śāsvataṃ |

brahmaṇō jāya mānasya brahmatvaṃ ca tathā bhavēt |

svalpamapyaṃtaraṃ kṛtvā jīvātma paramātmanōḥ |

yastiṣṭati samūḍhātmā bhayaṃ tasyāpi bhāṣitaṃ |

yadajñānādbhavē ddvaita mitaratta tprapasyati |

ātmatvēna tadā sarvaṃ nētarattatra cāṇvapi |

anubhūtō pyayaṃ lōkō vyavahāra kṣamōpisan |

asadrūpō yadā svapnaḥ uttarakṣaṇa bādhitaḥ |

svapnē jāgaritaṃ nāsti jāgaritaṃ nāsti jāgarē |

svapnatā nahi dvayamēva layē lāsti layōpi hya nayōrnica |

trayamēva bhavēnmidhyā guṇa traya vinirmitaṃ |

asya dṛṣṭvā guṇātītō nityōhēṣa cidātmakaḥ |

yadvanmṛdighaṭa bhrāṃtiḥ śuktētu rajata sthitiḥ |

tadvadbrahmaṇi jīvatvaṃ vīkṣamāṇē vinaśyati |

yathāmṛdi ghaṭōnāma kanakē kuṃḍa lābhidā |

śuktāhi rajatakhyātiḥ jīvaśabdastathā parē |

yadhaiva vyōmni nīlatvaṃ yathā nīraṃ marusthalē |

puruṣatvaṃ yathā sthāṇau tadvidviśvaṃ cidātmani |

yadhaivaśūnya vētāḷō gaṃdhirvāṇāṃ puraṃ yathā |

yathākāśē dvi caṃdratvaṃ tadvatsatyē jagatsthitiḥ |

yadhā taraṃga kallōlai jalamēvasphuratyalaṃ |

ghaṭanāmnā yathā pṛdhvī vānāmnāhi taṃtavaḥ |

jagannāmnā cidābhāti sarvaṃ brahmaiva kēvalaṃ |

yathā vaṃdhyā sutō yathā nāsti marau jalaṃ |

yathā nāsti nabhō vṛkṣaḥ tathā nāsti jagat sthitiḥ |

gṛhyamāṇē ghaṭē yadvanmṛttikā bhāti vai balāt |

vīkṣamāṇē prapaṃcē tu brahmaivābhāti bhāsuraṃ |

sa daivātmā viśuddhō smihyaśuddhō bhāti vai sadā |

yadaiva dvividhā rajju rjñāninō (a)jñāninō(a)niśaṃ |

yadhaiva mṛṇmayaḥ kuṃbhaḥ tadvaddēhōpi cinmayaḥ |

ātmānātmavivēkōyaṃ midhyaivakriyatē budhaiḥ |

sarpatvēna yathā rajjau rajata tvēna śuktikā |

vinirṇītā vimūḍhēna dēhatvē tathātmatā |

ghaṭatvēna yadhā pṛdhvī jalatvēna marīcikā |

gṛhatvēna ca kāṣṭāni khaḍgatvē naiva lōhitā |

tadvadātmani dēhatvaṃ paśyaṃtya jñāna yōgataḥ ||“. (yōgaśikhōpaniṣat)

(caitanyaṃ jīvēśvaruliddariki okaṭē. aṃducēta iddarikī bhēdamulēdu. cīkaṭilō trāḍunu cūci pāmu ani bhramiṃcinaṭlē jīvuḍu vēru ani anukonuṭa. reṃḍiṃṭilōnunna caitanyamu okaṭē ayi yuṃḍagā okaṭi īśvaruḍani okaṭi śivuḍu ani anukonuṭa bhrama. cīkaṭilō trāḍu trāḍu ani teliyakapōvuṭacēta trāḍu sarpamai tōcinaṭlu paramātmayokka caitanyamu (cicchakti) prapaṃcamuvale tōcunu. prapaṃcamunaku upādānakāraṇamu paramēśvaruḍu kāka maṟiyokaṭi kanabaḍadu - aṃducēta ī prapaṃcamaṃtayu brahmamē kāni maṟiyokaṭikādu - prapaṃcamaṃtaṭilōnu vyāpiṃciyuṃḍunadi aṃtayu ātmayē - paramēśvaruni tatvamu - (parabrahma tatvamu). ī prakāramuga telusukonina parabrahmanu itara vastuvunaku (jīvunaku) bhēdameṭlu kalugunu ? parabrahma valananē samasta bhūtamulu okadānilōnuṃḍi okaṭigā puṭṭucunnavi. aṃducēta ivanniyu parabrahmamē yagucunnavi. ī samasta rūpamulu, vāṭi nāmamulu, samasta kārya vastuvulu parabrahmayē ani bhāviṃpumu - baṃgāramutō cēyabaḍina vastuvulu baṃgāru vastuvulē. vāṭilō nunnadi baṃgāramē - aṃducēta brahmanuṃḍi puṭṭinavanniyu brahmamē. jīvātmaku paramātmaku ē koṃcemainanu bhēdamukaladanuvāḍu mūḍhuḍu. ajñānamu valana brahmakāni vastuvu maṟiyokaṭi yunnadani bhramiṃcuvāniki brahmakānidiga kanabaḍunu - ā prakāramē samastamū brahmamē (ātmayē) yani cūcuvāniki aṃtayu (aṇuvaṇuvunu) brahmamugānē kanabaḍunu. asadrūpamaina svapnamu maru kṣaṇamaṃdē lēkuṃḍunu. svapnamaṃdu jāgradavastha lēdu - jāgradavasthayaṃdu svapnamulēdu. layamaṃdu jāgratsvapnamulu lēvu. layamu jīvēśvaruliddarikī lēdu. ī mūḍu avasthalu triguṇamulavalana kalugunavi, kanuka ivi midhyalē. cidātmaguṇātītuḍu, nityuḍu. maṭṭini cūci (ākāramunubaṭṭi) kuṃḍayanu bhrāṃti kalugucunnadi. baṃgāramunu cūci kuṃḍalamulanu bhrāṃti kalugucunnadi. cīkaṭilō mutyapu cippanu cūci veṃḍiyani bhrāṃti kalugucunnadi. ā prakāramugānē parabrahmanu cūci jīvuḍani bhrāṃti kalugucunnadi. nirmalamaina ākāśamu nīlivarṇamugā nunnaṭlu, marubhūmiyaṃdu (eṃḍamāvulaṃdu) nīru valenē, cīkaṭilō staṃbamunu cūci maniṣi yani bhramiṃcinaṭlē. ī prakāramugānē aṃtā paramātmayē ayi yuṃḍagā prapaṃcamanunadi bhramacēta tōcinaṭluṃḍunu. ākāśamulō gaṃdharvanagaramu, reṃḍu caṃdrulu kanabaḍinaṭluṃḍuṭa. ā prakāramugānē satpadārthamaina paramātmayē aṃtayu ayi yuṃḍagā dānilō vērē prapaṃcamanudānini cūcuṭa. aṃtayu nīru ayi yuṃḍagā dānilōnē keraṭamulu vēru ani anukonuṭa, maṭṭini kuṃḍayani, dāramulu (kalisiyunna vāṭini) cūci baṭṭa yanikonunaṭlē prapaṃcamuvale ā cidābhāsamē yunnadi. (ā paramātma caitanyamē yunnadi). aṃtayu kēvalamu brahmamē - goḍrāliki koḍuku lēnaṭluganē, eṃḍamāvulalō nīru lēnaṭluganē, ākāśamulō ceṭṭu lēnaṭṭuganē jagattu anunadi lēdu. kuṃḍalō dāni upādānakāraṇamaina maṭṭi kanabaḍinaṭlu ī kanabaḍu prapaṃcamulō dāniki upādāna kāraṇamaina parabrahmamē kānavaccucunnadi (kārya vastuvu dāni upādānakāraṇamu kanna vēru kādu). trāḍu ajñāniki pāmu valenū,jñāniki trāḍuvale reṃḍu rītulanu kanabaḍunu. kuṃḍa maṭṭīgā jñāniki kanabaḍunu, kuṃḍagā ajñāniki kanabaḍunu. ī prakāramugānē paramātma jīvunivale, jīvunivale kanabaḍunu. ī prakāramugā buddhimaṃtulu (jñānulu) (brahmajñānamu galavāru), aṃtā ātmayē yani vāru teliyuṭacēta, ātma yēdō anātma yēdō anu vivēkamu midhyayani talaṃcedaru. cīkaṭilō trāḍunu cūci pāmu ani, muccepu cippanu cūci veṃḍiyani mūḍhulu talacedaru. ā prakāramē dēhamē ātmayani talaṃturu, maṭṭini kuṃḍayani, eṃḍamāvulu nīru ani, lōhamunu cūci khaḍgamani ajñānamuvalana talacinaṭlē aṃtā parabrahmamē ayi yuṃḍagā ātma dēhamani talaṃcedaru).

  1. “vyāpakasya īśvarasya jīvasya ca svarūpataḥ nāsti bhēdaḥ, kiṃtu upādhinā bhēdō asti avacchēda vādē māyā viśiṣṭa caitanyaṃ īśvaraḥ ityucyatē, avidyā viśiṣṭa caitanyaṃtu jīvaḥ iti. ābhāsavādēmāyāyāḥ ābhāsēna ca (resemblance) viśiṣṭaṃ caitanyaṃ īśvaraḥ iti varṇyatē. ābhāsasahitā vidyā viśiṣṭaṃ caitanyaṃ jīvaḥ itica. ābhāsavādē abhāsa sahitā vidyayāḥ ābhāsa sahita māyāyāḥ ca bhēdaō asti - tadhaivā vacchēdavādē avidyāyāḥ māyā yāśca bhēdō asti, svarūpataḥcaitanyasya bhēdō nāsti. biṃba pratibiṃba pakṣē ajñānagata caitanya pratibiṃbō jīvaḥ, biṃba caitanyaṃ īśvaraḥ. asmin pakṣē api caitanyasya nāsti bhēdaḥ, kiṃtu ēkasminnēva caitanyē jīvasyē śvaratvē kalpitē. īśvarasya jīvasyaca viśēṣaṇa mātrēṇa bhēdaḥ, svarūpataḥ nāsti bhēdaḥ”.

(anniṃṭilōnu aṃtaṭanu vyāpiṃciyuṃḍu īśvarunakunu (parabrahmamunakunu), jīvunakunu svarūpamulō bhēdamu lēdu, kāni vāru nivasiṃciyuṃḍu upādhini baṭṭi bhēdamu - avacchēdavādamaṃdu māyatō kalisina caitanyamu (parabrahmayokka cicchakti - lēka, caitanya śaktitō unna parabrahma) īśvaruḍani ceppabaḍucunnāḍu. avidyatō kūḍina caitanyamu jīvuḍani ceppabaḍucunnāḍu - ābhāsavādamaṃdu māyābhāsamaina caitanyamu īśvaruḍu - ābhāsatō kūḍina avidyatō kūḍina caitanyamu jīvuḍu - ī ābhāsavādamulō ābhāsasahita avidyaku ābhāsasahita māyaku bhēdamunnadi. avaccēdavādamulō kūḍā avidyakunnū, māyakunnū bhēdamunnadi. svarūpamulō caitanyamunaku bhēdamulēdu - biṃba pratibiṃba vādamulō ajñānamucēta āvariṃcabaḍina caitanyamuyokka pratibiṃbamu jīvuḍu, asalu biṃba caitanyamu īśvaruḍu - ī vādamulō kūḍa caitanyamulō bhēdamu lēdu - okē caitanyamunu jīvunuyaṃdu, īśvaruniyaṃdu kalpitamainadi. jīvēśvarulaku viśēṣaṇamātramu cētanē bhēdamu, rūpamulō bhēdamu lēdu).

  1. ‘tatva masi’ (ā paramātma nīvē ayi yunnāvu), “ahaṃ brahmasmi” (nēnu parabrahmanaitini) anu mahāvākyamulavalananu, “tat sṛṣṭvā tadēvānu prāviśat” , “tadanupraviśya sacca tvacca abhavat” (prapaṃcamunu sṛṣṭiṃci, ā sṛṣṭiṃcina pratidānilōnu tānē pravēśiṃci sat, tyat anu padārthamulu reṃḍunu tānē āyenu) aninnī, “nānyatōsti draṣṭā” (tānē ī prapaṃcamaṃtayu - īprapaṃcamulōni vastuvulanniyu - ayi yuṃḍuṭacēta vāṭini cūcuvāḍu, tānu kāka iṃkokaḍu (draṣṭa lēḍu), aninnī; “mṛtyōḥ sa mṛtyu māpnōti ya ivā nānēva paśyati”. evaḍu ī sṛṣṭi aṃtaṭilōnu bhagavaṃtuḍokaḍē yunnappaṭikī, bhagavaṃtuḍu kāka anēkamulunnavi yani abhiprāya paḍuvāḍu jananamaraṇarūpamaina saṃsāramulō paḍunu aninnī “mamai vāṃśō jīvalōkē, jīva bhūtassanātanaḥ”) nā yokka aṃśayē jīvalōkamaṃdu sanātanuḍaina jīvuḍu) aninnī, “pādō asya jīva bhūtāni” (ī paramātma yokka bhāgamē samastamaina bhūtamulu) aninnī; anēka vidhamulugā cēppina śruti smṛti vākyamulavalana īśvaruḍu (bhagavaṃtuḍu) jīvuḍu okaḍē yani vāriddariki bhēdamu lēdani spaṣṭamugā teliyucunnadi, ayinanu īśvarunakunna śaktulu jīvuḍugā nunnapuḍu lēvu. eṃducētananagā jīvuḍu avidyā prabhāvamuvalana prakṛtiki saṃbaṃdhiṃcina upādhulalō cikkukoni vāṭi prabhāvamuvalana tana svasvarūpamunu maṟaci, tana śaktulanu kōlupōyenu. sadguruvu dvārā śruti vākyamulavalana brahmajñānamunu poṃduṭacēta ’ahaṃ brahmasmi “ani tana īśvaratvamunu telusukoni -”brahmavit brahmaiva bhavati” brahmalō aikyamagunu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.