← Back to జ · Booklets 11–20 (digitized file 2)

జీవి jīvi

Original — తెలుగు
  1. జీవము కలవాడు.

  2. “సర్వజ్ఞేశో మాయాలేశ సమన్వితో వ్యష్టి దేహం ప్రవిశ్యతయా మోహితో జీవత్వ మగమత్ - శరీర త్రయ తాదాత్మ్యాత్ తత్కర్తృత్వ భోక్తృత్వం అగమత్ జాగ్రత్స్వప్న సుషుప్తి మూర్చా మరణధర్మయుక్తో ఘ టీ యం త్రవత్ ఉద్విగ్నో జాతో, మృత ఇవ కులాల చక్ర న్యాయేన పరిభ్రమతి.

(సర్వజ్ఞుడైన ఈశ్వరుడు మాయాలేశముతో కూడుకొన్న వాడై వ్యష్టి దేహమును - ఒక్కొక్క దేహి దేహమును - ప్రవేశించుటవలన మోహముచేత ఆవరించబడిన వాడై జీవత్వమును పొందెను - జీవుడు అనిపించుకొనెను - కారణ శరీరము, సూక్ష్మశరీరము , స్థూల శరీరము అను మూడు శరీరములతోను తదాత్మ్యమును పొంది వాటియొక్క కర్తృత్వమును, భోక్తృత్వమును పొందెను - (శరీరము ద్వారా కర్మచేసి దాని ఫలము ననుభవించుచున్నాడు). జాగ్రదవస్థ, సుషుప్త్యవస్థ, మూర్చావస్థ, మరణావస్థ అను స్వాభావికమైన ధర్మములతో కూడినవాడై ఘటీ యంత్రమువలె - నూతి గిలకవలె - వ్యాకులత చెందినవాడై, పుట్టినవానివలె, చనిపోయినవానివలె - చచ్చుచు, పుట్టుచూ - కుమ్మరివాని చక్రమువలె తిరుగుచు - పరిభ్రమించుచుండును -). (చూడుము - ‘జీవః’).

Transliteration
  1. jīvamu kalavāḍu.

  2. “sarvajñēśō māyālēśa samanvitō vyaṣṭi dēhaṃ praviśyatayā mōhitō jīvatva magamat - śarīra traya tādātmyāt tatkartṛtva bhōktṛtvaṃ agamat jāgratsvapna suṣupti mūrcā maraṇadharmayuktō gha ṭī yaṃ travat udvignō jātō, mṛta iva kulāla cakra nyāyēna paribhramati.

(sarvajñuḍaina īśvaruḍu māyālēśamutō kūḍukonna vāḍai vyaṣṭi dēhamunu - okkokka dēhi dēhamunu - pravēśiṃcuṭavalana mōhamucēta āvariṃcabaḍina vāḍai jīvatvamunu poṃdenu - jīvuḍu anipiṃcukonenu - kāraṇa śarīramu, sūkṣmaśarīramu , sthūla śarīramu anu mūḍu śarīramulatōnu tadātmyamunu poṃdi vāṭiyokka kartṛtvamunu, bhōktṛtvamunu poṃdenu - (śarīramu dvārā karmacēsi dāni phalamu nanubhaviṃcucunnāḍu). jāgradavastha, suṣuptyavastha, mūrcāvastha, maraṇāvastha anu svābhāvikamaina dharmamulatō kūḍinavāḍai ghaṭī yaṃtramuvale - nūti gilakavale - vyākulata ceṃdinavāḍai, puṭṭinavānivale, canipōyinavānivale - caccucu, puṭṭucū - kummarivāni cakramuvale tirugucu - paribhramiṃcucuṃḍunu -). (cūḍumu - ‘jīvaḥ’).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.